జహీరాబాద్: దుంప పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో శనివారం దుంప పంటల సాగుపై రైతులకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వీర సురేశ్, కృష్ణవేణి, కుమార్ మాట్లాడుతూ.. దుంప పంటలను సాగు చేయడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. చేమ గడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ సాగులో ఆధునిక పద్ధతుల గురించి చెప్పారు. అనంతరం రైతులకు దుంప పంటల విత్తనాలను పంపిణీ చేశారు.


