జలం..
అడుగంటుతున్న భూగర్భ జలాలు
చిన్న శంకరంపేట మండలంలోనిచందాపూర్‌లో ఓ రైతుబోరు
జిల్లాలో సగటున 10.67 మీటర్ల లోతులో
గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్లపైన
ప్రతీనెల మీటరున్నర పడిపోతున్న వైనం
నార్సింగి మండలంలో అత్యధికంగా 19 మీటర్ల లోతుకు..
జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. కాగా మెతుకు సీమలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటంతో నూటికి 95 శాతం రైతులు బోరుబావుల ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. ఈ యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. కాగా వరి పంటకు నిత్యం నీటి తడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో నిరంతరం బోరుబావులు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజురోజుకు పాతాళానికి పడిపోతున్నాయి. జనవరిలో 9.36 మీటర్ల లోతులో ఉండగా ఫిబ్రవరిలో 10.67 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన 1.31 లోతుకు పడిపోయాయి. జిల్లాలోని శివ్వంపేట మండలంలో 7.33 మీటర్లలో ఉండగా పాపన్నపేట మండలంలో 7.87 మీటర్ల లోతులో ఉన్నాయి. కాగా నార్సింగి మండలంలో మాత్రం అత్యధికంగా 19.28 మీటర్లలోతుకు పడిపోయి ప్రమాద స్థాయికి చేరుకుంది. చేగుంట, హవేళిఘనాపూర్ మండలాల్లో 8 మీటర్ల లోతులో ఉండగా మెదక్, టేక్మాల్, వెల్దుర్తి మండలాల్లో మాత్రం 9 మీటర్ల లోతులో నీరు ఉంది.
జిల్లాలో భూగర్భజలాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ మున్సిపాలిటీ ప్రాంతంలోని పిల్లికొటాల్ శివారులో కేవలం 3.60 మీటర్ల లోతులోనే ఉండటం గమనార్హం. అలాగే హవేళిఘనాపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామ శివారులో 4.5 మీటర్లలోతులో ఉండగా అత్యధిక లోతులో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో శివారులో ఏకంగా 25.24 మీటర్ల లోతుకు పడిపోయాయి.
గతేడాదితో పోలిస్తే..
కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడు భూగర్భ జలాలు కాస్త మెరుగనే చెప్పాలి. 2025 ఫిబ్రవరిలో 13.25 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం 10.67 మీటర్లలో ఉన్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 2.58 మీటర్ల పైనే భూగర్భజలాలు ఉన్నాయి.
మెదక్‌లో పైన.. తూప్రాన్‌లో అడుగున!
మండుతున్న
ఎండలు ఒకవైపు, నిరంతరం బోరు మోటార్లు నడుస్తుండటంతో భూగర్భ జలాలు రోజు రోజుకు పడిపోతున్నాయి మరోవైపు. ప్రతి నెల సగటున మీటరున్నర లోతుకు వెళ్తున్నాయి. ఏప్రిల్, మేలో మరింత దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సగటున ఫిబ్రవరికి సంబంధించి 10.67 మీటర్ల లోతులో ఉన్నాయి. కానీ గతేడాదితో పోలిస్తే మాత్రం 2 మీటర్ల పైన ఉన్నటు లెక్కలు చెబుతున్నాయి.
మెదక్‌జోన్:


