కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామంలో వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా గ్రామ పురోహితుడు బాపుశర్మ, మనోజ్‌శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకుమార్, ఉపసర్పంచ్ మౌనిక, నాయకులు భాస్కర్‌రెడ్డి, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


