ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక ప్రాంతం పూర్తిగా వెనకబడిందని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని.. సీఎంను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. అనంతరం పలు సమస్యలపై ఎంపీ సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపాక మండల పరిధిలోని ఎనిమిది గ్రామాలకు తపాస్‌పల్లి రిజర్వాయిర్ నీరు అందడం లేదని, దుబ్బాక నియోజకవర్గంలో కాల్వల ద్వారా మల్లన్నసాగర్ నీరు లేక రైతులు గోస పడుతున్నారని తెలిపారు. గజ్వేల్ రింగ్‌రోడ్డును పూర్తి చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సీనియర్ ఐపీఎస్ సౌమ్యామిశ్ర, విద్యా కమిషన్ చైర్మన్ మురళి, ఎంపీలు సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, సత్యనారాయణ, సంజీవ్‌రెడ్డి, నవీన్‌యాదవ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


