సమీక్షించిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత రెండో సారి సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నర్మేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తారు. అక్కడే వర్చువల్‌గా పలువాటికి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభ ఏర్పాట్లను ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, కలెక్టర్ హైమావతి, ఐజీ చంద్రశేఖర్, సీపీ రష్మీ పెరుమాళ్ పర్యవేక్షించారు. 900 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోస్తు
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తోపాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఫ్యాక్టరీని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరిమాళ్ తోపాటు భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులతో సమాలోచన చేశారు.


