భారీ వాహనాల రాకపోకలు మళ్లించాలి | - | Sakshi
Sakshi News home page

భారీ వాహనాల రాకపోకలు మళ్లించాలి

Mar 22 2026 1:28 AM | Updated on Mar 22 2026 1:28 AM

జిన్నారం (పటాన్‌చెరు): ప్రధాన రోడ్డు నుంచి కాకుండా పట్టణంలో నుంచే భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలోని శివాజీ చౌరస్తా నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని , పట్టణవాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. పట్టణంలోని రోడ్డును కాకుండా పారిశ్రామిక వాడకు వెళ్లే ఇతర మార్గాల నుంచి భారీ వాహనాలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రింబవళ్లు పట్టణ రోడ్ల నుంచి గృహ సముదాయాల మధ్య నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో శబ్ద, వాయుకాలుష్యంతో పాటు ఆదమరిస్తే ప్రమాదాలు జరిగే అవకా శాలు ఉన్నాయని వాపోతున్నారు. మున్సిపల్‌ అధికారులు, పోలీసులు భారీ వాహనాలను పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్ల నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement