ఆద్యంతం.. భక్తి పారవశ్యం | - | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. భక్తి పారవశ్యం

Mar 17 2026 8:44 AM | Updated on Mar 17 2026 8:44 AM

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజామున వరకు ఈ కార్యక్రమం ఉత్కంఠ భరితంగా సాగింది. మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. భారీ సంఖ్యలో భక్తులు అగ్నిగుండాలను దాటారు. స్వామివారి కల్యాణ వేదిక ప్రాంగణంలో ఆదివారం రాత్రి 7.15 గంటలకు వీరభద్ర ప్రస్థానం, భద్రకాళి పూజ, 9 గంటలకు బియ్యం సుంకు పట్టుట. 12 గంటలకు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు గురుపూజ, బలిహరణ, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, 11 గంటలకు స్వామి అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం.. అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమం శివశంకర శివాచార్య మహాస్వామి సేడం పీఠాధీశుల ఆధ్వర్యంలో కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ కృష్ణప్రసాద్‌, ఏఈఓలు సుదర్శనం, బుద్ధి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement