ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మాజీమంత్రి హరీశ్‌రావు కృషి వల్లే జిల్లా పామాయిల్‌కు హబ్‌గా మారిందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం వల్లే పామాయిల్ సాగు విస్తరిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సొమ్ము బీఆర్‌ఎస్‌దైతే సోకు కాంగ్రెస్ చేస్తున్నదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతు భరోసా సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతులకు రైతు భరోసా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడా నిలదీస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, బీఆర్‌ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కళ్యన్‌కర్ నర్సింగరావు, కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


