breaking news
Rahul Gandhi
-
‘ఓట్ బచావో... దేశ్ బచావో’ ర్యాలీ.. 11వేల కోట్ల నష్టం..?
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ‘ఓట్ బచావో... దేశ్ బచావో’ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీ కారణంగా తమకు రూ. 11వేల కోట్ల మేర భారీగా వ్యాపార నష్టం వాటిల్లినట్లు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆరోపణలు చేసింది. ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని, నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారని సీటీఐ ప్రశ్నించింది.ధన్‌తేరాస్, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఢిల్లీలోని మార్కెట్లు అన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాల్సిన కీలక సమయం ఇది. సరిగ్గా ఇదే తరుణంలో కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల జాబితాలు, ఈసీఐ విధానాలకు వ్యతిరేకంగా రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభ కారణంగా చాందినీ చౌక్, కరోల్ బాగ్ వంటి ప్రముఖ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లతో కలిపి సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని సిటిఐ వెల్లడించింది.తద్వారా ఈ భారీ నష్టం వాటిల్లింది.ఈ భారీ నష్టంపై సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయెల్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సీజన్ వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతుందని ముందే ఊహించి.. ఈ ర్యాలీని దీపావళి తర్వాత నిర్వహించాలని మేము ప్రతిపక్ష నాయకులను కోరాము. కానీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ భారీ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ లోటును ఎవరు పూడుస్తారు? ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు నష్టపరిహారం చెల్లిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.మేము బీజేపీకి తొత్తులం కామని, కేవలం వ్యాపారుల సంక్షేమం కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీకి రావాల్సిన సుమారు 3 నుండి 4 లక్షల మంది కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారులు రాలేకపోవడం వల్ల వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ కౌంటర్ మరోవైపు, వ్యాపారుల ఆందోళనలు,ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ ర్యాలీకి వచ్చే ప్రజలు స్థానికంగా కొనుగోళ్లు చేసుకోవాలని తాము ముందే చెప్పామని, అయితే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో బీజేపీ శ్రేణులే కావాల బలవంతంగా దుకాణాలను మూయించేశాయని ఆయన ఆరోపించారు. మొత్తానికి, ఎన్నికల వేడిలో తలపెట్టిన ఈ భారీ రాజకీయ సభ.. పండుగ వేళ వ్యాపారులకు తీరని ఆర్థిక నష్టాన్ని మిగల్చడంతో పాటు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. -
ఇండియా కూటమి పోరు.. జ్ఞానేశ్ కుమార్ జైలుకే?
-
అరాచకం సృష్టించేందుకు కుట్రలు
చండీగఢ్: దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుట్రలు సాగిస్తున్నారని, విదేశీ శక్తుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మండిపడ్డారు. రాహుల్ విదేశీ శక్తుల చేతుల్లో ఒక ‘టూల్‌కిట్’లా వ్యవహరిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తున్నారని విమర్శించారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందే తప్ప, ‘గాంధీ కుటుంబ చట్టాల’ప్రకారం కాదని తేల్చిచెప్పారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ప్రతిపక్ష కూటమి ఢిల్లీలో ర్యాలీ నిర్వహించడాన్ని తప్పుపట్టారు. ప్రజాదరణ కోల్పోయి ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుండడంతో నిరాశకు లోనై రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం హరియాణాలోని రోహ్తక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘లోక్తంత్ర బచావో, అరాచకతా హఠావో’పేరిట భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నితిన్ నబిన్ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేసి, క్షమాపణ కోరడానికి బదులుగా, ఆ హత్యాకాండ జరిగి నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు దిగిందని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యున్నతమైనదని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారని గుర్తుచేశారు. కానీ, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్లో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నిందలు వేశారని ఆరోపించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటని నిలదీశారు. గాంధీ కుటుంబం నిర్దేశించే నియమాల ప్రకారమే ప్రజాస్వామ్యం నడవాలా? అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తారని నితిన్ నబిన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను నెహ్రూ–గాంధీ కుటుంబం అవమానించిందని ఆరోపించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని పునరుద్ఘాటించారు. మోదీ ఎక్కడికీ వెళ్లబోరని, 2029లో ఆయన మళ్లీ ఎర్రకోట వద్ద కనిపిస్తారని స్పష్టంచేశారు. -
ప్రధానమంత్రి కావాలనుకుంటే ‘మాక్ పార్లమెంట్’లోనే ఉండిపోండి
చండీగఢ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1984 నవంబర్ 1న ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయని, అదే నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసుకున్న ‘బడా జల్సా’ను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి పదవి కావాలని అనుకుంటే జీవితాంతం ‘మాక్ పార్లమెంట్’లోనే ఉండాలని రాహుల్‌కు సూచించారు. అమిత్ షా ఆదివారం చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. అబద్ధాలు చెప్పడం, అరాచకాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేయడం, పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడం ప్రతిపక్షాల నిజ స్వరూపమని విమర్శించారు. ఢిల్లీలో నరమేధం జరిగిన విషాదకరమైన రోజున ‘జల్సా’నిర్వహించారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాహుల్ చెబుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’నుంచి ప్రజలు ద్వేషం తప్ప మరేమీ పొందలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 15 ఏళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతోందని, కుమారుడు రాహుల్ ప్రధానమంత్రి కావాలన్న సోనియా గాంధీ కల ఇంకా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్‌కు ఎప్పుడు రాదు కాబట్టి జీవితాంతం మాక్ పార్లమెంట్లో ప్రధానమంత్రిగా వ్యవహరించాలని అమిత్ షా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కాంగ్రెస్‌కు విదేశాల నుంచి నిధులు ర్యాలీని దీపావళి పండుగ తర్వాత నిర్వహించుకోవాలని ఢిల్లీ వ్యాపారులు కోరితే ‘ఇండియా’కూటమి నాయకులు పట్టించుకోలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజునే ర్యాలీ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు తన మాట గుర్తుంచుకోవాలని, రాబోయే మూడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ భారీ సభ నిర్వహించడం 1984 నాటి అల్లర్ల బాధితుల, వారి కుటుంబాల గాయాలపై కారం చల్లినట్లుగా ఉందని మండిపడ్డారు. వేలాది మంది సిక్కులను సజీవ దహనం చేసిన రోజున ఢిల్లీలో సభ నిర్వహించాల్సిందిగా విదేశాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు అందాయని ఆమిత్ షా ఆరోపించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వడం లేదని తప్పుపట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించడం రాహుల్ గాం«దీకి ఇష్టం లేదన్నారు. దేశంలో ‘నారీ శక్తి’కి 33 శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోదీ కచ్చితంగా కల్పిస్తారని, ఇది తమ సంకల్పం అని ఉద్ఘాటించారు. -
జ్ఞానేశ్‌ను జైలుకు పంపిస్తాం!
న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న బీజేపీని అధికారం నుంచి కూలదోయా లని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి దేశ ప్రజ లకు పిలుపునిచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, దేశద్రోహం కేసులో విచారణ జరిపి, జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు. ఓట్ల చోరీని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’కూటమి నేతలు ఆదివారం ఢిల్లీలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్,రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్, సీపీఎం నాయకుడు జాన్ బ్రిట్టాస్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థరూర్, అభిషేక్ సింఘ్వీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్, నేహా బోరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను దించేసిన తర్వాత మోదీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని, ఓట్ల దొంగతనానికి సంబంధించి వారిద్దరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టం నుంచి తప్పించుకోవాలని చూడొద్దని వారికి సూచించారు. రామ్‌లీలా మైదానంలో రాహుల్ ప్రసంగించారు. 2024 నాటి లోక్‌సభ ఎన్నికలు చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమేనని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుండి 15 శాతం మంది ఓటర్లను తొలగించిందని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే.. వారు వెళ్లాలనుకున్నా వెళ్లనివ్వం ‘‘నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లడం లేదని అమిత్ షా చెప్పారు. నిజం చెప్పాలంటే నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లలేరు. ఒకవేళ ఆయన వెళ్లాలనుకున్నా, మేము వెళ్లనివ్వం. ఈ దేశానికి న్యాయం జరుగుతుంది. ఓట్ల దొంగతనానికి, దేశాన్ని అదానీకి అమ్మేసినందుకు మేము న్యాయం కోరుతున్నాం. పారిపోవాలని అనుకోవద్దు. మీరు ఇక్కడే ఉండాలి. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ప్రజల గళమే ప్రేరణగా నిలుస్తుంది. ఇది ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకులకు సంబంధించిన నిరసన కాదు. ఇది యువత, రైతులు, కార్మికుల స్వరం. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం కానివ్వబోం అని ఇది చాటిచెబుతోంది. పాలకుల దగ్గర ఎంత అధికారం, ఎంత డబ్బు ఉన్నప్పటికీ, వారు రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు. ఇది సాధారణ దొంగతనం కాదు 2024 నాటి లోక్‌సభ ఎన్నికలతోపాటు పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, హరియాణా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీ జరిగింది. ఈవీఎంల ద్వారా, అలాగే ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం, కొత్తగా చేర్చడం ద్వారా ఓట్ల చోరీకి పాల్పడ్డారు. 2024 ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా నుంచి 13.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. అంటే ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరు ఓటు హక్కు కోల్పోయారు. సుమారు 15 శాతం మంది ఓటర్లను జాబితాల తొలగించారు. 2024 నాటి ఎన్నికలు చట్టవిరుద్ధమని చెప్పక తప్పదు. ఓట్ల దొంగతనం సాధారణ దొంగతనం కాదు. ఇది ప్రతి పౌరుడి గళాన్ని, వారి అభీష్టాన్ని దొంగిలించడం. దీనినే దేశద్రోహం అంటారు. జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదు, అమిత్ షా హోంమంత్రి అయ్యేవారు కాదు. అలాంటి దేశం మాకొద్దు దేశంలోని అన్ని వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ తన అధీనంలోకి తీసుకుంది. దీనివల్ల రైతులు, కార్మికులు, యువత తమ హక్కులను పొందలేకపోతున్నారు. దేశ సంపద మొత్తం ఇద్దరు–ముగ్గురు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వారికి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ లభిస్తోంది. అదే సమయంలో, ఒక రైతు కుమారుడు చిన్నపాటి అప్పును కూడా చెల్లించలేకపోతే, అతడిని జైలుకు పంపిస్తున్నారు. శివుడి బరాత్(శివుడి ఊరేగింపు)లో ఎవరైనా ఎలాగైతే పాల్గొనవచ్చో, దేశం కూడా అలాగే ఉండాలి. గౌతమ్ అదానీ వంటి బడా బాబులు ఏదైనా సంస్థను తన ఆ«దీనంలోకి తెచ్చుకోవడం, మౌలిక సదుపాయాలను లాగేసుకోవడం వంటివి జరిగే దేశం మాకు వద్దు... ఇలా జరగనివ్వబోం. దేశాన్ని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావాలంటే జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడమే మొదటి అడుగు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లను ద్వేషించడం లేదు. మేము మొహబ్బత్ కీ దుకాన్ తెరిచే వ్యక్తులం. అహింసను నమ్ముతాం. ఆ ముగ్గురూ దేశ ఆత్మపై, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. మేము దీనికి అంగీకరించే ప్రసక్తే లేదు. నాకు ఎవరూ శత్రువులు కారు. నా మతం ఏమిటని మీరు నన్ను అడిగితే, ప్రతి పౌరుడి గళం వినిపించడమే నా మతం అని చెబుతాను. నాకు అత్యంత ముఖ్యమైనది ప్రజల గళమే. అందుకే వారికి నిద్ర పట్టడం లేదు వరుసలో చివరన నిలబడిన వ్యక్తి గొంతుక అత్యంత ముఖ్యమైనది. హిందువు, ముస్లిం, సిక్కు, దళితుడు, ఆదివాసి, మహిళ లేదా దివ్యాంగుడు.. ఎవరైనప్పటికీ, వారి గొంతుకను మనం కాపాడాలి. ద్వేషాన్ని నిర్మూలించాలి. మోదీ–షా–ఆర్ఎస్ఎస్లు దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేశాయి, ఇది దేశ ఆత్మకే హాని కలిగిస్తోంది. మాకు ద్వేషం వద్దు, ప్రేమ, సోదరభావం కావాలి, ప్రేమతో కూడిన దేశం కావాలని దేశం మొత్తం నినదిస్తోంది. మేము కచ్చితంగా దీన్ని సాకారం చేస్తాం. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌లు దేశం గొంతును నొక్కేశారు. అందుకే వారికి నిద్ర పట్టడం లేదు. దేశాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించాలని ఇండియా కూటమి నిర్ణయించింది’’అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి.. ‘ఇండియా’కూటమి నాయకులు తొలుత మింట్ రోడ్–కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్‌లీలా మైదానం వైపు ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది మద్దతుదారులు వారితో పాటు నడిచారు. ఈ సందర్భంగా వాహనంలో రాహుల్ గాం«దీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డి.రాజా, ఎం.ఎ.బేబీ, దీపాంకర్ భట్టాచార్య తదితరులు ఉన్నారు. ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానం పరిసరాల్లో దాదాపు 250 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించారు. 3 వేల మందికి పైగా పోలీసులు, 10 వేల మంది పారామిలటరీ సిబ్బందిని భద్రత కోసం మోహరించారు. జనసమూహం అదుపు తప్పకుండా, జంతర్ మంతర్ వైపు కదలకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. కానీ, ఆ పార్టీ సభ్యులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బొరా తమ సభ్యులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఎవరేమన్నారంటే.. బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎస్ఐఆర్ ‘‘దేశంలో ఎన్నికలను బీజేపీ కుట్రపూరితంగా తారుమారు చేస్తోంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకుంటోంది. బీజేపీపై పోరాటం సాగించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు, సమాజంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే. బీజేపీకి లాభం చేకూర్చడానికే ఎస్ఐఆర్ను తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ వల్ల పశ్చిమ బెంగాల్ ఒక బాధిత రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం. కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి, జెన్ జెడ్ పోరాట స్ఫూర్తికి నా సంఘీభావం తెలియజేస్తున్నా’’ – మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు సిద్ధం ‘‘రామ్‌లీలా మైదానం నేడు ప్రజాస్వామ్య హల్దీఘాటిగా మారింది. ఇది రాబోయే మార్పుకు సంకేతం. ఉత్తరప్రదేశ్ ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వారు, అదే మార్గం ద్వారా అధికారం నుంచి నిష్క్రమించడం ఖాయం. వారణాసిలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ప్రజలు బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని డబుల్ జీరోగా మార్చేశారు. ఎస్ఐఆర్ ముసుగులో విచ్చలవిడిగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. 2022లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి ఈ ఓట్ల దొంగతనమే కారణం. భారతదేశాన్ని విశ్వగురువుగా చేస్తామని గొప్పలు చెప్పుకున్నవారు నేడు ఓటర్ల జాబితాలను తారుమారు చేయడంలో నిమగ్నం కావడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమవుతుంది’’ – అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు చొరబాటుదారులనే ముద్ర వేస్తున్నారు ‘‘ఎస్ఐఆర్లో భాగంగా తొలగించిన చాలామంది ఓటర్లపై చొరబాటుదారులనే ముద్రవేస్తుండడం చాలా దారుణం. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాల నుంచి తొలగింపునకు గురైన హిందూ ఓటర్లు కూడా పాకిస్తానీలేనా? ఎంతకాలం సాకులు చెబుతారు? ముస్లింలను పాకిస్తానీలని పిలుస్తూ వారి విధేయతను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు పదేపదే ప్రశ్నిస్తున్నాయి. ముస్లింలు కూడా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. మేము ఈ దేశం కోసం మా రక్తాన్ని ధారపోశాం. మేము ఈ దేశంలోనే జీవిస్తాం, దేశాన్ని బలోపేతం చేస్తాం’’ – ఫరూఖ్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ రాజ్యాంగం ఇచ్చిన హక్కును లాక్కుంటున్నారు ‘‘దేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలను విస్మరిస్తూ, దేశ ఆస్తులను కార్పొరేట్ మిత్రుడికి ధారాదత్తం చేస్తోంది. అంతేకాకుండా, భూములను కార్పొరేట్ సంస్థలకు అతి తక్కువ ధరలకే అప్పగిస్తున్నారు. ఉపాధిపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ, సైన్యంలో చేరిన వారిని సైతం రోజువారీ కూలీలుగా మార్చేశారు. తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి, ప్రభుత్వాలను మార్చడానికి రాజ్యాంగం ప్రజలకు హక్కు కల్పించింది. కానీ, నేటి ప్రభుత్వం ఆ హక్కును లాక్కోవాలని చూస్తోంది’’ – మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు ఇది ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య పోరాటం ‘‘ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మహాభారతంలో జరిగిన పోరాటం లాంటిదే. ఇది దేశంలో ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న పోరాటం. నేడు శకుని తన ఆట ఆడుతున్నాడు. మనం కురుక్షేత్రంలో పోరాడాల్సి ఉంది. అసలు శకుని ఎవరో అందరికీ తెలుసు. జ్ఞానేశ్ కుమార్ ప్రధాని మోదీకి ఒక నమ్మిన బంటు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి జైలుకు పంపాలి. అప్పుడే భవిష్యత్తులో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే సాహసం చేయరు. దేశాన్ని ఎంచుకుంటారో లేక జ్ఞానేశ్ కుమార్‌ను ఎంచుకుంటారో ప్రధాని మోదీ తేల్చుకోవాలి. ప్రభుత్వం ‘దో నెంబరీ సర్కార్’, మోదీ ‘దస్ నంబర్ ప్రధాని’. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలి’’ – తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం ‘‘ఎస్ఐఆర్ అనేది ఓటు హక్కులపై సర్జికల్ స్ట్రైక్‌గా మారింది. ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని కాపాడేందుకు నేడు పోరాటం సాగుతోంది. ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కాన్ రాజ్యాంగ హక్కులను దెబ్బతీస్తోంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లాలి. ఓటు హక్కు, నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం లాంటివి. ఈ రెండు హక్కులూ దాడికి గురవుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టంలో మార్పులు చేయాలి’’ – దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ‘‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో కోట్లాది మంది సామాన్య ప్రజల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కాపాడుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి వైదొలగే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతాయి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’ – జాన్ బ్రిట్టాస్, సీపీఎం ఎంపీ పౌరుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ‘‘ఇది కేవలం రాజకీయ నాయకుల పోరాటం కాదు. ముమ్మాటికీ దేశ పౌరులందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. మన ఓటును కాపాడుకోవడానికి, రాజ్యాంగం మనకిచ్చిన ప్రజాస్వామ్య స్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి పౌరులంతా శాంతియుతంగానే పోరాటానికి ముందుకు రావాలి. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడం మనందరి బాధ్యత’’ – ప్రకాశ్ రాజ్, సినీ నటుడు -
‘జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటారు.. జైలుకూ వెళ్తారు’
సాక్షి,న్యూఢిల్లీ : దేశాన్ని కోటీశ్వరులు నడిపేందుకు మేము ఏ మాత్రం అంగీకరించబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాం లీలా మైదానంలో ప్రతిపక్షాలు నిర్వహించిన చలో ఢిల్లీ సభ రాహుల్ గాంధీ మాట్లాడారు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత వర్గాలు లబ్ది పొందుతున్నాయి. పేదలు మాత్రం వంచింప బడుతున్నారు.ఓట్ల దొంగతనం చేసి మోడి ప్రధాని అయ్యారు. దేశంలో వ్యవస్థలను కొంతమంది కోటీశ్వరులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఓట్ల దొంగతనానికి పాల్పడ్డ మోడీ , అమిత్ షాలు దేశం నుండి పారిపోకుండా చూస్తాము. వారిని కఠినంగా శిక్షించాలి.ప్రజాస్వామ్యాన్ని అంతం కానివ్వం.. రాజ్యాంగాన్ని ధ్వంసం కానివ్వం. ఇది ఒక్క రాజకీయ పార్టీ గొంతుక కాదు.. దేశ యువత, రైతులు, కార్మికుల గొంతుక. దేశంలో ఏళ్ల తరబడి ఓట్ల చోరీ జరుగుతోంది. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగింది2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల ద్వారా అక్రమాలు జరిగాయి. 2024 ఎన్నికల తర్వాత 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతం మందిని తొలగించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే!.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటారు. జైలుకు వెళ్తారు. ఓట్ల చోరీ సాధారణ నేరం కాదు.. దేశ పౌరుల గొంతుకను దొంగిలించడమే!. దేశంలోని విద్య, వైద్యం, సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలను ఆర్ఎస్ఎస్ ఆధీనంలోకి తీసుకుంది. రైతులకు న్యాయం జరగడం లేదు..యువతకు ఉద్యోగాలు రావడం లేదు.. కార్మికులకు హక్కులు దక్కడం లేదు.దేశ సంపద ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి వెళ్తోంది. అంబానీ, అదానీ వంటి పారశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు మాఫీ.. సామాన్యులకు మాత్రం వేధింపులు.. రైతులు, విద్యార్థులు, కార్మికులు తమ కష్టానికి తగిన ఫలితం పొందే భారతదేశం కావాలి.దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని అంగీకరించబోము.నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై చట్టపరమైన చర్యల కోసం పోరాడతాము . ఓట్ల చోరీపై దేశం న్యాయం కోరుతుంది.. బాధ్యులు సమాధానం చెప్పాల్సిందే!. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు’ అని పునరుద్ఘాటించారు. -
రాజధానిలో టెన్షన్.. టెన్షన్.. అంతటా పోలీస్ పహరా!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రామలీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు.ర్యాలీ కనాట్ ప్లేస్ నుంచి ప్రారంభమై మింటో రోడ్ జంక్షన్, అజ్మేరీ గేట్ మీదుగా రామలీలా మైదానానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ కమిషనర్ సహా ఉన్నతాధికారులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra inspects preparations for INDIA bloc's mega rally on November 1 at Ramlila Maidan https://t.co/HLhDtOCex4— ANI (@ANI) October 31, 20264 వేల మందికి పైగా సిబ్బంది మోహరింపుర్యాలీ మార్గం, సభా ప్రాంగణంలో 4 వేల మందికి పైగా పోలీసు, కేంద్ర సాయుధ బలగాలను మోహరించనున్నారు. రామలీలా మైదానాన్ని 14 భద్రతా జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌ను అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. 200కు పైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మైదానంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలుఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఐటీవో, ఢిల్లీ గేట్, రాజ్‌ఘాట్, అజ్మేరీ గేట్, తుర్క్‌మాన్ గేట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. బహదూర్ షా జఫర్ మార్గ్, జవహర్లాల్ నెహ్రూ మార్గ్, మింటో రోడ్, దేశ్‌బంధు గుప్తా రోడ్లలో ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు.ఎల్ఎన్జేపీ, జీబీ పంత్ ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.రామలీలా మైదానంలో సభకు మాత్రమే అనుమతి ఇచ్చామని, మింటో రోడ్-కనాట్ ప్లేస్ కూడలి నుంచి ప్రతిపాదించిన ర్యాలీకి ఎలాంటి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్! -
ఓట్ల చోరీ దేశ ద్రోహమే
న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల చోరీకి పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై దేశద్రోహం ఆరోపణల కింద కోర్టులో విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో విపక్ష కూటమి ‘ఇండియా’కూటమి ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా అభిశంసన తీర్మానాన్ని మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టగా, సభ్యులంతా చేతులెత్తి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని తేల్చిచెప్పారు. ‘‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడడానికి, ఓటర్లను తొలగించడానికి, చేర్చడానికి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అనుమతి ఇవ్వడం ద్వారా జ్ఞానేశ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించారు. భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఎన్నికల ప్రక్రియపై ముందుగానే పథకం వేసి, దాడిని అమలు చేసినందుకు ఆయన దోషి. ఇది ఒక నేరపూరిత చర్య, అంతేకాకుండా దేశానికి, రాజ్యాంగానికి చేసిన ద్రోహం’’అని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ సభాపతిగా వ్యవహరించారు. మాక్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ అభిశంసనను ప్రజల ఓట్లను చోరీ చేయడానికి కుట్ర పన్నిన వారిపై ప్రయోగించిన ‘రాజకీయ ఆయుధం’గా అభివరి్ణంచారు. విపక్ష ఎంపీలు, నాయకులు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని నివాసంలో సమావేశం కావాల్సిన పరిస్థితి రావడం చాలా విచిత్రమని, చరిత్రలో ఇలా ఎప్పడూ జరిగి ఉండకపోవచ్చని అన్నారు. ఇతర సంస్థలను మూసివేయడం వల్ల వేరే మార్గం లేక తాము ఇక్కడ భేటీ కావాల్సి వచ్చిందన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఈసీపై విచారణ జరగాలని, బాధితులకు న్యాయం అందాలని తేల్చిచెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ‘చట్టవిరుద్ధం’ ఏ వ్యవస్థను కాపాడతానని ప్రమాణం చేశారో, అదే వ్యవస్థ వెనుక సీఈసీ దాక్కుంటున్నారని రాహుల్ విమర్శించారు. వారు ఎప్పటికీ ఇలా దాక్కోలేరని చెప్పారు. ఏదో ఒక రోజు ఈ దేశ ప్రజల ప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా ఇక పదవిలో కొనసాగలేరని పేర్కొన్నారు. ఆయన పదవిలో కొనసాగకుండా చేసేందుకు మా దగ్గర తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. తాము ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత కూడా ఆయనను అలాగే పదవిలో కొనసాగించాలని బీజేపీ పట్టుబడితే.. వారి అసలు ఉద్దేశం అందరికీ స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. ఓటర్ల జాబితాల నుంచి 13.3 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్ ధ్వజమెత్తారు. ఇది దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతానికి సమానమని తెలిపారు. 2024 ఎన్నికల్లో విజేతలకు, ప్రతిపక్షాలకు మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 3 శాతం మాత్రమేనని గుర్తుచేశారు. అంటే 2024 లోక్‌సభ ఎన్నికలు ‘చట్టవిరుద్ధం’అని స్వయంగా ఎన్నికల సంఘమే చెబుతోందని వెల్లడించారు. ప్రజల ఓట్లను తొలగించి, నిర్వహించిన ఎన్నికలు చట్టబద్ధం ఎలా అవుతాయని ప్రశ్నించారు. మాక్ పార్లమెంట్లో కాంగ్రెస్ నేతలు సోనియా గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కూటమి పక్షాల ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. నిజమైన ఓటర్లకు రక్షణ కల్పించాలి 2014 నుంచి రాజకీయ అధికారాన్ని దక్కించుకోవడానికి, నిలుపుకోవడానికి అధికార పార్టీ అనేక తప్పుడు మార్గాలను అవలంబించిందని ఖర్గే విమర్శించారు. ఎంపీలను దొంగిలించారని, రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేశారని, ప్రభుత్వాలను కూలదోశారని, ఎలక్టోరల్ బాండ్లు, ఈడీ, సీబీఐలను ప్రయోగించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఓట్లను దొంగిలిస్తున్నారని ఆక్షేపించారు. ఓట్ల దొంగతనానికి తమ వద్ద వందలాది ఉదాహరణలు ఉన్నాయని తేల్చిచెప్పారు. 2023 నాటి చట్టం కారణంగానే జ్ఞానేశ్ కుమార్ ఓట్ల దొంగతనానికి పాల్పడగలుగుతున్నారని వెల్లడించారు. 2023 డిసెంబర్లో 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి, ఈ బిల్లును ఆమోదించడం సిగ్గుచేటు, అవమానకరం అని దుయ్యబట్టారు. ఈ చట్టం కింద ఎన్నికల కమిషనర్లకు లభించే చట్టపరమైన రక్షణపై కూడా ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. 2023 నాటి చట్టం ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కవచాన్ని కల్పిస్తోందని గుర్తుచేశారు. ఇంతటి రక్షణ కనీసం భారత రాష్ట్రపతికి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఓటర్ల పేర్లను తొలగించడానికే ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ను చేపట్టిందని ఆరోపించారు. నిజమైన ఓటర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చొరబాటుదారుల అంశాన్ని వాడుకుంటోందని చెప్పా రు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించిన అంశాన్ని ఖర్గే ప్రస్తావించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడినప్పుడు మహిళలకు వెంటనే ఓటుహక్కు లభించలేదని గుర్తుచేశారు. ఆయా దే శాలతో పోలిస్తే భారతదేశం అనుసరించిన విధానం చాలా విశిష్టమైనదని తెలియజేశారు. అప్పట్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సార్వత్రిక ఓటు హక్కును వ్యతిరేకించిందని మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి చేస్తున్న ఆరు ప్రధాన ఆరోపణలను మల్లికార్జున ఖర్గే చదివి వినిపించారు. అవి ఏమిటంటే.. 1. ఎన్నికలను చోరీ చేయడానికి పెద్ద కుట్ర జరిగింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు జ్ఞానేశ్ కుమార్ సహకరించారు. 2. ఓటర్ల జాబితాల నుంచి 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగించారు. 3. పార్లమెంట్ ఆమోదం లేకుండానే ఫారం–6లో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు చేశారు. 4. కేంద్రం ఎన్నికల సంఘం ఈసీఐనెట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓటర్ల జాబితాలను తమ ఆ«దీనంలోకి తీసుకుంది. 5. ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దూరంగా ఉంచారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. 6. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రధానమంత్రి, హోంమంత్రి ఆదేశాల ప్రకారమే పని చేస్తున్నారు. వారు చెప్పినట్టల్లా నడుచుకుంటున్నారు. ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడేందుకే తీర్మానం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ముమ్మాటికీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆదేశాల మేరకు వ్యవహరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌పై కచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టాలని అన్నారు. మాక్ పార్లమెంట్లో ఖర్గే మాట్లాడారు. మోదీ, అమిత్ షాల ప్రత్యక్ష ఆదేశాల మేరకే ఎన్నికల సంఘాన్ని నడుపుతున్నారని సీఈసీపై నిప్పులు చెరిగారు. ఏడు నెలల క్రితం 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సీఈసీని తొలగించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. అయితే, తమ నోటీసులను తిరస్కరించారని తప్పుపట్టారు. అందువల్ల ఈరోజు ఇక్కడ మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడేందుకు సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. సీఈసీ పట్ల ప్రతిపక్షాలకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని, రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుకుంటున్నామని ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం పట్ల సామాన్య ప్రజలకు ఉన్న నమ్మకం చెక్కుచెదరకుండా ఉండాలని చెప్పారు. బలహీన వర్గాలు, మహిళలు, యువతకు ఉన్న ఓటు హక్కును ఢిల్లీలో కూర్చున్న ఎవరో కంప్యూటర్ ద్వారా రహస్యంగా తొలగించకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్ఘాటించారు. -
మాక్ పార్లమెంట్.. ఎస్ఐఆర్ను తక్షణమే నిలిపివేయాలన్న మల్లికార్జున ఖర్గే
సాక్షి,ఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇండియా కూటమి పీపుల్స్ ఇంపీచ్మెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు ఎంపీలు, విపక్ష నేతలు పాల్గొన్నారు.ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కుకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించాలని ఏడు నెలల క్రితమే ఉభయ సభల్లో 193 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.ప్రతిపక్ష పార్టీల ఓటర్ల పేర్లను తొలగించి అధికారాన్ని మళ్లీ వాళ్లే కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాతే సీఈసీకి సంబంధించిన చట్టాన్ని ఆమోదించారని ఖర్గే ఆరోపించారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఖర్గే పేర్కొన్నారు. ఓటర్లను చేర్చడం కంటే తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యంగా మారిందని విమర్శిస్తూ, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తమ నిరసనలను రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగిస్తామని ప్రకటించారు.దళితులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఓటు హక్కులను కాపాడటమే తమ పోరాట లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్‌కు ఏమైంది? ర్యాలీలో కంటి సమస్య.. ఆరోగ్యంపై కలకలం -
‘అభిశంసన’ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసన కార్యక్రమాన్ని శనివారానికి వాయిదా వేసినట్లు ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా నగరంలో భారీ వర్షాల కారణంగా మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై వస్తున్నాయని తెలిపారు. ఓట్ల చోరీపై తాము చేస్తున్న నిరసనలు వేర్వేరు కాదని, అదంతా ఒక్కటేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఖర్గే నివాసం వద్ద విపక్ష కూటమి నాయకులతో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. సీఈసీ బహిరంగ అభిశంసనను వర్షం కారణంగా వాయిదా వేయాలని అందరం కలిసి నిర్ణయించినట్లు చెప్పారు. శనివారం ఇదే కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు. నవంబర్ 1న రామ్‌లీలా మైదానం వరకు ‘చలో దిల్లీ’పాదయాత్ర చేపడుతున్నామని, ఇందులో రాజకీయ, రాజకీయేతర వర్గాలు పాల్గొనవచ్చని, అందరికీ స్వాగతం పలుకుతున్నామని స్పష్టంచేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పేరిట ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానే‹శ్ కుమార్, ఆయన బృందం కలిసి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఢిల్లీ వరకు రాకుండా అడ్డుకోవడానికి హోంమంత్రి కుతంత్రాలు సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. తమ పార్టీ శ్రేణులకు, సామాన్య ప్రజలకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకోసమే పోరాడుతున్నాం దేశంలో ఏం జరుగుతోందో అందరూ గుర్తించాలని రాహుల్ గాంధీ కోరారు. అదానీ, అంబానీ, మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్‌లకు మేలు చేసేందుకు లక్షలాది మందికి హక్కులకు దూరం చేస్తూ, ఓటును దొంగిలిస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, మానసిక వేదన నెలకొన్నాయని చెప్పారు. హక్కుల కోసం నిరసన తెలపాలనుకునే ఎవరైనా తమతో చేతులు కలపవచ్చని సూచించారు. రాజ్యాంగాన్ని, ‘భారతదేశం’అనే భావనను, భారతీయులందరి అభిప్రాయానికి ప్రతీక అయిన ఓటు హక్కును కాపాడేందుకు పోరాడుతున్నామని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి–హోంమంత్రి ద్వయం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని అత్యంత బహిరంగంగా, నిర్లజ్జగా నీరుగార్చి, దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్ ని్రష్కమణకు సమయం వేగంగా దగ్గరపడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. -
రాహుల్ మాత్రం ‘ఓటు చోరీ’పై చర్చకు రారు: అమిత్ షా
లక్నో: ‘ఓటు చోరీ’ ఆరోపణలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్లో చర్చకు ముందుకు రారని విమర్శించారు. తాజాగా లక్నోలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ వేదికపై అమిత్ షా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు పార్లమెంట్‌లోనే సమాధానం చెప్పుకోవాలని సవాల్ విసిరారు. సభలో చర్చించకుండా వీధుల్లో నిరసనలు, ఆందోళనలతో రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్, అఖిలేశ్‌లు ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం సొంతంగా ఏ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.ఇక మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనలకు సిద్ధమైంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను బీజేపీకి అనుకూలంగా చేపడుతున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శనివారం ‘పబ్లిక్ ఇంపీచ్మెంట్’, ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాయి.ఇదీ చదవండి: గ్యాస్, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారం.. విపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ -
పోలీసులకు, లాఠీలకు బెదరొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు, ఓట్ల చోరీని అడ్డుకొనేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే ‘చలో ఢిల్లీ’ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు సైతం ఈ నిరసన ర్యాలీలో చేరాలని కోరారు. పోలీసులకు, వారి లాఠీలకు ఎవరూ బెదరొద్దని స్పష్టంచేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన ర్యాలీ కాదని, భారతదేశ ఆత్మను కాపాడే ఉద్యమమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ గాంధీ గురువారం ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్టుచేశారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహార శైలితో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆరాట పడేవారంతా నిరసన ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు. ఇది ముమ్మాటికీ దేశ ప్రజల నిరసన అని తేల్చిచెప్పారు. దేశంపై దాడి జరుగుతోందని, ప్రజలు హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, ఆలోచనా విధానాలు దెబ్బతింటున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని రక్షించుకోవాలంటే ఉద్యమంలో చేరాలని సూచించారు. నవంబర్ 1న జరిగే నిరసన ర్యాలీలో అందరినీ కలుసుకోవాలని తాను ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేసిన పోస్టును కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులను రైళ్లను ఏర్పాటు చేయడానికి నిరాకరించారని, ఢిల్లీలో వ్యాపారులను రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు సాగించినా నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’ర్యాలీ జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు. ఇది ఒక వర్గానికి లేదా ఒక రాజకీయ పారీ్టకి సంబంధించిన నిరసన కాదని వివరించారు. ఇది దేశం చేస్తున్న నిరసన అని ఉద్ఘాటించారు. ఎస్ఐఆర్ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన 13.30 కోట్ల మంది భారతీయుల కోసం ఈ పోరాటం జరుగుతోందని ప్రకటించారు. ఇది రాజ్యాంగం కోసం సాగే యాత్ర, ప్రజాస్వామ్యం కోసం చేసే పాదయాత్ర, ప్రతి భారతీయుడి కోసం ఉద్దేశించిన ఉద్యమం అని తెలియజేశారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీ మార్చ్‌కు రండి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారంతా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రాంలీలా మార్చ్’లో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఓటు చోరీని అడ్డుకోవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించిన ఉద్యమమని పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్లపై అసంతృప్తితో ఉన్నవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునేవారు ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.మార్చ్‌లో పాల్గొనేవారు పోలీసుల చర్యలకు, లాఠీచార్జికి భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ అన్నారు. భయపడకుండా తమతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల మార్చ్ అని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. नमस्कार, चलो दिल्ली रामलीला मार्च, लोकतंत्र को बचाने का, वोट चोरी को रोकने का, संविधान को बचाने का मार्च है। यह किसी एक राजनीतिक पार्टी का मार्च नहीं - यह हिंदुस्तान की आत्मा का मार्च है। सब लोग जो नरेंद्र मोदी, अमित शाह, ज्ञानेश कुमार से तंग हैं। सब लोग जो लोकतंत्र को बचाना चाहते हैं, संविधान की रक्षा करना चाहते हैं, आप सब आइए। एक ही protest है - देश का protest है। Don't worry about the police, don't worry about lathis - the BJP will not have the guts to try any of their antics. Come march with us - we will walk together to protect the Constitution, to protect the Indian nation. घबराने की जरूरत नहीं है। I urge all student groups, regardless of your political affiliation - if you feel that India is under attack, if you feel you are under attack, your expression, your ideas, your way of thinking is under attack, come and join us. It will be a fantastic march, and it's a march for the soul of this country. Looking forward to seeing all of you there. 🗓️ 1 नवंबर 📍 रामलीला मैदान, नई दिल्ली #ChaloDilli— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2026 రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా విద్యార్థి సంఘాలు కూడా ఈ మార్చ్‌లో పాల్గొనాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. దేశంపై దాడి జరుగుతోందని, తమ భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచనలు, అభిప్రాయాలు లక్ష్యంగా మారుతున్నాయని భావించే విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ ఆత్మను కాపాడే ఉద్యమంగా ఈ మార్చ్‌ను అభివర్ణించారు. మరోవైపు, నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ఎంపీలతో సమావేశమవుతున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మాక్ పార్లమెంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ప్రతీకాత్మకంగా అభిశంసించే కార్యక్రమాన్ని చేపట్టాలని వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నవంబర్ 1న రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్నారు. -
టాటా వ్యవహారంపై రాహుల్, నిర్మల మాటా మాట!
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రముఖమైన సంస్థ ‘టాటా’ను నాశనం చేస్తున్నారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా జరిగిన ఈ మాటల యుద్ధమిప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. టాటా సన్స్ సంస్థకు ఎవరు నేతృత్వం వహించాలన్న విషయంలో ఇటీవలి కాలంలో కొంత వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనివల్ల కంపెనీ బోర్డులోని ట్రస్టీలు రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలొస్తున్నాయి. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్‌ను మళ్లీ నియమిస్తూ సెప్టెంబరు 17న చేసిన తీర్మానాన్ని సవాలు చేసిన విషయం తెలిసిందే. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా కొన్ని రోజుల క్రితం ఈ సవాలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ... టాటా సంస్థను నాశనం చేసేస్తున్నా పారిశ్రామికవేత్తలు పల్లెత్తు మాట మాట్లాడలేకపోతున్నారని, ఈ నేరాలకు తాము తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంతకాలం ఇలా మౌనంగా కూర్చుంటారని వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రశ్నించారు. వాళ్లు మిమ్మల్ని సొంతం చేసుకునేంత వరకా? అని విమర్శించారు. భారతీయ వ్యాపారాలంటే ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాల ఆటవస్తువులు కావని, మీకు ధైర్యం లేకపోయినా మాకుందని.... ఈ నేరాలన్నింటికీ న్యాయం జరిగేలా చేస్తామని తన పోస్టులో తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాహుల్ ఇప్పుడు పారిశ్రామికవేత్తలను కూడా తనతో కలుపుకుని అవిశ్వాసాన్ని, విషపు సంస్కృతిని వ్యాపింప జేస్తున్నారని విమర్శించారు. అన్నింటినీ రాజకీయం చేయడం రాహుల్ మానుకోవాలని హితవు పలికారు. భారతీయ పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తల విజయాలను తక్కువ చేసి చూపడం రాహుల్‌కు అలవాటైపోయిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించేవని, పరిశ్రమలకు, సంస్థలకు మద్దతిచ్చేవని స్పష్టం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడైన మీరు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని సూచిస్తున్నా. అలాగే వాణిజ్య, న్యాయపరమైన అంశాలను కూడా నేరాలుగా పరిగణించడం అంగీకారయోగ్యమైనవి కావు’’అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా దేశంలో పారిశ్రామిక స్ఫూర్తిని నీరుగార్చిందని, లైసెన్స్, కోటా రాజ్‌లతో కోట్లాది మంది భారతీయులు పేదరికంలో మగ్గిపోయేందుకు కారణమైందని విమర్శించారు. సీతారామన్‌కు రాహుల్ సమాధానంతన పోస్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఇంకో పోస్టు ద్వారా తిప్పికొట్టారు. ‘‘ప్రియమైన శ్రీమతి సీతారామ... 1. ఏ న్యాయ, వాణిజ్య అంశం టాటా ట్రస్ట్, టాటా సన్స్లు అమిత్ షా ఇంట్లో సమావేశమయ్యేలా చేసింది? 2.నెంబర్ వన్ ‘సన్నిహితుడు’రంగ ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి... టాటాలో ఏ ముక్క అతడికి దక్కనుంది? చివరగా... మీకు సంబంధించిన ముగ్గురు నలుగురు ‘సన్నిహితులు’మినహాయించి దేశంలోని మిగిలిన వ్యాపారవేత్తలందరూ మీ అందరినీ ఇప్పటికే ద్వేషిస్తున్నారు. వాళ్లను ఉసికొల్పాల్సిన అవసరమే లేదు’’అని వ్యాఖ్యానించారు. -
‘టాటాను నాశనం చేస్తున్నారు’.. రాహుల్ గాంధీ ఫైర్!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్‌ను ‘నేరపూరితంగా నాశనం చేస్తున్నారని’ ఆరోపించారు. ఈ పరిణామాలపై దేశంలోని ఏ వ్యాపారవేత్త కూడా నోరు విప్పడానికి ధైర్యం చేయడం లేదని విమర్శించారు. వ్యాపారవేత్తలు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక పోస్టు చేశారు.టాటా గ్రూప్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాపారవేత్తలు మౌనం వీడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నా, ఏ వ్యాపారవేత్త కూడా మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు. ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు? వారు మిమ్మల్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? భారత వ్యాపార రంగం మోదీ, అమిత్ షాల ఆటబొమ్మ కాదు. మీకు ధైర్యం లేదు. మాకు ఉంది. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై బీజేపీ, టాటా గ్రూప్ నుంచి ఇంకా స్పందన రాలేదు.దేశంలోని పురాతన పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, దానిలో కీలక వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17న ఎన్. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా వ్యతిరేకించారు. 2022లో చంద్రశేఖరన్ పునర్నియామకానికి అనుసరించిన విధానానికి భిన్నమైన రాజ్యాంగపరమైన మార్గాన్ని ఈసారి అనుసరించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.టాటా ట్రస్ట్స్ వాదన ప్రకారం.. ఛైర్మన్ పునర్నియామకానికి సంబంధించి ట్రస్ట్స్ నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు తప్పనిసరి. ఆ మద్దతు లేనప్పుడు ఛైర్మన్‌కు ఉండే నిర్ణయాత్మక ఓటు హక్కుతో సమస్యను అధిగమించలేరని ట్రస్ట్స్ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, టాటా సన్స్ సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని 104బీ, 118, 121 నిబంధనలను ఆధారంగా చేసుకుంటోంది. ఓట్ల సంఖ్య సమానమైనప్పుడు ఛైర్మన్‌కు నిర్ణయాత్మక ఓటు హక్కు ఉంటుందనే నిబంధనపైనా చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: జడ్జి కుమారుడి నిర్వాకం .. కొచ్చి పోలీస్ కమిషనర్ బదిలీ! -
జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంత వరకు లేదా ప్రధానమంత్రి మోదీ స్వయంగా జోక్యం చేసుకొని ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఐఖ) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో జన్ సున్వాయి(ప్రజా విచారణ) కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. త్రిలోక్‌పురి ప్రాంతంలోని నాలుగు పోలింగ్ బూత్‌ల నుంచి 416 మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. దీనిపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని, తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. కానీ, ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులను రాహల్ గాంధీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య, స్వరాజ్ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. బిలియనీర్ల కోసం కొత్త హిందూస్తాన్ ఎస్ఐఆర్ కారణంగా దేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతోందన్న విషయం దేశం మొత్తానికి అర్థమవుతోందని పేర్కొన్నారు. పేద ప్రజల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కొద్దిమంది బిలియనీర్ల కోసం ఒక కొత్త భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆ కొత్త దేశంలో పౌరులకు ఎలాంటి హక్కులు ఉండవు, పేదలకు వారి హక్కులు దక్కవని చెప్పారు. అలాంటి కొత్త దేశం కేవలం బిలియనీర్ల ప్రయోజనాల కోసమే పని చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ధనికుల కోసం మాత్రమే ఒక హిందుస్తాన్‌ను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని, ఇది దేశద్రోహంతో సమానమని ఆరోపించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తుతామని, ప్రజల ఓటు హక్కును కాపాడుకుంటామని ప్రకటించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఏకతాటిపై ఉండి, అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని వెల్లడించారు. -
10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. బిగ్ టెన్షన్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించనున్న ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపారులు మరోసారి కోరారు. దీపావళి పండుగకు ముందు కీలకమైన వ్యాపార సీజన్లో ర్యాలీ నిర్వహిస్తే తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఛైర్మన్ బ్రిజేష్ గోయల్.. రాహుల్ గాంధీకి మరోసారి లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా పంపించారు. ఈ అంశంపై మిత్రపక్షాలతో చర్చించాలని కోరారు.నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఈ ర్యాలీకి సుమారు 10 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే, దీపావళి షాపింగ్ జోరుగా సాగుతున్న సమయంలో ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని, అందువల్ల కార్యక్రమాన్ని పండుగ తర్వాతకు వాయిదా వేయాలని వ్యాపారులు కోరుతున్నారు.గతంలో చేసిన విజ్ఞప్తిని రాహుల్ గాంధీ తిరస్కరించడంపై గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే 30 సెకన్లలో నిరసనలను ఆపేయవచ్చని రాహుల్ పేర్కొన్నారు.‘ఢిల్లీ వ్యాపారులారా.. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీ సమస్యలను వింటున్నాం. ప్రభుత్వం మెట్రోను మూసివేసి, రహదారులను దిగ్బంధించి, రాజధానిని నిర్బంధంలో ఉంచింది. ఓట్ల చోరీ జరిగితే మీ దుకాణం, పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు ఏదీ సురక్షితంగా ఉండదు’ అని రాహుల్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగో నిందితుడిగా జ్ఞానేశ్ కుమార్‌ను పేర్కొంటూ ఆయనను తొలగించాలని ప్రధాని మోదీని కోరారు.ర్యాలీ కారణంగా రామ్‌లీలా మైదాన్ చుట్టుపక్కల ఉన్న 20 ప్రధాన మార్కెట్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్ 31 నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి.. రహదారులను మూసివేస్తారా? నవంబర్ 1న దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందా? వినియోగదారులు మార్కెట్లకు చేరుకోగలరా? అంటూ ప్రశ్నించింది.ర్యాలీకి 10 లక్షల మంది నిరసనకారులను తరలించేందుకు సుమారు 15 వేల నుంచి 20 వేల బస్సులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటికి తోడు రాజకీయ నాయకుల ప్రైవేటు వాహనాలు కూడా వస్తాయని తెలిపింది. రామ్‌లీలా మైదాన్ చుట్టూ ఢిల్లీలోని అతిపెద్ద హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయని, అక్కడికి వెళ్లే మార్గాలన్నీ ఈ మార్కెట్ల గుండా సాగుతాయని వివరించింది. చాందినీ చౌక్, భాగీరథ్ ప్యాలెస్, ఖారీ బావోలీ, సదర్ బజార్, చావ్రీ బజార్, కశ్మీరీ గేట్, నబీ కరీం, కరోల్ బాగ్ తదితర మార్కెట్లపై ర్యాలీ ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కేవలం 3 వేల నుంచి 4 వేల మంది పాల్గొన్న నిరసన కార్యక్రమం కారణంగానే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతమంతా దిగ్బంధానికి గురైందని సీటీఐ పేర్కొంది. దీనివల్ల వ్యాపారులకు సుమారు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. అలాంటిది నవంబర్ 1న 10 లక్షల మందితో ర్యాలీ నిర్వహిస్తే పాత ఢిల్లీలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని, రూ.10 వేల కోట్ల వరకు నష్టం సంభవించవచ్చని అంచనా వేసింది. ర్యాలీని వాయిదా వేయడం సాధ్యం కాకపోతే రామ్‌లీలా మైదాన్‌కు బదులుగా బురారీ గ్రౌండ్స్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించాలని సీటీఐ సూచించింది. తద్వారా మార్కెట్లకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంది.ఇదీ చదవండి: రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షల మంది -
ఓటర్ల జాబితా 'SIR'పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి,న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా శివుడి చిత్రాన్ని ట్వీట్ చేశారు. ‘సత్యం శివం సుందరం’ అని ట్యాగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం విధివిధానాలు, ఏకపక్ష నిర్ణయాలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న తరుణంలో రాహుల్ ట్వీట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ పనితీరును ప్రశ్నిస్తూ ఆయనపై తగిన విచారణ జరపాలని, దేశవ్యాప్త ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని, జస్టిస్‌లు జయమల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు విచారణకు స్వీకరించింది. గత విచారణల సందర్భంగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం..ఓటర్ల జాబితాల ఎస్ఐఆర్ నిర్వహణ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే చేపట్టినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలను ఈసీ పూర్తిగా తోసిపుచ్చింది. సవరణకు సంబంధించిన మూడు కీలక ఉత్తర్వులను కమిషన్‌లోని ముగ్గురు సభ్యులు (సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు) ఏకగ్రీవంగా ఆమోదించారని వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌పై సీఈసీతో పాటు ఇతర కమిషనర్లు కూడా సంయుక్తంగా అంగీకరించినట్లు తెలిపింది.ఓటరు నమోదు కోసం చట్టాన్ని గానీ, నిర్దేశించిన ‘ఫారం-6’ను గానీ తాము సవరించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో సాంకేతిక సౌలభ్యం కోసం మాత్రమే కొన్ని మార్పులు చేసినట్లు వివరించింది. తమకు తెలియకుండా, తమ సిఫార్సు లేకుండా ఓటర్ల జాబితాల ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వెలువడిన మీడియా నివేదికల ఆధారంగా ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల విమర్శలు, రాహుల్ గాంధీ తాజా ఆధ్యాత్మిక పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుండటంతో, ఈసీ తీసుకున్న చర్యలు, కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
రామ్‌లీలా ర్యాలీకి 10 లక్షల మంది
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఓట్ల చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో చేపట్టిన చలో ఢిల్లీ నిరసనకు కాంగ్రెస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. కనీసం 10 లక్షల మందిని సమీకరించాలని, ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా దీనిని నిలపాలని కాంగ్రెస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పార్టీ అన్ని రాష్ట్రాల యూనిట్లకు, అనుబంధ విభాగాలకు స్పష్టమైన భారీ టార్గెట్లను నిర్దేశించింది. జన సమీకరణకు జిల్లాకో ఇన్చార్జి ర్యాలీ కోసం మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని తరలించాలంటూ కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ పెట్టింది. ఆయా రాష్ట్రాల నేతలతో ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాం«దీ, కేసీ వేణుగోపాల్ సమీక్షలు జరిపారు. ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న హరియాణా, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి లక్ష మంది చొప్పున తీసుకురావాలంటూ రాష్ట్ర నాయకత్వాలను ఆదేశించింది. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కో రాష్ట్రానికి 15 వేల మంది చొప్పున సమీకరించాలని ఏఐసీసీ ఆదేశించింది. అర నిమిషంలోనే ఆందోళనలకు చెక్: రాహుల్ నవంబర్ 1న కూటమి పార్టీలు చేపట్టిన ఈ ర్యాలీపై ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) అధ్యక్షుడు బ్రిజేష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధులు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని వారు కలిశారు. పండగల వేళ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలకు కీలకమైన సమయంలో భారీ నిరసన నిర్వహిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.దీనిపై రాహుల్‌గాంధీ సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యాపారుల ఇబ్బందులను తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మెట్రో సేవలను నిలిపివేసి, రహదారులను దిగ్బంధించి దేశ రాజధానిని అష్టదిగ్బంధనం చేసిందని రాహుల్ విమర్శించారు. ప్రధాని మోదీ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జ్ఞానేశ్‌ను మోదీ తొలగిస్తే 30 సెకన్లలోనే ఆందోళనలు ఆగిపోతాయి’అని పేర్కొన్నారు. ర్యాలీని విజయవంతం చేయండి: ఖర్గే పిలుపు దేశంలో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని, ఇప్పటికీ కొనసాగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కోట్లాది మంది పౌరుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ రాజీనామా, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయా లని డిమాండ్ చేస్తున్నామని, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నవంబర్ 1న చేపట్టిన మహా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి న్యాయస్థానంలో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే స్వభావం కలిగి లేవని కోర్టు పేర్కొంది. కాగా, తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఈ వివాదం తలెత్తింది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం ఫిర్యాదు చేశారు. 2018 ఆగస్టు 4న ఆయన ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొన్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వల్ల అమిత్ షా ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 499, 500 కింద క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదైంది.సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు ప్రస్తావనరాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించినవిగా వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కేసులో అమిత్ షాను 2014లో ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు అభియోగాల నుంచి విముక్తి చేసింది. అయితే, 2018లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఫిర్యాదుదారు వాదించారు. మరోవైపు, తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి చూపించారని రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులో విచారణ కొనసాగింది.#BREAKING: Sultanpur Court ACQUITS Lok Sabha LoP Rahul Gandhi in a 2018 criminal defamation case over alleged remarks against then BJP president Amit Shah. https://t.co/IgmjFKMcUQ— Live Law (@LiveLawIndia) October 26, 2026ఐదేళ్లకు పైగా కొనసాగిన న్యాయపోరాటంఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు 2023లో రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. అనంతరం ఆయన కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారు రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన వాయిస్ రికార్డుతో ఆయన స్వర నమూనాను పోల్చాలని కోరారు. అయితే, ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీనిపై దాఖలైన విచారణ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కూడా కొట్టివేసింది. అనంతరం అలహాబాద్ హైకోర్టులోనూ ఈ నిర్ణయాలను సవాలు చేయగా, అక్కడ కూడా ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత అక్టోబర్ 13న తీర్పు వెలువరించాలని నిర్ణయించినప్పటికీ, అనంతరం అక్టోబర్ 26కు వాయిదా వేసింది.కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ..తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లక్నోకు చేరుకుని అక్కడి నుంచి సుల్తాన్‌పూర్‌కు వెళ్లారు. ఆయన రాక నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభమ్ వర్మ తీర్పు వెలువరించారు. తాజా తీర్పుతో 2018లో నమోదైన ఈ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీపై విచారణ ముగిసింది. అమిత్ షాపై వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులో రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదల కావడం న్యాయపరమైన ఊరట లభించింది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీకి త్రుటిలో తప్పిన ప్రమాదం -
రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం
-
రాహుల్ గాంధీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. 91వ మైలురాయి వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన కాన్వాయ్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, భద్రతా సిబ్బందితో సహా పలువురికి గాయాలయ్యాయి. VIDEO | Lucknow: Congress workers gather at Chaudhary Charan Singh Airport in Lucknow to welcome party MP Rahul Gandhi ahead of the Sultanpur court's verdict in the defamation case against him today. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/eVeqM55U9N— Press Trust of India (@PTI_News) October 26, 20262018 నాటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పట్లోని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుండి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పటికీ ఆయన కోర్టు కార్యకలాపాలకు హాజరయ్యేందుకు ముందుకు సాగారు. -
రాహుల్‌గాందీకి ఏటీఎంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభజనలు సృష్టిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజలను దోచుకుంటోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచి్చన హామీలను విస్మరించారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందని, రేవంత్ ఆయనకు ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ సీనియర్ నాయకుడు జిబ్రాన్ షరీఫ్ ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వెయ్యి రోజులైనా అమలుకాలేదు... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, 13 డిక్లరేషన్లను నెరవేరుస్తామని, మొత్తం 420 హామీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రజలకు మాట ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీల అమలు కాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. మైనారిటీ సంక్షేమానికి రూ.4,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌లో టీ స్టాల్ వద్ద కూర్చొని నిరుద్యోగ యువతకు హామీలు ఇచి్చన రాహుల్ ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వరుసగా స్కామ్‌లు రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఒక్కొక్కటిగా వివాదాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. రూ.200 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్న ఐదెకరాల భూమిని కేవలం రూ.7 కోట్లకే తన తమ్ముడికి బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. సీఎం చిన్న తమ్ముడి విద్యార్హతలు, ఏరోస్పేస్ రంగంలో ఆయన వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అమెరికాలో నివసిస్తున్న మరో తమ్ముడికి సంబంధించినదిగా పేర్కొంటున్న రూ.1,000 కోట్ల డీల్‌పై సమగ్ర వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమస్యలను ప్రస్తావిస్తే అక్రమ కేసుల బెదిరింపులతోపాటు తిట్లతో రేవంత్ రెడ్డి బదులిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలోనూ ఇలాంటి ధోరణులే కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం, అరెస్టులతో భయపెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. చేరికల కార్యక్రమాల్లో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఓటును రక్షించండి, దేశాన్ని కాపాడండి’.. రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ‘ఓటు చోరీ’ ఆరోపణలు చేస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువకులు, వ్యాపారులు అందరూ తరలిరావాలని కోరారు.ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని, నిబంధనలు ఉల్లంఘించారని, ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీచార్జీలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్లు దొంగిలిస్తున్నారని, ఏ పరిస్థితుల్లోనూ దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్చ్ గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఆయన వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలు జరిగాయని ‘ఓటు చోరీ’కి పాల్పడ్డారంటూ నిరసిస్తూ నిర్వహిస్తున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్ ముగింపు వేడుకగానే ఈ మెగా ర్యాలీ ఉంటుందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఈ ర్యాలీలో కనీసం లక్ష మందికి పైగా పాల్గొంటారని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది బలమైన సందేశాన్ని ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.మరోవైపు నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల క్షతగాత్ర హృదయాలపై రాహుల్ గాంధీ ఉప్పు చల్లుతున్నారని, సిక్కుల మనోభావాలతో క్రూరమైన చెలగాటం ఆడుతున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అంతేకాకుండా ఈ మార్చ్ వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని కొన్ని వ్యాపార వర్గాలు కోరినప్పటికీ రాహుల్ గాంధీ పట్టించుకోకుండా దీన్ని కొనసాగిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.ఇదీ చదవండి: ‘ఆత్మ నిర్భర్ భారత్’ మన లక్ష్యం: ప్రధాని మోదీ -
‘దీపావళి వ్యాపారాన్నికాపాడండి’.. రాహుల్‌కు వ్యాపారుల విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: ఢిల్లీలో దీపావళి పండుగ సీజన్ వ్యాపారానికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనతో, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నవంబర్ 1న తలపెట్టిన ‘ఓట్ చోరీ’ ర్యాలీని వాయిదా వేయాలని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ)లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరింది.అక్టోబర్ 24న రాసిన లేఖలో, ఈ ర్యాలీ కారణంగా రామ్‌లీలా మైదాన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లు, మెట్రో స్టేషన్ల మూసివేత వంటి చర్యలు ఉంటాయని, ఇది ప్రధాన మార్కెట్లలోని వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని ట్రేడ్ బాడీ ఆవేదన వ్యక్తం చేసింది. ‘దీపావళి షాపింగ్ సీజన్ పీక్స్‌లో ఉన్నందున, భాయ్ దూజ్ (నవంబర్ 10) తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.ధనతేరస్, దీపావళి పండుగల్లో ఢిల్లీలో భారీ వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని సీటీఐ తెలిపింది. ఈ ఏడాది ధనతేరస్ నవంబర్ 6న, దీపావళి నవంబర్ 8న, భాయ్ దూజ్ నవంబర్ 10న వస్తున్నాయి. పండుగకు వారం రోజుల ముందే ప్రజలు షాపింగ్ ప్రారంభిస్తారు. బంగారం, వెండి నుంచి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బట్టలు, డ్రై ఫ్రూట్స్, మిఠాయిలు, ఆటోమొబైల్స్, ఫర్నిచర్, స్టేషనరీ, గిఫ్ట్ ఐటమ్స్ మొదలైనవి ఈ కాలంలో దాదాపు రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది.అలాగే అక్టోబరు నెలలో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్, సెంట్రల్ ఢిల్లీలో జరిగిన నిరసనలు, ర్యాలీల వల్ల వ్యాపారులు ఇప్పటికే సుమారు రూ. 3,000 కోట్ల నష్టాన్ని చవిచూశారని ట్రేడ్ బాడీ పేర్కొంది. బయటి ప్రాంతాల నుంచి హోల్‌సేల్ మార్కెట్లకు సరుకులు రాకపోవడం, కస్టమర్లు రిటైల్ మార్కెట్లకు చేరుకోలేకపోవడం ఇందుకు కారణమని వివరించింది.రామ్‌లీలా మైదాన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో చాందినీ చౌక్, సదర్ బజార్, భగీరథ్ ప్యాలేస్, కాశ్మీరే గేట్, నై సడక్, దరిబా కలాన్, అజ్మేరీ గేట్, జామా మస్జిద్, కరాల్ బాగ్, లాజపత్ రాయ్ మార్కెట్ వంటి 20 చారిత్రక హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. ఈ మార్కెట్ల నుంచి భారతదేశం అంతటికీ సరుకులు సరఫరా అవుతుంటాయి.ర్యాలీ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు, మెట్రో స్టేషన్ల మూసివేత ఈ మార్కెట్ల వ్యాపారాన్ని పూర్తిగా స్థంభింపజేస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా, రామ్‌లీలా మైదాన్‌కు సమీపంలో ఉన్న పాత ఢిల్లీ, కొత్త ఢిల్లీ రైల్వే స్టేషన్ల ద్వారా నిత్యం వేలాది మంది వ్యాపారులు, కొనుగోలుదారులు రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్ల మూసివేత వల్ల వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇక్కడకు రాకండా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఎన్నికల అవకతవకలు, బీజేపీపై ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని నిర్వహిస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉత్తరప్రదేశ్, హర్యానా నాయకులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ 'ఢిల్లీ చలో మార్చ్' నవంబర్ 1న జాతీయ రాజధానిని చేరుకుంటుందని, కనీసం 1 మిలియన్ (కోటి మంది) పౌరులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రత్యేక సవరణ (సర్) ఓటర్ల జాబితా ప్రక్రయలో అవకతవకలపై ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చేందుకు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేయడానికి ఈ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: Rajasthan: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
‘రాబోయే 30 ఏళ్ల వరకు..’.. రాహుల్‌పై అమిత్ షా విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే 30 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చే అవకాశం మీకు రాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారని, అందుకే తన మాటలు ఆయనకు వినపడకపోవచ్చని పేర్కొన్న షా, ఆయన ఎందుకు విదేశాల్లో ఉన్నారనేది ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు. दिल्ली में यमुना सफाई के परियोजनाओं के शिलान्यास के वक्त अमित शाह ने कहा ''धरना-प्रदर्शन से कुछ नहीं होता.. जहां से चुनकर आए हैं..वहां के लोगों के लिए काम कीजिए.. पंजाब की जनता ने तय कर लिया है कि पंजाब में इस बार NDA की सरकार बनेगी.. 2029 तक पंजाब से नशे के व्यापार को साफ कर देंगे''- गृहमंत्री #NDA #DrugFreePunjab #AmitShah #Homeminister #RahulGandhi #Punjab— AajTak (@aajtak) October 22, 2026అయితే రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత తన మాటలను గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో వారికి ఎలాంటి అవకాశం లభించదని ఎద్దేవా చేశారు.ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)కి సంబంధించి సుమారు రూ.8,941 కోట్ల విలువైన 43 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ధర్నాలు, ఆందోళనలు చేయడం వల్ల ఏమీ సాధించలేరని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో పంజాబ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని, అక్కడి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సీఈసీ అంశం: నవంబర్‌లో 'ఇండియా' కూటమి రెండో దశ నిరసనలు
న్యూఢిల్లీ: నవంబర్ మొదటి వారంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రెండో విడత నిరసనలను ప్రారంభించాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి యోచిస్తోంది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ర్యాలీతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దసరా, నవరాత్రి ఉత్సవాల కారణంగా తాత్కాలికంగా ఆగిన ఈ ఆందోళనలను మళ్లీ వేగవంతం చేసేందుకు విపక్ష నేతలు వరుస సమాలోచనలు జరుపుతున్నారు.సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నడిబొడ్డున భారీ ప్రజా సమీకరణతో పాటు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయకోవిదులతో ఒక ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించి ఆయనపై అభిశంసన ప్రక్రియను ప్రదర్శించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణను పర్యవేక్షించేందుకు విపక్ష కూటమి త్వరలోనే ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనుంది.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అక్టోబర్ రెండో వారంలో విపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. అక్టోబర్ 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సీఈసీ రాజీనామాతో పాటు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల మంది ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 12న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.రామ్‌లీలా మైదానంలో నిర్వహించబోయే ర్యాలీలో విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం అన్ని వర్గాలను ఏకం చేస్తూ ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలన్నది ప్రతిపక్షాల ప్రధాన వ్యూహం. ఈ నిరసనల రూపురేఖలపై భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా అంతిమ నిర్ణయం తీసుకోనున్నాయి.ఇదీ చదవండి: ష్రాఫ్ కాల్పుల కేసు: ఆమిర్, రణ్‌బీర్ ఇళ్ల వద్దా రెక్కీ.. -
‘నేనేమీ ఏజెంట్‌ను కాదు’.. రాహుల్ టూర్‌పై థరూర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాలుగు రోజుల పాటు వియత్నాం పర్యటనకు వెళ్లడం రాజకీయ దుమారానికి దారితీసింది. కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన బదులిచ్చారు. తాను ఎవరికీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదని, తనను ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయని, తాను ఢిల్లీని విడిచి కేరళకు ఎందుకు వచ్చానో అలాగే రాహుల్ పర్యటన వెనుక కూడా కారణాలు ఉండవచ్చని చెబుతూ, దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు.మరోవైపు, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఢిల్లీ నిరసనల్లో అబద్ధాలు ప్రచారం చేసి అలసిపోయిన తర్వాత ఆయన విహారయాత్రకు వెళ్లారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఉన్న ఒక వీడియోను ఎక్స్‌లో పంచుకుంటూ, ఆయన విదేశీ పర్యటనల వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటని బీజేపీ ప్రశ్నించింది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ, రాహుల్ గాంధీ భారత్‌లో పాలన మార్పు తీసుకురావడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.జార్జ్ సోరోస్ వంటి వ్యక్తుల వద్ద శిక్షణ తరగతులు తీసుకోవడానికే ఆయన విదేశాలకు వెళ్లారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు వారిని సమర్థించకపోవడంతో, దేశాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై చర్చలు జరపడానికే ఈ పర్యటన అని విమర్శించారు. అలాగే బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ, రాహుల్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారా లేక దేశంలో గందరగోళం సృష్టించే వారితో సమావేశం కావడానికి వెళ్లారా అని ప్రశ్నించారు.బీజేపీ విమర్శలను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఖండించారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి అనేక బాధ్యతలు ఉంటాయని గుర్తుచేశారు. ఈ సమయంలో ఇతరులు విదేశాలకు వెళ్లడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లండన్, యేల్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడటం, మేధావులతో చర్చలు జరపడం, పత్రికా సమావేశాలు నిర్వహించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తారని, ప్రధాని నరేంద్ర మోదీ చేయని పనులను కూడా ఆయన చేస్తున్నారని అన్నారు. రాహుల్ విదేశీ పర్యటనలపై బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ కొట్టిపారేసింది.ఇదీ చదవండి: ప్రియాంక కుమారుని ఫొటో ఎగ్జిబిషన్‌పై దుమారం -
రాజకీయ రణరంగం వేళ.. రాహుల్ వియత్నాం టూర్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న వేళ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా వియత్నాం బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన హనోయ్ బయలుదేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటన వ్యక్తిగతమైనదా లేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం ‘ఓట్ల చోరీ’ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో సీఈసీ పని చేస్తున్నారని పేర్కొంటూ, ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.వియత్నాం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆదివారం గోవాలోని మార్గావ్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికతో, అమిత్ షా అమలు చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ద్వారా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ చర్యలకు మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ తప్పకుండా న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగే తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో కీలక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్లడంపై ప్రశ్నిస్తూ, గతంలో జనవరిలో కూడా ఆయన వియత్నాం వెళ్లిన విషయాన్ని ప్రస్తావించింది. విదేశీ వేదికలపై ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయనను విదేశాలకు ఎవరు ఆహ్వానిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు -
మోదీ ప్లాన్..షా ఆచరణ..జ్ఞానేశ్ అమలు
మార్గోవా: ప్రధాని మోదీ తెరవెనుక ఉంటూ ఓట్ల చోరీ కుట్రకు పథక రచన చేస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆచరించారని, దానిని సీఈసీ జ్ఞానేశ్ అమల్లో పెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీకి పాల్పడిన ఈ ముగ్గురు చట్టం ముందు దోషులుగా నిలబడి తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ గోవాలో చేపట్టిన మూడు రోజుల గోయ్ రఖోన్ యాత్ర ముగింపు కార్యక్రమం ఆదివారం మార్గోవాలో జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి రెండు కిలోమీటర్ల మేర నడిచి తర్వాత రాహుల్ మాట్లాడారు. ప్రభుత్వ కాంట్రాక్టులను కొందరు సన్నిహిత పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తూ వారి నుంచి నిధులు దండుకుంటున్నారని కేంద్రాన్ని విమర్శించారు. ‘మీరేం కంగారుపడకండి. గోవా గురించి మీరు చూసుకోండి. ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, అమిత్ షాల విషయం మేం చూసుకుంటాం. వాళ్లకు సమయం దగ్గరపడింది’అని కార్యకర్తలతో అన్నారు. ఇది బహిష్కరణ వ్యవస్థ దేశంలో విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని రాహుల్ ఆక్షేపించారు. లక్షలాది మంది యువతను విద్యకు దూరం చేసే వ్యవస్థ నేడు అమల్లో ఉందని విమర్శించారు. ఇది విద్యా వ్యవస్థ కాదని, బహిష్కరణ వ్యవస్థ అని తప్పుపట్టారు. ఇటీవల విద్యార్థుల బృందంతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టుచేశారు. డబ్బు, అధికారం లేకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా ఇప్పుడున్న వ్యవస్థ రెండో ఆలోచన లేకుండా యువతను బయటకు గెంటేస్తుందని పేర్కొన్నారు. దీనిని విద్యా వ్యవస్థ అని ఎలా పిలవాలని ప్రశ్నించారు. -
దీప్కే ఎక్కడ?
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని.. పైగా ఇది వరకు ఆయన సమర్పించిన బాండ్‌ను సైతం ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న ఢిల్లీలో తిరంగా యాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించిన ఆయన్ని, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.సర్ ప్రక్రియకు, సీఈసీకి వ్యతిరేకంగా అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద ర్యాలీకి సీజేపీ పిలుపు ఇచ్చింది. అయితే ఢిల్లీ పోలీసుల కట్టుదిట్టమైన ముందస్తు చర్యలతో ఆ ప్రయత్నం భగ్నమైంది. పైగా సీజేపీ కీలక నేతలను విమానంలోనే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలేవీ చేయమంటూ వాళ్లతో సంతకాలు చేయించుకుని.. రూ.50 వేల వ్యక్తిగత బాండ్ మీద పోలీసులు వాళ్లను రిలీజ్ చేశారు. ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద మరోసారి ధర్నా చేపడతామని సీజేపీ ప్రకటించింది. అయితే ఈలోపు అనూహ్యంగా..జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధిస్తూ కేంద్ర హోం శాఖ, ఢిల్లీ పోలీసులు ప్రకటన చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ సీజేపీ కోర్ కమిటీ సభ్యులు జాతీయ జెండాలతో జంతర్ మంతర్ బారికేడ్లు దూకి లోపలికి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయసి కోర్టులో ప్రవేశపెట్టగా.. జ్యూడీషియల్ రిమాండ్ మీద తిహార్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతలు కనిపించాయి.ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో ‘లెహ్రా దో తిరంగా’ పేరిట త్రివర్ణ పతాక ప్రదర్శన, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాలని సీజేపీ భావించింది. అయితే పోలీసులు ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను అరెస్ట్ చేశారు.దీప్కే ఆచూకీపై సీజేపీ ఆందోళనదీప్కేను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. ‘ఢిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయనతో మాకు సంబంధాలు తెగిపోయాయి. న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదు’ అని సీజేపీ పేర్కొంది. జాతీయ జెండా చేతబట్టి ఇంటి నుంచి బయటకు రావడం ఎలా నేరమవుతుందని ప్రశ్నించింది. యువతను ఉగ్రవాదుల్లా ఎందుకు చూస్తున్నారని నిలదీసింది. ఇలాంటి చర్యలతో నిరసనల్లో పాల్గొనేవారిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించింది.సీజేపీ న్యాయ విభాగానికి చెందిన రత్నా సింగ్ కూడా దీప్కే అరెస్ట్‌పై స్పందించారు. ఆయనను అరెస్ట్ చేసి ఎస్ఈఎం ఎదుట హాజరుపరచనున్నారని సమాచారం మాత్రం ఉందని అంటున్నారు. అయితే, దీప్కే ఆచూకీ ఇంకా తెలియలేదని, న్యాయవాదులు సైతం ఆయనను కలవలేకపోయారని పేర్కొన్నారు.పోలీసులకు సీజేపీ నేత లేఖదీప్కే ఎక్కడ ఉన్నారు? ఏ చట్ట నిబంధనల కింద ఆయనపై చర్యలు తీసుకున్నారు? నిర్బంధానికి ఆదేశించిన అధికారి ఎవరు? ఆయన కస్టడీకి బాధ్యత వహిస్తున్నది ఎవరు? అనే వివరాలు వెల్లడించాలని కోరుతూ సీజేపీ నేత రోహన్ దేశ్‌పాండే ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. దీప్కేను ఏ పోలీస్ స్టేషన్లో ఉంచారనే విషయంపై తమకు సమాచారం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆచూకీని వెల్లడించడంతో పాటు సహచరులతో మాట్లాడేందుకు, న్యాయ సహాయం పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు.నేహా బోరా విడుదలదీప్కేతో పాటు అరెస్టైన ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత ఆమెను విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే నేహాను మంగోల్‌పురిలోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఒంటరిగా ఉంచారని ఏఐఎస్ఏ పేర్కొంది. నిర్బంధంలో ఉన్నప్పుడు న్యాయవాదులను, సహచరులను ఆమెతో కలిసే అవకాశం ఇవ్వలేదని ఆరోపించింది.నేడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుభారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద దీప్కేపై చర్యలు తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న కారణంతో ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్న బాండ్ నిబంధనలను దీప్కే ఉల్లంఘించారని పోలీసులు చెబుతున్నారు. అలాగే, సెంట్రల్ పార్క్‌కు వెళ్లవద్దంటూ ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చామని, అయినా వాటిని పాటించలేదని చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎముకలు విరగ్గొట్టగలరేమో, కానీ.. -
రాహుల్‌గాంధీవి దింపుడు కల్లం ఆశలే
సాక్షి, హైదరాబాద్: శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూలి్చనట్లుగానే భారత్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాహుల్ గాంధీ దింపుడు కల్లం ఆశలు పెట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 10 నెలల్లో మోదీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత తనదని రాహుల్ గాంధీ అంటున్నారని ఆరోపించారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్షాల డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేసిందని.. అంతమాత్రాన తమ ప్రభుత్వం భయపడినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.2029 వరకు ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని.. రాహుల్ గాందీకి దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాదరణతో ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి చూపాలని సవాల్ విసిరారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇంత బాధ్యతారాహిత్యమైన, బలహీనమైన నకిలీ ప్రతిపక్ష నేతను దేశం ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధ సంస్థలను నిరీ్వర్యం చేసేందుకు, ఎన్నికల కమిషన్‌పై బురదజల్లేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయతి్నస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పారీ్టలు, ప్రభుత్వాలు రావచ్చు.. పోవచ్చుగానీ వ్యవస్థలను నాశనం చేయకూడదన్న ఇంగితం రాహుల్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు, సర్‌పై ఇవేం మాటలు? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను బెదిరిస్తూ రాహుల్ గాంధీ దాదాగిరి భాష మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే దానికి బాధ్యత ఎన్నికల కమిషనర్ వహించాలా అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు, ఈసీని మెచ్చుకొని.. కేరళంలో గెలిస్తే ‘సర్’మంచిదని సరి్టఫికెట్లు ఇచ్చే కాంగ్రెస్.. బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఈసీదే తప్పని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఓట్ల చోరీ ఎక్కడా జరగలేదని, దొంగలకు ప్రజలే ఓటు వేయట్లేదన్న వాస్తవాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని చురకలంటించారు. అంతర్జాతీయ డీప్ స్టేట్, విద్రోహ శక్తుల కుట్రలు, ప్రపంచ శక్తులు ఏకమైనా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని వ్యాఖ్యానించారు. ‘యాదాద్రి’కి కేంద్రం అండ... సింగరేణిలో ఉత్పత్తి తగ్గుదలతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని.. రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా కోల్ ఇండియా నుంచి బొగ్గు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను కోరారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిడ్డగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ కొరత రాకుండా యాదాద్రి ప్లాంట్‌కు తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశానని.. మహానది కోల్ ఫీల్డ్స్ లేదా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి తక్షణమే బొగ్గు అందిస్తామని స్పష్టం చేశారు. -
ఎముకలు విరగ్గొట్టగలరేమో.. సత్యాగ్రహాన్ని భగ్నంచేయలేరు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వైదొలగాలనే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులపై భద్రతా బలగాలు దారుణంగా ప్రవర్తించాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరగా ఢిల్లీ పోలీసులు తిరస్కరించారన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా నిరసనలకు దిగిన వారి ఎముకలను విరగ్గొట్టగలరేమోకానీ, వారి సత్యాగ్రహాన్ని మాత్రం భగ్నం చేయలేరని రాహుల్ పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని ఢిల్లీ పోలీసుల అమానుష చర్యలకు అడ్డుకట్ట వేస్తామని, ఇందుకు బాధ్యులైన ప్రతి అధికారిపైనా న్యాయబద్ధంగా పోరాడుతామని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యాలకు బలైన కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐకు చెందిన కొందరు విద్యార్థులను కలిసి మాట్లాడిన వీడియోను శుక్రవారం ఆయన ఎక్స్లోపోస్ట్ చేశారు. ‘మా విద్యార్థులపై దాడికి దిగిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారు. కేరళకు చెందిన అథిర, రాజస్తాన్‌కు చెందిన రితు తదితరులను ఢిల్లీ పోలీసులు కొట్టారు. వీరిపై కేసులు పెట్టాలని కేరళ హోం మంత్రి చెన్నితాల, రాజస్తాన్ పీసీసీ చీఫ్ దోతాస్రాను కోరాను. కేరళలో ఇప్పటికే జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది’అని రాహుల్ వివరించారు. వీటిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని, మరోసారి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడాలనుకునే అధికారులకు ఇదో గుణపాఠం అవుతుందని వ్యాఖ్యానించారు. -
మోదీ పాత వీడియోతో కాషాయ నేతల హడావుడి
రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు వరుసగా ఆ వీడియోను పోస్టు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు ఎందుకు వైరల్ చేస్తున్నారనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అటు సీజేపీ, ఇతర విద్యా సంఘాలు కూడా ఈ పోరాటం విడిగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి రాజకీయంగా మంచి పేరు వస్తోందనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు పాత వీడియోను తెరపైకి తెచ్చారంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రధాని మోదీ నిరాశ, అసహనంతో ఉన్నారనే అర్థం వచ్చేలా సీజేపీ కూడా ఈ వీడియోపై స్పందించింది.మోదీ ఏమన్నారంటే..ఈ ఏడాది ఫిబ్రవరిలో మీరట్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని పదవిని ఆశించేవారు ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని అన్నారు. పార్లమెంటులో ప్రధాని సీటును ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఎంపీలను ముందుకు నెట్టడం ద్వారా ఆ స్థానాన్ని సాధించలేరని వ్యాఖ్యానించారు. మహిళా ఎంపీలను అలా ముందుకు పంపే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందా? అంటూ ప్రశ్నించారు.ఢిల్లీలో జరిగిన ఏఐ సమిట్ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన ఘటననూ మోదీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ తన రాజకీయాలకు అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుందని, విదేశీ అతిథులు ఉన్న చోట గందరగోళం సృష్టించిందని విమర్శించారు. ఆ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని మండిపడ్డారు.‘‘కాంగ్రెస్ నగ్నత్వం దేశానికి తెలుసు. ఇప్పటికే ప్రజల దృష్టిలో ఆ పార్టీ నేతలు దిగజారిపోయారు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసే పనిలో కాంగ్రెస్ తీరిక లేకుండా ఉంది. రాజకీయ విభేదాల కంటే వ్యక్తిగత శత్రుత్వానికే ప్రాధాన్యమిస్తోంది. గతంలో నన్ను, నా తల్లిని అవమానించారు. ఇప్పుడు ప్రపంచ నేతల ఎదుట దేశాన్ని అవమానించారు. అన్ని పరిమితులనూ దాటిపోయారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.कांग्रेस के बेलगाम नेता, देश को तबाह करने पर तुले हुए हैं... https://t.co/jLzawqFRee— Smriti Z Irani (@smritiirani) October 15, 2026తమ చర్యలకు సిగ్గుపడాల్సింది పోయి, వాటినే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కష్టపడుతుంటే, కొన్ని పార్టీలు విజయాలను జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఇలాంటి అంశాలపై తాను స్పందించినప్పుడు ‘విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ’ అంటూ వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.కుర్చీ కోల్పోతామనే భయమా?బీజేపీ నేతలు వరుసగా పోస్టు చేస్తున్న ఈ వీడియోపై సీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘ఇది ప్రధాని నిరాశ, అసహనాన్ని చూపిస్తోంది. కుర్చీ కోల్పోతామనే భయం ఇది’’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు, పాత వీడియోను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనుక కారణమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, బీజేపీ నేతలు ఈ వీడియోను ఇప్పుడు ఎందుకు పోస్టు చేస్తున్నారనే దానిపై స్పష్టమైన కారణం వెల్లడికాలేదు.పాత వీడియోతో కొత్త రాజకీయ రచ్చమోదీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు బీజేపీ నేతల పోస్టులతో మళ్లీ చర్చలోకి వచ్చింది. అయితే, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల అంశాలపై కొనసాగుతున్న రాజకీయ పోరాటానికి ఈ వీడియోను జోడించి ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. పాత వీడియోను ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం కంటే, దాని చుట్టూ సాగుతున్న రాజకీయ వాదోపవాదాలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: కాంగ్రెస్, ఎస్పీకి యూపీలో షాక్ -
సస్పెన్స్‌కు తెర దించిన మాజీ ఐఏఎస్ దివ్య
ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా.. రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నుంచి ఆహ్వానాలంటూ చర్చ.. రాహుల్ గాంధీతో రహస్య భేటీ జరిగిందంటూ మరో ప్రచారం! మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ రాజకీయ అడుగులపై గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర చర్చ నడిచింది. ఆమె ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ప్రధాన పార్టీల అంచనాలకు భిన్నంగా తన రాజకీయ ప్రస్థానంపై ఆమె కీలక ప్రకటన చేశారు.13 ఏళ్ల సివిల్ సర్వీసు కెరీర్‌కు స్వస్తి చెప్పిన దివ్యా మిట్టల్(42).. గురువారం తన రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించిన ఆమె.. ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయడం కంటే ప్రజలతో నేరుగా మమేకమై రాజకీయాలు చేయాలన్న తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు.సొంత పార్టీతో రాజకీయాల్లోకి..తన పార్టీకి ‘జన్ నీతి భారత్ పార్టీ’ అని పేరు పెట్టినట్లు దివ్యా మిట్టల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రజలే విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండాలని, ఎన్నికల సమయంలోనే కాకుండా ఐదేళ్ల పాలనలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండాలని ఆమె పేర్కొన్నారు. కులం, మతం వంటి గుర్తింపుల కంటే ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పనికి ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని పేర్కొంటూ మూడు ప్రధాన సూత్రాలను వివరించారు.मेरा राजनीतिक सफर का अगला कदम। मेरे साथ जुड़ें 🙏🙏 https://t.co/c9ihA3dxOB— Divya Mittal (@divyamittal_IAS) October 15, 2026రాహుల్‌తో భేటీ ఉత్తదేదివ్యా మిట్టల్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన సోషల్ మీడియా పోస్టు మరింత ఆసక్తి రేకెత్తించింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో దివ్యా మిట్టల్ రహస్యంగా సమావేశమయ్యారంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే, ఈ ఆరోపణలను దివ్యా మిట్టల్ ఖండించారు. సెప్టెంబర్ 29న విడుదల చేసిన వీడియోలో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, ప్రజలతో కలిసి పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.అఖిలేశ్ వ్యాఖ్యలతోనూ చర్చ..దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామనే సంకేతంగా ఆయన వ్యాఖ్యలను పలువురు విశ్లేషించారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే, ఈ ఊహాగానాల మధ్య దివ్యా మిట్టల్ సొంత పార్టీ ప్రకటన చేయడంతో ఆమె రాజకీయ ప్రయాణంపై స్పష్టత వచ్చింది.వ్యవస్థలోని లోపాలే రాజకీయాలకు కారణమా?ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసినప్పుడు ఎదురైన అనుభవాలే రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయానికి కారణమని దివ్యా మిట్టల్ గతంలో వివరించారు. మంజూరైనప్పటికీ నిర్మాణం కాని పాఠశాలలు, లబ్ధిదారులకు అందని భూములు, అధ్వాన్న రహదారులు, పేపర్ లీకేజీలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన రాజకీయ లక్ష్యమని చెప్పారు.ఐఐటీ.. ఐఐఎం నుంచి ఐఏఎస్ వరకుహరియాణాలోని రేవారీకి చెందిన దివ్యా మిట్టల్.. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. అనంతరం లండన్‌లో పనిచేసి, 2013లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 68వ ర్యాంకు సాధించారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆమె సంత్ కబీర్ నగర్, మిర్జాపూర్, డియోరియా జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్‌గా సేవలందించారు. మిర్జాపూర్‌లోని మారుమూల గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. ఆగస్టు 30న ఐఏఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్న ఆమె.. తాజాగా సొంత పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2027 యూపీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఈసీపై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు -
న్యాయవ్యవస్థను భయపెట్టలేరు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రవర్తనను సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రపై అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాం«దీతోపాటు ప్రతిపక్ష నాయకులను ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎస్ఐఆర్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతలు ఈ నెల 12న సుప్రీంకోర్టు వరకు ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలను నిరోధించాలని కోరుతూ నలుగురు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థను ఎవరూ భయపెట్టలేరని జస్టిస్ సూర్యకాంత్ తేల్చిచెప్పారు. తాము దంతపు కోటలో కూర్చోలేదని, బయట ఏం జరుగుతుందో, కోర్టులో ఏం చెబుతున్నారో, ఎవరు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో అంతా గమనిస్తున్నామని స్పష్టంచేశారు. న్యాయస్థానాలను ప్రభావితం చేయాలనే ఇలాంటి ప్రయత్నాలు బలహీనమైనవని, వాటిని ఎవరూ పట్టించుకోరని వెల్లడించారు. ఎస్ఐఆర్పై నోటీసులు దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఆందోళనలు, పోలీసుల ఆంక్షలు, పత్రికా స్వేచ్ఛ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తదితర అంశాలపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. ధర్మాసనం ఒకేసారి 46 పిటిషన్లను పరిశీలించింది. ఒకే రకమైన పిటిషన్లను వర్గీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.ఆందోళనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ ఎత్తున ఓటర్ల తొలగింపు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష ‘ఇండియా’కూటమి నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. ‘‘నోటీసు జారీ చేయడం అంటే మేము దీనిని ఖండిస్తున్నామని అర్థం కాదు’’అని రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఎస్ఐఆర్పై వివిధ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా దీనికి జత చేశారు. పోలీస్ కమిషనర్ బేషరతు క్షమాపణ ఢిల్లీలో ప్రజా రవాణా విషయంలో అక్టోబర్ 9, 11 తేదీల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ రెండు అఫిడవిట్లు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని, ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే బేషరతు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కమిటీ ఆందోళనల ప్రాంతాల్లో విధుల్లో ఉన్న మహిళా జర్నలిస్టుల రక్షణపై నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. మహిళా జర్నలిస్టుల భద్రత కోసం మాజీ మహిళా న్యాయమూర్తులు, ఐపీఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. బాధితుల వివరాలు, కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో సమర్పించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ను ఆదేశించింది.ఓ పోలీస్ అధికారి వేధింపులపై ఫిర్యాదు చేసిన మహిళా జర్నలిస్టుపై కక్షసాధింపుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా, ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ఆవరణలో గర్భిణిగా ఉన్న జర్నలిస్టును రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆమె ఆసుపత్రి పాలైందన్న వార్తను గౌరవ్ భాటియా ప్రస్తావించగా.. ఈ అంశంపైనా కోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టులకు ఆర్టికల్ 19(1)(ఎ) కింద భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)(జి) కింద వృత్తిలో కొనసాగేందుకు హక్కు ఉంటాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. -
తొలిసారి కాంగ్రెస్ నిరసనలో విజయ్ పార్టీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ పార్టీ తొలిసారి ఇండియా కూటమి నిరసనలో పాల్గొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం చెన్నైలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో టీవీకే నేతలు పాల్గొన్నారు.ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఈ నిరసన చేపట్టారు. అక్టోబర్ 3న ఇండియా కూటమిలో చేరిన తర్వాత టీవీకే ఈ తరహా ఆందోళనలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.రాహుల్-విజయ్ భేటీ తర్వాత కీలక పరిణామంఅక్టోబర్ 10న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. విజయ్‌తో చెన్నైలో సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో నిర్వహించే ప్రచారాలు, నిరసనలు, రాజకీయ చర్చల్లో పాల్గొనాలని విజయ్ను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నేతలు కాంగ్రెస్ నిరసనలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియలో సుమారు 97 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని నిరసనకారులు ఆరోపించారు. అందులో ముఖ్యంగా ముస్లింలు, గిరిజనులు, అణగారిన వర్గాల ఓటర్లు ఉన్నారని వారు విమర్శించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ప్రయోగానికి అమెరికా ప్లాన్? -
రాహుల్ తీరుపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం.. వివరణ కోరుతూ నోటీసులు
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ విపక్ష నేతలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అయితే, ఈ పిటిషన్ల నేపథ్యంలో అక్టోబర్ 12న ‘ఇండియా’ కూటమితో కలిసి సుప్రీంకోర్టు వరకు రాహుల్ గాంధీ నిర్వహించిన నిరసన ర్యాలీ, కోర్టు ఆవరణలో జరిగిన ఆందోళనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో కోర్టు వద్ద చేపట్టిన ఈ ఆందోళనపై వివరణ ఇవ్వాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా ఈ నిరసన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై బయట రాజకీయ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, కోర్టుపై ఒత్తిడి తెచ్చేందుకే ఇదంతా చేశారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ అని తేల్చిచెప్పారు. కోర్టును ప్రభావితం చేసేందుకు జరిగే ఇలాంటి బలహీనమైన ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరని, తాము ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో కూర్చోలేదని, చుట్టూ ఏం జరుగుతుందో తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదే క్రమంలో అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన నిరసనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ రికార్డింగులను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ నిర్ణయం రాజకీయ నేతల తీరును సమర్థించినట్లు లేదా వారి ప్రవర్తనను క్షమించినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత పక్షాల స్పందన కోరుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
జంతర్ మంతర్ హోదా రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశంగా గుర్తించే హోదాను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. జంతర్ మంతర్ హోదా రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు. నిరసనలను నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తే.. అధికారులకు తమ సమస్యలను తెలియజేసే అవకాశం తగ్గిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగించవచ్చని వాదించారు.జంతర్ మంతర్ హోదా రద్దు నిర్ణయం సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా తీసుకున్నదా? లేదంటే ఆ ప్రాంతం నిరసనల వేదికగా ఎంతవరకు ఉపయోగకరమన్న అంశంపై స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించారా? అని కూడా ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి.. సమగ్ర నివేదిక సమర్పించిందని కోర్టుకు వివరించారు.‘నిరసనకారుల మాటలు అధికారులకు చేరాలి’విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదించిన మాజీ న్యాయమూర్తి, సీనియర్ న్యాయవాది ముక్తా గుప్తా.. నిరసనకారుల మాటలు అధికారంలో ఉన్నవారికి చేరే ప్రదేశంగా జంతర్ మంతర్ ఉండాలని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి స్పందిస్తూ.. ‘‘వినడం అనే పదాన్ని సాంకేతికత కోణంలోనూ అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు. ప్రత్యామ్నాయ వేదికలుగా మూడు ప్రాంతాలుఅక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జంతర్ మంతర్ హోదాను తొలగించి, నిరసనలకు ప్రత్యామ్నాయ వేదికలుగా రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు (ఎస్ఓపీలు) విడిగా జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే రాంలీలా మైదాన్‌లో గతంలో అనేక రాజకీయ నిరసనలు, ధర్నాలు జరిగాయి. అయితే బురారీ, షాహదరాలోని సీబీడీ మైదానాల్లో చాలా కాలంగా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ వేదికలు ప్రజలకు అందుబాటులో ఉండటం, నిరసనల ఉద్దేశం అధికారులకు చేరే అవకాశం వంటి అంశాలు ఈ వివాదంలో కీలకంగా మారాయి.ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్జంతర్ మంతర్ హోదా రద్దుపై ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్.. నిరసనకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూనే.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్లో కొత్త ఉత్తర్వులను కూడా సవాలు చేశారు. జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేయడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే జంతర్ మంతర్ వద్దకు దూసుకెళ్లిన సీజేపీ కోర్ కమిటీ సభ్యులు.. జాతీయ జెండాలు ప్రదర్శించారు. దీంతో వాళ్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ కింద తిహార్ జైలుకు తరలించారు. ఈ అరెస్టును దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఖండించాయి.గతంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలపై సంపూర్ణ నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు 2018లో పేర్కొన్న తీర్పును కూడా పిటిషనర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ పోలీసుల సమాధానాల తర్వాత సుప్రీంకోర్టు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మతం మారితే ఇక అంతే!.. సుప్రీం కోర్టు -
మోదీతో విభేదాలున్నా.. దేశం జోలికొస్తే ఊరుకోం!: ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు చేసే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పొలిటికల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ విషయంలో మాత్రం దేశ సార్వభౌమాధికారాన్ని ముందుకు తెచ్చారు. భారత్ ప్రధాని గురించి మాట్లాడే హక్కు.. ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం మస్క్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.భారత్‌లో స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అనుమతులు ఆలస్యమవుతున్నాయంటూ మస్క్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. దేశ వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది భారతదేశమేనని ఒవైసీ కుండబద్ధలు కొట్టారు. విదేశీయులు వచ్చి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో తనకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ప్రధాని స్థానాన్ని అగౌరవపర్చడం, దేశ గౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించబోనని అన్నారు.అంతేకాదు.. ప్రపంచంలోనే చౌక ధరకు ఇంటర్నెట్ లభించేది భారత్లోనని గుర్తు చేశారాయన. దేశంలో టెలికాం రంగానికి సంబంధించిన నిర్ణయాలు భారత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని, విదేశీ వ్యాపారవేత్తల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భారత్‌ను రష్యా చమురు కొనొద్దని చెబుతున్న అమెరికా.. అక్కడి నుంచి డీజిల్ కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. భారత్ కూడా తన ప్రయోజనాలే ముఖ్యంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. Owaisi slams Elon Musk for insulting PM Modi ji. Agree or not, he is a more loyal Indian than undignified Rahul Gandhi. https://t.co/1FUJKwKalK— Alpakanya (@Alpakanya) October 14, 2026భారతదేశ వనరులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించేది ఈ దేశమేనని.. విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్ విధానాలను శాసించే పరిస్థితి ఉండకూడదని అన్నారాయన. రాజకీయ విభేదాలు ఉన్నా దేశ గౌరవం, రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో రాజీ పడకూడదన్న ఆయన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎలాన్ మస్క్ వరకు.. విదేశీ ప్రముఖుల వ్యాఖ్యలపై ఇక్కడి రాజకీయ నేతలు గట్టిగా స్పందించడం లేదని నిలదీశారు. మస్క్‌ను ఉద్దేశించి ‘గోరా చమ్డీ వాలా’ (తెల్లతోలు వ్యక్తి) అంటూ మండిపడ్డారు.ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించడానికి అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తికాలేదు. ఈ జాప్యంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత టెలికాం మార్కెట్లోని శక్తిమంతమైన వ్యాపార వర్గాలు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్టులు కూడా చేశారు.అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. స్టార్‌లింక్‌తో పాటు ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకూ భద్రతాపరమైన పరిశీలనలు, నిబంధనల అమలు అవసరమని స్పష్టం చేసింది. అనుమతుల ప్రక్రియలో పక్షపాతం చూపుతున్నారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా మస్క్ పోస్టుకు స్పందించడంతో రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పుడు ఒవైసీ వ్యాఖ్యలు ఈ అంశానికి మరో కోణాన్ని జోడించాయి. విదేశీ సంస్థలకు భారత్‌లో వ్యాపారం చేసే అవకాశం ఉండొచ్చు.. కానీ దేశ చట్టాలు, నిబంధనలు, నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సిందేనన్నది మజ్లిస్ అధినేత వైఖరిగా ఆ వైరల్ వీడియోతో కనిపిస్తోంది.ఇదీ చదవండి: సీజేపీ నిరసనల ఎఫెక్ట్.. దేశ బహిష్కరణ నోటీసులు! -
ఎస్ఐఆర్పై సుప్రీం కోర్టులో నేడు బిగ్ డే!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు పలువురు విపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఈ కేసులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, మార్పులపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడంతోపాటు, జాబితాలో మార్పులు చేయడంలో అక్రమాలు జరిగాయనేది రాహుల్‌గాంధీ, ఇతర విపక్ష నేతల ప్రధాన ఆరోపణ. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలూ ఇందులో ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో, సాంకేతిక నిపుణులు, ప్రముఖులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.ఎస్ఐఆర్ సందర్భంగా ఓటర్ల జాబితాలో చేసిన తొలగింపులు, మార్పులను నిర్దిష్ట గడువులోగా ఆడిట్ చేయాలని కోరారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఎన్నికల సంఘం రికార్డులు, సమావేశాల వివరాలు, అభ్యంతరాలు, డిజిటల్ యాక్సెస్ లాగ్లను పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కూడా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. తగిన నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా ఏ ఓటరు పేరునూ తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.సర్‌ను సవాలు చేసిన ఒవైసీఎస్ఐఆర్ నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్‌ను రాహుల్‌గాంధీ తదితరుల పిటిషన్లతో కలిపి విచారించాలని ఆయన తరఫు న్యాయవాది కోరడంతో, గురువారం విచారణకు జాబితా చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వేర్వేరు అభ్యంతరాలు అత్యున్నత న్యాయస్థానం ముందుకు రానున్నాయి.ఢిల్లీ నిరసనలపై పిటిషన్లూ విచారణకు..మరోవైపు, అక్టోబర్ 10న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలపై దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. నిరసనల సమయంలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రాకపోకలకు అంతరాయం, పోలీసుల చర్యలకు సంబంధించిన అంశాలు ఈ పిటిషన్లలో ఉన్నాయి.నిరసనలను కవర్ చేస్తున్న మహిళా జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపైనా గత విచారణలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారిని హాజరుకావాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని, సంబంధిత పిటిషన్లకు సమాధానాలు ఇవ్వాలని కూడా సూచించింది. ఈ కేసుల విచారణను కూడా నేటికి(అక్టోబర్ 15)కు వాయిదా వేసింది.ఢిల్లీ ఎస్ఐఆర్లో ఫారం-6 వివాదంపై వేరుగా..ఢిల్లీలో ఎస్ఐఆర్ సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినవారు తిరిగి పేర్లు చేర్చుకోవడానికి కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం-6 సమర్పించాలని కోరుతున్నారంటూ మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై అక్టోబర్ 14న విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కాకుంటే.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.ఎస్ఐఆర్ ప్రక్రియపై విపక్షాల అభ్యంతరాలు, ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఢిల్లీ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు.. ఇలా పలు కీలక అంశాలపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరగనుంది. విచారణ అనంతరం ధర్మాసనం ఇచ్చే ఆదేశాలపై ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: పోలీసుల అదుపులో అంకిత పేరెంట్స్.. సెన్సేషన్ కేసులో హైడ్రామా -
యువత దారికి అడ్డు రావొద్దు
న్యూఢిల్లీ: నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఈ దేశం గొంతుక అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యువత దారికి అడ్డు రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూకి చెందిన విద్యార్థులను రాహుల్ బుధవారం కలిశారు. ఢిల్లీ 10, జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరసనల సమయంలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల అమానుష ప్రవర్తన గురించి, తమపై దాడి చేయడం గురించి రాహుల్‌కు విద్యార్థులు వివరించారు. పోలీసులు తమను దారణంగా దూషించడమే కాకుండా, తమ జననేంద్రియాలపై కూడా కొట్టడం వల్ల తీవ్రంగా గాయపడ్డామని చెప్పారు. విద్యార్థుల ఆవేదన విని రాహుల్ గాంధీ చలించిపోయారు. ఎవరూ అందోళన చెందవద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులను సింహాలు, ఆడసింహాలుగా అభివరి్ణంచారు. ఒక విద్యార్థినిని ‘మన షేర్ని’గా పరిచయం చేశారు. ‘‘ఆమెపై దాడి జరిగింది కానీ ఆమె భయపడలేదు. ఆమె హృదయంలో ఎలాంటి ద్వేషం లేదు’’అని అన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రజల గొంతుకకు, వారి నిరసనకు ఎదురుగా నిలబడి ఉన్నారని రాహుల్ ఆక్షేపించారు. ప్రజలకు ఇంకా ఎదురుగా నిలబడవద్దని, అలా చేస్తే మీరు తట్టుకోలేరు అని మోదీ, అమిత్ షాలకు సూచించారు. ఈ దేశంలో కులం, మతం, లింగభేదాలు లేకుండా ప్రజలంతా ఒక్కటిగా కలిసి ఉన్నారని, వారిని ఎవరూ విడగొట్టలేరని చెప్పారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులంతా భుజం భుజం కలిపి నిలబడాలని రాహుల్ సూచించారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిందని ఆరోపించారు. ఆమెకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ విద్యార్థులపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ సహా తమ పిల్లలపై చేయి చేసుకున్న కానిస్టేబుళ్ల వరకు అందరినీ శిక్షిస్తామని ఉద్ఘాటించారు. రాహుల్ గాం«దీతో మాట్లాడుతున్నప్పుడు ఓ విద్యార్థి మహాత్మా గాం«దీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’అనే భజన గీతాన్ని వేణువుపై వాయించారు. ద్వేషానికి సమాధానం ప్రేమతోనే ఇస్తామని అన్నారు. వీడియోలు, ఫొటోలు భద్రపర్చుకోండి గాయపడిన విద్యార్థులతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘మన ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయాలని చూసేవారు చట్టం ఆగ్రహానికి గురయ్యే రోజు వస్తుంది. తప్పు చేసినవారు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. పోలీసుల క్రూరత్వానికి, చట్టవిరుద్ధమైన నిర్బంధానికి గురైన విద్యార్థులు, యువతీ యువకులు దానికి సంబంధించిన వీడియో లు, ఫోటోలు భద్రపర్చుకోవాలి. అది చాలా అవసరం. బాధ్యులను శిక్షించడానికి అవి ఉపయోగపడతాయి. శాంతియుత నిరసన మీ హక్కు. దానిని ఎవరైనా లాక్కోవాలని చూస్తే సహించం’’ అని స్పష్టం చేశారు. -
రెండు లక్షల మందితో భారీ మార్చ్.. మహేష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: దసరా తర్వాత రాష్ట్రంలో రెండు లక్షల మందితో భారీ స్థాయిలో మార్చ్ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. అదే విధంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదికి చెందిన రెండు రాష్ట్రాలలో సభ లు నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా జర్నలిస్టుల ను అవమానించారని రాహుల్ గాంధీ పై చౌకబారు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.రాహుల్ గాంధీ ఖర్గేకు షూస్ లేస్ కట్టారు. బీజేపీ మొలకెత్తడానికి వాజ్ పేయి,సుస్మా స్వరాజ్ కారణం వాళ్ళు లేకుంటే బీజేపీ మొలకెత్తేదా? అని ప్రశ్నించారు. ప్రజా స్వామ్యం లో నిరసన తెలిపే హక్కును కాల రాస్తాం అంటే ఎట్లా?బీజేపీ మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడిన వాళ్లకు మద్దతు ఇస్తాం. సీజేపీ, ఇండియా కూటమి ఎవరి వారే పోరాటం చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో భాష గౌరవం ఉండాలి. అని అన్నారు.ఆయన మాట్లాడుతూ.."అయోధ్య మందిరానికి భూమి పూజ చేసింది రాజీవ్ గాంధీరాజకీయాలకోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాముడికి రాజకీయాలకు ఏంటి సంబంధం. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన తప్పిదాలు ఆధారాల తో సహా బయట పడుతున్నాయి. 2029 లో ఎవరు ఓడిపోబోతున్నారు అని ప్రజలు చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం ప్రమాదం లో ఉంది. బీజేపీ పాలనలో సామాన్యులకు ఏమి జరగలేదు"అని అన్నారు.అదే విధంగా రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతూ "15ఏండ్ల నుండి RTC ఎన్నికలు లేవు కాబట్టి నిర్వహించాం. ఓడినా గెలిచినా కార్మికుల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాం. పట్టబద్రుల ఎన్నికల కోసం సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం.ఎర్రవల్లి లో 45 ఎకరాలు ఎవరి కబ్జా లో ఉన్నాయో విచారణ జరుగుతుంది. కవిత ఫ్యామిలీ గురించి ఎక్కువగా వాస్తవాలు మాట్లాతుంది. కవిత మాట్లాడే వాస్తవాలు అన్ని ప్రజలకు అర్థం అవుతుంది. ఫామ్ హౌస్ ల మీద దాడి చేయాలని మా అభిమతం కాదు.సింగరేణి గర్జనకు అర్థం లేదు కాంగ్రెస్ పార్టీనే సింగరేణి కార్మికులకు ఫలాలు ఇస్తుంది. అని అన్నారు. -
ఈడ్చుకెళ్లారు.. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో చేపట్టిన సీఈసీ వ్యతిరేఖ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాహుల్ గాంధీ ఒక 'హై-టీ' సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇండియా (INDIA) కూటమి నాయకులతో పాటు, సీఈసీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న సివిల్ సొసైటీ కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ భేటీలో పోలీసుల చేతిలో గాయాలైన NSUI విద్యార్థులు ప్రత్యేకంగా రాహుల్‌ని కలిశారు. తమను పోలీసులు రోడ్లపై ఈడ్చెకళ్లారని ఇష్టారీతిన కొట్టారని ఈ సందర్బంగా ఆందోళనకారులు రాహుల్ గాంధీతో వాపోయారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ పోలీసులు దాడి చేసిన వీడియో ఆధారాలు సేకరించాలని బాధ్యులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ ఈ వారికి హామీ ఇచ్చారు అనంతరం రాహుల్ మాట్లాడుతూ "కేరళకు చెందిన అతిర ఒక చెవి వినికిడిని కోల్పోయింది. ఆ చెవిపై దెబ్బ తగలడంతో ఆమెకు ఒక చెవి వినపడకుండా అయ్యింది. ఆమె ఇక వినలేకపోతుంది. గతసారి నేను మీకు కళ్ళు కోల్పోయిన ఒక బాలుడిని చూపించాను. ఇప్పుడు, ఆమెకు చెవి వినపడకుండా అయ్యింది," అని అన్నారు.కాగా గత వారం రోజులుగా ఢిల్లీ నిరసనలతో అట్టుడుకుతుంది. అక్టోబర్ 6న ఈసీ కార్యాలయం (ఎన్నికల సంఘం ఆఫీస్) మరియు ఆకాశవాణి భవన్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళనలు చేపట్టారు అక్టోబర్ 10 (శనివారం) కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాలు, జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 12న రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండి కూటమి వేలాది మంది కార్యకర్తలతో సుప్రీంకోర్టు వైపు భారీ నిరసన మార్చ్ నిర్వహించింది.ఈ నిరసనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అక్టోబర్ 10న ఢిల్లీని అష్ట దిగ్భందనం చేసింది. జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీలతో దాడి చేశారని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు NSUI విద్యార్థి నాయకులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాధితులతో రాహుల్ ఈ రోజు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. ఇదీ చదవండి: యూపీలో బీజేపీ నేత బంధీ -
ఢిల్లీలో వేడి పుట్టిస్తున్న ఓటు చోరీ రాజకీయం
-
సీజేపీ నేతల అరెస్టు పిరికిపంద చర్య: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తూ శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ కారణంతో యువ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆయన స్పందించారు.మంగళవారం సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలతో పాటు సీజేపీ ముంబై సమన్వయకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు బారికేడ్లను దాటి జంతర్ మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించి జాతీయ జెండాను ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అయితే, శిండే అనే మరో వ్యక్తి శాంతి బాండ్‌పై సంతకం చేసిన అనంతరం విడుదలయ్యేందుకు అనుమతించారు.సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలపై గతంలో సంతకం చేసిన శాంతి బాండ్ల నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలు ఉన్నాయి. జంతర్ మంతర్‌ను ఇప్పటికే నిరసన ప్రదేశంగా గుర్తింపు నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై రాజకీయంగా చర్చ మొదలైంది.ఈ అంశంపై రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని పేర్కొన్నారు. అలా చేసినందుకు యువతను జైలుకు పంపడం పిరికిపంద చర్య అని విమర్శించారు. విద్యార్థులు, యువత, పాత్రికేయులు, ఇండియా కూటమి నేతలు వేర్వేరు వేదికలపై ఉన్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కోరుకోవడమే వారి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు.జంతర్ మంతర్ భారత ప్రజలకు చెందిన ప్రదేశమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజల నిరసన హక్కులను కాపాడేందుకు ఆ ప్రాంతాన్ని తిరిగి సాధిస్తామని తన పోస్టులో పేర్కొన్నారు. యువత, పాత్రికేయులు, ప్రతిపక్ష కూటమి చేపడుతున్న నిరసనలను పౌరుల రాజ్యాంగ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: 6 నెలల్లో 80 మంది పసికందులు మృతి.. విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ -
దమ్ముంటే ఎమర్జెన్సీ విధించండి: మోదీకి దీప్కే సవాల్
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతుకను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శించారు. సీజేపీ కోర్ కమిటీ సభ్యుల అరెస్ట్.. రిమాండ్ల నేపథ్యంపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు న్యాయ కస్టడీకి పంపడంపై దీప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకుంటే ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు.జాతీయ జెండాను ప్రదర్శించారనే ఆరోపణలతో నేతలను కస్టడీకి పంపడం ఏమిటని ప్రశ్నించారు. నిరసన తెలిపిన వారిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించాలని చూస్తోందని విమర్శించారు.ఇండియా కూటమితో కలవం, కానీ..ఎన్నికల అక్రమాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ప్రశ్నించడంలో ఇండియా కూటమి, సీజేపీ లక్ష్యం ఒక్కటేనని దీప్కే చెప్పారు. అయితే, అందుకోసం తమ పార్టీ ఇండియా కూటమిలో చేరబోదని స్పష్టం చేశారు. సీజేపీ స్వతంత్ర ఒత్తిడి బృందంగా కొనసాగుతుందని, రాజకీయ పార్టీగా మారడం లేదంటే ఇండియా కూటమిలో విలీనం కావడం తమ ఉద్దేశం కాదని తేల్చిచెప్పారు.Nagpur, Maharashtra: CJP founder Abhijeet Dipke asserted that the Cockroach Janta Party is an independent pressure group and will continue to operate independently. #Nagpur #Maharashtra #AbhijeetDipke #CJP https://t.co/VvZ75pKuLx— The Guardian Chronicle (@gcnewsindia) October 14, 2026ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రశ్నించడం, ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని కోరడం తమ పోరాటంలో భాగమని పేర్కొన్నారు. ఒక అంశంపై ప్రతిపక్ష కూటమితో అభిప్రాయాలు కలిసినంత మాత్రాన ఆ కూటమిలో చేరినట్లు కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు.‘అర్బన్ నక్సల్స్’పై రియాక్షన్సీజేపీని అర్బన్ నక్సల్స్ బృందంగా చిత్రీకరించడాన్ని దీప్కే తోసిపుచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసన తెలపడం దేశవ్యతిరేక చర్యలు కావని పేర్కొన్నారు. విమర్శించే వారిపై ముద్రలు వేసి వారి గొంతు నొక్కాలని చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయకుండా ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు, నిరసనకారులపై చర్యలు, ప్రభుత్వంపై విమర్శలు.. వీటన్నింటిపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారాయన.ఇదీ చదవండి: పోలీస్ బాండ్ బ్రేక్ చేసిన సీజేపీ నేతలు! -
నిరసనల పేరిట అరాచకానికి యత్నం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గత వారం రోజులుగా ఢిల్లీలో నిరసనల పేరిట డ్రామాలాడుతూ దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను రాహుల్‌గాం«దీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పారీ్టలు దుర్వినియోగం చేస్తున్నాయని, దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కోల్పోయి ఓడిపోతున్న కాంగ్రెస్ పారీ్ట...తమ ఓటమికి ఎన్నికల కమిష¯న్ను, సుప్రీంకోర్టును బాధ్యులను చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో లోక్‌సభ స్పీకర్, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాద్ధాంతం చేశారని, ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా గద్దె దిగాలని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. వేలాది మందితో సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లి సీజేఐపై ఒత్తిడి తీసుకురావడం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదన్నారు.రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారు.. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై రాహుల్‌గాంధీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. సర్ æసర్వేలో దేశవ్యాప్తంగా 2.8 కోట్ల మంది మరణించినట్లు తేలింది. చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోతే బోగస్ ఓటింగ్ జరగదా? మరో 6.3 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కోటి మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అసలు ఆచూకీ లేని వ్యక్తుల ఓట్లు 3 కోట్ల వరకూ ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే రెండుచోట్ల పేర్లున్న 9 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించారు.‘ఒక వ్యక్తికి ఒకే ఓటు‘విధానం రాజ్యాంగబద్ధం కాదా? ప్రతి పోలింగ్ బూత్‌కు కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఉన్నారు. తప్పులుంటే క్షేత్రస్థాయిలో ఆధారాలతో ఎందుకు సరిదిద్దడం లేదు. కేరళం, తమిళనాడులలో గెలిచినప్పుడు ఎస్ఐఆర్ ఎంతో మేలు చేసిందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాలే స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల బ్యాలెట్ పేపర్లతో జరిగిన గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, త్రిపుర రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు.పెట్టుబడులకు గండి ‘విపక్షాల బాధ్యతారాహిత్యం వల్ల ఒక్క రోజే రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలతో ఢిల్లీ మార్కెట్లు స్తంభించిపోయాయి. చిరు వ్యా పారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌గాంధీ బారికేడ్లు ఎక్కి డ్యాన్సులు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నారు. ఓ గర్భిణీ జర్నలిస్టును, మహిళా పోలీసు అధికారులను దురుసుగా నెట్టివేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. రేవంత్ ఎగిరెగిరి పడుతున్నారు.. రాహుల్‌గాంధీ గజం ఎత్తు ఎగిరితే.. సీఎం రేవంత్‌రెడ్డి తాను రెండు గజాల ఎత్తు ఎగురుతానంటూ ఎగిరెగిరి పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ధర్నాలకు పిలుపునిస్తే కనీస అనుమతి ఇవ్వకుండా ముందస్తు అరెస్టులు చేయించే రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ మాట్లాడటం హాస్యాస్పదం. వర్షాల్లేక రైతులు, కరెంట్ కోతలతో పరిశ్రమలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వాటిని పట్టించుకోకుండా వారానికోసారి ఢిల్లీకొచ్చి రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తి వెళ్తున్నారు..’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి -
ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్.. బూత్ స్థాయిలో స్పెషల్ ప్లాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యే వరకు పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలకు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్లో పేర్లు గల్లంతైనట్లు పేర్కొంటున్న ఓటర్లను గుర్తించి, వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేరి్పంచేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యకర్తలను నియమించాలని ఆదేశించింది.రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకోవాలని చెప్పింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’కూటమి హస్తినలో చేపట్టిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితోపాటు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్, ఖర్గే సర్ అంశంలో క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన అవసరాన్ని మరోమారు నొక్కిచెప్పినట్లు తెలిసింది.లేదంటే గెలుపోటములు ప్రభావితం ఓటరు సవరణ ప్రక్రియలో పారదర్శకతకు తూట్లు పొడిచి, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లు, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈసీ ఓట్లను తొలగిస్తోందని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం. తమ అర్హతను తామే నిరూపించుకోవాల్సిన భారాన్ని పౌరులపై మోపుతూ, హడావుడిగా కొనసాగుతున్న సర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకోరాదని చెప్పినట్లు తెలిసింది. ఒక్కో బూత్‌లో 2–3శాతం ఓట్లే పోయాయని తేలిగ్గా తీసుకోరాదని, వీటిద్వారా గెలుపోటములు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ చెప్పినట్లు నేతలు పేర్కొన్నారు.యువత నిలదీసి ప్రశి్నస్తుందనే భయంతోనే మోదీ ప్రభుత్వం నిశ్శబ్దంగా ఫారం–6 నిబంధనల్లో అక్రమ మార్పులు చేసి, యువతను ఓటు హక్కుకు దూరం చేస్తోందన్న రాహుల్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సర్‌పై అవగాహన కల్పించేలా వివిధ ప్రాంతాల్లో సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. బూత్‌ల వారీగా తొలగించిన ఓట్లను తిరిగి చేర్చేలా ఎమ్మెల్యే, మంత్రులు బాధ్యత తీసుకోవాలని, పీసీసీ దీనిని పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిసింది. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించే వరకు ఈ పోరాటం ఆగదని.. దీనిపై అన్ని వేదికల మీద పోరాటం కొనసాగుతూ ఉంటుందని రాహుల్, ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం.రాష్ట్ర నేతల సంఘీభావం సర్ అక్రమాలపై గళమెత్తి పోరాటం చేస్తున్న ఏఐసీసీ నేతలు, ఇండియా కూటమి పక్షాలకు రాష్ట్ర నేతలంతా సంఘీభావం ప్రకటించారు. దేశంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అధికారంలోని బీజేపీ కుమ్మక్కైన విధానాన్ని దేశమంతా గమనిస్తోందని, ఈ అంశంలో రాహుల్ సహా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంపై హర్షం వ్యక్తమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.జాతీయ స్థాయిలో పార్టీ చేసే ప్రతీ పోరాటానికి రాష్ట్ర నేతలంతా మద్దతుగా ఉంటారని రేవంత్ హామీ ఇచ్చినట్లు వెల్లడించాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు సర్ఫై పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. కాగా, ఇండియా కూటమి పక్షాలకు రాహుల్ ఇచ్చిన తేనీటి విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, ఎస్పీ, తృణముల్, కమ్యూనిస్టు పక్షాల నేతలతో ఆయన ముచ్చటించారు. -
ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి
న్యూఢిల్లీ: ఎన్ని ఉద్యమాలు చేసినా దేశ ప్రజలు బీజేపీ, ఎన్డీఏ, ప్రధాని మోదీ వెంటే ఉన్నారని, రాహుల్‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ మరోమారు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్లు వెల్లువెత్తాక తొలిసారిగా అమిత్ షా తాజా ఉద్యమాలపై స్పందించారు. మంగళవారం షా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్జీ, ఆయన మిత్రపక్ష భాగస్వాములకు ఒక విషయం చెప్పదల్చుకున్నా.2029లో మీరంతా దారుణమైన ఓటమిని చవిచూసేందుకు సిద్ధంగా ఉండండి. 2029 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతోంది. కాంగ్రెస్ వరసగా నాలుగోసారి ఓటమి కూపంలో కూరుకుపోనుంది. దేశ ప్రజలంతా మోదీ, బీజేపీ, ఎన్డీఏ వెన్నంటే ఉన్నారు. ఈ నిజాన్ని నమ్మక తప్పదు’’అని అన్నారు. ‘‘ఢిల్లీలో ఒకటిన్నర కిలోమీటర్ పొడవునా 8,000 మంది జనం మధ్య 14 రాజకీయ పార్టీలతో కలిసి కదం తొక్కినంత మాత్రాన రాహుల్‌గాంధీ దేశ గొంతుకగా మారిపోరు.ప్రజాగొంతుక అనేది దేశంలో సస్యశ్యామలమైన పొలాల్లో, గ్రామాల్లో, సుదూర కొండలు, అడవులు, నదీపరివాహకప్రాంతాల్లోనూ విని్పస్తుంది. మీరు ఈ ప్రాంతాలను ఎన్నటికీ చేరుకోలేరు. బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో ఓటర్లు మిమ్మల్ని తిరస్కరించారు. అందుకే మీ పార్టీ తరచూ ఓడిపోతూనే ఉంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చెరి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క చోట అయినా విజయకేతనం ఎగరేయలేక చతికిలపడింది’’అని అన్నారు. ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సీఈసీ జ్ఞానేశ్ వ్యతిరేక నిరసనలపై షా స్పందించారు. ‘‘తప్పుడు రాజకీయాలతో కాంగ్రెస్‌కు ఒనగూరేదేమి ఉండదు.అయినా రాహుల్ పార్టీలో కీలక నేతగా ఎదిగాక, పార్టీ అధ్యక్షుడయ్యాక, దిగిపోయి తర్వాత విపక్షనేతగా ఎంపికయ్యాక సైతం పార్టీ ఎలాంటి ఘనతలు సాధించలేదు పైగా నిరాటంకంగా ఓడిపోతోంది. మరీ ముఖ్యంగా 2024లో ఎస్ఐఆర్ మొదలయ్యాక కాంగ్రెస్ ఓటముల జోరు ఎక్కువైంది. గతంలో గద్దెనెక్కి పరిపాలించిన గుజరాత్లో కాంగ్రెస్ గత 41 ఏళ్లుగా ఓటమిని చవిచూస్తోంది. ఈ లెక్కన ఇకనైనా రాహుల్ ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది. కృత్రిమ మీడియా కార్యక్రమాలు, అబద్ధాలను రాజధాని నడివీధుల్లో వల్లెవేసినంత మాత్రాన మీరు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. చొరబాటుదారులను ఓటర్లుగా మార్చాలని రాహుల్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు’’అని షా అన్నారు.ఇదీ చదవండి: జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళన -
కలిసికట్టుగా పోరాడుతాం!
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడతామని, ఓట్ల చోరీకి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నాయకులు ప్రతిజ్ఞ చేశారు. నిరంకుశ పాలనపై రాజకీయ ప్రతిఘటన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో విపక్ష కూటమి నాయకులు, పౌర సమాజ సభ్యులకు తేనీటి విందు ఇచ్చారు. ఓట్ల చోరీకి, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసనకు సంబంధించిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు.జంతర్‌మంతర్ నిరసనలను నిషేధించడంపైనా చర్చ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, మనోజ్ ఝా, జేఎంఎం నేత మహువా మాఝీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు హరేంద్ర మాలిక్, ఆనంద్ భదౌరియా, మొహిబుల్లా నదీ్వ, ఎన్సీపీ(ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ చీఫ్ నేహా బోరా, సీపీఐ–ఎంఎల్ అగ్రనేత దీపాంకర్ భట్టాచార్య, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరిక ఘోష్ , మహువా మొయిత్రాతోపాటు పౌర సమాజం సభ్యులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తదితరులు ఈ తేనీటి విందులో పాల్గొన్నారు.భవిష్యత్తు కార్యాచరణపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జంతర్‌మంతర్‌ను డీనోటిఫై చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేయబోతున్నామని రాహుల్ గాంధీ ప్రకటించారు. గంటన్నర పాటు జరిగిన విందు సమావేశం అనంతరం కూటమి నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు.వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని, చివరికి విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. తమ ఉద్యమం వెనుక ‘భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ’అనే ఏకైక లక్ష్యం ఉందన్నారు. దేశంలో నేడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ఎన్నికల వ్యవస్థ ధ్వంసం చేశారని, రాజ్యాంగాన్ని చించి పారేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి తాము కలిసికట్టుగా పోరాడుతున్నామని వెల్లడించారు.ప్రజాస్వామ్య భావాలను వ్యక్తీకరించడానికి జంతర్ మంతర్ ఒక ప్రధాన వేదికగా ఉండేదన్నారు. అయితే, దానిని అందుకోసం ఉపయోగించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆక్షేపించారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దేశంలో విధ్వంసానికి కారకులైన నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌తోపాటు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు.ఈ పోరాటం తమ కోసం కాదన్నారు. భారత ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం పోరాటం సాగుతోందన్నారు. ఓట్ల చోరీ వెనుక ఉన్నవారిలో ‘ప్రస్తుతం డెహ్రాడూన్‌లో తలదాచుకుంటున్న ఒక మహిళ’కూడా ఉన్నారని రాహుల్ ప్రస్తావించారు. అయితే, ఆమె పేరును వెల్లడించలేదు. న్యాయ వ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించామని స్పష్టంచేశారు.ఎలాంటి త్యాగానికైనా సిద్ధం: తేజíస్వీ యాదవ్జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ చేపట్టాల్సిన కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై, అలాగే ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తామంతా ఏకమయ్యామని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, సీఈసీ రాజీనామాను డిమాండ్ చేస్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ మాట్లాడుతూ... ప్రభుత్వం మొదట ఓట్ల దొంగతనానికి పాల్పడింది, ఇప్పుడు జంతర్ మంతర్‌ను కూడా లాగేసుకునే పనిలో ఉందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని సుప్రియా సూలే ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం కొనసాగుతుందన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని నేహా బోరా స్పష్టంచేశారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విషయంలో రాజీ పడిందని ఆరోపించారు. నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు అని వివరించారు. ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతిపక్షం, పౌర సమాజం కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ ఒక మాఫియా: సంజయ్ రౌత్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మొత్తం ఎన్నికల వ్యవస్థనే నేరమయం చేశారని, ఆయన ఒక మాఫియా అని రౌత్ ఆరోపించారు.శివసేన(ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. మాఫియా శక్తులను ఎలా ఎదుర్కోవాలో, వారితో ఎలా వ్యవహరించాలో తెలుసన్నారు.ఇదీ చదవండి: ఇక ముక్కోణ హోరాహోరీయేనా! -
నాలుగోసారి కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ కంటే ముందు కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసం రాహుల్ ఇష్ఠారీతిన అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇండి కూటమి నేతలపై ఈ రోజు (మంగళవారం) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.రాహుల్ దురుద్దేశంతోనే ఎస్ఐఆర్ ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని 2029 ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు ఉంటారో తేల్చుకుందామని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరో ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని, కాంగ్రెస్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాబోతోందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం చొరబాటుదారులను రక్షించడమేనని అమిత్ షా ఆరోపించారు.కాంగ్రెస్ ఆడుతున్న ఈ రాజకీయ రంగులను దేశ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఆత్మపరిశీలన చేసుకోకుండా... ఎన్నికల సంఘం, ఈవీఎంలు లేదా సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోల్పోయిన రాహుల్ గాంధీ, కేవలం దురుద్దేశంతోనే ఇష్టారీతిన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బాధ్యతల నుండి విముక్తి కల్పించండి -
ముగిసిన ఇండి కూటమి నేతల సమావేశం.. కీలక నిర్ణయం
సాక్షి, న్యూ ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండి కూటమి నేతల సమావేశం ముగిసింది. సీఈసీకి జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు విపక్షాలు తెలిపాయి. అదే విధంగా జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. మీటింగ్ అనంతరం ఇండి కూటమి నేతలు మాట్లాడుతూరాహుల్ మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలనే మా తాపత్రేయం దేశంలో ఎన్నికల వ్యవస్థ నాశనం చేశారు. మోదీ, అమిత్‌షా, జ్ఞానేష్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్షం". అని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ..తమ పోరాటం విజయవంతమైందని నిన్న సుప్రీంకోర్టుకు విపక్షాలు చేపట్టిన ధర్నాలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తప్పదని రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ పేర్కొన్నారు. ఆందోళనపై భయంతోనే జంతర్ మంతర్ ను మూసివేశారని జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశంగా కొనసాగించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇదీ చదవండి: రాహుల్‌కు పిటిషన్ వేయడం రాదు -
పిటిషన్ వేయడం కూడా రాదా? రాహుల్‌పై విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సరిగ్గా పిటిషన్ వేయడం సైతం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. నిన్న ఎస్ఐఆర్పై విపక్షాలు వేసిన పిటిషన్లో 14 లోపాలు రిజిస్ట్రీ గుర్తించిందన్నారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఈసీకి వ్యతిరేకంగా సరైన ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదన్నారు. మీరు గెలిచిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సక్రమమా ఓడిన చోట అక్రమమా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దేశంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. అసత్యాలతో రాజకీయం చేసే యత్నం చేస్తున్నారన్నారని పీయూష్ గోయల్ విమర్శించారు.కాగా ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, సర్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. ఈ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టుల నిర్బంధం, ప్రజా రవాణాపై ఆంక్షలు తదితర అంశాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై స్పందన తెలియజేస్తూ నివేదికలు, కౌంటర్లు దాఖలు చేసేందుకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గడువు కోరింది. అయితే అందుకు న్యాయస్థానం అంగీకరించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించాల్సి ఉంది. అయితే జస్టిస్ మోహన అనారోగ్యానికి గురికావడంతో విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేయాలని సీజేఐ బెంచ్ భావించింది. ఈ లోపు కేంద్రం గడువు కోరడంతో.. వాయిదాకు ఇరుపక్షాల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: అక్టోబర్ 15న విచారణ -
రాహుల్ గాంధీపై గర్భిణీ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దుమారం చెలరేగింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ తనను నెట్టేశారని జర్నలిస్ట్ రిచా పరాశర్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న తనని రాహుల్ నెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆమెను బీజేపీ నేతలు పరామర్శించారు.బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ, బీజేపీ ఎమ్మెల్యే ఉమంగ్ బజాజ్‌లు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి, పితృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ... విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్ పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి : మనవడితో వాకింగ్.. మాజీ మంత్రి లైఫ్‌లో ట్విస్ట్!ప్రస్తుతం మూడు నెలల గర్భిణినని చెప్పిన ఆమె, విధి నిర్వహణలో భాగంగా రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నిస్తే ఆయన తనను బలంగా లాగి కింద పడేశారని వాపోయారు.‘సుప్రీంకోర్టు గేటు వద్ద రాహుల్ గాంధీ బయటకు వచ్చే సమయం కోసం ఎదురుచూశాను. ఆయన మైక్‌ను పక్కకు జరపమని సైగ చేయడంతో నేను వెనక్కి తీసుకున్నాను. కానీ ఇతర జర్నలిస్టులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నా విధుల్లో భాగంగా నేను కూడా రాహుల్‌తో మాట్లాడేందుకు ముందుకు వచ్చా. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాహుల్ గాంధీ అసహనంతో ముందుకు వచ్చారు. నా చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగారు. అదే సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది నన్ను నెట్టారు. నేను మెట్లపై బోర్లా పడిపోయాను’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.మరోవైపు, బీజేపీ, మహిళా జర్నలిస్ట్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చెప్పినట్లుగా ఎలాంటి ఘటన స్పష్టంగా కనిపించడం లేదని, రాహుల్ గాంధీపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన అబద్ధాలని, ప్రతిపక్షాల పోరాటాన్ని దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.ఎన్నికల సంఘం తీరును, ఓటరు జాబితా సవరణలోని లోపాలను ఎత్తిచూపుతూ విపక్షాలు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్,ఆందోళనల వేళ ఈ వివాదం తెరపైకి రావడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది. సుప్రీంకోర్టులో ఈ విషయమై పిటిషన్లు దాఖలవుతున్న తరుణంలో జర్నలిస్ట్ ఆరోపణల ఉదంతం చర్చనీయాంశమైంది."Rahul Gandhi Pushed me down" Rahul Gandhi now pushes a female journalist! Rahul Gandhi's behavior are dangerous for Indian Democracy! He pushes journalist, beats his workers with elbow punch, pushes his own Chief Minister. Rahul Gandhi is behaving like a goon! https://t.co/9GtJ36LDHO— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 12, 2026 -
రఫేల్ డీల్‌పై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు సుప్రీంలో ఊరట
ఢిల్లీ: రఫేల్ డీల్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రధాని మోదీని ‘చోరోన్ కే సర్దార్’, ‘కమాండర్ ఇన్ థీఫ్’ అన్న వ్యాఖ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాహుల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బాంబే హైకోర్టు సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రాహుల్ ఆశ్రయించారు.పరువునష్టం కేసును కొట్టివేయాలన్న రాహుల్ గాంధీ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదుపై రాహుల్‌కు సమన్లు పంపింది. తాను రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించలేదని రాహుల్ గాంధీ వాదన. తన వ్యాఖ్యలు నిర్దిష్ట వ్యక్తుల లేదా గుర్తించదగిన వర్గాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రాహుల్ పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.రాహుల్ గాంధీ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పరువు నష్టం కేసు తదుపరి విచారణ కొనసాగింపుపై సుప్రీంకోర్టు పరిశీలించనుంది.ఇదీ చదవండి: టార్గెట్ జ్ఞానేశ్ కుమార్.. రాహుల్ గాంధీ బిగ్ మీటింగ్ -
రాహుల్‌ను చీదరించుకుంటున్నారు: కిషన్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ : రాహుల్ గాంధీ డ్రామాలను ప్రజలు చీదరించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన రాజ్యాంగ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో లోక్ సభ స్పీకర్ రాజీనామా చేయాలని నవ్వుల పాలయ్యారన్నారు. ఇప్పుడు సిఈసి రాజీనామా చేయాలని రోజుకొక నాటకం ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు సిజెఐ రాజీనామా చేయాలనడం శోచనీయమని, వేలాదిగా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయమూర్తుల పై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలలో గెలవడం చేతగాక రాజ్యాంగ సంస్థలపై దండ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. -
రాహుల్ గాంధీ పిటిషన్ లో 14 లోపాలు.. సుప్రీంకోర్టులో విచారణపై సందేహాలు..
-
టార్గెట్ జ్ఞానేశ్ కుమార్.. రాహుల్ గాంధీ బిగ్ మీటింగ్
ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ మార్చ్ నిర్వహించిన ప్రతిపక్షాలు.. తాజాగా తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై పోరును మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు.‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంతో.. ఇవాళ ఇండియా కూటమి నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆపై సాయంత్రం రాహుల్ నివాసంలో హై టీ సమావేశం జరగనుంది. ఇండియా కూటమి నేతలు, పౌరసమాజ ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులకు ఆయన ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. సీజేపీ నేతలకు ఆహ్వానం వెళ్లిందా? వాళ్లు హాజరవుతారా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.జ్ఞానేశ్ కుమార్ టార్గెట్‌గా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్లో జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలను ప్రతివాదులుగా పేర్కొన్నాయి. ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించిన నిర్ణయం చట్టబద్ధతను పరిశీలించాలని విజ్ఞప్తి చేశాయి.ఢిల్లీలో భద్రత కట్టుదిట్టంమరోవైపు, ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, బిహార్ రాజధాని పాట్నాలోనూ విద్యార్థి, యువజన సంఘాలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మంగళవారం ఆందోళనకు పిలుపునిచ్చాయి. గాంధీ మైదాన్ నుంచి లోక్‌భవన్ వరకు మార్చ్ నిర్వహించి, సీఈసీ రాజీనామా, ఎస్ఐఆర్ ఉపసంహరణను డిమాండ్ చేయనున్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కూడా కోరుతున్నాయి.ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సంఘంపై విపక్షాల ఆరోపణలు, ఎస్ఐఆర్పై న్యాయపోరాటం, తదుపరి నిరసన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ పిటిషన్ చెల్లదా? -
సీజేఐపై కాంగ్రెస్ పోస్ట్.. డిలీట్ చేసినా తగ్గని దుమారం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఢిల్లీలో నిరసనలు, ఆంక్షలపై స్పందిస్తూ.. ‘ఇది శాంతిభద్రతలకు సంబంధించిన అంశం.. నా పరిధిలోకి రాదు’ అని సీజేఐ వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది. తక్షణమే రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం తీవ్ర దుమారం రేపింది. న్యాయ వ్యవస్థపై, చీఫ్ జస్టిస్‌పై తమకు నమ్మకం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించిన సమయంలోనే దాదాపుగా ఇది జరిగింది.‘శాంతిభద్రతలు మీ పరిధిలోకి రాకపోతే రాజీనామా చేయండి. ఆ బాధ్యతలను నిర్వహించగల మరో వ్యక్తిని మేం కనుగొంటాం’ అంటూ కేరళ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో సీజేఐని ఉద్దేశించి పోస్ట్ చేశారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరించిందంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.వివాదం ముదరడంతో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ స్పందించారు. సీజేఐపై అభ్యంతరకర పోస్ట్ పెట్టిన వ్యక్తిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా, అనుమతి.. సంప్రదింపులు లేకుండానే ఆ పోస్ట్ ప్రచురితమైందని స్పష్టం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందో పరిశీలిస్తామని వెల్లడించారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అందుకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులు పార్టీ నాయకత్వ అభిప్రాయాన్ని ప్రతిబింబించవని పేర్కొన్నారు.‘కాంగ్రెస్ తదుపరి లక్ష్యం న్యాయవ్యవస్థే’విపక్ష నేతలకు సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరణ.. దానికి ఆయన ఇచ్చిన వివరణపై రాహుల్ గాంధీకి విలేకరుల నుంచి ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రాహుల్ అన్నారు. ఈ ప్రెస్‌మీట్ జరుగుతున్న టైంలోనే అటు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ పోస్ట్ పబ్లిష్ అయ్యింది. ఈ వ్యవహారంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం తర్వాత కాంగ్రెస్ లక్ష్యం న్యాయవ్యవస్థేనని తాను గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య సంస్థలను కాంగ్రెస్ బలహీనపరచాలని చూస్తోందని ఆరోపించారు. దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయని, దేశభక్తులంతా కూడా ఒక్కటవుతారని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు సైతం కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు.I had said it earlier, next target of the Congress Party is Judiciary. Congress wants to destroy all the constitutional and democratic institutions of India. All Anti-India gangs are joining hands. All patriotic Indians will also come together 🇮🇳 https://t.co/oOLST1yuUL— Kiren Rijiju (@KirenRijiju) October 12, 2026లాయర్ల సంఘం ఏమందంటే?సీజేఐ సూర్యకాంత్ రాజీనామా చేయాలంటూ చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (ఎస్సీఏఓఆర్ఏ) ఖండించింది. ఇలాంటి ప్రకటనలు న్యాయపదవి గౌరవాన్ని దెబ్బతీయడంతోపాటు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించే ప్రమాదం ఉందని పేర్కొంది. న్యాయవ్యవస్థ పనితీరుపై అభ్యంతరాలుంటే తగిన చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన మార్గాల్లోనే తెలియజేయాలని సూచించింది. న్యాయ ప్రక్రియ స్వతంత్రంగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని కోరింది.అసలు వివాదం అక్కడే మొదలైంది!ఢిల్లీలో నిరసనలకు విధించిన ఆంక్షలు, పోలీసుల చర్యలపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. ప్రతిపక్ష నేతలు తనను కలిసేందుకు చేసిన విజ్ఞప్తిని కూడా ఆయన తిరస్కరించారు. వారు లేవనెత్తాలనుకున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున, వారితో సమావేశమైతే అధికార విభజన సూత్రానికి విరుద్ధంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భారీగా ఓట్ల తొలగింపులు, అవకతవకలు జరిగాయంటూ 11 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లతో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సంఘం నిర్ణయం చట్టబద్ధతను పరిశీలించాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలు, సీజేఐ వ్యాఖ్యలు, కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్.. వరుస పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ పిటిషన్లో 14 లోపాలు?! -
సుప్రీం దిశగా సమర భేరి. ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా రాహుల్, విపక్ష నేతల బస్సు ర్యాలీ.
-
రాహుల్ పిటిషన్: 14 లోపాలతో ఎండగట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల అవకతవకలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు దాఖలు చేసిన సంయుక్త పిటిషన్లో సుప్రీంకోర్టు 14 లోపాలను గుర్తించింది. ఇందులో కోర్టు ఫీజులో రూ. 220 తక్కువగా చెల్లించడం కూడా ఒక లోపంగా రిజిస్ట్రీ పేర్కొంది. తొమ్మిది మంది పిటిషనర్లకు సంబంధించిన న్యాయపరమైన అధికార పత్రాలు సమర్పించకపోవడం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గుర్తింపు కార్డు ఫోటోకాపీ స్పష్టంగా కనిపించకపోవడం వంటి ఇతర లోపాలను కూడా కోర్టు ఎత్తిచూపింది.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఎన్నికల అక్రమాల ఆరోపణలు చేస్తూ సెంట్రల్ ఢిల్లీలో వేలాది మందితో సుప్రీంకోర్టు వైపు చేపట్టిన నిరసన ర్యాలీ రోజే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘ఇండియా’ కూటమి నాయకులు రోడ్లపై మార్చ్ నిర్వహిస్తుండగా, వారి న్యాయ బృందం ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఎన్నికల సంఘంపై ఈ పిటిషన్‌ను సమర్పించింది. అయితే పిటిషన్లో చిన్న ఫాంట్ వాడటం, రెండు నిర్దిష్ట పత్రాలకు రంగు ప్రతులు ఇవ్వకపోవడం, మసకబారిన రాత, తప్పిపోయిన పేజీలు, ప్రాంతీయ భాషా పత్రాలు, పేజీ నంబర్లలో తేడాలు ఉండటం వంటి సాంకేతిక సమస్యలను రిజిస్ట్రీ ప్రధాన అభ్యంతరాలుగా లేవనెత్తింది.ఈ పిటిషన్‌ను రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో పాటు సౌగతా రాయ్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, సుప్రియా సులే, సంజయ్ రౌత్, డి. రాజా, మహువా మాఝీ, ఎం.ఎ. బేబీ, ఇ.టి. మొహమ్మద్ బషీర్ సంయుక్తంగా దాఖలు చేశారు. భారత ఎన్నికల సంఘంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ‘రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ పేరిట నమోదైన ఈ పిటిషన్‌పై విచారణ జరగాలంటే పిటిషనర్లు ముందుగా ఈ 14 లోపాలను సరిదిద్దాల్సి ఉంటుంది.ఈ పిటిషన్ ద్వారా ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘం నిర్ణయాలపై పది రకాల ఉపశమనాలను కోరారు. అందులో ‘సర్’కు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించడం, ఆ నిర్ణయాల రాజ్యాంగబద్ధతను పరిశీలించడం, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం, స్వతంత్ర కమిటీతో ఆడిట్ నిర్వహించడం వంటి ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ మార్చ్‌కు ముందు ప్రతిపక్ష నేతలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో సమావేశం కావాలని కోరగా, ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఆయన తిరస్కరించారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు తలుపులు సామాన్య పౌరులకైనా, ప్రజాప్రతినిధులకైనా ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. -
జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా తగ్గేదే లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ రాజీనామా చేసేంతవరకు విపక్షాలు, ప్రజలు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జ్ఞానేశ్ పదవికి రాజీనామా చేసి ఎన్నికల వ్యవస్థలో జరిగిన అక్రమాలపై అప్రూవర్‌గా మారాలని సూచించారు. అలా చేస్తే దేశానికి మేలు చేసినవారవుతారని, ప్రజలు క్షమించే అవకాశం ఉంటుందని చెప్పా. ’దిల్లీ చలో’పాదయాత్ర నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మోదీ సర్కారు జ్ఞానేశ్‌ను కాపాడేందుకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న ప్రజలను అడ్డుకునేందుకు 30 వేల మందికి పైగా పోలీసులతో ఢిల్లీని ఎందుకు నిర్బంధించారు? దేశ రాజధానిని జైలుగా ఎందుకు మార్చారు?’’అని సూటిగా ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు బయల్దేరిన యువత, పౌరులను రైళ్లు, బస్సుల్లోంచి బలవంతంగా కిందకు దింపేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశ రాజధానిని ఒక సైనిక స్థావరంలా మార్చారని ధ్వజమెత్తారు. ‘భారీ బందోబస్తు పెట్టినంత మాత్రాన వెనకడుగు వేయబోం. ప్రభుత్వం ఎంత మంది పోలీసులను మారిస్తే అంత మంచిది. మోదీ ప్రభుత్వం జ్ఞానేశ్‌ను ఏస్థాయిలో కాపాడుతోందో దేశప్రజలంతా చూసి తెల్సుకోవాలి. కేంద్రం చేస్తున్న ఈ పెద్ద తప్పును యావత్ భారతదేశం గమనిస్తోంది’అని రాహుల్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోందని వెల్లడించారు. 200 మంది అధికారులతో సంప్రదింపులు‘‘ప్రభుత్వ వ్యవస్థలలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు, పోలీసులు యువతపై బలప్రయోగం చేయడానికి సిద్ధంగా లేరు. హింసను ప్రేరేపించే ఆరెస్సెస్, బీజేపీ వర్గాలను స్వేచ్ఛగా తిరగనిస్తూ, ప్రశ్నించే యువతను ఆపడంపై భద్రతా బలగాల్లోనూ అసంతప్తి వ్యక్తమవుతోంది. ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖ ఇలా పలు ప్రభుత్వ విభాగాల్లోని కీలకమైన 200 మందికి పైగా అధికారులు లోపల జరుగుతున్న సమాచారాన్ని విపక్షనేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. దేశంలోని కోట్ల మంది యువత రాజ్యాంగాన్ని తమ మతంగా భావిస్తున్నారు. ఆ గొంతును నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది’’అని ఆరోపించారు. సమాంతర ఉద్యమాలు లేవు.. ‘‘జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్‌తో దేశంలో జరుగుతున్నది ఒక్కటే ఉద్యమం. సమాంతర ఉద్యమాలే లేనేలేవు. కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి, సామాజిక సంఘాలు చేపడుతున్న ఉద్యమాలన్నీ విపక్షాల ‘ఇండియా’కూటమి ప్రధాన ఉద్యమంలో భాగాలే. రాజ్యాంగం పరిరక్షించబడి, సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ తప్పుకుని, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన చెంది, న్యాయం జరిగేదాకా విద్యార్థి, యువత ఉద్యమం ఆగబోదు’’అని రాహుల్ స్పష్టంచేశారు. జ్ఞానేశ్ నుంచీ మెసేజ్‌లు వస్తున్నాయి.. ‘‘జ్ఞానేశ్ నుంచి సైతం మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. మన పత్రికాసమావేశాన్ని ఆయన సైతం ప్రత్యక్షప్రసారంలో చూస్తూనే ఉండిఉంటారు. ఇకనైనా ఆయన అప్రూవర్‌గా మారితే మంచిది. మీరు అతిపెద్ద నేరం చేశారు. నిజం చెప్పాలంటే నేరం చేసిన మీ వెనకాల అసలైన నేరగాళ్లు దాక్కున్నారు. మీరూ తప్పుచేశారుగానీ ఆ తప్పుకు అసలైన కారకులు మీరు కాదు. మీ వెనకాల ఉన్న వాళ్లు. మీ వెనుక ఉండి నడిపిస్తున్న అసలు వ్యక్తుల వద్దకు చేరుకుంటాం. సీఈసీగా మీరు కొనసాగలేరు. మీపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోగలం. మేం క్రూరులం కాదు, క్షమించే గుణం ఉన్నవాళ్లం. రాజ్యాంగాన్ని కాపాడటమే మా ఏకైక లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై అంత ప్రేమ ఎందుకు?‘‘జంతర్‌మంతర్, పరిసర ప్రాంతాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులు, విపక్షపార్టీల కార్యకర్తలపై పోలీసుల జులుం కొనసాగుతోంది. కానీ అదే ప్రాంతంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ శ్రేణులను పోలీసులు కన్నెత్తి్తచూడట్లేరు. వాళ్లపై అంతటి ప్రేమ ఎందుకు? ’’అని రాహుల్ నిలదీశారు. రాష్ట్రపతికి ఆధారాలు సమర్పిస్తాం.. రాష్ట్రపతి ముర్ముతో జరిగిన భేటీపై రాహుల్ ప్రస్తావించారు. ‘‘ఎన్నికల అక్రమాలపై రాష్ట్రపతి ఆధారాలు కోరారు. దీంతో పూర్తి స్థాయి పత్రాలను సిద్ధం చేసి సమర్పిస్తామని తెలిపాం.రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి తిరస్కరణ రాలేదు. దేశం కోసం చేసే ఈ పోరాటం ఒక్క రోజులోనో, రెండు రోజుల్లోనో ముగిసేది కాదు. నెలలు, సంవత్సరాలు పట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రోడ్లపైనే కాదు, ప్రజల ఆలోచనల్లో ప్రజాస్వామ్య రక్షణ స్పృహను రగిలించడమే మా లక్ష్యం. ఈ పోరాటంలో అలుపు లేకుండా నిలబడతాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు. -
ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్ ఓడిపోవడమేంటి?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్‌లో గత 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు ఓడిపోయారు? అందుకే ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో టీడీపీ, జనసేన ఆఖర్లో కూటమి కట్టాయని గుర్తుచేశారు.కేంద్ర ఎన్నికల సంఘంలో పెద్ద కుట్ర జరుగుతోందితెలంగాణలో తాము బలంగా ఉన్నాం కాబట్టే ఈ సారి 73 లక్షల ఓట్లు అక్రమంగా తీసేయడానికి కుట్ర పన్నారని, తాము మళ్లీ గెలుస్తామని తెలుసు కాబట్టే ఓట్లను గల్లంతు చేస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. దేశంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంలో పెద్ద కుట్ర జరుగుతోందని, దీన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహారశైలి ఎంత వివాదాస్పదమైందో, ఆయన ఏకపక్ష నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు కేవలం పది నెలల వ్యవధిలోనే 14 సార్లు రికార్డు పూర్వకంగా ఎందుకు అభ్యంతరం చెప్పారో ప్రజలంతా గమనించాలని కోరారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవని మంత్రి వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: సుప్రీం దిశగా సమరభేరీ -
సుప్రీం దిశగా సమరభేరీ
సాక్షి, న్యూఢిల్లీ: కోట్ల ఓట్లను గల్లంతు చేశారన్న ప్రధాన ఆరోపణలను నెత్తినమోస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ పదవి నుంచి తక్షణం తప్పుకోవాలన్న డిమాండ్‌తో కొద్దిరోజులుగా దేశ రాజధాని వీధుల్లో ఉద్యమిస్తున్న విపక్షపార్టీల నేతలు ఇప్పుడు నేరుగా సర్వోన్నత న్యాయస్థానం దిశగా ర్యాలీగా దూసుకెళ్లి ఉద్యమపథాన్ని కొత్త దిశలో మళ్లించారు. అన్యాయంగా ఓట్లు కోల్పోయిన కోట్లాది మంది ఓటర్లకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసేందుకు వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులతో బయల్దేరిన విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీల ర్యాలీ హస్తినవీధుల్లో జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఉద్యమకారులు ఎన్డీఏ సర్కార్, సీఈసీ, మోదీ, షా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది.‘మోదీ–జ్ఞానేశ్‌ను తప్పిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం’, ‘జ్ఞానేశ్ ఎక్కడ? మోదీ ఒడిలో’, ‘జ్ఞానేశ్జీ మీ గడువు ముగిసింది. దిగిపో’, ‘రాజీనామా.. చేయాల్సిందే’నినాదాలు సోమవారం ఢిల్లీ రహదారుల్లో మార్మోగాయి. జ్ఞానేశ్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నాయకులు సోమవారం రఫీమార్గ్లోని కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వైపు మార్చ్ చేపట్టారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియాసూలే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతిపక్ష నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది నిరసనకారులు తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టు దిశగా కదిలారు.సుప్రీంకోర్టుకు కొంత దూరంలో భగవాన్ దాస్ రోడ్డులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు బారికేడ్లు ఎక్కడంతో పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. తర్వాత కాస్తంత తక్కువ మంది నేతలు, కార్యకర్తలతో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాం«దీ, ప్రియాంక, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వాహనం పైకెక్కి ర్యాలీగా ముందుకు కదిలారు. వీళ్లను కార్యకర్తలు జెండాలు ఊపుతూ అనుసరించారు.తర్వాత నేతలు బస్సులో ప్రయాణించారు. బస్సు బారాఖంబా రోడ్– కన్నాట్‌ప్లేస్ జంక్షన్ సమీప ఇందిరాచౌక్కురాగానే రాహుల్, ప్రియాంక, ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా కిందకు దిగి కార్యకర్తలతో కలిసి నడిచారు. దీంతో ఆ మార్గంలోని పలు కంపెనీలు, సంస్థల ఉద్యోగులు వీళ్లను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, శివసేన నేత సంజయ్ రౌత్, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సుఖూ్ఖ, కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, టీఎంసీ నేత సాగరికా ఘోష్, సామాజిక వేత్తలు యోగేంద్ర యాదవ్, నందితా నారాయణ్ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కానిస్టిట్యూషన్ క్లబ్ నుంచి సెంట్రల్ సెక్రేటేరియేట్, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా మీదుగా, ఫిరోజా రోడ్, మండీ హౌజ్‌ల నుంచి బారాఖంబాకు మార్చ్ చేరుకుంది.నేతలతోపాటు వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు అడుగులు వేశారు. ఇతర వామపక్ష సంఘాల సభ్యులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన మార్చ్ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమైంది. సుప్రీంకోర్టుకు చేరేసరికి సమయం సాయంత్రం ఐదున్నర అయింది.ప్రధాన ఆకర్షణగా బ్యాట్‌మ్యాన్ మాస్క్ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల్లో కొందరు బ్యాట్‌మ్యాన్ మాస్క్‌లు ధరించి అందర్నీ ఆకర్షించారు. ఉద్యమంలో ప్రధాన ఆకర్షణగా మారి అందర్నీ ముందుండి నడిపిస్తున్న రాహుల్‌గాం«దీని బ్యాట్‌మ్యాన్‌గా భావిస్తూ మాస్‌్కలు, వేషధారణలో వచ్చామని పలువురు ఉద్యమకారులు తెలిపారు. వారిలో ఒకరు కొన్ని మాస్‌్కలను బస్సులోని ముఖ్యనేతలకు అందజేశారు. వాటిలో ఒకదానిని రాహుల్ ధరించగానే నిరసనకారులు ఆనందంతో నినాదాలుచేశారు. మరో మాస్్కను ఖర్గే ధరించారు.ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 11 మంది ప్రతిపక్ష నాయకులు సంయుక్తంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, రాష్ర్టీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ–ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మహువా మాఝీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఈటీ మొహమ్మద్ బషీర్ ఈ పిటిషన్ వేశారు.పిటిషన్లో సీఈసీ జ్ఞానేశ్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కోసం సుప్రీంకోర్టు తలుపులు తెరచే ఉంటాయని సీజేఐ సూర్యకాంత్ వేరే కార్యక్రమంలో వ్యాఖ్యానించిన కొన్ని గంటలకే విపక్షనేతలు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.నేడు ఎస్ఐఆర్ పిటిషన్లపై విచారణ?ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇప్పటికే విచారణలో ఉన్న సంబంధిత కేసులతో కలిపి పరిశీలించే అవకాశం ఉందని సీజేఐ సూచించినట్లు సమాచారం. అయితే, రాహుల్, ఇతర ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌లోని పూర్తి వాదనలు, కోరిన ఉపశమనాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అందువల్ల మంగళవారం విచారణలో ఈ పిటిషన్ ఏ విధంగా పరిశీలనకు వస్తుంది, న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: నిరసనల రాజధాని! -
సుప్రీంకోర్టు మార్చ్‌లో ‘బ్యాట్‌మ్యాన్’ నిరసన
సాక్షి,న్యూఢిల్లీ: ఓ వైపు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు.. మరో వైపు సుప్రీంకోర్టు దిశగా ప్రతిపక్ష నేతల నిరసన ప్రదర్శన.. ఈ హడావుడి మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఓ సూపర్ హీరో మాస్క్! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష నేతల నిరసనకు బ్యాట్ మ్యాన్ మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిబ్యాట్మ్యాన్ అంటే చాలామందికి గుర్తొచ్చేది చీకటిలో నేరాలపై పోరాడే ఓ కల్పిత సూపర్‌హీరో. తప్పులను ఎదిరించడం, అన్యాయంపై పోరాడటం, న్యాయం కోసం నిలబడటం వంటి భావాలు ఈ పాత్రతో ముడిపడి ఉన్నాయి. అందుకే బ్యాట్ మ్యాన్ మాస్కును నిరసనలో ఉపయోగించడం ద్వారా తమ పోరాటానికి ఓ ప్రత్యేకమైన దృశ్య రూపం ఇవ్వాలనే ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు.రాహుల్ గాంధీ పాత జోక్..ఇప్పుడు నిరసనలో!ఈ మాస్కుల వెనుక రాహుల్ గాంధీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఉంది.ఆగస్టులో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి రాహుల్‌ను ‘‘మీరు బ్యాట్మ్యానా?’’ అని అడిగారు. తాను, బ్యాట్‌మ్యాన్ ఎప్పుడైనా ఒకే గదిలో కనిపించారా? అన్న తరహాలో సరదాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో రాహుల్, బ్యాట్మ్యాన్లను పోలుస్తూ మీమ్స్ ప్రచారంలోకి వచ్చాయి.ఆ తర్వాత కాంగ్రెస్ వర్గాలు కూడా బ్యాట్‌మ్యాన్ బొమ్మను తమ రాజకీయ ప్రచారంలో ఉపయోగించాయి. అక్టోబర్ 6న జరిగిన నిరసనకు సంబంధించిన ప్రచారంలో ఈ తరహా చిత్రాలు కనిపించగా..అక్టోబర్ 12న ఢిల్లీలో జరిగిన నిరసనలోనూ బ్యాట్‌మ్యాన్ మాస్కులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.సుప్రీంకోర్టు దిశగా మార్చ్.. ఆ తర్వాత ఏం జరిగింది?ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రతిపక్ష నేతలను పోలీసులు భగవాన్ దాస్ మార్గ్ సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆరోపణలపై రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 13న పిటిషన్ పరిశీలనకు వచ్చే అవకాశంపై కోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల్లో అసలు చర్చ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల హక్కులు, ఎన్నికల సంఘం బాధ్యతల చుట్టూ తిరుగుతోంది. బ్యాట్‌మ్యాన్ మాస్కులు మాత్రం ఆ రాజకీయ పోరాటానికి అదనపు ప్రచార ఆకర్షణను తీసుకొచ్చాయి.రాజకీయాల్లోనూ మారుతున్న ప్రచార శైలిఒకప్పుడు రాజకీయ నిరసన అంటే నినాదాలు, ప్లకార్డులు, ప్రసంగాలు, ర్యాలీలు ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు వాటితోపాటు ఫొటోలు, చిన్న వీడియోలు, మీమ్స్, గుర్తుండిపోయే దృశ్యాలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఒక చిత్రం కొన్ని సెకన్లలోనే వేలాది మందికి చేరగలదు. అందుకే నిరసనలో కనిపించే ప్రతి ప్రత్యేక దృశ్యం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తోంది. -
రాహుల్ గాంధీ టచ్‌లో 200 మంది అధికారులు
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి యువత నిరంతరం పోరాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. సత్యం మన వైపు ఉంది.. ఆగకండి, ప్రతిరోజూ పోరాటం కొనసాగించండి అని దేశ యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఎన్నికల వ్యవస్థలోని అక్రమాలను, ఓటు చోరీని ప్రశ్నిస్తున్న యువతను ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఢిల్లీని ఒక కోటలా మార్చేసింది. దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించి, యువతను, ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు. రైళ్లు, బస్సుల్లోంచి ప్రజలను బలవంతంగా దింపేస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఓటు హక్కు కోసం ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులతో దాడులు చేయిస్తూ, మరోవైపు బీజేపీ,ఆర్ఎస్ఎస్ శ్రేణులకు స్వేచ్ఛనిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసన ప్రదర్శనల్లో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ .. మీరు చేసింది తప్పు. కానీ ఈ ఓటు చోరీ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో మాకు తెలుసు. మీ పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వ సాక్షిగా మారండి. దేశానికి, రాజ్యాంగానికి సేవ చేసేందుకు ఇప్పటికైనా తప్పుకోండి. మీరు రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ వేదికలపై జరుగుతున్న ఉద్యమాలన్నీ వేర్వేరు కాదని, అవన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఒకే ఒక్క బృహత్ ఉద్యమంలో భాగమని రాహుల్ స్పష్టం చేశారు. దేశం మొత్తం ఒక్కటిగా ముందుకెళ్తోందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అందరి ఏకైక లక్ష్యమని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ,ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీరుపై అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన 200 మందికి పైగా అధికారులు కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో పాటు పోలీసు బలగాల్లోని 50 శాతం మంది సిబ్బంది తమ పోరాటం సరైనదేనని భావిస్తూ, లోపలి నుంచి సమాచారాన్ని అందిస్తున్నారని ఆయన వెల్లడించారు.దేశంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య నిష్పాక్షికత లోపించడంపై ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కలసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ అంశంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తున్నామని, రాజ్యాంగ బద్ధమైన న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని రాహుల్ గాంధీ ఘంటాపథంగా చెప్పారు. -
రాహుల్ మతి లేకుండా మాట్లాడుతున్నారు.. ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐఆర్ ప్రక్రియపై రాహుల్ గాంధీ మతిలేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఢిల్లీలో కాంగ్రెస్ నిరనసలు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ రోజు ( సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సంస్థలపై రాహుల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.ఎంపీ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూకలను వెంట తీసుకొని సుప్రీం కోర్టుకు వెళ్లడం ఏమిటి?సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి క్లియర్‌గా వ్యక్తిగతంగా కలవలేను అని చెప్పారు.మూకలను వెంట వేసుకొని రాహుల్ సుప్రీంకోర్టు ముట్టడికి వెళ్తారా..! దేశంలో ఇప్పటికే ఎనిమిది సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. మర్చిపోయారా? అని అడిగారు.రాష్ట్రంలో నీరు, కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని. ఒకప్పుడు కాంగ్రెస్ దేశంలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పింది మర్చిపోయిందా అని అడిగారు. ఇదీ చదవండి: కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ -
ఢిల్లీలో హై టెన్షన్... SIR రద్దు..! సుప్రీంకోర్టుకు భారీ ర్యాలీ
-
ఇది శివ తాండవం.. ప్లానింగ్ అవసరం లేదు : రాహుల్ గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ,ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న నిరసనల వ్యూహంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం సుప్రీంకోర్టు మార్చ్‌కు ముందు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న నిరసనలకు ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక అవసరం లేదని, ఇది శివుడి తాండవం లాంటిదని అన్నారు. తాము చేస్తున్న పోరాటానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ‘మా సోదరి (ప్రియాంక గాంధీ) నాతో అన్నారు. అందుకు నేను సమాధానంగా.. ఇది ‘తాండవం’ (శివుడి నాట్యం). దీనికి ఎలాంటి ప్రణాళికలు ఉండవు అని చెప్పాను అని రాహుల్ వెల్లడించారు. తాము ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, రేపు మరో రూపంలో నిరసన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి భవన్ వద్ద జరిగిన ఆందోళనను గుర్తుచేస్తూ.. పోలీసుల ఆంక్షల కారణంగా తాము ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చిందని, అయితే అనుకోని మార్పుల వల్లే సరైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ నిరసనలకు ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదని, ఇది శివుని శివతాండవం లాంటిదని, ఇందులో భాగస్వాములు కావాలనుకునే ప్రతి ఒక్కరూ వచ్చి చేరవచ్చని పిలుపునిచ్చారు. शिव का तांडव चल रहा है- इसमें कुछ भी प्लान नहीं होता है। ये शिव की बारात है, इसमें कोई भी आ सकता है, हम किसी को रोकेंगे नहीं। : नेता विपक्ष श्री @RahulGandhi 📍 दिल्ली https://t.co/nSItxL6Vew— Congress (@INCIndia) October 12, 2026 జ్ఞానేశ్ కుమార్‌కు హెచ్చరికజ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘జ్ఞానేశ్ కుమార్.. రాత్రిళ్లు మీకు నిద్ర కరువైందని మాకు సమాచారం అందుతోంది. చింతించకండి, మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిరసనల నుంచి మీరు తప్పించుకోలేరు. లక్షలాది మంది ప్రజలు మీ ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమం ఆగదు అని హెచ్చరించారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలనే తాము అడుగుతున్నామని, జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆయన నిలదీశారు.ఈ సాయంత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చే ఏ పార్టీ వారైనా, ఏ పౌరుడైనా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావచ్చని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. బరాఖంబా రోడ్, మండి హౌస్ ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి తలపెట్టిన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: వాచ్‌మన్ ఉద్యోగం తీసేశారనే చిన్నారి హత్య: సీపీ సుమతి -
రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి సీఈసీకి రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్..!
-
ప్రభుత్వం చాలా తప్పు చేస్తోంది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరు తెన్నులను ఎండగట్టారు. నిరసనకారులను నిర్బంధిస్తూ ప్రభుత్వం తప్పు చేస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని, సుప్రీంకోర్టులో జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ వేస్తామన్నారు. సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా వాటర్ కెనాన్లు మోహరించారని రాహుల్ పేర్కొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి నాయకులు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తొలి రోజు నిరసనల సందర్భంగా ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, రెండో రోజు నిరసనల కోసం ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి స్పందించి, చట్టపరమైన మార్గాన్ని అనుసరించాలని సలహా ఇవ్వడంతోనే తాము ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఈసి జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతేకాకుండా సీఈసీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. #WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi says, "This is happening because we are raising the very same question that the two Election Commissioners had asked: why isn't Gyanesh Kumar resigning? Gyanesh Kumar, you have lost your sleep; we will not spare you... We know about your past and your corruption, and we are waiting..."— ANI (@ANI) October 12, 2026 ప్రభుత్వం ఢిల్లీని నిర్బంధించి కోటలా మార్చిందని, ప్రజలు రాకుండా బస్సులు, రైళ్లను అడ్డుకుంటోందని రాహుల్ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెందిన 200 మంది ఉన్నతాధికారులు తమతో సంప్రదింపుల్లో ఉండి సమాచారం ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం తీరుపై సిబ్బందిలోనూ అసంతృప్తి ఉందని, సుమారు 50 శాతం మంది పోలీసులు తమకు అనుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి సీజేఐతో భేటీకి సమయం కోరగా అనుమతి లభించలేదని, బదులుగా న్యాయపరంగా పిటిషన్ వేయాలని సూచించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలందరూ కలిసి నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని నాయకులు స్పష్టం చేశారు.హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేయగా, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు ఆరోపించారు. మధ్యాహ్నం 1 గంటకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమా సమావేశం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. మరోవైపు నిరసనలకు అనుమతి నిరాకరించడంపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కాక్రోచ్ జనతా పార్టీ సైతం పోలీసులకు 24 గంటల గడువు ఇచ్చింది. -
కాసేపట్లో కాంగ్రెస్ మార్చ్.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ
కాంగ్రెస్ మార్చ్ అప్డేట్స్..నాడు సైమన్ గోబ్యాక్.. నేడు సర్ గోబ్యాక్: రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిమంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, జిల్లాల అధ్యక్షులతో సమావేశమైన సీఎంకాంగ్రెస్ నిర్వహిస్తున్న మార్చ్, సర్ ప్రక్రియపై నేతలకు దిశా నిర్దేశంసీఎం రేవంత్ కామెంట్స్..సర్ వ్యతిరేక పోరాటం మరో స్వతంత్ర పోరాటమేసైమన్ గో బ్యాక్ పోరాటం లాగే పోరాటం చేయాలిఇప్పుడు సర్ గోబ్యాక్ అనాలి.రాజ్యాంగం ద్వారా ప్రతీ భారతీయుడికి ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ ఎంతో అధ్యయనం చేసి ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారు.రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా ఓటు హక్కు వచ్చింది.పరిపాలన చేయాల్సిన వాళ్లను ప్రజలే ఎన్నుకోవాలని అంబేద్కర్ నినదించారు.మంచి ఉద్దేశంతో మొదలైన సర్ ఇప్పుడు ఓటు హక్కు తొలగించేదిగా మారింది.మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోంది.దేశంలో ఓటు చోరీకి కుట్రలు జరుగుతున్నాయి.సీఈసీని అడ్డుపెట్టుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఓటు హక్కు కోసం పోరాటం: భట్టిఢిల్లీ భట్టి విక్రమార్క కామెంట్స్..రాహుల్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ నుంచి సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు .. ఢిల్లీకి వచ్చాంప్రజాస్వామ్యానికి బలమైన పునాది ఓటు హక్కుఓటు హక్కును చోరీ చేస్తున్నారుబీజేపీ మాత్రమే గెలిచేలా.. సర్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయికాంగ్రెస్ కోసం కాదు ఈ ఆందోళన..అందరి ఓటు హక్కును కాపాడటం కోసం మా పోరాటంప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాలిశాంతియుతంగా, గాంధేయ మార్గంలో మా ఆందోళన కొనసాగుతుందిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్..సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే వరకు ఆందోళన కొనసాగుతుందిమోదీ అమిత్ షా సర్‌ను వాడుకొని బీహార్ ఎన్నికల్లో గెలిచారుఅధికారంలో ఎప్పటికీ ఉండాలనే ఆకాంక్షతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారుప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయిసీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లాల అధ్యక్షులు ఢిల్లీకి వచ్చాంసుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించే ప్రయత్నం చేస్తాంమంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్సర్ రద్దు చేయాలని రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చారుసర్ను ఉపయోగించుకొని బీజేపీ ఎన్నికలు నిర్వహించిందిఅర్హులైన ఓటర్లను తొలగించారుసీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందిఎన్నికల కార్యాలయం పక్షపాతంగా వెళ్తుందికేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాంరాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పిలుపుతో ప్రజాస్వామ్య గొంతును వినిపించేందుకు ఢిల్లీ వచ్చాముమా నిరసన తెలియజేస్తాం.కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అపాయింట్మెంట్ తప్పిదంబీజేపీ కార్యకర్తగా ఎన్నికల కమిషనర్లు తీసుకువచ్చి కేంద్ర ఎన్నిక సంఘంలో కూర్చోబెట్టారు50 ఏళ్లు అధికారంలో ఉండాలనే పిచ్చి ఆలోచనతో బీజేపీ ఇలాంటి పనులు చేసిందిప్రజాస్వామ్యంలో ఓటును తొలగించడం తప్పజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తుజంతర్మంతర్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.కాంగ్రెస్ ర్యాలీ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు, జంతర్‌మంతర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంకన్నాట్ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయంమధ్యాహ్నం 1.30 గంటలకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారాఖంబకు సమీపంలోని సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు.కాంగ్రెస్‌కు నో చెప్పిన సీజేఐ..👉ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు సమావేశం కావాలన్న ఇండియా కూటమి నేతల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఓట్చోరీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా, ఎస్ఐఆర్ నిలిపివేత, భవిష్యత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరపాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు భావించారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వారిని కలిసేందుకు తిరస్కరించారు. #WATCH | Delhi | On INDIA Bloc's protest march and their demand to meet him, Chief Justice of India (CJI) Justice Surya Kant says, "I received a letter yesterday regarding a meeting request, and I responded to it last night, outlining the reasons why I will be unable to meet..." He also says, "The Supreme Court's doors are open to everyone. Any petition from any common citizen or member of an elected body is welcome. Every Indian citizen has the right to approach the court, and we will hear their concerns and grant whatever is due under the law."— ANI (@ANI) October 12, 2026👉అయితే, సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తూనే అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. ఈ మార్చ్ కేవలం ఒక ఆందోళన మాత్రమే కాదన్నారు. ఇది ఒక ఉద్యమంగా మారిందని తెలిపారు.👉దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందరికీ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. తమ ప్రతినిధి బృందాన్ని కలవకూడదని సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం గౌరవిస్తుందని అన్నారు. కానీ, సుప్రీంకోర్టుకు మార్చ్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.సీఈసీ రాజీనామా చేయాలి: శశిథరూర్👉ఎన్నికల సంఘం చట్టాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఓటు హక్కు పౌరుల రాజ్యాంగ హక్కు అని, తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణ తప్పినట్లుగా వ్యవహరిస్తోందని, నిబంధనలను పక్కనపెడుతోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది భారతీయుల పేర్లు తొలగించారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్చ్ ద్వారా న్యాయం కోరనున్నట్లు థరూర్ తెలిపారు. ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి! -
సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. CJI సూర్యకాంత్ నిరాకరణ..!
-
ఇండియా కూటమి విజ్ఞప్తికి సీజేఐ నో!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ షాక్ ఇచ్చారు. తనను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. తాము లేవనెత్తాలనుకుంటున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, వాటిపై ఫిర్యాదులు లేదంటే అభ్యంతరాలు ఉంటే పిటిషన్ దాఖలు చేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల తొలగింపు తదితర అంశాలపై నిరసన తెలియజేసేందుకు ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీజేఐని కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నించారు. అయితే, అపాయింట్మెంట్ నిరాకరణతో వారి ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ విధంగా పరిపాలనా స్థాయిలో కలవడానికి కోర్టుకు అధికారం లేదని ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.తలుపులు తెరిచే ఉంటాయ్సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమని, దాని తలుపులు ప్రజలందరికీ 24 గంటలూ తెరిచే ఉంటాయని సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు న్యాయస్థానం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాజకీయ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిసి వినతులు స్వీకరించడం కంటే, న్యాయపరమైన మార్గంలో పిటిషన్ దాఖలు చేస్తే విచారించి తీర్పు ఇవ్వడం కోర్టు విధి అని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపాయి.నేడు సుప్రీంకోర్టు వరకు మార్చ్సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరించినప్పటికీ, సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించాలనే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించినదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణను కోరుకునేవారంతా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సీజేఐని కలిసేందుకు సమయం కోరినట్లు సమాచారం.నాలుగు ప్రధాన డిమాండ్లుఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ఇండియా కూటమి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసింది. అందులో నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించింది.1. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పించే 2023 చట్టాన్ని రద్దు చేయాలి.2. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తొలగించినట్లు చెబుతున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలి.3. అన్ని ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.4. గత రెండేళ్లలో ఓట్ల చోరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి.ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. అయితే, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ ఖండిస్తున్నాయి.పోలీసుల చర్యలపైనా విచారణఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యలపై కూడా వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సుమారు 3,000 మందిని నిర్బంధించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆదివారం కూడా ఢిల్లీతోపాటు ముంబై సహా పలు నగరాల్లో నిరసనలు కొనసాగాయి.పోలీసుల చర్యలు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, నిరసనకారుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్న ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలపై మంగళవారం విచారణ జరగనుంది. మరోవైపు, ఓటర్ల జాబితా సవరణ చట్టబద్ధతను సుప్రీంకోర్టు గత మే నెలలో సమర్థించినప్పటికీ, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పేర్లు తొలగించడంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.ఇండియా కూటమి తీరుపై బీజేపీ విమర్శలుసీజేఐని కలిసి వినతిపత్రం అందజేయాలన్న ప్రతిపక్షాల నిర్ణయాన్ని బీజేపీ ఇప్పటికే తప్పుబట్టింది. రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రధాన న్యాయమూర్తులు ప్రత్యేకంగా కలవడం సంప్రదాయం కాదని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు కేసులు వేయడం ద్వారా ప్రభుత్వాలను నిర్ణయించలేరని, ఎన్నికల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో సీజేఐ అపాయింట్మెంట్ నిరాకరణ ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై ఆసక్తిని పెంచింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ ఆరోపణలపై పోరాడుతారా? లేక నిరసనల ద్వారా రాజకీయ ఒత్తిడిని మరింత పెంచుతారా? అనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: నిరసన హక్కును హరిస్తారా? -
రేపు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ మార్చ్: రాహుల్ గాంధీ
సాక్షి,న్యూఢిల్లీ: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు(సోమవారం) ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించి, భారత ప్రజల తరఫున ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మార్చ్‌లో యువత, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఓట్ల చోరీకి ముగింపు పలకాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.Yesterday, the nation's young came out in Delhi to peacefully protest. They came with love in their hearts, not hatred or anger. They were beaten, both by cops and BJP goons. This is not the India we want. Tomorrow, we will march to the Supreme Court as Indians, united beyond party, gender, caste, community and state. Youth, all opposition parties, civil society groups, all those who believe in democracy and stand by the Constitution of India, will walk with us. We will submit a memorandum to the Chief Justice on behalf of the nation, demanding an end to vote chori, halting of SIR and the resignation of Gyanesh Kumar. Narendra Modi, Amit Shah, Ajit Doval and Mohan Bhagwat cannot silence India's voice. These cowards cannot intimidate us. They will have to step aside. We will march together, with love, brotherhood and patriotism. Daro mat. Tomorrow, all of India will march to the Supreme Court. कल दिल्ली में देश का युवा शांतिपूर्ण विरोध के लिए सड़कों पर उतरा। उनके दिलों में नफ़रत या गुस्सा नहीं, मोहब्बत थी। लेकिन उन्हें पुलिस और BJP के गुंडों, दोनों ने पीटा। ऐसा भारत हम नहीं चाहते। कल, सोमवार 12 अक्टूबर को, हम भारतीय होने के नाते सुप्रीम कोर्ट तक मार्च करेंगे। पार्टी, महिला-पुरुष, जाति, समुदाय और राज्य की हर दीवार से ऊपर उठकर, हम सब एक साथ चलेंगे। देश का युवा, तमाम विपक्षी दल, सिविल सोसाइटी और लोकतंत्र में विश्वास रखने वाले, भारत के संविधान के साथ खड़े सभी लोग हमारे साथ चलेंगे। हम देश की ओर से मुख्य न्यायाधीश को एक ज्ञापन सौंपेंगे। हमारी माँग है - वोट चोरी बंद हो, SIR पर रोक लगे और ज्ञानेश कुमार इस्तीफ़ा दें। नरेंद्र मोदी, अमित शाह, अजित डोभाल और मोहन भागवत भारत की आवाज़ को दबा नहीं सकते। ये कायर हमें डरा नहीं सकते। इन्हें पीछे हटना ही होगा। हम सब साथ चलेंगे - मोहब्बत, भाईचारे और देशभक्ति के साथ। डरो मत। कल पूरा भारत सुप्रीम कोर्ट तक मार्च करेगा। #ChaloDilli— Rahul Gandhi (@RahulGandhi) October 11, 2026ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, సుమారు 60 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. SIR ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వరుస ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేపు జరగనున్న కాంగ్రెస్ మార్చ్ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్.. యాసంగి పంటలు వేయొద్దు.. నీరు ఇవ్వలేం: మంత్రి పొంగులేటి -
విజయ్ చుట్టూ జాతీయ రాజకీయం.. రాహుల్‌తో భేటీ, మోదీతో ప్రయాణం!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మెట్రో ప్రయాణానికి సిద్ధం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకే వేదికపై కాకపోయినా.. వరుసగా ఇద్దరు జాతీయ స్థాయి నేతలతో విజయ్ కనిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.అక్టోబర్ 10న చెన్నై వచ్చిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేస్తూ చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. విద్య, పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధానంగా నిలిచాయి. కాంగ్రెస్, టీవీకే మధ్య ఏర్పడిన రాజకీయ అనుబంధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అదే సమయంలో, తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల విమర్శలు కూడా రాజకీయ చర్చలో ఉన్నాయి. ఈ అంశంపై రాహుల్ గాంధీ వైఖరిపై డీఎంకే గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్, టీవీకే, డీఎంకే మధ్య సంబంధాలు ఎలా ముందుకు సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.మరుసటి రోజే మోదీతో మెట్రో ప్రయాణంరాహుల్తో సమావేశమైన మరుసటి రోజే.. అక్టోబర్ 11న ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో విజయ్ పాల్గొనాల్సి ఉంది. పూనమల్లి-వడపళని మధ్య చెన్నై మెట్రో రెండో దశలోని సుమారు 14.64 కిలోమీటర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మార్గంలో విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం కూడా ఆయన కార్యక్రమంలో ఉంది. అంతేకాకుండా, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్య తదితర రంగాలకు సంబంధించి రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.NO FILTER Ft. Joseph Vijay & Rahul Gandhi👑 https://t.co/W3PnRZdf6K— Prakash Vijay (@PrakazVijay_Of) October 10, 2026ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొనడం సహజమే. అయినప్పటికీ, రాహుల్‌తో భేటీ జరిగిన వెంటనే మోదీతో కలిసి కనిపించనుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిని కేంద్రంతో సంబంధాలు కొనసాగించే ప్రయత్నంగా రాజకీయ కోణంలో చూడవచ్చు. మరోవైపు, కాంగ్రెస్‌తో ఏర్పడిన రాజకీయ అనుబంధం నేపథ్యంలో రాహుల్‌తో సమావేశం కూడా ప్రాధాన్యం కలిగి ఉంది. అయితే, ఈ భేటీలు ఏవైనా కొత్త రాజకీయ ఒప్పందాలకు సంకేతమని నిర్ధారించే సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు, కూటముల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కాంగ్రెస్-టీవీకే అనుబంధం మరింత బలపడుతుందా? డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అంశాల్లో ఎలా వ్యవహరిస్తుంది? వంటి ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.విజయ్ ముందున్న అసలు పరీక్ష ఇదే!రాహుల్ గాంధీతో భేటీ, మోదీతో మెట్రో ప్రయాణం.. ఈ రెండింటినీ విడివిడిగా చూస్తే ఒకటి రాజకీయ సమావేశం కాగా, మరొకటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం. కానీ వాటి సమయం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల కారణంగా రెండింటికీ అదనపు ప్రాధాన్యం ఏర్పడింది. విజయ్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తూనే, ప్రతిపక్ష కూటమిలో తన రాజకీయ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటుందన్నది రాబోయే రోజుల్లో కీలకం కానుంది. తమిళనాడులో రాజకీయంగా ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు అన్నదానికంటే.. కూటమి సంబంధాలు, ఓటర్ల జాబితా వివాదం, అభివృద్ధి ప్రాజెక్టులు, యువత సమస్యలపై పార్టీలు తీసుకునే వైఖరే అసలు పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్నది ఇద్దరు జాతీయ నేతలతో విజయ్ వరుస కార్యక్రమాలు మాత్రమే. వాటి నుంచి ఎలాంటి రాజకీయ పరిణామాలు వస్తాయో వేచి చూడాలి.TN CM Vijay arrives at Chennai airport to welcome PM Modi. https://t.co/1P7J2BmFYJ— News Arena India (@NewsArenaIndia) October 11, 2026ఇదీ చదవండి: ఢిల్లీలో హైటెన్షన్.. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ కీలక ప్రెస్‌మీట్ -
పిరికితనమే వారి ప్రధాన లక్షణం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లపై దశాబ్ద కాలంగా సాగిస్తున్న పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యూహాలు, ఎత్తుగడలు తనకు పూర్తిగా తెలుసని, పిరికితనమే వారి ప్రధాన లక్షణమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాడుతున్న యువతకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను ఈ కథలో ప్రతినాయకులుగా(విలన్లు) రాహుల్ గాంధీ అభివరి్ణంచారు. వీరందరి చుట్టూ క్రమంగా ఉచ్చు బిగుస్తోందని, ఆ పని తామే చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక ప్రత్యరి్థని అర్థం చేసుకున్నట్లుగానే వారి ప్రతి కదలికను తాను లోపలి నుంచి పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి పోలీసు బలగాలను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేది లేదని రాహుల్ సవాల్ విసిరారు. ‘‘మోదీజీ.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. 10 వేలు, 20 వేలు, 50 వేలు.. మీకు ఎంతమంది కావాలంటే అంతమంది పోలీసులను రప్పించుకోండి. విపక్ష నాయకులందరినీ, యువతను, మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేసుకోండి. కానీ, మేము మిమ్మల్ని చుట్టుముడుతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అవసరమైన సమాచారం ఇప్పటికే తమ వద్ద ఉందని వెల్లడించారు. -
ఓటు హక్కు పరిరక్షణకు కదంతొక్కండి
సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు కదంతొక్కాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ నాశనం చేస్తున్నారని, విద్యార్థి పోరాటాలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైన్నైలో శనివారం నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరో చెప్పారని దేనినీ గుడ్డిగా అనుకరించొద్దని, మీ నేల వారసత్వాన్ని, చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమిళనాడుకు చెందిన మహనీయులు తిరువళ్లువర్, పెరియార్ల అడుగుజాడల్లో నడుస్తూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. తమిళ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దాలని అమిత్ షా ఆదేశించారని, కొత్త విద్యా విధానాన్ని ఆమోదిస్తేనే తమిళనాడుకు రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని బీజేపీ చెప్పిందని విమర్శించారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి తమిళనాడు గొప్పతనం, తిరువళ్లువర్, పెరియార్ సిద్ధాంతాల గురించి ప్రస్తావించారు. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ.. ఆ విద్యార్థినుద్దేశించి ‘ఒకవేళ మోదీ కలిస్తే.. పెరియార్ ఆయనతో ఏం మాట్లాడేవారు?’ అని ప్రశ్నించారు. దానికి ఆ విద్యార్థి సమాధానమిస్తూ.. ‘దేశంలో కులమతాలు కాదని.. మానవత్వమే ముఖ్యమని చెప్పి ఉండేవారు’ అని బదులిచ్చారు. విద్యార్థి ఇచ్చిన ఈ సమాధానానికి రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం విజయ్‌తో భేటీ: అంతకు ముందు రాహుల్ గాంధీ తమిళనాడు సీఎం విజయ్ నివాసానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం చేస్తూ సమకాలీన రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే కారులో సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లి కాఫీ తాగారు. -
కౌటిల్యమా... కనువిప్పా?!
‘‘సాంకేతిక నైపుణ్యం, మేధస్సు, మంచి ఆలోచనలూ, పెట్టుబడులూ ఉన్నంత మాత్రాన ఒక జాతి అభివృద్ధి పథంలో పయనించదు, సమర్థవంతమైన నాయకత్వం కూడా ఉండాలి’’. ఈ అద్భుతమైన కొటేషన్‌ను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలువరించారు. అటువంటి సమర్థ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి, విశ్వసనీయతలు కొలమానాలని కూడా ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీలో గత పాతికేళ్లుగా ఈ నాయకత్వ సుగుణాలను తాను చూస్తున్నానని బాబు చెప్పుకొచ్చారు. సరిగ్గా పాతికేళ్ల కింద గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ పదమూడేళ్ల పాటు ఆ పదవిలో, మరో పన్నెండేళ్లుగా ప్రధాని పదవిలో నిరంతరాయంగా కొనసాగుతూ దేశాభివృద్ధికి, ప్రజల సాధికారత కోసం పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.ప్రధానమంత్రి సాధించిన ఈ రికార్డు నిజంగానే అసాధారణమైనది. నభూతో నభవిష్యతి అని కూడా అనవచ్చేమో! అరుదైన ఈ ఘనతను సాధించిన ప్రధానిని దేశంలో ఉన్న రాజకీయ ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు కూడా అభినందించారు. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ది హిందూ’ పత్రికలో చంద్రబాబు నాయుడు ఒక వ్యాసాన్ని రాశారు. అందులో మోదీ నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ ఆయన సారథ్యంలో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని సోదాహరణంగా విశదీకరించారు. ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అలా రాయడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. చంద్రబాబు కూడా చిన్న నాయకుడేమీ కాదు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కరుణానిధి తర్వాత దక్షిణాదిన ఆయనదే ఈ రికార్డు. అటువంటి నాయకుడు వ్యక్తం చేసే అభిప్రాయాల్లో స్థిరత్వం ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. పూటకో మాట మాట్లాడితే ఇక విశ్వసనీయత ఎక్కడుంటుంది? విశ్వసనీయత, చిత్త శుద్థిలేని నాయకులు జాతిని ముందుకు నడిపించలేరనే భావన కూడా ఈ వ్యాసంలో కనిపిస్తుంది. నాయకుడు తన అభిప్రాయాలను ఎన్నటికీ మార్చుకోకూడదని ఎవరూ చెప్పరు. అయితే అటువంటి మార్పు ఎందుకువచ్చిందో, కారణాలేమిటో స్పష్టం చేస్తేనే మారిన అభిప్రాయానికీ, మార్చుకున్న నాయకునికీ విశ్వసనీయత పెరుగుతుంది.నరేంద్ర మోదీ పాతికేళ్ల అధికార కాలాన్ని గంపగుత్తగా ‘ది హిందూ’ వ్యాసంలో చంద్రబాబు సమర్థించారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఈ పాతికేళ్ల ప్రయాణం సాగిందని బాబు అభినందించారు. మోదీ వ్యక్తిగత ఔన్నత్యం, క్రమశిక్షణ వగైరాలను ప్రస్తావించడంతో పాటు దేశాభివృద్ధికి ఆయన చేపట్టిన పథకాలను ప్రస్తావిస్తూ వాటి గురించి గొప్పగా కితాబులిచ్చారు. ఈ వ్యాసాన్ని చదివిన వారికి చంద్రబాబు తీసుకున్న ఇంత పెద్ద యూ టర్న్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. పాతికేళ్ల వెనక్కు కూడా వెళ్లనవసరం లేదు. ఏడెనిమిదేళ్ల కిందటి చంద్రబాబు మాటలు గుర్తుకు చేసుకున్నా కూడా ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్థమౌతుంది. గతంలో నరేంద్ర మోదీని, ఆయన విధానాలనూ అపార్థం చేసుకున్నాననీ ఇప్పుడు జ్ఞానోదయమైన కారణంగా ప్రశంసిస్తున్నానని ఒక వాక్యం రాసి ఉన్నట్లయితే ‘ది హిందూ’ వ్యాసానికి సార్థకత చేకూరేది. అటువంటి సంజాయిషీ ఏమీ లేదు కనుక ఈ పొగడ్తలన్నీ పబ్బం గడుపుకోవడానికేనని ఎవరైనా భావిస్తే తప్పు పట్టగలమా?ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగానూ, విధానాల పరంగానూ ఎవరూ విమర్శించని స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడిన ఘటనలు కేవలం ఏడెనిమిదేళ్లు వెనక్కి వెళ్లినా కనిపిస్తాయి. 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం మోదీకి లేదు, ఆయనకు కుటుంబ బంధాల గురించి తెలియదు. విడాకులివ్వకుండా భార్యను దూరం పెట్టాడు. పెద్ద నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్య, ఆయన పాలనలో బ్యాంకులు దివాళా తీశాయి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడని’’ బాబు విరుచుకుపడ్డారు. నిండుసభలో మాట్లాడిన ఈ మాటలకూ, హిందూ వ్యాసంలో ప్రకటించిన అభిప్రాయాలకూ ఏమైనా సామ్యం ఉన్నదా?‘‘59 వేల కోట్ల రఫేల్ ఒప్పందం దేశరక్షణ రంగంలోనే అతి పెద్ద కుంభకోణం. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నది. దేశాన్ని మోసం చేశారు. మోదీజీ... సత్యాన్ని ఎక్కువకాలం దాచలేరు’’ అంటూ 2019 ఫిబ్రవరి 8న బాబు ట్వీట్ చేశారు. అప్పుడు దేశాన్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు హఠాత్తుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే పరిణామం ఎలా సంభవించిందో బాబు వివరించాలి కదా! అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ‘‘భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడని’’ కూడా మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదని ఆ సమయంలోనే టీడీపీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నరేంద్రమోదీ ఓ కేడీ అనీ, దేశం మొత్తం ఆయన్ను చోర్ అని పిలుస్తున్నదనీ కూడా ఆనాటి ఎన్నికల సభల్లో బాబు విమర్శలు చేశారు. మోదీకి దేశభక్తి లేదనీ, రాజకీయ భక్తి మాత్రమే ఉన్నదని దేశంలోని వ్యవస్థలన్నింటినీ ఆయన ధ్వంసం చేస్తున్నారని కూడా బాబు ధ్వజమెత్తారు.ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సందర్భంలో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలన్నీ గుదిగుచ్చితే ఓ పుస్తకం అవుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్ చేస్తానని అన్న విషయాన్ని గుర్తు చేయటం అప్రస్తుతం కాకపోవచ్చు. గోథ్రా అల్లర్ల నేపథ్యంలోనే చంద్రబాబు అలా మాట్లాడారు. కానీ, అప్పటినుంచే మోదీ గొప్ప నాయకత్వ లక్షణాలు కలవాడనీ, దేశాభివృద్ధికోసం కష్టపడ్డారని ఇప్పుడు మాట మార్చుతున్నారు. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు మార్చుకోకపోతే పొలిటీషియన్ కానేరడు’ అనే గిరీశం నిర్వచనానికి ఈ పిల్లిమొగ్గలు సరిపోతాయేమో కానీ, చిత్తశుద్ధి, విశ్వసనీయతలే నాయకత్వానికి కొలమానాలని చంద్రబాబు హిందూ వ్యాసంలో చెప్పిన నిర్వచనానికి మాత్రం సరిపోలవు. పోనీ, మోదీపై తీసుకున్న ఈ తాజా వైఖరికి చంద్రబాబు కట్టుబడి ఉంటారా? వచ్చే ఎన్నికల్లో ఒకవేళ మోదీ ప్రభుత్వం ఓడిపోతే గెలిచిన కూటమిలో దూరకుండా ఉంటారా?2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓడిపోవచ్చనే అంచనాలతోనే ఆయన కూటమి నుంచి వైదొలిగారనే అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయంతోనే విమర్శలతో చెలరేగిపోయారనీ, ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే ప్లేటు మార్చి కాళ్ల బేరానికి దిగడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తారు. అప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలగిన సందర్భంగా తిరుపతిలో ‘ధర్మ పోరాటం’ పేరుతో జరిపిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నవాడే నాయకుడని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అంటే తను ఆచరించడానికి గిరీశం ఫిలాసఫీ, నీతులు చెప్పడానికి హిందూలో రాసిన ఫిలాసఫీ అనుకోవాలి. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..’’ అంటూ హిందూలో రాసిన ప్రేమలేఖలాంటి వ్యాసం పవిత్రమైనదా, కపటంతో కూడినదా అనే సందేహం ఎవరికైనా సహజంగానే తలెత్తుతుంది.కేంద్రంలో మోదీ సర్కార్ గత పన్నెండేళ్లలో ఎన్నడూ ఎరుగనంతటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. యువతరంలో గూడుకట్టుకున్న అసంతృప్తి ఉద్యమ రూపాలను తీసుకుంటున్నది. బూటకపు ఎన్నికల బండారం బట్టబయలై రాజకీయ పార్టీలు వీధుల్లోకి వస్తున్నాయి. యువతరంతో చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకలు పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయాస పడుతున్నారు. వారి వీధి పోరాటాలను ఎద్దేవా చేస్తూ ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర పక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. కూటమిలో రెండో ప్రధాన పక్షమైన తెలుగుదేశం అధినేత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలకు దూరంగా ఉండిపోవడం కూడా పరిశీలకుల దృష్టిని దాటిపోలేదు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. రేపు విపక్ష సంకీర్ణమే అధికారంలోకి రావచ్చు. అందుకే ఈ ముందు జాగ్రత్త అనుకోవాలి. అనుమానం రాకుండా జాతీయ పత్రికలో మోదీ భజన. జాతీయ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏలోని టీడీపీ పట్ల ఇదే స్నేహభావాన్ని ప్రదర్శిస్తుండటం కూడా గమనించదగ్గ విషయం. ఓట్చోరీ పైన ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన ఓట్చోరీ పైన ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. శుక్రవారం నాడు ఓట్చోరీ అంశంపై ప్రతిపక్ష బృందం రాష్ట్రపతిని కలిసింది. ఆధారాలుంటే ఇవ్వాలని రాష్ట్రపతి తమతో చెప్పినట్లు రాహుల్‌గాంధీ మీడియాకు వెల్లడించారు.బోగస్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? రాత్రి 8 గంటల తర్వాత 52 లక్షల ఓట్లు పోలైనట్లు ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్నకు ఇప్పటిదాకా ఈసీ నుంచి సమాధానం లేదు. నాటి ఎన్నికల ప్రధానాధికారి పదిరోజుల్లోగానే వీవీ ప్యాట్లను ఎందుకు కాల్చేయమన్నారన్న ప్రశ్నకూ సమాధానం లేదు. పోలింగ్ రోజు తగ్గిన ఈవీయమ్ బ్యాటరీ కౌంటింగ్ నాటికి ఎలా పెరిగిందంటే జవాబు చెప్పే దిక్కులేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేంద్రాల ముందు లక్షలాది మంది బారులు తీరి నిలబడ్డారని చెబుతున్న ఎన్నికల సంఘం ఆ వీడియో ఫుటేజిని ఎందుకు చూపెట్టడంలేదో తెలియదు. కానీ ఏపీలో జరిగిన బూటకపు ఎన్నికల గురించి రాహుల్ మాట్లాడరు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం అటువంటిది. చంద్రబాబు ‘ది హిందూ’లో రాసిన వ్యాసం కౌటిల్యంతో రాశారా? కనువిప్పు కలిగి రాశారా అన్న అంశాన్ని ఈ నేపథ్యంలోనే పరిశీలించాలి.- వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.comఇదీ చదవండి: ‘నోబెల్ శాంతి’కి సరైన ఎంపిక -
2K కాదు 50K పోలీసులను తెచ్చుకో... మోదీకి రాహుల్ సవాల్
-
ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ సంచలన హెచ్చరిక
ఢిల్లీ: ‘మిస్టర్ మోదీ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి. యువకులందరినీ, నేతలందరినీ అరెస్ట్ చేసుకోండి. మేం మాత్రం వెనక్కి తగ్గం.. మిమ్మల్ని కమ్మేస్తాం’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.‘‘మేం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. 15 ఏళ్లలో దేశానికి ఏం జరిగిందో.. అది మళ్లీ జరగనివ్వం. రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరుతాం. దేశ యువతను చూసి గర్వపడుతున్నా. యువత తమ పోరాటాన్ని ఆపొద్దు.. మీ వెనుక మేం ఉన్నాం’’ అంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.కాగా, ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కనాట్ ప్లేస్‌లో సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. గుంపులుగా వస్తున్న నిరసనకారులు ఆందోళనలో పాల్గొంటున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం -
రాహుల్, విజయ్ భేటీ.. గంటపాటు చర్చలు
చెన్నై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ శనివారం చెన్నైలో సమావేశమయ్యారు. విజయ్ నివాసంలోనే ఇద్దరు నేతలు సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం సమీపంలోని కేఫ్‌కు వెళ్లి కాఫీ, తిరమిసు, కుకీస్‌ను రుచి చూశారు. దీంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.చెన్నైలోని నీలాంకరైలో ఉన్న తన నివాసం వద్దకు వచ్చిన రాహుల్ గాంధీకి విజయ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేఫ్‌కు వెళ్లిన నేతలు అక్కడికి వచ్చిన అభిమానులతో ముచ్చటించారు. అనంతరం కొందరితో సెల్ఫీలు దిగారు.రాహుల్ గాంధీ చెన్నైలో నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో జరగనున్న యువజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితులు ఏర్పడటంతో కాంగ్రెస్, టీవీకే చేతులు కలిపిన విషయం తెలిసిందే. గతంలో డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్.. విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జరిగిన రాహుల్, విజయ్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక చర్చలతో పాటు ఇద్దరి మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటనపై కేంద్రం సీరియస్.. ఎన్ఐఏ కేసు నమోదు -
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.. రాష్ట్రపతికి INDIA కూటమి విజ్ఞప్తి
-
జ్ఞానేశ్ కుమార్ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది!
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.‘‘జ్ఞానేశ్ కుమార్ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యాన్ని బాగుచేసే ప్రక్రియ మొదలవుతుంది’’ అంటూ పోస్ట్ చేశారాయన. మరోవైపు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనలకు రాహుల్ దూరంగా ఉన్నారు. ఆయన శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో భేటీ కానున్నారు. అనంతరం విద్యార్థులతో జరిగే ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇవే డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తమ ధర్నాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అనుమతులు నిరాకరించడం, భద్రతా ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సహా పలువురు నిరసనకారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.ज्ञानेश कुमार जाएँगे। यह सरकार जाएगी। फिर शुरू होगी लोकतंत्र की मरम्मत। 🇮🇳 https://t.co/spGmBxgXLn— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. అయితే గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఇండియా కూటమి ఈసీ వ్యతిరేక ధర్నాలు చేపట్టింది. నిన్న రాత్రి విపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ఇటు ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం ప్రియాంక గాంధీ వాద్రా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: రైళ్లు, బస్సులు ఆపడమేంటి? కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
‘ఓట్ల చోరీ’ని రాష్ట్రపతి అంగీకరించారు
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 10 మంది నేతల బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవా రం రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. దాదాపు గంటసేపు రాష్ట్రపతితో విపక్ష నేతలు సమావేశమయ్యారు. అంతకుముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన తెలపగా, 10 మందితో కూడిన బృందం మాత్రమే రాష్ట్రపతిని కలిసేందుకు అను మతి లభించింది. ముర్ముతో సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల మోసంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను రాష్ట్ర పతి ఏమాత్రం ఖండించలేదని, ప్రశ్నించలేదని చెప్పారు. తాము చెప్పిన విష యాన్ని ఆమె అంగీకరించడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని అమె కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. తమ వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకించలేదని అన్నారు. ఓట్ల చోరీ గురించి దేశమంతటా తెలుసని, సాక్ష్యాధారాలను రాష్ట్రపతికి సమర్పించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అన్ని అంశాలను పరిశీలించి, విచారణ జరుపుతానని రాష్ట్రపతి ముర్ము తమకు హామీ ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు. నరేంద్ర మోదీ, అమిత్ షా దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తమ ఆందోళనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపి, తగిన చర్యలపై నిర్ణయం తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందంలో రాహుల్, ఖర్గే, మమతా బెనర్జీ, ఎం.ఎ.బేబీ, డి.రాజా, రాజీవ్ రాయ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మనోజ్ ఝా, తిరుమావళవన్ తదితరులు ఉన్నారు.మోదీ సర్కార్‌ను తొలగించడమే పరిష్కారం రాష్ట్రపతిని కలవడానికి ముందు విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో భేటీ అయ్యారు. ఓట్ల చోరీపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేలా ఒత్తిడి పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రతిపక్షాల నిరసనలు ప్రభుత్వ పునాదులను కదిలించాయని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్ కంటే చాలా లోతైన సమస్య ఒకటి ఉందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని తొలగించడమే దీనికి పరిష్కారమని ఉద్ఘాటించారు. వినతి పత్రంలో ఏముంది? రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో విపక్ష నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ముసుగులో ఓటర్ల జాబితా నుండి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఓట్ల చోరీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించిన అసెంబ్లీ ఎన్నికలన్నింటినీ రద్దు చేయాలని స్పష్టంచేశారు. ఒకదాని తర్వాత మరొక ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్ల దొంగతనం జరిగిందనడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష కూటమి తేల్చిచెప్పింది. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో గోల్మాల్ చేసిందని ధ్వజమెత్తారు. దేశంలో పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ అనేది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఉద్ఘాటించారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టుకు బహిరంగంగానే అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326లో పొందుపరిచిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఎన్నికల కమిషన్ దానికి రాజ్యాంగబద్ధ సంరక్షకుడే తప్ప యజమాని కాదని స్పష్టం చేశారు. -
ఢిల్లీలో హై టెన్షన్.. రాహుల్‌పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ: రాహుల్ గాంధీ, ఇండి కూటమి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దుర్మార్గపు ప్రచారం చేసినా.. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ఒక ఎన్నిక తర్వాత మరొక ఎన్నికలో విజయం సాధిస్తూనే ఉందని అమిత్ షా పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ విజయాలు, అలాగే రాజస్థాన్, త్రిపురలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇండి కూటమిని పూర్తిగా తిరస్కరించారన్నారు. ప్రజా మద్దతును కోల్పోయిన ఇండియా కూటమి పార్టీలు ప్రతి ఓటమి తర్వాత సంస్థలను ప్రశ్నిస్తున్నాయని.. కానీ ప్రజలు వారి ఈ స్వభావాన్ని గుర్తించారన్న అమిత్ షా.. అందుకే మరోసారి బీజేపీపై తమ అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: సెంట్రల్ ఢిల్లీలో లాక్డౌన్..! -
‘కాంగ్రెస్ నిరసనలో మహిళా పోలీసులకు లైంగిక వేధింపులు’
ఢిల్లీ: ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ నిరసన సందర్భంగా మహిళా పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు గురై, గాయపడ్డారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ నిరసనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇండి కూటమి సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల సందర్బంగా విచారణ జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘దయచేసి రెండు రోజుల క్రితం నాటి దృశ్యాలను చూడండి. మహిళా పోలీసు అధికారులు లైంగిక వేధింపులకు గురై, గాయపడ్డారు’ అని మెహతా కోర్టుకు తెలిపారు. పోలీసు సిబ్బందిని మాటలతో కూడా దూషించారని,. అయినప్పటికీ వారు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆయన అన్నారు. ఈ నిరసనకు ఎలాంటి అనుమతి లేనందున ఇది చట్టవిరుద్ధమని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని 'ఓటు దొంగతనం' అని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ చేరుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా రేపు(శనివారం, అక్టోబర్ 10న) కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో నేటి వాదోప వాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: ఇక నరేంద్ర మోదీ విమానాశ్రయంగా నోయిడా ఎయిర్పోర్ట్ -
సీఈసీపై సమరం.. జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్.. ఢిల్లీలో కీలక పోరు!
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తున్నాయి. వరుస ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కింది. ఇప్పటికే మూడు రోజులుగా నిరసనలు చేపట్టిన విపక్ష ఎంపీలు.. నాలుగో రోజూ తమ ఆందోళనలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. ఎస్ఐఆర్ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు విపక్ష ఎంపీలు నేడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం కానున్నారు. అనంతరం ఇండియా కూటమి నేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించనుంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయడంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ భేటీకి సంబంధించి పది మంది నేతల బృందం రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నట్లు సమాచారం.రేపు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనమరోవైపు, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) రేపు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. అయితే, నిరసనకు పోలీసుల అనుమతి విషయంలో స్పష్టత లేకపోయినా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నిరసనకు ముందు తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారని ఆ సంస్థ ఆరోపించగా, ఈ పరిణామాలు ఢిల్లీలో ఉద్రిక్తతలను పెంచాయి.భారీ భద్రతవరుస నిరసనలు, రేపటి ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 20 వేల మంది పోలీసులను మోహరించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. నిరసనకారుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. ఆందోళనల కారణంగా న్యూఢిల్లీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.మద్యం దుకాణాలు బంద్మరో కీలక పరిణామంగా.. ఢిల్లీలో అక్టోబర్ 9, 10 తేదీల్లో అన్ని రిటైల్ మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎస్ఐఆర్పై భిన్న వాదనలుఎస్ఐఆర్ ద్వారా పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, ముస్లిం వర్గాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు విపక్ష నేతలు సీఈసీ రాజీనామాతోపాటు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుతున్నారు.అయితే, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితాలో నకిలీ, పునరావృత, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియగా సమర్థిస్తోంది. మరోవైపు 42 మంది మాజీ న్యాయమూర్తులు కూడా ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేసి, ఆరోపణలు చేసేవారు ఆధారాలను సమర్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై మొదలైన వివాదం ఇప్పుడు ఎన్నికల సంఘం నాయకత్వంపై రాజకీయ పోరుగా మారింది.ఇదీ చదవండి: దేశం కంటే జ్ఞానేశ్ కుమార్ గొప్ప? -
అంబానీనే కాదు.. ఇంకో బాస్ కూడా ఉన్నాడా?
భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు రావడం లేదంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశంలో అంబానీనే(ముకేశ్ అంబానీని ఉద్దేశించి) అసలు బాస్నా? అంటూ ఆయన సంధించిన ప్రశ్న ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే ఈ ప్రశ్నకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించగా.. వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.‘భారత్‌కు స్వాగతం ఎలాన్.. ఇంకో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ బదులిచ్చారు. దానికి మస్క్ స్పందిస్తూ.. ఇది నిజంగా ఆందోళనకరం అని అన్నారు. అయితే రాహుల్ ఎవరిపేరూ ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మస్క్ ఏమన్నారంటే..భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఎందుకు ఆలస్యమవుతున్నాయంటూ మస్క్ ప్రశ్నించారు. 165కి పైగా దేశాల్లో లైసెన్సులు పొందిన తమ సంస్థ.. భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంకా అనుమతి ఎందుకు రాలేదని నిలదీశారు. ‘భారత్‌లో అసలు బాస్ అంబానీనా?’ అంటూ ముఖేశ్ అంబానీని ఉద్దేశించి ప్రశ్నించారు.అంతకుముందు కూడా భారత్‌లో తమ సంస్థ ప్రవేశాన్ని కొందరు శక్తిమంతమైన వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ ప్రజలకు ప్రయోజనం కల్పించడం కంటే కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వచ్చిన ఓ పోస్టును షేర్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Thank you, Rahul. This is indeed troubling.— Elon Musk (@elonmusk) October 8, 2026‘ఇది నిజంగా ఆందోళనకరం’మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘వెల్కమ్ టు ఇండియా, ఎలాన్. మరో వ్యక్తి గురించి తెలుసుకునే వరకు వేచి చూడండి’ అని పేర్కొన్నారు. దీనికి మస్క్ కూడా స్పందించారు. ‘థాంక్యూ, రాహుల్. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’ అంటూ బదులిచ్చారు.అయితే, రాహుల్ తన పోస్టులో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అదానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గతంలో పలుమార్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు అదానీని ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.కేంద్రం ఏమంటోందంటే..మస్క్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతుల ప్రక్రియ నిష్పక్షపాతంగా, వివక్ష లేకుండా కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అన్యాయంగా లేదా వివక్షాపూరితంగా ఉందన్న వాదనకు ఆధారాలు లేవని కేంద్ర సమాచార, ప్రసార వ్యవస్థల మంత్రిత్వ శాఖ పేర్కొంది.ప్రస్తుతం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రిలయన్స్ జియోకు చెందిన జియో శాట్‌కామ్, భారతి మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు లైసెన్సులు ఉన్నాయి. అయితే, అవసరమైన భద్రతా తనిఖీలు, స్పెక్ట్రమ్‌కు సంబంధించిన అనుమతులు పూర్తయ్యే వరకు ఏ సంస్థా వాణిజ్య సేవలను ప్రారంభించలేవని ప్రభుత్వం అంటోంది. అయినప్పటికీ మస్క్ మాత్రం పరోక్షంగా భారత ప్రభుత్వం ఇక్కడి ఒకట్రెండు కార్పొరేట్ శక్తుల చేతితో బంధీ అయ్యిందన్న రీతిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: గద్దె దిగకపోతే ప్రజలే దించుతరు -
మోదీ గద్దె దిగు.. లేదా ప్రజలే దింపుతారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయతి్నస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గద్దె దిగాలని, లేకపోతే ప్రజలే గద్దె దించుతారని అన్నారు.ఓట్ బచావో..దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంకాగాం«దీ, కేసీ వేణుగోపాల్, ఇతర ఇండియా కూటమి నేతలు గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. వారితో కలిసి అక్కడ నివాళులర్పించిన తర్వాత రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.ఓట్లు లాక్కోవడానికి ప్రధాని, జ్ఞానేశ్ ప్రయత్నం‘ఓట్ బచావో..దేశ్ బచావో ఉద్యమం కాంగ్రెస్ పార్టీ పోరాటం కోసమో, ఇండియా కూటమి కోసమో కాదు. ఇది దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ ఉద్యమం. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరింది. 2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశ జనాభా 140 కోట్లకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య మరింతగా పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్లు గల్లంతు అయ్యాయి? అవి ఎలా తగ్గిపోయాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పాలి. ఇప్పటివరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఎన్నిసార్లు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఎన్నికల సంఘం కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.బీజేపీని వ్యతిరేకించే వారి ఓట్లే లక్ష్యం కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి వచి్చంది. దేశ ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లని, రెండు వర్గాలుగా విభజిస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్లు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న పేదలు మరోవైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేశ్‌కుమార్ పరిస్థితులను మార్చారు. బీజేపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగిçస్తున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.రాహుల్ వెంటే సీఎం..గురువారం మధ్యాహ్నం మోట్స్ హోటల్లో ఇండియా కూటమి లంచ్ మీటింగ్ నిర్వహించగా, ఆ ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఈ సమావేశానికి వచ్చిన రేవంత్‌రెడ్డి సుమారు కిలోమీటరు దూరంలోనే తన కాన్వాయ్ నుంచి దిగారు. రాష్ట్ర ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్ లతో కలిసి నడుచుకుంటూ వచ్చి సమావేశానికి హాజరయ్యారు. అనంతరం అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీలతో కలిసి ఒకే బస్సులో రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాల కట్టడికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ -
ఢిల్లీలో హైటెన్షన్... సీఈసీ జ్ఞానేష్ ఇంటి వద్ద భారీ భద్రత
-
ఢిల్లీలో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. ఢిల్లీ పోలీసుల తీరుపై సీఎం రేవంత్ ఫైర్..
-
బతిమాలినా వదల్లేదు! యూనిఫాం చించేసి.. కొరికారు
ఢిల్లీలో ఈసీ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. నిరసనకారులను అదుపు చేసే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తనను చుట్టుముట్టి కొట్టారని, యూనిఫాం చింపేశారని, గోళ్లతో గీశారని, చేతిని కొరికారని కానిస్టేబుల్ అంకిత్ కసానా ఆరోపించారు. ఘటన అనంతరం ఆయనను వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.పార్లమెంట్ పోలీస్‌లో పనిచేస్తున్న కసానా.. బుధవారం జంతర్ మంతర్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆకస్మిక నిరసన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తనను సుమారు 30–35 మంది చుట్టుముట్టారని కసానా తెలిపారు.వారిలో పురుషులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని.. తనపై దుర్భాషలాడుతూ యూనిఫాం చింపేశారని ఆరోపించారు. వెనుక నుంచి లాగి గోళ్లతో గీశారని, ఓ వ్యక్తి తన చేతిని కొరికి చర్మాన్ని చీల్చాడని పేర్కొన్నారు.Opposition flashing the constitution for every thing & then treating the people who uphold the constitution like this ? Const. Ankit Kumar claims & shows how he was bit , his uniform torn , nails scratched on him - all because he was doing his duty ! https://t.co/ere1de01Cz— ExtraSpiceAni (@ShrivastavAni) October 7, 2026‘దయచేసి వదిలేయండి’ అంటూ వేడుకున్నా..ఘటనతో తాను భయపడిపోయానని కసానా తెలిపారు. తనను వదిలేయాలని పదేపదే వేడుకున్నానని చెప్పారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే తన తోటి సిబ్బంది వచ్చి తనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారని వివరించారు. లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనతో పాటు తన కుటుంబ భద్రతపై కూడా ఆందోళన కలిగించిందన్నారు.సీజేపీ టైంలోనూ ఇబ్బందులే..నిరసనల్లో విధులు నిర్వహించే పోలీసులే కొన్నిసార్లు ఆందోళనకారుల ఆగ్రహానికి గురవుతున్నారని కసానా అన్నారు. గతంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన సమయంలోనూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనను తాను ఎదుర్కొన్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత అయినప్పటికీ.. విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ఇలాంటి ఘటనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.Photo Credits: Aaj Takవైద్య పరీక్షల తర్వాత ఎఫ్ఐఆర్?దాడి ఆరోపణల నేపథ్యంలో కసానాకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మరోవైపు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిరసనకారుల స్పందన కూడా ఇంకా వెలువడలేదు.రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కానిస్టేబుల్ ఆరోపించడంతో.. జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ఓట్ల గల్లంతుపై మెరుపు ధర్నా -
రాహుల్ కొత్త పొలిటికల్ స్ట్రాటజీ.. మొండితనమా.. వ్యూహమా?
ఊహించని చోట ప్రత్యక్షం.. చెప్పాపెట్టకుండా నిరసన.. పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా ముందుకు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ శైలిలో ఈ తరహా ‘సర్ప్రైజ్ పాలిటిక్స్’ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించడం కంటే.. చిన్న బృందంతోనే నేరుగా రంగంలోకి దిగుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆకస్మిక నిరసనలు, అనూహ్య మార్చ్‌లు, ముందస్తు సమాచారం లేకుండా కీలక ప్రాంతాలకు వెళ్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నిసార్లు ఒంటరిగానే.. మరికొన్ని సందర్భాల్లో ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి రోడ్డెక్కుతున్నారు. దీంతో రాహుల్ రాజకీయ వ్యూహంపై చర్చ మొదలైంది.మొండితనమా.. వ్యూహమా?ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణ అంశంపై తాజాగా ఇండియా కూటమి ఆందోళనలు ఉధృతమయ్యాయి. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయగా.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టి.. ఆకాశవాణి భవన్ వద్ద దాదాపు ఎనిమిది గంటల పాటు నిరసన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం మరింత పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కూటమి నిర్ణయించింది.రాహుల్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ తరహా రాజకీయ శైలి రాహుల్‌కు ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. భట్టా-పార్సౌల్ రైతుల ఆందోళన సమయంలోనూ ఆయన మోటార్ సైకిల్‌పై అక్కడికి వెళ్లి రైతులను కలిశారు. మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న రాహుల్.. భారత్ జోడో యాత్ర సమయంలోనూ యాత్రికులతో కలిసి శిక్షణ తీసుకున్నారు. వీధి నిరసనల్లో గంటల తరబడి నడవడం, బైఠాయించడం, పోలీసుల అడ్డంకులను ఎదుర్కోవడంలో ఆయన ఫిట్నెస్ కూడా కనిపిస్తోంది.మరోవైపు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు కూడా ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. 15 మంది నేతలతో కూడిన ప్రతినిధి బృందానికి సమయం కోరగా.. 10 మందికి అనుమతి లభించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ‘సడెన్ యాక్షన్’ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహమా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న -
మెరుపు ధర్నా..!
న్యూఢిల్లీ: కోట్ల ఓట్ల గల్లంతులో కీలకపాత్ర పోషించిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తన పదవికి రాజీనామా చేసేదాకా ఉద్యమాగ్ని మరింత రగులుతుందని స్పష్టంచేసిన విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఢిల్లీలో 24 గంటలు గడిచేలోపు మరోమారు మెరుపుధర్నా పట్టారు. మంగళవారం ఆద్యంతం ఉద్రిక్తంగా కొనసాగిన ఉద్యమంలో స్వయంగా పాల్గొని, నినదించి, అరెస్టయిన మిత్రపక్షాల ఎంపీలను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే ఇచ్చిన మధ్యాహ్న విందు కాస్తా అనూహ్యంగా జంతర్‌మంతర్ ధర్నాస్థలికి ర్యాలీగా మారడం, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని ఎంపీలను బస్సుల నుంచి దించేయడం, ఎంపీలు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగడం, పోలీసులు, ఎంపీల మధ్య వాగ్వాదం, తోపులాట, బలవంతంగా అరెస్ట్‌లతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా ఉద్యమం నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది. తమ ముఖ్యనేతల విడుదలతో విపక్షపార్టీల కార్యకర్తలు రాత్రిపూట శాంతించారు. అయినాసరే ఉద్యమం మరికొత్త పంథాలో మరింత ఉధృతంగా కొనసాగనుందని ప్రధాన పార్టీలు ప్రకటించాయి. చక్కటి భోజనంతో మొదలై... ఉద్యమంలో మమేకమైన మిత్రపక్షాల ఎంపీలందర్నీ భోజనానికి రావాల్సిందిగా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. దీంతో సెంట్రల్ ఢిల్లీ జన్‌పథ్ ప్రాంతంలోని సాగర్‌రత్న రెస్టారెంట్‌కు 200 మందికిపైగా ఎంపీలు వచ్చి అందరూ శాఖాహార భోజనం పూర్తిచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు ప్రియాంక గాంధీ సహా ఆర్జేడీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఇండియన్ ముస్లిం లీగ్ దాకా పలు విపక్ష పార్టీల ఎంపీలు రెస్టారెంట్‌కు వచ్చారు. భోజనం పూర్తికాగానే ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది భోజన భేటీకాదు ఉద్యమభేటీ. మేం ఇప్పుడు నేరుగా జంత్మంతర్కు వెళ్లి సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్‌తో ఉద్యమించనున్నాం’’ అని ప్రకటించారు. వెంటనే ఎంపీలంతా అప్పటికే సిద్ధంచేసిన బస్సుల్లోకి ఎక్కి నేరుగా జంతర్‌మంతర్‌కు బయల్దేరారు. మరోమారు విపక్ష ఎంపీలు నిర్వాచన్ సదన్‌కు ధర్నా కోసం రావొచ్చనే ముందస్తు అంచనాతో పోలీసులు సెంట్రల్ ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో 163వ సెక్షన్ అమల్లోకి తెచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఇమ్రాన్ మసూద్, సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌లు బస్సులపైకెక్కి త్రివర్ణ పతాకం చేతబూని సీఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ‘‘జ్ఞానేశ్ ఆచూకీ ఎక్కడ? మోదీ ఒడిలో’ అని వ్యంగ్య నినాదాలు సైతం చేశారు. నేతల బస్సులను కార్యకర్తల వాహనాలూ అనుసరించాయి. నేతల బస్సులు ఒక కిలోమీటర్ ప్రయాణించాక అశోక్ రోడ్డులోని షాంగ్రీ–లా హోటల్ వద్ద పోలీసులు అడ్డగించి నేతలను బలవంతంగా కిందకు దించేశారు. దీంతో ఆగ్రహంతో నేతలంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా ఆరంభించారు. తీవ్ర వాగ్వాదం.. తోపులాట... బైఠాయించిన నేతలకు మద్దతుదారులు, కార్యకర్తలు తోడవడంతో నడిరోడ్డు హఠాత్తుగా ధర్నాస్థలిగా మారిపోయింది. కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. వెంటనే పోలీసులు నేతలను బలవంతంగా పక్కకు లాగేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో ప్రియాంకా గాంధీ సహా పలువురు మహిళా ఎంపీలు నేలపై పడుకుని రాజ్యాంగ ప్రతిని చేతబూని అంతా కలిసి నినదించారు. వీళ్లను మహిళా పోలీసులు లాగేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తన ఒళ్లంతా గోళ్లు గీసుకుపోయిన గాయాలయ్యాయని ప్రియాంక ఆరోపించారు. ‘‘పార్లమెంట్ సభ్యులతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను తోసి కిందపడేస్తారా? మీ పోలీస్‌బలగాలు వెనక్కి వెళ్లేదాకా మేం ఇక్కడి నుంచి లేవబోం. ఎంపీలను ఈడ్చిపడేస్తారా? కొడతారా?’’ అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తమతో వెటకారంగా మాట్లాడారని తర్వాత ప్రియాంక ఆరోపించారు. తీవ్రంగా ప్రతిఘటించిన రాహుల్ గాంధీ.. పక్కనే ఉన్న రాహుల్ గాంధీ, ఇతర ఎంపీలు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతలను బస్సుల్లోకి ఎక్కించి తీసుకెళ్లకుండా కార్యకర్తలు రెండు బస్సుల టైర్ల గాలి తీసేశారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినాసరే పోలీసులు రాహుల్‌ను భుజాలపై పైకెత్తి బస్సులోకి నెట్టేశారు. తీవ్రంగా ప్రతిఘటించినా లాభంలేకుండా పోయింది. రాహుల్ ఉన్న వాహనం ముందుకెళ్లకుండా అమరీందర్, ఉదయ్‌భాను చిబ్ బస్సు పైకెక్కారు. ముంతాజ్ పటేల్ బస్సు బానెట్ ఎక్కారు. తర్వాత వీళ్లందర్నీ పక్కకు నెట్టేసి బస్సు వేగంగా బరాఖంబా రోడ్ పోలీస్‌స్టేషన్ వైపు దూసుకెళ్లింది. ‘‘దేశంలోనే అత్యంత తీవ్రమైన అంశంపై జరుగుతున్న పోరాటమిది. మా పోరును ఆపటం మోదీ, షా తరం కాదు. మోదీ, షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, జ్ఞానేశ్లను చట్టం ముందు నిలబెడతాం’’అని బస్సులో రాహుల్ అన్నారు. ప్రియాంకను సైతం పోలీసులు వేరే వాహనంలోకి ఎక్కించి ఛాత్రాసాల్ స్టేడియంకు తరలించారు. వాహనం ఎక్కాక ప్రియాంక ‘‘దేశం రాజ్యాంగం ప్రకారమే నడవాలి. ఈ రాజ్యాంగ రక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తాం’’ అని అన్నారు. టీఎంసీ ఎంపీ డిరెక్ ఓబ్రియాన్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తదితర ఎంపీలందర్నీ నిర్బంధించి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ అనూహ్య ధర్నా దాదాపు మూడు గంటలపాటు కొనసాగింది. అరెస్టయిన రెండు గంటల తర్వాత తొలుత రాహుల్‌గాం«దీని విడుదలచేయగా కొంత సమయానికి ఛాత్రాసాల్ స్టేడియం నుంచి ప్రియాంకను విడిచిపెట్టారు. 100 ఎఫ్ఐఆర్లే లక్ష్యం... మెరుపు ధర్నాకు ముందు మీడియాతో రాహుల్ మాట్లాడారు. ‘‘మోదీ ప్రజావ్యతిరేక పరిపాలనను తప్పుబడుతూ నేను ఉద్యమించిన ప్రతిసారీ నాపై ఎఫ్ఐఆర్ నమోదుచేస్తున్నారు. తాజాగా అవి 45కు పెరిగాయి. 100 కేసులే నా లక్ష్యం. వంద దాటాకా కూడా నా పోరాటం కొనసాగుతుంది. ప్రతి ఎఫ్ఐఆర్ను ఛాతీపై ధరించే మెడల్‌గా భావిస్తా. జ్ఞానేశ్ సీఈసీ పదవి నుంచి దిగిపోయేదాకా విపక్షాల ఉద్యమం ఆగదు. మొదట్నుంచీ మాకు మద్దతిస్తూ ఉద్యమంలో మమేకమై, అరెస్టయిన ఎంపీలకు నా అభినందనలు, కృతజ్ఞతలు’’ అని అన్నారు.విమర్శించిన బీజేపీ... పలు రాష్ట్రాల్లో వరసబెట్టి ఓడిపోయిన విపక్ష పార్టీలు చివరకు చేసేదేమీలేక ఎస్ఐఆర్ ప్రక్రియ మాటున ఎంతో కొంత మీడియాలో ప్రచారం పొందేందుకు ఇలా వీధినాటకాలు ఆరంభించాయని బీజేపీ విమర్శించింది. ‘‘మంగళవారమే వాళ్లతో నిబంధనమేరకే భేటీకి ఈసీ ముందుకొచ్చింది. కానీ తమ వారసత్వ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో చూపించేందుకు రాహుల్, ప్రియాంక ద్వయం ఎలక్షన్ కమిషనర్లతో సమావేశాలకు ముందుకు రాలేదు. రాజ్యాంగ హక్కుల కంటే వీళ్లకు రాజకీయ లబ్ధే ప్రధానం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు. అసాంఘిక శక్తులతో రాహుల్ కలిసిపోయారని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అన్నారు. మరోవైపు తోపులాట వేళ మహిళా పోలీసులతో కొందరు కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంకిత్ అనే కానిస్టేబుల్ యూనిఫామ్ చింపేసిమరీ కొట్టడంతో అతనికి సమీప ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. పలువురు ఎంపీలుసహా 91 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి తర్వాత వదిలేశారు. గురువారం సైతం ఉద్యమం కొనసాగే సూచనలు ఉన్నాయని విపక్ష పార్టీల కీలక నేతలు సూచనప్రాయంగా తెలిపారు. ఇది పార్టీలకతీతంగా జరుగుతున్న ఉద్యమం అని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఢిల్లీలో పోలీసుల మోహరింపు రోజురోజుకూ పెరుగుతోంది. అయితే బుధవారం ధర్నాలో ఎస్పీ, శివసేన(యూబీటీ), శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీ–ఎస్పీ ఎంపీలు పాల్గొనలేదు. -
జంతర్ మంతర్ వద్ద హై టెన్షన్ రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు
-
దద్దరిల్లిన ఢిల్లీ జంతర్ మంతర్ లో భారీ నిరసన
-
రాహుల్ చేతిలో ‘స్టింగ్’.. పెప్సీకోకు కోర్టులో ఊరట
ఎస్ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఢిల్లీ సహా పలు చోట్ల నిరసనల్లో స్పీడ్ పెంచింది. కాగా, మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిగా అలసిపోవడంతో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. అనంతరం అదే బాటిల్‌ను తన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు ఇచ్చారు.ఈ క్రమంలో సింగ్ బాటిల్‌ను ప్రియాంక తీసుకునే ముందు వద్దు.. వద్దు అంటూ తిరస్కరించారు. అనంతరం ప్రియాంక ఆ డ్రింక్‌ను తీసుకుని వాసన చూసి.. ఒక సిప్ తీసుకుని మళ్లీ రాహుల్‌కు ఇచ్చేశారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ రూ.20 ‘స్టింగ్’ తాగడాన్ని కొందరు ఆయన సామాన్య ప్రజలతో మమేకం కావాలనే ప్రయత్నానికి ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు ఇద్దరి మధ్య ఉన్న సోదరసోదరీ అనుబంధాన్ని ప్రస్తావించారు. కొందరు మాత్రం రాజకీయ వ్యంగ్యానికి ఉపయోగించుకున్నారు.ఇదిలా ఉండగా.. ఇక్కడే ఈ ఘటనకు మరో ఆసక్తికరమైన అంశం ఉంది. రాహుల్, ప్రియాంకలు ‘స్టింగ్’ తాగుతున్న సమయంలోనే.. పెప్సీకో ఢిల్లీ హైకోర్టులో ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఉపయోగించడంపై జరుగుతున్న కేసులో పోరాడుతోంది. పెప్సీకో ఉత్పత్తులపై ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వ్యతిరేకించింది. ఆ పదాన్ని ఉత్పత్తుల లేబుళ్ల నుంచి తొలగించాలని కంపెనీని ఆదేశించింది. అలాగే ఆ లేబుల్‌తో ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులకు సూచించింది.कोई राहुल गांधी को शहजादा बोलता है कोई जमीनी नेता ,पर सच तो यह है यह बंदा आम आदमी की तरह जीवन जीने से कतई परहेज नहीं करता ! LOP होने के बावजूद भी सिंपलीसिटी लाइफस्टाइल में सामान्य रहना कोई राहुल गांधी से सीखे बरहाल Sting energy को फ्री में प्रमोशन मिल गया @RahulGandhi @INCIndia https://t.co/cYIAZiS1iS— Rahul Kumar (@NewsRahulkumar) October 7, 2026దీంతో పెప్సీకో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మంగళవారం కోర్టు కంపెనీకి మధ్యంతర ఊరట ఇచ్చింది. ఇప్పటికే తయారై మార్కెట్లో ఉన్న ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ ఉన్న స్టాక్‌ను విక్రయించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే కేసు తుది నిర్ణయం వచ్చే వరకు అదే వివాదాస్పద లేబుల్‌తో కొత్త ఉత్పత్తులను తయారు చేయకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దానిపై ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. కెఫీన్ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్’గా పిలవడం వల్ల అవి శరీరానికి పోషక శక్తిని లేదా అదనపు శక్తిని అందిస్తాయనే అభిప్రాయం వినియోగదారుల్లో కలగవచ్చని పేర్కొన్నాయి.కెఫీన్ ప్రధానంగా శరీరాన్ని ఉత్తేజపరిచే పదార్థంగా పనిచేస్తుంది. ఇది కొంతసేపు అప్రమత్తతను పెంచి, అలసట అనిపించడాన్ని తగ్గించవచ్చు. అయితే కెఫీన్ స్వయంగా శరీరానికి పోషక శక్తి లేదా క్యాలరీలను అందించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధిక కెఫీన్, అదనపు చక్కెర ఉన్న పానీయాలను యువత, క్రీడాకారులు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అలా ఢిల్లీలో ఒకవైపు నిరసనలో రాహుల్ గాంధీ చేతిలో కనిపించిన ‘స్టింగ్’ ఆసక్తిని రేపగా.. మరోవైపు అదే సమయంలో ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదంపై పెప్సీకో కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది.ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్ టూర్‌కు మళ్లీ బ్రేక్! -
ఈసీపై రాహుల్ గాంధీ నెక్స్ట్ స్టెప్ ఇదేనా?
ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల పోరు మరింత ఉధృతమవుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ ఉద్యమం తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల సంఘంపై అదే పోరును దేశవ్యాప్త ఆందోళనగా మలిచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరడంతో పాటు.. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభకు కూటమి సన్నద్ధమవుతోంది. నిన్నటి ఘటనకు కొనసాగింపుగా కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో ఎన్నికల సంఘం కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలోనూ ఆందోళనలు కొనసాగనున్నాయి. ఎన్నికల జాబితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.ఆకాశవాణి భవన్ వద్ద..మంగళవారం ఉదయం పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి దాదాపు 200 మంది ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ ప్రారంభించారు. అఖిలేశ్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, మనోజ్ ఝా, డెరెక్ ఓబ్రెయిన్ తదితర విపక్ష నేతలు పాల్గొన్నారు. పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు.రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ఊపారు. అనంతరం పలువురు నేతలను పోలీసులు బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్ మాత్రం ఆకాశవాణి భవన్ వైపు వెళ్లారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనతో చేరారు. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగిన అనంతరం వారిని ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి అనుమతించారు. అక్కడే ఇద్దరూ బైఠాయించి నిరసన చేపట్టారు.రాత్రి హైడ్రామాఆకాశవాణి భవన్ ప్రాంగణంలో కొనసాగిన నిరసన అనంతరం రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కింగ్స్‌వే క్యాంప్ న్యూ పోలీస్ లైన్స్‌కు తరలించారు. రాత్రి 10 గంటల తర్వాత వారిని విడుదల చేశారు. దీంతో ఇవాళ రాహుల్, ప్రియాంకలు స్వేచ్ఛగా ఉండగా.. తదుపరి నిరసన కార్యక్రమాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నంఇండియా కూటమి తమ పోరును మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను రాష్ట్రపతికి వివరించేందుకు సమయం కోరింది. అక్టోబర్ 7, 8 లేదంటే 9 తేదీల్లో భేటీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ బృందంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్ తదితరులు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘాన్ని కలవాలన్న ప్రయత్నమూ నిన్న ఫలించలేదు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే అభ్యంతరం లేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. నవంబర్ 1న భారీ సభమరోవైపు ఈసారి బిజూ జనతాదళ్ (బీజేడీ) కూడా ఇండియా కూటమికి మద్దతుగా వీధుల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు బీజేడీ ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో బీజేడీ దూరంగా ఉండేది. ఇక ఇవాళ్టి నిరసనలతోనే ఉద్యమాన్ని ముగించకుండా.. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభ నిర్వహించేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. అప్పటివరకు రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో నిరసనలు, సభలు, మార్చ్‌లు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదీ చదవండి: ఒక దేశం.. ఒకే పార్టీ అనే కుట్రా? -
దద్దరిల్లిన ఢిల్లీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) మాటున కోట్ల ఓట్లను రద్దుచేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ తక్షణం పదవికి రాజీనామాచేయాలన్న ఏకైక ప్రధాన డిమాండ్‌తో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు చేపట్టిన ర్యాలీ హస్తినలో అత్యంత ఉద్రిక్తతలకు దారితీసింది. విపక్ష పార్టీల అగ్రనేతలు పార్లమెంట్ వీధిలో కదంతొక్కారు. మోదీ సర్కార్‌కు లబ్ధిచేకూరుస్తున్న జ్ఞానేశ్ ఇకనైనా గద్దె దిగాలంటూ నేతలు చేసిన నినాదాలతో దేశ రాజధాని హోరెత్తింది. భారీ సంఖ్యలో విపక్షపార్టీల కార్యకర్తలు సైతం తోడవడంతో అత్యంత సున్నితమైన పార్లమెంట్ పరిసరాలు ఒక్కసారిగా ఉద్రిక్తమయ ఉద్యమవేదికగా మారిపోయింది. పలువురు ముఖ్య నేతలు అరెస్ట్‌లు, తర్వాత విడుదలతో విపక్షాల ర్యాలీ ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. నూతన ఓటర్లు సమర్పించాల్సిన ఫారమ్6కు అనుబంధంగా ఈసీ తీసుకొచి్చన డిక్లరేషన్‌కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన మరుసటి రోజే ‘ఇండియా’ కూటమి పార్టీలు ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని ఉధృతంచేయడం గమనార్హం. పార్లమెంట్ నుంచి ఆరంభమై.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన భవనం మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఒక్కచోటకు చేరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’కు ర్యాలీగా బయల్దేరారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డిరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఇలా దాదాపు 300 మంది ఎంపీలు ర్యాలీగా బయల్దేరారు. ఆర్ఎస్ఎస్ ఆహార్యంలో ఉన్న జ్ఞానేశ్ కటౌట్లను ప్రదర్శిస్తూ ‘ఓటు దొంగలు గద్దె దిగాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ఆపండి’ అంటూ ఈసీ, కేంద్రప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కూటమిలోలేని బిజూ జనతాదళ్ పార్టీ ఎంపీలు సైతం ర్యాలీలో పాల్గొనడం విశేషం. మధ్యలోనే అడ్డగింత.. వాగ్వాదం.. నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా పావు కిలోమీటర్ ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ హెడ్ఆఫీస్ వస్తుందనగా నేతలు నీతి ఆయోగ్ కార్యాలయం వద్దకు రాగానే బారికేడ్లు అడ్డంగాపెట్టి వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను నెట్టేసి ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాహుల్ బారికేడ్‌ను ఎక్కేశారు. త్రివర్ణ పతాకం చేతబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. తోటి ఎంపీలు సైతం ముక్తకంఠంతో నినదించడంతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. తర్వాత నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ర్యాలీని కొనసాగనివ్వాలని డిమాండ్‌చేశారు. ‘‘జ్ఞానేశ్ జీ ఇప్పటికే ఎన్నికల వ్యవస్థను నాశనంచేశారు. చేసింది చాలు. ఇకనైనా రాజీనామా చేయండి’’ అని ఇదే సమయంలో రాహుల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. నేతలంతా బైఠాయించడంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు వెంటనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఓబ్రియాన్, అభిషేక్ బెనర్జీ, సాగరికా ఘోష్, మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ సహా పలువురు ఎంపీలను నిర్బంధించి బస్సుల్లోకి ఎక్కించారు. అయితే బస్సులు కొంతదూరం కదిలినా చుట్టూతా కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో నేతలను విడిచిపెట్టారు. ఇదే సమయంలో ప్రియాంకాగాంధీ ఎలాగోలా బస్సు నుంచి బయటపడి తిరిగి ధర్నాలో కూర్చున్నారు.50 మంది ఎంపీలు సహా 250 మంది అరెస్ట్చెట్టు కింద దాదాపు తొమ్మిది గంటలపాటు కొనసాగిన ధర్నాను రాత్రి వేళ పోలీసులు హఠాత్తుగా భగ్నంచేశారు. ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో చుట్టుముట్టి కీలక నేతలందర్నీ లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లు, బస్సుల్లోకి ఎక్కించారు. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, కె.సురేశ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, చరణ్‌జీత్‌సింగ్ ఛన్నీ, దీపేందర్ హూడా, ప్రణీతి షిండే, వర్షా గైక్వాడ్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మనీశ్ ఛాత్రా తదితర నేతలందరిన్నీ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న విపక్ష పార్టీల మద్దతుదారుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.50 మంది ఎంపీలుసహా మొత్తంగా 250 మందిని అరెస్ట్‌చేశారు. రాహుల్‌ను కింగ్స్‌వే క్యాంప్ న్యూ పోలీస్‌లైన్స్ స్టేషన్‌కు తరలించారు. ఇతర నేతలను వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. విడుదలైన ప్రియాంక తర్వాత రాహుల్‌ను నిర్బంధించిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 2 గంటల నిర్బంధం తర్వాత రాహుల్‌సహా నేతలందర్నీ విడిచిపెట్టారు. నేతల అరెస్ట్‌పై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే ధర్నా నుంచి డీఎంకే, ఆప్ పార్టీలు దూరంగా ఉండిపోయాయి.అపాయింట్ కోసం లేఖ రాశాకే, సీఈసీని కలిసేందుకే ర్యాలీగా వెళ్లామని ఎంపీలు చెబుతుండగా ముందస్తు అపాయింట్మెంట్ కోసం సాయంత్రందాకా ఎలాంటి అభ్యర్థన రాలేదని ఈసీ వర్గాలు స్పష్టంచేశాయి. పార్లమెంట్ అనుబంధ భవనంలో 240 మంది ఎంపీలు తమతో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు పోలీసుల నుంచి సమాచారం అందిందని, ఇలాంటి భేటీకి ఈసీ నిబంధనలను ఒప్పుకోవని ఈసీ పేర్కొంది. ముందస్తు అనుమతితో ఈసీ కార్యాలయంలోనే రాజకీయపార్టీల ప్రతినిధులతో ఎలక్షన్ కమిషనర్లు భేటీ అయ్యేందుకే నిబంధనలు అనుమతిస్తాయని ఈసీ ఆ ప్రకటనలో పేర్కొంది. ధర్నాను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కొత్త ‘వీధి నాటకం’గా అభివరి్ణంచారు. రహదారి నుంచి ఆకాశవాణిలోకి..ఎంపీలందరినీ పోలీసులు నిర్బంధించే అవకాశం ఉండటంతో రాహుల్, ప్రియాంక, దీపేందర్ హూడా తదితర ఎంపీలు మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో వెంటనే ఎదురుగా ఉన్న ఆకాశవాణి(ఆలిండియా రేడియో కార్యాలయం) ప్రాంగణంలోకి పరుగెత్తారు. మూడో నంబర్ గేటు వద్ద ఉన్న రిసెప్షన్ ఏరియా నుంచి సమీపంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అయినాసరే రాహుల్, ప్రియాంక, తదితరులు లోపలికి చొరబడ్డారు.తర్వాత కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ప్రణీతి షిండే, చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ, సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్ తదితరులూ లోపలికొచ్చారు. నాలుగో నంబర్ గేటు సమీప భారీ మర్రిచెట్టు కింద నేతలంతా భైఠాయించి ధర్నా కొనసాగించారు. వెంటనే అక్కడికొచి్చన పోలీసు ఉన్నతాధికారులు నేతలకు ధర్నా విరమించాలని నచ్చజెప్పారు. ధర్నా చేసుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతం చూపిస్తే అక్కడికే వెళ్తామని నేతలు తెగేసిచెప్పారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇక్కడి నుంచే పోరాటం కొనసాగిస్తాం. ఎన్డీఏ సర్కార్ ప్రజాస్వామ్యవ్యతిరేక నిర్ణయాలు అమలుచేస్తోంది.ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్, జ్ఞానేశ్ వీళ్లలో ఎవరినీ వదిలిపెట్టేది లేదు. కూటమి ఎంపీలతో ఎన్నికల సంఘం భేటీకి ఒప్పుకునేదాకా మేం వెనక్కితగ్గం’’ అని రాహుల్ మీడియాతో అన్నారు. మధ్యాహ్నం హఠాత్తుగా కాంగ్రెస్ ముఖ్యనేతలంగా లోపలికిరావడంతో ఆలిండియా రేడియో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఆశ్చర్యంతో బయటకు పరుగెత్తారు. రాహుల్‌తో సెల్పిలు దిగారు. కొందరు కిటికీల నుంచి తొంగిచూస్తూ, మరికొందరు గోడలెక్కి మరీ నేతల ధర్నాను చూసేందుకు ఎగబడ్డారు. వాళ్లను పోలీసులు వారించారు. ధర్నాచేస్తున్న నేతలు నేలపై కూర్చునేందుకు చాపలు, దుప్పట్లు, ఆరుబయట దోమలు కుట్టకుండా మస్కిటో క్రీమ్‌లు, తినేందుకు చిరుతిండ్లు, తాగడానికి నీరు కార్యకర్తలు ఆగమేఘాల మీద ఏర్పాటు చేశారు. -
రాహుల్, ప్రియాంకలకు మద్దతుగా.. నేడు ఢిల్లీకి రేవంత్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతల అరెస్టుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు మద్దతు తెలిపేందుకు రేవంత్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం.అయితే, మంగళవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ కాంగ్రెస్ నేతల నిర్బంధాన్ని ఖండించారు.ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. పార్టీ అగ్రనేతలను కలిసి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ అరెస్ట్ -
రాహుల్ గాంధీ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గత 9 గంటలుగా నిరసన దీక్షను కొనసాగిస్తున్నాయి.మంగళవారం సాయంత్రం ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిరసన విరమించాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ, వారు వెనక్కి తగ్గకపోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు.ఈ పరిణామంతో ఆకాశవాణి భవన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇదీ చదవండి : మీ ఓటు గల్లంతు కానుందా?.. ఎస్ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది? -
బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.పార్లమెంట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. ఎంపీలు చేతుల్లో జ్ఞానేశ్ కుమార్ చిత్రాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘‘ఓటు దొంగలారా.. పదవి వదిలేయండి’’ అంటూ నినాదాలు చేశారు. నితి ఆయోగ్ కార్యాలయం సమీపంలో భారీ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు.బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపి.. ఈ సమయంలో రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కారు. పోలీసులు ప్రియాంక గాంధీని నిర్బంధించేందుకు బస్సులోకి తీసుకెళ్లగా, ఆమె కొద్దిసేపటికే బస్సు నుంచి దిగి రాహుల్ గాంధీతో కలిసి ఆకాశవాణి భవన్ గేటు వద్దకు చేరుకున్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మరికొందరితో కలిసి ఆకాశవాణి భవన్ స్వాగత ద్వారం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం వారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఐఆర్లో తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ప్రక్రియను రద్దు చేయాలని కూడా కోరుతున్నాయి. ఫారమ్-6లో మార్పులపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ఎన్నికల సంఘం మాత్రం ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది.రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ ‘ఓటు చోరీ’ ద్వారా దేశాన్ని హైజాక్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ వారికి సహకరించారు. ఇది దేశద్రోహం. ఎవరూ తప్పించుకోలేరు. సుమారు 300 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కలవాలనుకున్నారు. ఇదీ చదవండి: స్మిట్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్, మెమరీ లాస్, చూపు దెబ్బతిని..కానీ, పోలీసులు మమ్మల్ని ఇక్కడే ఆపేశారు. మేము ఎన్నికైన ప్రజా ప్రతినిధులం. అయినా మమ్మల్ని ఎందుకు ఆపారో తెలియడం లేదు. ఎన్నికల కమిషన్ కేవలం 50 మీటర్ల దూరంలో ఉండగా ఏమైందో అర్థం కావడం లేదు. దేశంలో ఏమి జరుగుతోంది? ఎన్నికల కమిషన్ ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలవకపోతే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?” అని అన్నారు. VIDEO | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi climbs atop the barricades during the INDIA bloc MPs' march from Parliament to the ECI, demanding CEC Gyanesh Kumar's resignation. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/YkwlFV8WCn— Press Trust of India (@PTI_News) October 6, 2026 -
‘జ్ఞానేశ్ బ్రో’ ఎపిసోడ్.. కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఇప్పటివరకు రాజకీయ విమర్శలు, నిరసనలకే పరిమితమైన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడప దాటింది. జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా మారింది. అదే సమయంలో.. సోమవారం సుప్రీంకోర్టులో ఫామ్-6పై వచ్చిన వ్యాఖ్యలు, మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీల ఆందోళన.. ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి.జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ పోస్టు నుంచి తక్షణం సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే కేసును విచారణకు స్వీకరించి.. కేంద్రం, ఈసీతో పాటు జ్ఞానేశ్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి తదితరులకు నోటీసులు ఇచ్చింది. ఎస్ఐఆర్కు సంబంధించిన 14 నిర్ణయాలు ఇతర కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి తీసుకున్నారన్నది పిటిషన్లో ప్రధాన ఆరోపణ. అలాగని ఇప్పటికిప్పుడు జ్ఞానేశ్ కుమార్ పదవికి ముప్పు వచ్చిందని చెప్పలేం. కానీ ఆయన నిర్ణయాలపై న్యాయపరీక్ష మొదలైందన్నది మాత్రం స్పష్టం.అసలు చిక్కు ఆ ఫామ్‌తోనే!ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం ఫామ్-6. కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఈ ఫామ్‌కు ఎస్ఐఆర్ సమయంలో అదనపు డిక్లరేషన్ జతచేశారు. దాని విషయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.“మార్చిన ఫామ్-6ను మేం ఆమోదించలేదు. రికార్డులు వచ్చిన తర్వాత ఎవరు ఏం మార్చారో చూస్తాం” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీంతో ఈ మార్పులకు అసలు అధికారం ఎవరిది? ఏ ప్రక్రియలో జరిగాయి? అన్నది ఇప్పుడు కోర్టు పరిశీలనలోకి వచ్చింది.ఇదే అంశంపై ఎన్నికల సంఘం మాత్రం ఇంతకు ముందు తన వివరణ ఇచ్చింది. బిహార్‌లో ఎస్ఐఆర్ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నామని, సుప్రీంకోర్టు కూడా ఆ ఎస్ఐఆర్ అధికారాన్ని సమర్థించిందని పేర్కొంది. ఫామ్-6 విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఈసీ అభివర్ణించింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం తన ముందు ఉన్న రికార్డులను పరిశీలించి ఎవరు ఏ మార్పు చేశారో తెలుసుకుంటామని చెప్పడం.. ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లైంది.జ్ఞానేశ్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే..ఇక జ్ఞానేశ్ కుమార్ ముందున్న అసలు పరీక్ష.. రాజకీయ విమర్శలకు సమాధానం ఇవ్వడం కాదు. సుప్రీంకోర్టుకు రికార్డులు సమర్పించి.. నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారో వివరించడం. ముఖ్యంగా 14 నిర్ణయాలపై మిగిలిన ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న ఆరోపణలపై ఈసీ వద్ద ఉన్న పూర్తి రికార్డులు కీలకం కానున్నాయి. నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ చెబుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మరి కేంద్రం ఏం చేయబోతోంది?ఇక్కడే రాజకీయ ఉత్కంఠ మొదలవుతోంది. విపక్షాలు మాత్రం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ సీఈసీని కేంద్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనా ఉత్తర్వుతో తొలగించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత దశలో కేంద్రం ముందున్న తక్షణ మార్గం సుప్రీంకోర్టుకు సమగ్ర సమాధానం ఇవ్వడం, ఎన్నికల సంఘం వైఖరిని చట్టపరంగా సమర్థించడం. అదే సమయంలో విపక్షాల తీరును ఎండగట్టడం. కోర్టు రికార్డులను పరిశీలించిన తర్వాత ఏదైనా నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉందని తేలితే.. దాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు కేంద్రం వైఖరి అత్యంత కీలకంగా మారింది.రోడ్డెక్కిన విపక్షాలు.. ‘జ్ఞానేశ్ బ్రో.. ఇట్స్ డన్’సుప్రీంకోర్టు పరిణామాల మరుసటి రోజే ఢిల్లీలో విపక్షాలు భారీ ఆందోళనకు దిగాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్లమెంట్ స్ట్రీట్ వద్దే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. “జ్ఞానేశ్.. ఇట్స్ డన్ బ్రో. టైమ్ టు రిజైన్” అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆందోళనకు నినాదంగా మారింది. సీఈసీ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్, ఫామ్-6 వ్యవహారంపై సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఈసీ కార్యాలయం చుట్టూ భారీగా భద్రత ఏర్పాటు చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎంపీలను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నిరసన మరింత ఉధృతమైంది.మరోవైపు సీజేపీ.. దేశవ్యాప్త ఉద్యమానికి రెడీఇదంతా జరుగుతుండగానే సీజేపీ కూడా జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ, విద్యార్థి బృందాలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి. ఎన్నికల జాబితా ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఒకవైపు పార్లమెంటరీ విపక్షాల నిరసనలు.. మరోవైపు యువత ఆధారంగా సాగే సీజేపీ ఉద్యమం.. ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ. మూడు దారుల్లో ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఉత్కంఠ ఇక్కడే..ఇప్పటివరకు ఎస్ఐఆర్ వివాదం ప్రధానంగా “ఎన్నికల సంఘం వర్సెస్ విపక్షాలు” అన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులతో వ్యవహారం “ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టబద్ధంగానే జరిగాయా?” అనే ప్రశ్నకు చేరింది. కేంద్రం కూడా ఇప్పుడు రెండు విషయాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఒకటి.. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం. రెండోది.. సుప్రీంకోర్టు అడిగిన రికార్డులు, వివరణలను సమర్థంగా సమర్పించడం.అందుకే ఇప్పుడు అందరి చూపూ ఒక్కచోటే.. సుప్రీంకోర్టు తదుపరి అడుగు ఏంటి? దానికి కేంద్రం ఇచ్చే సమాధానం ఏంటి? జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంలో అసలు ట్విస్ట్ అక్కడే ఉండబోతోంది.ఇదీ చదవండి: జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్ -
జ్ఞానేశ్.. చేసింది చాలు బ్రో... ఇక రిజైన్ చెయ్: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జ్ఞానేశ్.. ఇక చాల్లే బ్రో.. రాజీనామా చేసే సమయం వచ్చింది’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టిన సమయంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. Gyanesh, it’s done, bro. Time to resign. #IndiaAllianceMarch https://t.co/9ZB6aJfakl— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026జాతీయ రాజధానిలో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన అనంతరం పలువురు ఇండియా కూటమి ఎంపీలు నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో కూర్చొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమి నిరసన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత సాధించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కును కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ మాట్లాడుతూ.. 13 కోట్ల ఓట్లు తొలగించారని, తద్వారా ఆయా వ్యక్తులు తమ ప్రజాస్వామ్య ఓటుహక్కును కోల్పోయారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం, జ్ఞానేశ్ కుమార్ సహకారంతో ప్రజలపై చేసిన అతిపెద్ద ఎన్నికల మోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతామని చెప్పారు.ప్రతిపక్షం రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందన్న బీజేపీ ఆరోపణలను ధర్మవీర్ గాంధీ ఖండించారు. రాజ్యాంగ సంస్థలను ఎవరు తమ ఆధీనంలోకి తీసుకున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్నికల కమిషనర్లు, సీఈసీ ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది బీజేపీయేనని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు, మీడియా, ఇతర సంస్థలపై కూడా ప్రభుత్వం ప్రభావం చూపుతోందని ఆయన విమర్శించారు.ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యంపై ఉన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. తమ ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ను రద్దు చేయాలని కోరారు. సర్‌లో తొలగించిన లేదా డిలీట్ చేసిన ఓటర్లందరి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణకు బీసీ సీఎం అవుతారు: మహేష్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం కచ్చితంగా అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపదంగా చెబుతున్నానన్నారు. మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లే క్రమంలో శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.‘రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన ధైర్యంతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నా. రాహుల్ భారత్ జోడో యాత్రతో ఎవరు వాటా ఎంతో వారికి అంత అనేది రాహుల్ గాంధీ నినాదం. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటాం. కుల సర్వే సాకారం అయి ఉంటే యావద్దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండేది. ప్రధాని మోదీ బీసీలను వంచనకు గురి చేస్తున్నారు. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్‌లను చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం. మోదీ గద్దె దిగే టైం వచ్చింది. రాహుల్ ప్రధాని కావడం తథ్యం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తాం. కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమీ లేదు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: CECని తొలగించాలని రాష్ట్ర వ్యాప్త నిరసనలు -
మహిళా జర్నలిస్టులతో ఇదేం తీరు.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహిళా జర్నలిస్టులపై పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపుతోంది. ముగ్గురు మహిళా జర్నలిస్టులు తమపై పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాత దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల వ్యవహారం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టు పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాహుల్ ఆరోపించారు. జంతర్ మంతర్‌లో వందలాది మంది జర్నలిస్టులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారని రాహుల్ తెలిపారు. నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారుల పట్ల కూడా పోలీసుల ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. కెమెరాలు లాక్కోవడం, జర్నలిస్టులను ఈడ్చుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు.🚨THIS IS SHAMEFULL Female Journalist alleges an inappropriate behavior by security personnel during Jantar Mantar Protest. @yadavakhilesh @abhijeet_dipke @RahulGandhi #DelhiPolice #JantarMantar #GyaneshKumar https://t.co/jJ1kRjyU98— Global News 🚨 (@Jarvis945) October 3, 2026ఇదిలా ఉండగా, సీపీజే, ఏఐఎస్ఏ కూడా మహిళా జర్నలిస్టులు, మహిళా ఆందోళనకారులు, న్యాయవాదుల పట్ల పురుష పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆరోపించాయి. పలువురు మహిళలు గృహిణులు/జర్నలిస్టులు తమను తాకుతూ వేధించారని ఫిర్యాదు చేసినట్లు ఏఐఎస్ఏ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అందిన ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించిన నేపథ్యంలో.. విచారణలో ఏం తేలుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.Bravo Delhi Police 🔥🔥 Neha Bora Detained Again On 2nd day of protest At Jantar Mantar https://t.co/GCphH3PNHg— INDIAN (@hindus47) October 3, 2026𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐖𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐍𝐚𝐦𝐞𝐩𝐥𝐚𝐭𝐞𝐬 Under the cover of Darkness, they are detaining Girls and taking them away in Buses. First of all, Detaining Women in this manner after Dark raises Serious questions about Legality and due Process. Who are these Police Personnel without Nameplates? If anything happens to these Protesting Girls while they are being taken away, Who Will Be Held Accountable? Let's reclaim Jantar Mantar. 🔥 #JantarMantar— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) October 3, 2026She refused to leave him 🥹❤️ Woman = God 🙏 https://t.co/lWDe4nfyrB— 🐅ராச.துரை ஆனந்தன் 🐅 (@thuosi444) October 3, 2026 -
అఖిలేశ్ వల్లే రాహుల్ గెలిచారు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
‘కలిసుంటే బలం.. విడిపోతే బలహీనం’ అన్న రాజకీయ సామెతకు భిన్నంగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య అప్పుడే మాటల వేడి మొదలైంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీతో పొత్తు లేకపోయి ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని అన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి కూడా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భరోసా ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.శివ్‌పాల్ సింగ్ పటేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు వల్లే కాంగ్రెస్‌కు ఆరు సీట్లు దక్కాయని అన్నారు. ఎస్పీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలిచేది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి ఓటు ఆ పార్టీ అభ్యర్థులకే పడిందని, అందుకే ఆరు స్థానాలు గెలుచుకోగలిగారని చెప్పారు.రాహుల్ భయపడ్డారు.. రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపైనా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో రాహుల్ పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అఖిలేశ్ యాదవ్ భరోసా ఇచ్చి పోటీ చేయాలని ఒప్పించారని అన్నారు. తాను పోటీ చేయకపోతే ఎస్పీ తరఫున సొంత అభ్యర్థిని బరిలోకి దింపుతానని అఖిలేశ్ హెచ్చరించడంతోనే రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీకి అంగీకరించారని పటేల్ పేర్కొన్నారు. ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ 37 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయే మొత్తం 36 స్థానాలు దక్కించుకుంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా ఎస్పీ గెలుచుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఎస్పీ సాధించిన 37 సీట్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఆశించకూడదని పటేల్ అన్నారు. మేమే పెద్దన్న.. చాలా పెద్దన్న అని వ్యాఖ్యానిస్తూ ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీదే పైచేయి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహకరిస్తే పొత్తు ద్వారా ఇరు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని, పొత్తు లేకపోయినా ఎస్పీకి పెద్దగా నష్టం ఉండదని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం సున్నా సీట్లకు పడిపోతుందని పటేల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులను కేవలం ఓట్లు చీల్చేందుకే బరిలోకి దిగుతున్నారని భావించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వేరే స్థాయి ఉండొచ్చని, కానీ ఒంటరిగా పోటీ చేసిన చోట ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయిందని విమర్శించారు. అలాగే.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దళితుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ఎస్పీ పాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.కాంగ్రెస్ సీరియస్.. ప్రస్తుతం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీకి 101 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకంలో తమ పార్టీదే పైచేయి అన్న సంకేతాలను పటేల్ ఇచ్చారు. అయితే, పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలను ఎస్పీ నాయకత్వం అదుపులో పెట్టాలని అన్నారు. ఇండియా కూటమి కారణంగానే పటేల్ ఎంపీగా గెలిచారని గుర్తుచేస్తూ.. ఆయన తన పరిమితులు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాగా, 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ విభేదాలు మరింత ముదురుతాయా? లేక ఇరు పార్టీలు సర్దుకుపోయి పొత్తును కొనసాగిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బీజేపీకి ఊహించని షాక్.. -
ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్ కీలక ప్రకటన
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం(టీవీకే) కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరింది. చెన్నైలో జరిగిన ఇండియా కూటమి పార్టీల సమావేశానికి టీవీకే తరఫున ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. వారికి కాంగ్రెస్ నాయకులు ఆహ్వానం పలికారు. ఇండియా కూటమిలో కొద్ది నెలల క్రితం వరకు తమిళనాట డీఎంకే కీలకంగా ఉంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకేకు మద్దతివ్వడంతో డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలగింది.ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరుకాలేదు. టీవీకే కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. గత నెలలో తమిళనాట టీవీకే నేతృత్వంలో ‘మత సామరస్య సామాజిక న్యాయ విజయ కూటమి (సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్)’ ఆవిర్భవించింది. ఇందులో ఇండియా కూటమిలోని సీపీఎం, సీపీఐ మాత్రం చేరలేదు. ఈ పరిస్థితులలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో పోరాటాలకు ఇండియా కూటమి నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నైలోని సత్యమూర్తి భవన్లో ఇండియా కూటమి సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీవీకే పార్టీ అధికారికంగా పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.ఈ సమావేశానికి టీవీకే తరఫున మంత్రులు ఆధవ్ అర్జున, మరియా విల్సన్ హాజరై కూటమికి మద్దతు ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ తరపున రవీంద్రనాథ్, ఐయూఎంఎల్ తరపున అబూబకర్ తదితర కూటమి పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు పాల్గొన్నారు. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో పోరాటాలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. అనంతరం, మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలో టీవీకే చేరడం ప్రతిపక్ష ఐక్యతకు చారిత్రక రోజని వ్యాఖ్యానించారు. తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం మరింత ఆసక్తికరంగా మారుతుందని చెప్పారు.ఓటర్ల జాబితా అంశంపై ఆందోళనలుమరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్‌పై ఇండియా కూటమి ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని కూటమి నిర్ణయించినట్లు ఠాగూర్ తెలిపారు. అక్టోబర్ 15న కూటమిలోని ఏడు పార్టీలకు చెందిన అగ్రనేతలతో భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు అక్టోబర్ 6న ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: విజయ టార్గెట్‌గా స్టాలిన్ బిగ్ అటాక్.. దెబ్బకు డిఫెన్స్‌లో టీవీకే? -
నిరసన గొంతుకల ఐక్య వేదిక ‘సత్యాగ్రహ’!
