నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో గురువారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. బస్సు సౌకర్యాలు, ఇతర సమస్యలపై ప్రయాణికులు, ప్రజలు 9959223170 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలతో పాటు సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
ఇందిరమ్మ బిల్లులు
వెంటనే చెల్లించాలి
అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్‌మెంట్‌స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు. హెడ్ ఆఫీసుకు బిల్లులు పంపామని రాగానే ఇస్తామని స్థానిక అధికారులు చెప్తున్నారని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన మేరకు లబ్ధిదారులకు వెంటనే బిల్లులు విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం నర్సాపూర్‌లో సుమారు 500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని సునీతారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. వాటిలో కొన్ని బ్లాకులు పూర్తయ్యాయని వాటికి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తే వినియోగంలోకి తెచ్చే అవకాశం ఉందన్నారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు
కొండాపూర్(సంగారెడ్డి): మద్యం మత్తులో కారును డ్రైవ్ చేస్తూ కొండాపూర్ మండలం మల్లెపల్లి చెరువుకట్టపై సీనీ నటుడు రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలి లావణ్య బుధవారం రాత్రి కారుతో ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఢీ కొట్టినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో మల్లెపల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దీంతో చేసేదేమీలేక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లావణ్యకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా, ఆమె మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు తేలింది. పోలీసులు ఆమైపె మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు కౌన్సిలింగ్ కోసం నోటీసులిచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈమైపె గతంలోనూ పలు వివాదాలున్నాయి. గతేడాది నటుడు రాజ్ తరుణ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని ఆమె పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ వివాదం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఎర్రరాళ్ల ట్రాక్టర్లు స్వాధీనం
జహీరాబాద్ టౌన్: అసైన్డ్ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఎర్రరాళ్లను తీసుకెళ్తున్న ట్రాక్టర్లను తహశీల్దార్ దశరథ్ పట్టుకుని సీజ్ చేశారు. మండలంలోని హోతి(కె) గ్రామ శివారులో గల అసైన్డ్ భూముల్లో కొంతమంది వ్యాపారులు అక్రమంగా ఎర్రరాళ్ల తవ్వకాలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఐ.రుక్మోద్దీన్ తదితరులు దాడులు జరిపి నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లు పరారీ కాగా మరో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ దశరథ్ తెలిపారు. ఎర్రరాళ్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో జహీరాబాద్‌తోపాటు నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలతోపాటు కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
మెదక్ కలెక్టరేట్: షెడ్యూల్ట్ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసి హార్డ్ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.


