రైల్వే స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైల్వే స్టేషన్‌ తనిఖీ

Mar 29 2026 8:55 AM | Updated on Mar 29 2026 8:55 AM

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, ఇతర వసతులపై సమీక్షించారు. పలు అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డా.ఆర్‌.గోపాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులు

సత్వరమే కల్పించాలి

బీసీ సంక్షేమ జిల్లాధికారి జగదీష్‌

కంగ్టి(నారాయణఖేడ్‌): మండల కేంద్రం కంగ్టి లోని వెనుకబడిన సంక్షేమ వసతి గృహంలో మౌలిక వసతులు సత్వరమే కల్పించాలని బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి జగదీష్‌ సూచించారు. శనివారం ఆయన కంగ్టిలోని బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న శౌచాలయాలు, నీటి సౌకర్యాల కల్పనలో గుత్తేదారు ఆలసత్వం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగాను, వేగవంతం అయ్యేట్లు కృషి చేయాలని సంబంధిత హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పండరీకి సూచించారు. వంటలు మెనూ ప్రకారం వండుతున్నారా అనే విషయం అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ రూంలో వంటలకు వాడుతున్న సామగ్రి, కూరగాయలు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ రహీమోద్దీన్‌, ఎస్సీ హాస్టళ్ల వార్డెన్లు సంతోష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద

మజ్జిగ పంపిణీ

వట్‌పల్లి(అందోల్‌): పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం మండల పరిధి దేవునూర్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష రాసే విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు వాడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు దిగంబర్‌రావు, ప్రధానకార్యదర్శి నర్సింలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధేశ్వర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీశైలం, విపుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement