సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Mar 23 2026 10:06 AM | Updated on Mar 23 2026 10:06 AM

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆదివారం ప్రారంభించారు. మండలంలోని అల్గోల్‌, హుగ్గెళ్లి తండాలో, రాయిపల్లి(డి)లో, బూచినెల్లిలో రూ.5లక్షల చొప్పున సీసీ రోడ్డు నిర్మాణ పనులతోపాటు గోవింద్‌పూర్‌ గ్రామంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న మురికి కాలువలు పనులను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

దైవచింతనతో మానసిక ప్రశాంతత: సుధారాణి

పటాన్‌చెరు టౌన్‌: దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి అభిప్రాయపడ్డారు. ముత్తంగి డివిజన్‌ పరిధిలోని కర్దనూర్‌లో ఆదివారం జరిగిన ఎల్లమ్మతల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవంలో సుధారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు కాటా సుధారాణిని ఘనంగా సన్మానించారు.

ప్రభుత్వాస్పత్రిలో అన్నదానం

సంగారెడ్డి: జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ పూజారులు నాగరాజు, శివపంతులు ఆధ్వర్యంలో ప్రతీ ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సీఐటీయూతోనే

కార్మికులకు న్యాయం

సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లికార్జున్‌ పేర్కొన్నారు. తోషిబా పరిశ్రమలో సీఐటీయూ యూనియన్‌ ఏర్పడి 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పరిశ్రమలోని కార్మికులకు బోనస్‌లు, పర్మినెంట్‌ చేయించడంతోపాటు డీఏ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.రాజయ్య, పాండురంగారెడ్డి, నాయకులు అనంతరావు, శ్రీధర్‌, బంగారురాజు, నరేందర్‌, వేంకటేశ్వర్లు, కృష్ణయ్య, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement