ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి: ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. శనివారం శనివారం సీఎస్‌ఆర్ నిధులతో ఎన్టిపిసి సౌజన్యంతో డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను అదనపు కలెక్టర్ పాండుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రం ఆయా వార్డులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అన్ని శాఖలకు సంబంధించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లయితే రోగులందరికీ సులువుగా ఉంటుందని సూచించారు. పేద ప్రజలు మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందుతూ ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, సూపరింటెండెంట్ మురళీకష్ణ, సంబంధిత అధికారులు బీజేపీ నాయకులు కొండాపురం జగన్, డాక్టర్ రాజు గౌడ్, రమేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు ద్వారక రవి తదితరులు పాల్గొన్నారు.
కవిత, కాంగ్రెస్ ఒకటే..
కవిత కాంగ్రెస్ ఒకటేనని, ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివా రం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడు తూ అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.


