వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

Mar 23 2026 10:07 AM | Updated on Mar 23 2026 10:07 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): ఉపాధిహామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... ఆరెగూడెం గ్రామానికి చెందిన ఏర్పుల నాగలక్ష్మి(45) రోజూ మాదిరిగా శనివారం గ్రామ శివారులో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. వడదెబ్బ కారణంగా నాగలక్ష్మి మృతి చెంది ఉంటుందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

గుండె పోటుతో ఒకరు..

మెదక్‌జోన్‌: ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... బాల్‌నగర్‌ గిరిజన తండాకు చెందిన కాట్రోత్‌ రాజు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సైకిల్‌పై మెదక్‌ పట్టణానికి వస్తూ పిల్లికొటాల్‌ సమీపంలో కిందపడి మృతి చెందాడు. గమనించిన కొందరు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య కాంట్రోత్‌ విజయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement