జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని శిశు మందిర్ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారులకు వస్తువుల నాణ్యత, సామర్థ్యం, ధర ప్రమాణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. వస్తువులో నాణ్యత లోపించినప్పుడు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నరసింహగౌడ్, కూనవేణు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


