బురద ఆరక | - | Sakshi
Sakshi News home page

బురద ఆరక

Mar 22 2026 2:06 AM | Updated on Mar 22 2026 2:06 AM

మురుగు పారక..

పాత మున్సిపల్‌ పరిధిలోని ఆర్యనగర్‌, రాంనగర్‌, గాంధీనగర్‌, శాంతినగర్‌, బాగారెడ్డిపల్లి, గడి, వతన్‌బాగ్‌, రహమత్‌నగర్‌, తమ్మడ్‌పల్లి, భరత్‌నగర్‌, గడిహరిజనవాడ, మాణిక్‌ ప్రభువీధి, ఫరీద్‌నగర్‌, కాంతారెడ్డి నగర్‌, డ్రైవర్స్‌ కాలనీలతోపాటు తదితర కాలనీలు సమస్యలకు నిలయంగా మారాయి. పలు వార్డుల్లోని ఆయా కాలనీల్లో ఇప్పటికీ పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి బురద మేటలు వేస్తోంది. ఆక్రమణల ద్వారా ఇండ్ల నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో అయితే సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేసినట్లు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. వీటితోపాటు దోమలు కూడా స్వైరవిహారం చేస్తుండటంతో రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం రోడ్ల సౌకర్యం కూడ లేకపోవడంతో వర్షం పడితే రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి డ్రైనేజీ కాలువలే ఉన్నాయి. వాటికి పక్కా నిర్మాణాలు చేయకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే స్థంభిస్తోందంటున్నారు. అవసరం మేరకు నిధుల కేటాయింపుల్లేక అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల్లో ఎక్కువ నిధులను మురికివాడల ప్రాంతాలకే కేటాయించాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్న మురికి కాలవల్లో పేరుకుపోయిన చెత్త, మురికిని తొలగించేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో వారం, పక్షం రోజుల వరకు కూడా కాలువలను శుభ్రం చేయడం లేదని పలువురు వాపోతున్నారు. పక్కా డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం తగిన నిధులు కేటాయించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జహీరాబాద్‌ మురికివాడల్లో పారని డ్రైనేజీలు

దుర్గంధంతోపాటుదోమల స్వైరవిహారం

జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని మురికివాడలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

జహీరాబాద్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement