డంప్‌ యార్డులో మంటలు | - | Sakshi
Sakshi News home page

డంప్‌ యార్డులో మంటలు

Mar 29 2026 8:56 AM | Updated on Mar 29 2026 8:56 AM

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ పట్టణంలోని మున్సిపల్‌ డంప్‌ యార్డులో మంటలు చెలరేగడంతో శుక్రవారం రాత్రి పట్టణమంతా పొగ కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా ఫైర్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. శనివారం ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితోపాటు ఫైర్‌ సిబ్బంది మున్సిపల్‌ ట్యాంకర్లతో డంప్‌యార్డులో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సుమారు ఆరు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. ప్రస్తుతం పట్టణంలో పొగ వ్యాప్తి ఆగిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. నాలు గు ఫైర్‌ ఇంజన్లు, 15 మంది సిబ్బందితో శ్రమించి పూర్తిగా మంటలను అదుపుచేసినట్లు అగ్నిమాపక అధికారి వేణు తెలిపారు. ప్రతి ఏడాది ఇలాగే జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమ ర్శలున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పొగతో ప్రజల అవస్థలు

ఆరు గంటలు శ్రమించి ఆర్పిన

ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement