అభివృద్ధిలో ముందుండాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ముందుండాలి

Mar 29 2026 8:55 AM | Updated on Mar 29 2026 8:55 AM

మునిపల్లి(అందోల్‌): గ్రామాలు, కాలనీల అభివృద్ధిలో ముందుండాలని ఎంపీడీఓ ఆయా గ్రామాల ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను ఇన్‌చార్జి ఎంపీడీఓ అంజయ్య కోరారు. శనివారం మండలంలోని కంకోల్‌ రైతు వేదికలో వార్డు సభ్యుల హక్కులు, విధులు, బాధ్యతలు గ్రామాల అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు అవసరమయ్యే తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ అండాళ్లు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement