పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య | - | Sakshi
Sakshi News home page

పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్య

Mar 20 2026 10:05 AM | Updated on Mar 20 2026 10:05 AM

కల్హేర్‌(నారాయణఖేడ్‌): పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యనందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. సిర్గాపూర్‌ మండలం వాసర్‌లో రూ.200 కోట్లతో సమీకృత రెసిడెన్షియల్‌ పాఠశాల సముదాయ నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఈ పాఠశాల సముదాయంలో అత్యాధునిక హంగులతో వసతులు, క్రీడా మైదానాలు ఏర్పాటు అవుతన్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం మైలురాయిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ నాగరం శ్రీనివాస్‌, నాయకులు రమేశ్‌ చౌహన్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement