నర్సాపూర్ రూరల్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా... నర్సాపూర్ పట్టణానికి చెందిన కూరగాయల వ్యాపారి సయ్యద్ గౌసోద్దీన్(పాషా) (62) ఈనెల 17న సాయంత్రం ఈదురు గాలులతో ఇంటి గోడ కూలి అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా అదే రోజు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం అతడు మృతి చెందాడు. మూడు నెలల క్రితం మృతుడు గౌసోద్దీన్ (పాషా) కుమారుడు సయ్యద్ క్రముద్దీన్ (23) స్నేహితులతో కలిసి కారులో గోవాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ జనవరి 1న మృతి చెందాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకులు ప్రమాదానికి గురై మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు సయ్యద్ గౌసోద్దీన్ (పాషా) కు భార్య, కూతురు ఉన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో మృతి


