పాపన్నపేట(మెదక్): మండలంలో గుర్తు తెలియని వ్యాధితో వేలాది కోళ్లు మృత్యువాత’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య స్పందించారు. ఈ మేరకు లింగాయపల్లికి తమ సిబ్బంది వెళ్లి విచారణ జరిపినట్లు తెలిపారు. ఒక షెడ్డులో సుమారు వెయ్యి కోళ్లు చనిపోగా ,మిగతా వాటిని కంపెనీ వారు తీసుకెళ్లారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదన్నారు. అయితే చనిపోయిన కోళ్లకు పరీక్షలు జరిపారా? అని ప్రశ్నించగా ఇక్కడ అలాంటి అవకాశం లేదని, వాటి అవశేషాలను బెంగళూర్ పంపాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే బర్డ్ ఫ్లూ లేదని చెప్పడం అనుమానాలకు దారి తీస్తుంది. ఇతర గ్రామాల్లో కూడా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తుంది. కాగా కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోయి ఉండొచ్చన్నారు. వేసవిలో కోళ్ల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుబ్రత పాటించాలని కోరారు.
కొక్కెర వ్యాధితో చనిపోయి ఉండవచ్చు
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య


