వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు, తీపి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఆనందోత్సాహాలు, కష్టసుఖాలు కలబోతే జీవితమని వాటన్నింటినీ సమదృష్టితో స్వీకరించేందుకు ప్రతీకగా ఈ ఉగాది పచ్చడిని తాగుతారు. గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పలు ఆలయాల్లో పచ్చడి వితరణ నిర్వహించారు. ఐబీ గెస్ట్ హౌస్ దగ్గర హిందూవాహిని ఆధ్వర్యంలో వాహనదారులకు పచ్చడిని అందించారు. అనంతరం ఒకరికొకరు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి


