● విద్యార్థి, డ్రైవర్‌కు గాయాలు
● కర్ణాటకలో ఘటన
న్యాల్‌కల్(జహీరాబాద్): న్యాల్‌కల్ మండలం సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటకలో స్కూల్‌వ్యాన్ బోల్తా పడిన ఘటనలో విద్యార్థితోపాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుధవారం జరిగి ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని డప్పూర్, మల్గి తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు హుస్సెళ్లి గ్రామ శివారులోని గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్తుంటారు. యథావిధిగానే ఉదయం డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన విద్యార్థులతో వ్యాన్ పాఠశాలకు వెళ్తుంది. సరిగ్గా కర్ణాటకలోని అస్టూర్ వద్ద గల బ్రిడ్జిపైకి రాగానే అదుపు తప్పి పైనుంచి కిందికి పడిపోయింది. దీంతో ముందుభాగంలో కూర్చు న్న డప్నూర్‌కు చెందిన విద్యార్థి సాయిరాం(13)తోపాటు డ్రైవర్ జ్ఞానవరావుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో గల బీదర్ ఆస్పత్రికి తరలించారు.


