సియోల్: అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకే క్షిపణి ఇంజిన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో రూపొందించిన ఈ ఇంజిన్‌లో ఘనరూప ఇంధనాన్ని వాడే వీలుందని అధికార వార్తా సంస్థ కేఎస్‌సీఎన్ తెలిపింది. ప్రయోగాన్ని అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారని తెలిపింది. బాలిస్టిక్ క్షిపణి సంపత్తిని సమకూర్చుకునే క్రమంలో ఈ పరిణామం ఒక మైలురాయి వంటిదని కిమ్ పేర్కొన్నట్లు వెల్లడించింది. 2,500 కిలోటన్నుల బరువైన ఈ ఇంజిన్‌ను అమర్చిన క్షిపణి సుమారు 5 వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికా ప్రధాన భూభాగాన్ని సైతం తాకగలదని పేర్కొంది.


