కోతుల బెడదకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

కోతుల బెడదకు చెక్‌

Mar 23 2026 10:07 AM | Updated on Mar 23 2026 10:07 AM

ఎలుగుబంటి వేషధారణతో

తరిమిన గ్రామస్తులు

మర్కూక్‌(గజ్వేల్‌): కోతుల బెడదకు చెక్‌ పెట్టేందుకు గ్రామస్తులు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామంలో చాలా కోతులు ఇళ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో సర్పంచ్‌, గ్రామ యువకులు కోతులను తరిమేందుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని మాజీ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో ఆదివారం సర్పంచ్‌ కవిత రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో సుమారు వంద కోతులను యువకులు నగేశ్‌, గోపిరెడ్డి ఎలుగుబంటి వేషధారణతో కోతులను భయపెట్టి గ్రామం నుంచి తరిమివేశారు. దీంతో గ్రామంలో కోతుల బెడద తగ్గిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు భిక్షపతి, వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement