హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం రెడ్డి సంక్షేమానికి బడ్జెట్‌లో పైసా నిధులు కేటాయించలేదని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఊసే లేదని, కనీసం సంక్షేమానికి నిధుల కేటాయింపులు కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో రెడ్డి జనాభాను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మండలంలోని కానుకుంట రామ్ రెడ్డి బావి గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సీపీఎం పార్టీ డివిజన్ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో డివిజన్ పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. పథకంలో పని చేస్తున్న కూలీలకు రూ.800 చెల్లించాలని, ప్రతిరోజు రెండు సార్లు ఫొటో క్యాప్చర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రవీందర్, కూలీలు పాల్గొన్నారు.


