పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా.. | Bengaluru Content Creator Works At Panipuri Stall Goes Viral, Know About How Much Can You Really Earn | Sakshi
Sakshi News home page

పానీపూరీతో ఇంత ఆదాయం వస్తుందా..?! నెలకు ఏకంగా..

Mar 29 2026 1:51 PM | Updated on Mar 29 2026 5:34 PM

Bengaluru content creator works at panipuri stall Goes Viral

పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించొచ్చు అనగానే మహా అయితే రూ. 20 వేలు లేదా రూ. 30 వేలు ఉండొచ్చని అనుకుంటాం. రోజంతా నిలబడి.. అర కొర సంపాదనతో కష్టపడే వేతన జీవులుగా భ్రమపడతాం అని అంటున్నాడు కంటెంట్‌ విక్రేత. అంతేకాదండోయ్‌ వాళ్లు నిజంగా పానీపూరీ అమ్ముతూ ఎంత సంపాదించగలరో స్వయంగా తెలుసుకునేందుకు ఆ స్టాల్‌లో పనిచేసి మరి రోజువారీ వేతనం లెక్కించాడు. మరి ఇంతకీ ఎంత సంపాదించొచ్చంటే..

బెంగళూరుకు చెందిన పెరీరా అనే కంటెంట్‌ క్రియేటర్‌ రోడ్డు పక్కనే ఉన్న ఒక పానీపూరీ స్టాల్‌లో ఒక రోజంతా పనిచేసి అతడి రోజువారీ సంపాదనను లెక్కించాడు. అందుకోసం ఉల్లిపాయలు, బంగాళ దుంపల తొక్కు తీయడం, మసాల పూరీని తయారు చేయడం వంటి ప్రాథమిక తయారీ పనులను కుణ్ణంగా నేర్చుకుని మరి ప్రారంభించాడు పెరారీ. ఆ పనులు అలవాటయ్యాక వినియోగదారులకు అందించడం ప్రారంభించడు. 

మొదట్లో కాస్త తడబడ్డాడు. ఆ తర్వాత రద్దీ పెరిగాక త్వరగా అలవాటుపడిపోయాడు. కేవలం ఒక గంటలోనే సుమారు 120 పూరీలు దాక అమ్మాడు. ఈ స్టాల్‌ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుందని, సాయంత్రం అయ్యే కొద్దీ జనం క్రమంగా పెరుగుతారని ఆయన పేర్కొన్నారు. అంతేగాదు ఆయన పనిచేస్తున్న సమయంలో పలువురు సన్నిహితులు ఆయన గుర్తుపట్టారు కూడా. 

ఎంత ఆదాయం వస్తుందంటే..
ఒక ప్లేట్‌ ధర రూ. 30లు. అంటే రోజుకి సుమారు 80 నుంచి 100 ప్లేట్లు అమ్ముడవుతాయని పెరీరా తెలిపారు. అంటే రోజువారీ మొత్తం ఆదాయం సుమారు రూ. 3000 దాక ఉంటుంది. దానిప్రకారం నెలకు రూ. 90,000 వరకు గడిస్తాడని, దాదాపు ఏడాదికి రూ. 10.8 లక్షలకు సమానమని పెరారీ అంచనా వేశారు. 

అందుకు సంబంధించిన వీడియోతో సహా నెట్టింట షేర్‌ చేయడంతో సర్వత్రా పానీపూరీ వంటి సంప్రదాయ వ్యాపారాలతో ఇంతలా ఆర్జిస్తారా అని చర్చల మొదలయ్యాయి.

 

(చదవండి: నాడు కాలేజ్‌ డ్రాపౌట్‌..ఇవాళ ఏకంగా ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో చోటు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement