చుక్కా రాములు
పటాన్‌చెరుటౌన్: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ నుంచి బీరంగూడ కమాన్ వరకు తలపెట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ ...భగత్‌సింగ్ తన 23 సంవత్సరాల కాలంలోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ధీరుడని గుర్తు చేశారు. 1907 సంవత్సరంలో జన్మించి, 1931 మార్చి 23 న ఉరి తీయబడ్డారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజ య్య, మాణిక్యం, సీపీఎం పటాన్‌చెరు డివిజన్ కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


