ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
న్యాల్‌కల్ (జహీరాబాద్): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది.


