విద్యాభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి పెద్దపీట

Mar 22 2026 1:28 AM | Updated on Mar 22 2026 1:28 AM

రూ.16.62కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవనాల నిర్మాణం

పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్‌ మురళి

మర్కూక్‌(గజ్వేల్‌): విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించాలనే ఏకై క లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్‌ ఆకునూరి మురళి తెలిపారు. మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల కోసం సుమారు రూ.16.62 కోట్లతో భవనాలు నిర్మించి, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్‌ క్వార్టర్స్‌, పక్కనే ఉన్న 5 ఎకరాల స్థలాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. అనతరం చైర్మన్‌ మాట్లాడుతూ... పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉన్న భవనాలను ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు కేటాయించి, పక్కనే ఉన్న ఐదెకరాల్లో మూడెకరాలు 9వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు భవనాల నిర్మాణం, మిగతా రెండెకరాల్లో క్రీడా స్థలానికి కేటాయించనున్నట్లు తెలిపారు. మర్కూక్‌ మండల కేంద్రంలోని 603 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని ఈ పాఠశాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కస్తూర్భా గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి.. మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడబ్ల్యూడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ సరిత, మండల విద్యా ధికారి వెంకట్‌ రాములు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement