హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉమేశ్
ములుగు(గజ్వేల్): గజ్వేల్‌లో నిర్వహించనున్న ప్రోమో రన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మండల పరిధిలోని క్షీరసాగర్ హంస హోమియోపతి మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎ.ఉమేశ్ పిలుపునిచ్చారు. కళాశాలలో గజ్వేల్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులతో కలసి ప్రోమో రన్‌కు చెందిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోమో రన్‌లో ప్రతీ ఒక్కరు భాగస్వాములై సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, స్ఫూర్తిని పెంపొందిస్తాయని చెప్పారు. తమ కళాశాల విద్యార్థులు పూర్తిస్థాయిలో కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు నిఖిల్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, లింగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జనార్దన్, కరుణాకర్, నరేశ్‌గౌడ్, అజయ్, ముస్తాఫా, అఫ్రస్ తదితరులు పాల్గొన్నారు.