న్యూఢిల్లీ: దేశంలో సత్యాన్ని అణచివేసే ప్రయత్నాలు సాగుతున్నాయని, వీటిని అడ్డుకోవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యతని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు అంశాలపై వెల్లువెత్తుతున్న నిరసన గళాలు అన్నింటినీ ఒక్క చోటికి తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’డిజిటల్ వేదికను రాహుల్ శనివారం ప్రారంభించారు. మహాత్మా గాంధీ 157వ జయంతి మరుసటి రోజున ప్రారంభమైన ఈ వేదికలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలు తమ ఉద్యమ వివరాలను నమోదు చేసుకోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ వివరాలను ఇంటరాక్టివ్ మ్యాప్‌లో కనిపించేలా చేసి, ఒకే తరహా సమస్యలపై పోరాడుతున్న వారిని అనుసంధానించడం, సత్యం అణచివేతకు గురవుతున్న ప్రతిచోటా అండగా నిలవడమే ఈ వేదిక ఉద్దేశమని తెలిపారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే, చాలాసార్లు ఇవి ఒంటరి పోరాటాలుగానే మిగిలిపోతున్నాయి. జెన్–జీ, యువత, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు ఒక్కో పోరాటానిది ఒక్కో ప్రత్యేక కథ. అయితే ఒంటరి గొంతుకలను అణచివేయడం సులభం’’అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే గొంతులన్నింటినీ ఒకే మ్యాప్‌పైకి తీసుకు వచ్చేందుకు ‘సత్యాగ్రహ’ఏర్పాటైందని చెప్పారు. మహాత్మాగాంధీ సత్యమే గొప్ప ఆయుధమని బోధించారని, అయితే ఇందుకోసం కలిసికట్టుగా నిలబడితే ఆయుధం మరింత శక్తిమంతమవుతుందని అన్నారు. -
రాహుల్ గాంధీకి హరీష్ లేఖ
హైదరాబాద్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీకి హరీష్ లేఖ రాశారు. ఈ ప్రైవేటీకరణ అంశంపై రాహుల్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్కో, సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్ జాతీయ విధానం ఢిల్లీలో ఒకలా.. తెలంగాణలో మరోలా ఎందుకు? అని ప్రశ్నించారు హరీష్, కాంగ్రెస్ మేనిఫెస్టో, రాయ్‌పూర్ ఆర్థిక తీర్మానాలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజా ఆస్తులను రేవంత్ ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు.ఇదీ చదవండి: ఖైరతాబాద్‌లో వందశాతం మేమే గెలుస్తాం.. -
రాహుల్ గాంధీ మెచ్చిన ‘మహ్మద్ దీపక్’ అరెస్ట్
కొద్ది నెలల క్రితం.. మత సామరస్యానికి సంబంధించిన ఘటనతో వైరల్ అయిన దీపక్ కుమార్ గుర్తున్నాడా?. ఓ వివాదంలో హిందూ సంఘాల నుంచి ఓ ముస్లిం వ్యాపారిని రక్షించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడతను. ఆ సమయంలో నా పేరు ‘మహ్మద్ దీపక్’ అంటూ అతను చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీపక్‌ను మెచ్చుకుని.. ‘భారత హీరో’గా అభివర్ణించారు. అయితే తాజాగా అతను మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.ఉత్తరాఖండ్వాసి మహ్మద్ దీపక్ (దీపక్ కుమార్).. ఓ వ్యాపారిని బెదిరించి, దాడికి పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు. మొన్నీమధ్యే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఓ మసీదు వ్యవహారం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై దీపక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి సంజీవ్ టోంక్ అనే యూజర్ కామెంట్ చేశాడు. ఈ విషయంలో కోపంతో రగిలిపోయిన దీపక్.. అతని దుకాణానికి వెళ్లి దూషించి, బెదిరించారు. The man seen in the video is Md Deepak, the “hero” of the Congress ecosystem. Rahul Gandhi and several big and small Congress leaders were desperate to meet him.Now look at what he is doing.He is accused of abusing and threatening a Hindu shopkeeper and even attempting to… pic.twitter.com/nNEWioLlie— Mr Sinha (@Mrsinha) October 1, 2026ఈ మేరకు ఆ పెద్దాయన కోట్ద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. దీపక్ సంజీవ్‌ను బెదిరించింది నిజమేనని సీసీటీటీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. దీపక్‌ను అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.ఈ ఏడాది జనవరిలో దీపక్ కుమార్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కోట్‌ద్వార్‌లో ఓ ముస్లిం దుకాణదారుడి విషయంలో వివాదం తలెత్తిన సమయంలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఆ సందర్భంగా “నా పేరు మహ్మద్ దీపక్” అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఆయనను తన వద్దకు పిలిపించుకుని ప్రశంసించారు. ఇప్పుడు ఓ హిందూ వ్యాపారిని బెదిరింపు కేసులో అరెస్ట్ కావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.करोड़ों भारतीयों के दिलों में सद्भाव और मोहब्बत की विचारधारा है, मगर मन में भय भी है - दीपक ने उन सभी को अपने साहस से राह दिखाई है।जो लोग नफ़रत फैलाकर समाज को डराने की कोशिश करते हैं, वो दरअसल कायर होते हैं - उनसे कभी भी डरो मत।दीपक ने हमारे तिरंगे और संविधान की रक्षा की है।… pic.twitter.com/lk3IMlk8x8— Rahul Gandhi (@RahulGandhi) February 25, 2026 -
ఈసీకి రాహుల్ గాంధీ బిగ్ క్వశ్చన్
కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్లైన్ ఫామ్–6లో మార్పులు అక్రమంగా జరిగాయంటూ శుక్రవారం తన ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఎవరి ఒత్తిడి మేరకు ఇలా చేశారో చెప్పాలంటూ వరుస ప్రశ్నలు సంధించారాయన. ఎన్నికల సంఘం (ECI) సూచనల మేరకు టీసీఎస్ (TCS) తన డిజిటల్ పోర్టల్‌లో మార్పులు చేసిందా? ఒకవేళ చేస్తే.. ఆ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారు? వారిపై ఒత్తిడి ఏమైనా ఉందా? అంటూ రాహుల్ గాంధీ ఈసీని వరుస ప్రశ్నలు సంధించారు.‘‘ఆన్లైన్ ఫామ్–6ను అక్రమంగా మార్చారు. ఈ మార్పుపై ఈసీలోని కమిషనర్లే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీసీఎస్‌ను ఈ మార్పు చేయాలని ఈసీలో ఎవరు ఆదేశించారు?’’ అని అని ప్రశ్నించారు. ఈ మార్పులకు టీసీఎస్‌లో ఎవరు ఆమోదం తెలిపారో, ఆ నిర్ణయం తీసుకునేలా వారిపై ఒత్తిడి తెచ్చారా? అని అడిగారు.The online Form 6 was changed illegally - as the EC's own Commissioners have recorded.Who at the ECI ordered Tata Consultancy Services to make that change?Who at TCS signed off on it? And were they pressured into doing it?— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2026ఫామ్–6లో ఏం మారిందంటే..కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫామ్–6ను ఉపయోగిస్తారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) సమయంలోనూ ఇది కీలకమైన ఫామ్. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిపోయిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి కూడా దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ ఫామ్‌కు అదనంగా ఓ డిక్లరేషన్ జత చేశారు. గతంలో జరిగిన ఎస్ఐఆర్ సమయంలో రూపొందించిన ఓటర్ల జాబితాలో దరఖాస్తుదారుడి పేరు ఉందా? లేక వారి తల్లిదండ్రులు లేదా తాత, నానమ్మ/అమ్మమ్మ పేర్లు ఉన్నాయా? అనే వివరాలను ఇందులో కోరారు.ఇద్దరు ఈసీల అభ్యంతరాలు..ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ సంచలనాత్మక కథనం ఇచ్చింది. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్ రూల్స్‌లో నిర్దేశించిన ఫామ్‌ను నిబంధనలను సవరించకుండా మార్చే అధికారం ఎన్నికల సంఘానికి లేదని వారు అభిప్రాయపడినట్లు ఆ కథనం పేర్కొంది. ఇలాంటి మార్పులను సూచించే లేదంటే అమలు చేసే అధికారం న్యాయశాఖకు మాత్రమే ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈసీ వివరణ ఏంటి?అయితే ఫామ్–6ను తాము మార్చలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అసలు చట్టబద్ధమైన ఫామ్–6 యథాతథంగానే ఉందని.. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దానికి కేవలం ‘అనెక్సర్–డి’ అనే అదనపు డిక్లరేషన్‌ను జత చేశామని వివరించింది. మే 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ డిక్లరేషన్ జత చేసే అంశానికి సమర్థన లభించిందని కూడా ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్కు సంబంధించిన నిర్ణయాలకు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదం ఉందని తెలిపింది.ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తొలగింపుఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఫామ్–6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను సెప్టెంబర్ 30 నుంచి ఈసీఐనెట్(ECINET) పోర్టల్ నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫామ్–6తోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న 13 రాష్ట్రాల్లో ఈ అదనపు డిక్లరేషన్ అందుబాటులోనే ఉంటుంది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో మాత్రమే ఈ అదనపు ఫామ్ అవసరం ఉండదని ఈసీ స్పష్టం చేసింది.ఆందోళనలకు సిద్ధమవుతున్న విపక్షాలుఫామ్–6 వివాదంతోపాటు ఎస్ఐఆర్పై విపక్షాలు ఎన్నికల సంఘంపై విమర్శలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలకు నిర్ణయించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి 8వ తేదీ వరకు జిల్లా స్థాయిలో ‘సేవ్ డెమోక్రసీ మార్చ్’ నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అక్టోబర్ 6న విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ రెండో వారంలో ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు.ఫామ్–6లో మార్పులపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న మాత్రం ఇదే. ఈ మార్పు చేయాలని టీసీఎస్‌ను ఆదేశించింది ఈసీలో ఎవరు? ఆ నిర్ణయానికి ఎవరు ఆమోదం తెలిపారు?. ఈ ప్రశ్నలపై ఎన్నికల సంఘం, టీసీఎస్ నుంచి వచ్చే తదుపరి వివరణ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: ఆఫ్రికా నుంచి సీబీఐ ఆఫీసర్లా? -
కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. పీసీసీ చీఫ్ రాజీనామా
పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వడింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్‌లో కొత్త నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.వడింగ్ స్థానంలో మాజీ మంత్రి విజయ్ ఇంద్ర సింగ్లా పేరు ముందంజలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సింగ్లా పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 2న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పీసీసీ అధ్యక్ష పదవికి జలంధర్ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, గురుదాస్‌పూర్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇతర నివేదికల్లో మరికొందరు నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నట్లు సమాచారం.నాలుగున్నరేళ్ల తర్వాత మార్పు..రాజా వడింగ్ 2022లో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సుమారు నాలుగున్నరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. తాజాగా పార్టీ అధిష్ఠానం ఆయన పదవిలో మార్పు చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ నిర్ణయం నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.పార్టీలో అంతర్గత విభేదాలు..పంజాబ్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా నాయకత్వంపై అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రాజా వడింగ్, మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ వర్గాల మధ్య విభేదాలు బహిరంగంగా కనిపించాయి. జూలై 1న వడింగ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ.. చన్నీకి పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించినప్పటికీ అంతర్గత విభేదాలు పూర్తిగా సమసిపోలేదని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా సచిన్ పైలట్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పార్టీ నేతలు, జిల్లా స్థాయి నాయకులతో ఆయన నిర్వహించిన సమావేశాల ద్వారా సంస్థాగత పరిస్థితిపై అభిప్రాయాలు సేకరించినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయన పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం.రాజా వడింగ్ తదుపరి అడుగు?రాజీనామా అనంతరం రాజా వడింగ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో రాష్ట్ర కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. -
రాహుల్ గాంధీతో మాజీ ఐఏఎస్ రహస్య భేటీ?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ పేరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పదమూడేళ్ల సర్వీసు తర్వాత హఠాత్తుగా ఐఏఎస్‌కు రాజీనామా చేసిన ఆమె.. రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. జెన్‌జీ ఉద్యమ ప్రభావం కూడా రాజకీయ పార్టీలను కొత్త ముఖాల వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దివ్యా మిట్టల్‌ను తమవైపు తిప్పుకునేందుకు పలు పార్టీలు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. రాజకీయ ప్రవేశంపై దివ్యా మిట్టల్ మాత్రం ముందుగానే ఓ స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు తాజాగా ఆమె వ్యాఖ్యలతో తేలింది.తాజాగా బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ చేసిన సోషల్ మీడియా పోస్టు.. యూపీ రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్(43) రహస్యంగా కలిశారని అన్నారాయన. ‘‘చీకటి మాటున భేటీ’’ అంటూ చేసిన సంచలన ఆరోపణతో చేసిన ఈ పోస్టుతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో.. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఆమెను ప్రత్యక్షంగానే సమాజ్‌వాదీ పార్టీ ఆహ్వానించడం, అదే సమయంలో కాంగ్రెస్‌తో ఆ పార్టీకి జరుగుతున్న సీట్ల పంపకం పంచాయితీ, రాహుల్‌ను ఆమె కలిశారన్న ప్రచారం ఈ ఎపిసోడ్‌ను మలుపుల మీద మలుపులు తిప్పుతోంది. దివ్యకు అఖిలేశ్ ఆహ్వానందివ్యా మిట్టల్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల పంచాయితీకి కూడా ఈ వ్యవహారం ముడిపడింది. కాంగ్రెస్ 150 సీట్లలో పోటీ చేయాలని చెబుతుండగా.. ఎస్పీ 350 స్థానాల్లో సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇక దివ్యా మిట్టల్ విషయంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తున్న విషయంపై స్పందిస్తూ.. ‘‘హరా ఔర్ లాల్ గమ్ఛా డాల్ లేన్’’ అంటూ ఎస్పీ పార్టీ రంగులను సూచించేలా వ్యాఖ్యానించారు. ఆమె ఎస్పీలో చేరితే స్వాగతిస్తామన్న సంకేతంగా ఈ వ్యాఖ్యను తీసుకున్నారు. ఏం జరిగిందో చెప్పిన దివ్యా మిట్టల్..రాహుల్ గాంధీతో రహస్య భేటీ అంటూ వచ్చిన ప్రచారంపై దివ్యా మిట్టల్ సుమారు తొమ్మిది నిమిషాల వీడియో విడుదల చేసి స్పందించారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధృవీకరించిన ఆమె.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. యూపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమవుతుందని, అది ఏ పార్టీ జెండా కింద ఉండదని తెలిపారు. పార్టీతో కాదు.. ప్రజలతో కలిసి రాజకీయాలు అనేదే తన విధానమని చెప్పారు. ‘‘గత నెల ఐఏఎస్‌కు రాజీనామా చేశాను. ఎన్నో ప్రశ్నలను వదిలి వచ్చాను. తర్వాత ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం.. రాజకీయాలు’’ అని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.ప్రజల గొంతుకగా..ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నా.. వాటి అమలు జరగని సందర్భాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని దివ్యా మిట్టల్ చెప్పారు. మంజూరైన పాఠశాలలు నిర్మాణానికి నోచుకోకపోవడం, భూములు కేటాయించినా లబ్ధిదారులకు అందకపోవడం, అధ్వాన్న రహదారులు, పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడం వంటి అంశాలను ప్రస్తావించారు. మిర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు లహురియా దహ్ గ్రామంలో ఓ మహిళ.. ఇల్లు, పింఛన్ కాకుండా పిల్లల కోసం పాఠశాల కావాలని కోరిన ఘటనను గుర్తుచేశారు. నిధులు, నిబంధనలు, అనుమతులు ఉన్నప్పటికీ మూడేళ్లు గడిచినా నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. ‘‘అన్నీ ఉన్నాయి.. కానీ ఉద్దేశం లేదు’’ అంటూ వ్యవస్థలో నిర్ణయం, అమలు మధ్య ఉన్న అంతరాన్ని వివరించారు.कुछ दिन पहले IAS से त्यागपत्र दिया था और आपके मन में कई सवाल छोड़ दिए थे। अपनी बात इस वीडियो में कह दी है। अगर आपको लगे कि ये आपकी भी बात है, तो 9198956957 पर whatsapp मैसेज करिए। pic.twitter.com/mtS6gzBzRw— Divya Mittal (@divyamittal_IAS) September 29, 2026ఐఐటీ–ఐఐఎం చదువు.. లండన్‌లో ఉద్యోగందివ్యా మిట్టల్ 2013 బ్యాచ్ యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి. ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. సివిల్ సర్వీసెస్‌లోకి రాకముందు లండన్‌లో ఎక్సోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్‌గా పనిచేశారు. సంత్‌కబీర్‌నగర్, మిర్జాపూర్, డియోరియా జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిర్జాపూర్ కలెక్టర్‌గా మారుమూల లహురియా దహ్ గ్రామానికి పైపుల ద్వారా తాగునీరు అందించే కార్యక్రమంతో గుర్తింపు పొందారు. గోండా సీడీవో, యూపీ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ, బరేలీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. తర్వాత యూపీ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆగస్టులో ఐఏఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర చర్చనీయాంశంగా మారారు.ఇదీ చదవండి: లండన్ పరీక్ష నుంచి భారతీయుల పోరాటం దాకా.. -
ఇండి కూటమి భేటీలో దేశ వ్యాప్తంగా నిరసనలకు నిర్ణయం
ఢిల్లీలో మంగళవారం ఇండి కూటమి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై చర్చించేందుకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టే నోటీసు ముసాయిదాపై కూటమి చర్చించింది.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఇండి కూటమి నేతలం జిల్లా, కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతాం. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వరకు పాదయాత్ర నిర్వహిస్తాం. సంస్థలను ఏ విధంగా స్వాధీనం చేసుకుంటున్నారో రాష్ట్రపతికి తెలియజేయడానికి ప్రతిపక్ష నాయకులం అందరం అక్టోబర్ రెండవ వారంలో కలవడానికి అపాయింట్మెంట్ కోరుతాం. అక్టోబర్-నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన ర్యాలీలు నిర్వహిస్తాము. ర్యాలీల తేదీలు, వేదికలను త్వరలోనే ఖరారు చేస్తాము. నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తాం. ఓటు చోరీపై రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ చెప్పే మాటలను ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు’’ అని తెలిపారు.కాగా, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించిన అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఇండి కూటమి నేతలు కోరుతున్నారు. కూటమిలో 21 పార్టీలు పాల్గొన్నాయి. గతంలో 23 పార్టీలుగా ఉన్న ఇండి కూటమి నుంచి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమావేశానికి హాజరుకావడం కాలేదు. ఆయన స్థానంలో ఎంపీలు హరేంద్ర మాలిక్, మొహిబ్బుల్లా నద్వీ పాల్గొన్నారు. సమావేశానికి డీఎంకే దూరంగా ఉన్నప్పటికీ, జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్లో తొలగింపు తీర్మానం వస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ తెలిపారు.ఇదీ చదవండి: అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు -
అఖిలేశ్ డుమ్మా.. ఏ కోణంలో చూసినా అలకే!
కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ అంశాలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించేందుకు ఇండియా కూటమి కీలక నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. ఈ గైర్హాజరు ఇప్పుడు హస్తిన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అఖిలేశ్ కావాలనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అయ్యింది. కూటమిలో సీట్ల లెక్కలు తేలకముందే కాంగ్రెస్‌కు తన అసంతృప్తిని పరోక్షంగా తెలియజేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సీట్ల లెక్కపై పేచీ..ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ప్రకటించారు. మొత్తం 403 స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. మరోవైపు ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు సుమారు 85–90 స్థానాల వరకు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ, అమేథీ పరిధిలోని కొన్ని స్థానాల విషయంలోనూ ఇరు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అయితే ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌తో విభేదాలు లేవనే అంటోంది. అఖిలేశ్ గైర్హాజరుకు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియే కారణమని ఎస్పీ చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అఖిలేశ్‌తో మాట్లాడానని, నామినేషన్ ప్రక్రియ కారణంగానే ఆయన వ్యక్తిగతంగా సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. రియాక్షన్ మరీ ఇలాగనా?కానీ, అఖిలేశ్ స్థానంలో ఎస్పీకి చెందిన ప్రముఖ నేతలు ఇండియా కూటమి సమావేశానికి రాలేదు. మొహిబుల్లా నద్వీ, హరేంద్ర మాలిక్ లాంటివాళ్లను సమావేశానికి పంపడం కూడా చర్చకు దారితీసింది. దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిడికి అఖిలేశ్ తనదైన రీతిలో స్పందిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా అఖిలేశ్ కూటమి సమావేశానికి దూరంగా ఉండటంపై వ్యాఖ్యలు చేశారు. కూటమికి నాయకత్వం వహించాలంటే అఖిలేశ్ మరింత విశాల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎస్పీ వర్గాల్లో ఇప్పుడు అసంతృప్తికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు ఇండియా కూటమి సమావేశంలో ఎస్ఐఆర్, ఎన్నికల సంఘంపై ఉమ్మడి కార్యాచరణ, తదుపరి ఆందోళనలపై చర్చ జరిగింది. అఖిలేశ్ గైర్హాజరుతో పాటు డీఎంకే, ఆప్ వంటి పార్టీల దూరం నేపథ్యంలో కూటమి అంతర్గత సమన్వయంపై చర్చ మొదలైంది.ఇదీ చదవండి: సీఈసీపై ‘ఇండియా’ కూటమి సమరశంఖం! -
సీఈసీని తక్షణమే తొలగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశంలో పారదర్శకతకు తూట్లు పొడిచి, ఓటర్ల ప్రాథమిక హక్కును హరించేలా వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని, సీఈసీపై తీవ్రమైన ఒత్తిడి తెచి్చనందుకు, ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు సైతం రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన 13.30 కోట్ల ఓటర్ల పేర్లను మళ్లీ చేర్చాలని డిమాండ్ చేసింది. తమ అర్హతను తామే నిరూపించుకోవాల్సిన భారాన్ని పౌరులపై మోపుతూ, పారదర్శకమైన రక్షణలు లేకుండా హడావిడిగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సీడబ్ల్యూసీ తీవ్రంగా ఆక్షేపించింది. ఎన్నికల సంఘం పనితీరుతోపాటు ఎస్ఐఆర్ వివాదంపై చర్చించడానికి సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాందీ, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు, ముఖ్యమంత్రులతోపాటు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.త్రిముఖ వ్యూహంతో ముందుకు.. దేశంలో ఎన్నికల ప్రక్రియను ఓ క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారని సీడబ్ల్యూసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. బీజేపీ పాలనలో జరుగుతున్న ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని ప్రజల వద్దకు, అందుబాటులో ఉన్న ప్రతి వేదికకూ తీసుకెళ్లినట్లు గుర్తు చేసింది. బిహార్‌లో ఓటరు అధికార్ యాత్ర, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలను బహిర్గతం చేస్తూ రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాల గురించి ప్రస్తావించింది. ఎస్ఐఆర్లో అక్రమాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో విపక్ష ‘ఇండియా’కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమాలను సీడబ్ల్యూసీ ప్రశంసించింది. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటం సాగించేందుకు త్రిముఖ వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు ఖరారు చేశారు. రాజకీయ కార్యాచరణలో భాగంగా ఎస్ఐఆర్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం, ప్రజలతో సమావేశాలు, ఆందోళనలు, ఓటర్లకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవాలని, దీంతోపాటే పార్లమెంటరీ, న్యాయపరమైన వ్యూహాలను అనుసరించాలని నిర్ణయానికొచ్చారు. త్వరలో జరగబోయే ‘ఇండియా’కూటమి భేటీ తర్వాత దీనిపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించబోతున్నారు. ‘ఓట్–బందీ’తో ప్రజాస్వామ్యం అంతంకేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. సీడబ్ల్యూసీ భేటీలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. దశాబ్దం క్రితం నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ‘ఓట్–బందీ’కుట్రతో బలమైన ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, మోదీ ప్రభుత్వపు కనుసన్నల్లో అధికారులు ఇష్టానుసారంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. రెండు రకాలుగా మ్యాచ్–ఫిక్సింగ్దేశంలో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో ‘మ్యాచ్–ఫిక్సింగ్’జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా విరోధ్ (వ్యతిరేకత), ప్రతిరో«ద్(ప్రతిఘటన) మార్గం నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాల గురించి తాము ప్రస్తావించినప్పుడు చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ అంశంపై ఇప్పుడు మీడియాలోనూ, సంపాదకీయాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. మ్యాచ్–ఫిక్సింగ్ రెండు రకాలుగా సాగుతోందని, ఒకటి ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించినది కాగా, మరొకటి ఓటర్ల జాబితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం అని విమర్శించారు.సీడబ్ల్యూసీ ప్రధాన డిమాండ్లు ⇒ ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి. నైతిక, వ్యవస్థాగతమైన అధికారాన్ని, గౌరవాన్ని కోల్పోయినందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ⇒ ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత, విధివిధానాలు, సమగ్రత, రాజ్యాంగబద్ధతపై తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నందున ‘ఎస్ఐఆర్’ప్రకియను తక్షణమే నిలిపివేయాలి.⇒ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలి. తొలగింపునకు గురైన ఓటర్లకు పూర్తి సమాచారం ఇచ్చి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి. ⇒ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి పెద్ద మార్పునకు సంబంధించిన పూర్తి డేటాను బహిర్గతం చేయాలి ⇒ ఓటర్ల జాబితా డేటాను రాజకీయ పార్టీలకు సులభమైన ఫార్మాట్లో సకాలంలో అందించాలి. తీవ్రమైన వ్యత్యాసాలు, లోపాలు ఉన్నచోట స్వతంత్ర విచారణ జరపాలి. ⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన డేటాలో ఎలాంటి సమాచారం దాచిపెట్టకుండా పూర్తి పారదర్శకత పాటించాలి. -
కాంగ్రెస్ VS ఈసీ CEC జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలి
-
రాహుల్ హెచ్చరించినట్లే ఓట్ల చోరీ నిజమైంది!
సాక్షి, హైదరాబాద్: ‘ఓట్ల చోరీ’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర ఎన్నికల కమిషనర్లే స్వయంగా అంగీకరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీ నామా చేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ నిరసన చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిరసనలో భాగంగా జ్ఞానేష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి భట్టి విక్రమార్క చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హాజరయ్యారు. అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌లతో కలిసి ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కునే కాలరాస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందని , ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం భారత ప్రజలకు చెందిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమగ్రంగా, ప్రజల విశ్వాసానికి తగిన విధంగా కొనసాగేలా చూడటం కూడా దాని అత్యంత కీలక బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ వ్యవస్థ, ఎన్నికల సమగ్రత, భారత ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నమోదు చేసినట్లు నివేదించబడిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రజా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడడం ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రజల విశ్వాసానికి తగిన విధంగా కొనసాగేలా చూడడం దాని అత్యంత కీలక బాధ్యత అన్నారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రశ్నలు లేవనెత్తుతోందని, ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్, శంకరయ్య, సీనియర్ నాయకులు దానం నాగేందర్, కోదండరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్, టీపీసీసీ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్, టీపీసీసీ ‘సర్’స్టేట్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
అల్లకల్లోల సముద్రంలో ఈత కొట్టడం ఇష్టం: రాహుల్
న్యూఢిల్లీ: సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ఈత కొట్టడం తనకు చాలా ఇష్టమని, అల్లకల్లోలం కూడా ఒక రకమైన ప్రశాంతతను నేర్పుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో నర్మగర్భమైన పోస్టుచేశారు. కానీ, దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తోపాటు ఎన్నికల సంఘం పనితీరుపై రాజకీయ దుమారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘సర్’ పేరుతో ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. -
కీలకమైన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ని స్థానాల్లో పోటీ?
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య వచ్చే నెలలో చర్చలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ 403 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలను కోరాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తుది సీట్ల పంపకంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ మూడు విభాగాలుగా విభజించినట్లు సమాచారం. వీటిలో 150 స్థానాలను తొలి ప్రాధాన్య విభాగంలో చేర్చింది. పొత్తు చర్చల్లో ఈ స్థానాలను కోరనుంది. అయితే తుది ఒప్పందంలో తమకు దక్కే స్థానాల సంఖ్య 100 కంటే తక్కువగా ఉండకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పొత్తు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్టీ బలాబలాలు, అభ్యర్థుల అవకాశాలను గుర్తించే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది. రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టింది. దళితులు, బ్రాహ్మణులతో పాటు అత్యంత వెనుకబడిన వర్గాల్లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్గఢీకి ఈ ప్రయత్నాల్లో కీలక బాధ్యతలు అప్పగించింది.మరోవైపు అఖిలేశ్ యాదవ్ ఇటీవల రాయ్‌బరేలీ నుంచి ‘పీడీఏ రథయాత్ర’ ప్రారంభించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని అఖిలేశ్ స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ 37, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి 43 స్థానాలు సాధించాయి. 2019లో ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు ఒక స్థానం మాత్రమే దక్కింది. 2027 ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే సీట్ల సర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్ 150 స్థానాల డిమాండ్, తుది పొత్తు పరిమితులు కీలకంగా మారనున్నాయి. -
CEC పై విపక్షాల ఐక్య పోరు
-
ఆ ముగ్గురు దేశద్రోహులు
న్యూఢిల్లీ: ప్రజల ఓటు హక్కును కాలరాసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ముమ్మాటికీ దేశద్రోహులేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కుపై దాడి చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను మూలాల నుంచే ధ్వంసం చేసేవారు దేశద్రోహులే అవుతారని పేర్కొన్నారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్వెంటనే రాజీనామా చేయాలని, అప్రూవర్‌గా మారాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ జరుగుతోందన్న విషయాన్ని అంగీకరించడం ద్వారా ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీ మంచి పని చేశారని ప్రశంసించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికలు పూర్తిగా బూటకం అంటూ ధ్వజమెత్తారు. అంతకు ముందు జరిగిన ఎన్నికలు కూడా బూటకమేనని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగిందని అన్నారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మోదీ, అమిత్ షాలు విచారణ ఎదుర్కోక తప్పదని తేల్చిచెప్పారు. సీఈసీ చేసిన పని కచ్చితంగా దేశ వ్యతిరేక చర్య అని స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఓట్లను తొలగించడం రాజ్యాంగంపై, చట్టపరమైన వ్యవస్థపై జరిగిన దాడిగా అభివరి్ణంచారు. వారు కుట్రదారులు.. వీరు పావులు ‘కుట్రదారులు’అనే శీర్షికతో మోదీ, అమిత్ షా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా, జ్ఞానేష్ కుమార్ చిత్రాలను తెరపై రాహుల్ గాంధీ ప్రదర్శించారు. ‘పావులు’అనే శీర్షిక కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ చిత్రాలను ప్రదర్శించారు. అలాగే, కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించారు. మోదీ, అమిత్ షాల మాటల ధోరణిని గమనించాలని ప్రజలను కోరారు. బీజేపీ 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పడం, ‘అబ్ కీ బార్ 400 పార్’అనే నినాదాన్ని ప్రధానమంత్రి వినిపించడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వాతావరణంలో పనిచేసే ఏ రాజకీయ నాయకుడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేరని రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ నుంచి కానూన్ చోరీఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలు పార్లమెంట్లో చేసిన చట్టాల చట్టబద్ధతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ నుంచి కానూన్(చట్టం) చోరీ, ఆ తర్వాత సంస్థల చోరీ పుట్టుకొస్తాయని అన్నారు. ఈ రోజు ఓటు పోయిందంటే చట్టాలు చేసే వ్యవస్థ కూడా పోయినట్లేనని తెలిపారు. ‘‘కుట్రదారులు ఓట్లను దొంగిలించారు, ఆ ఓట్ల దొంగతనం ద్వారా చట్టాలను దొంగిలించారు, దేశంలోని వ్యవస్థలను దొంగిలించారు. అంతేకాదు, ఓట్ల దొంగతనం తర్వాత చేసిన చట్టాలు చట్టవిరుద్ధమైనవి’’అని స్పష్టంచేశారు. ఓట్ల చోరీ ద్వారా పార్లమెంట్‌కు ఎన్నికైన చట్టసభ సభ్యులు చేసిన ఏ చట్టమైనా, ఏ సంస్థాగత మార్పు అయినా చట్టవిరుద్ధమే అవుతుందన్నారు. ఓటు అనేది మన దేశానికి పునాది అని తెలిపారు. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. ఓటు వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. ఇది కేవలం ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతి భారతీయుడి భావ వ్యక్తీకరణపై జరిగిన దాడి అని స్పష్టంచేశారు. -
ఐఐటీ విద్యార్థి సాహిల్ కేసు.. రంగంలోకి దిగిన రాహుల్
ముంబై: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కుటుంబంతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. కుటుంబానికి తన మద్దతు ఉంటుందని, న్యాయం కోసం అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ గురువారం వెల్లడించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సాహిల్ వాకోడే కుటుంబ సభ్యులతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. న్యాయం కోసం అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై గురువారం మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ కూడా మీడియా సమావేశం నిర్వహించనుంది. కేసులో తదుపరి కార్యాచరణ, ఆందోళనలపై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.సాహిల్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు ఐఐటీ బాంబే యాజమాన్యం, కొంతమంది అధికారులపై ఆరోపణలు చేశారు. సాహిల్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించారని, చాట్‌జీపీటీ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని సంస్థ తెలిపింది. పరీక్ష నిర్వాహకుడు, విభాగాధిపతి ఈ అంశంపై సాహిల్‌తో మాట్లాడినట్లు ఐఐటీ బాంబే తెలిపింది. ఈ ఘటన వల్ల అతడి కెరీర్‌పై ప్రతికూల ప్రభావం ఉండదని అతడికి భరోసా ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. అనంతరం సాహిల్ హాస్టల్‌కు వెళ్లాడు. ఈ ఘటన తర్వాత విద్యార్థులు నిరసనలు చేపట్టారు. మంగళవారం క్రైమ్ బ్రాంచ్ సాహిల్ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కేసులో ఎఫ్ఐఆర్లో పేరున్న వారిపై దర్యాప్తు చేసి, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను వెంటనే అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.బుధవారం క్రైమ్ బ్రాంచ్ డిటెక్షన్-1 ఎదుట సాహిల్ తల్లిదండ్రులు రవీంద్ర వాకోడే, సోనాలి వాకోడే వాంగ్మూలం ఇవ్వడానికి హాజరుకాలేదు. వారిని విచారణ కోసం పిలిచినట్లు అధికారులు తెలిపారు. అయితే మంగళవారం ఇద్దరూ బాంద్రా క్రైమ్ బ్రాంచ్ యూనిట్లో సుమారు గంటన్నర పాటు ఉండి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.సాహిల్ ఘటనకు ముందు ఓ మహిళా స్నేహితురాలికి సందేశం పంపినట్లు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. ఆ వార్తల్లోని ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, సున్నితమైన కేసులో అధికారిక సమాచారాన్ని మాత్రమే ఉపయోగించాలని మీడియాను కోరారు. మరోవైపు, సాహిల్ మహిళా స్నేహితురాలు క్రైమ్ బ్రాంచ్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పరీక్ష సరిగా రాయకపోవడంతో తాను చేసిన తప్పు గురించి సాహిల్ చెప్పినట్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ధ్రువీకరణ లేదు.సాహిల్ గదిలో లభించిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పరీక్ష హాల్, హాస్టల్లోని వివిధ ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను ఫోరెన్సిక్ పరిశీలన కోసం కాలినా ఎఫ్ఎస్ఎల్కు పంపారు. వాటి నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. తుది పోస్టుమార్టం నివేదిక కూడా పోలీసులకు అందలేదు. ఇదిలా ఉండగా, వంచిత్ ఆఘాడీ కార్యకర్తలు బుధవారం ఐఐటీ బాంబే వెలుపల నిరసన చేపట్టారు. కొంతమంది మహిళా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు.ఇదీ చదవండి: నవరాత్రులకు వైష్ణోదేవికి ప్రత్యేక రైళ్లు -
జెన్‌జీలకు కొత్త గాలం! రాహుల్ గాంధీకు కౌంటర్‌గా..
దేశ రాజకీయాల్లో జెన్‌జీ చుట్టూ కొత్త ఫోకస్ కనిపిస్తోంది. విద్యార్థులు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ వేదికగా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. దీంతో యువతను చేరుకోవడంపై అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ కసరత్తు మొదలైంది.ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువతతో మరింతగా మమేకం కావాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేబినెట్ భేటీలతో పాటు తరచూ జరుగుతున్న పార్టీ సమావేశాల్లోనూ ఎంపీలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు.. ఇన్స్టాగ్రామ్, రీల్స్ వంటి డిజిటల్ వేదికల ద్వారా జెన్‌జీకి దగ్గర కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీకి మోదీ ‘తురుపుముక్క’గా భావిస్తున్న చిరాగ్ పాస్వాన్ నుంచి కౌంటర్‌కు రంగం సిద్ధమైంది.ఎన్డీయే మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తాజా జెన్‌జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్ యూత్ బోలె తో(Youth Bole To) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు కౌంటర్ అనే చర్చ జోరందుకుంది.తొలి కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే..పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్లో ‘Youth Bole To’ తొలి కార్యక్రమం జరగనుంది. ఇందులో చిరాగ్ పాస్వాన్ బిహార్ యువతతో, ముఖ్యంగా జెన్‌జీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్య, ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువతతో చర్చించనున్నారు.యువత తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను నేరుగా చిరాగ్ ముందుంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ బిహార్ అధ్యక్షుడు సురేంద్ర వివేక్ మాట్లాడుతూ.. యువతను ఓటుబ్యాంకుగా చూడటం లేదని, వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై చర్చించడమే తమ ఉద్దేశమని తెలిపారు.రాహుల్ ఫోకస్.. ఎన్డీయేలో కదలికఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ విద్యార్థులు, యువతతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాల్లో విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ.. యువత సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకొస్తున్నారు. ఒకానొక దశలో ఇవి విమర్శలకు దారి తీస్తున్నప్పటికీ.. యువతను ఆకర్షిస్తున్నాయనే చర్చా నడుస్తోంది. దీంతో జెన్‌జీని ఎవరు ఎలా చేరుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు రాహుల్ గాంధీ ప్రత్యక్ష కార్యక్రమాలతో యువతను కలుస్తుండగా.. ఇటు మోదీ ప్రభుత్వం డిజిటల్ వేదికలపై దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఎన్డీయే తరఫున చిరాగ్ పాశ్వాన్ ప్రత్యక్షంగా జెన్‌జీతో సంభాషించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.బిహార్ నుంచి యూపీకి..చిరాగ్ వ్యూహం బిహార్‌తోనే ఆగడం లేదు. సెప్టెంబర్ 24న పాట్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి ‘Youth Bole To’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూపీలోని ఇతర నగరాల్లోనూ యువతను కలిసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడే ఎన్నికల లెక్కలు కూడా తెరపైకి వస్తున్నాయి. బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో చిరాగ్ తన సొంత పార్టీకి యువతలో మరింత కనెక్ట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతను చేరుకునే కార్యక్రమాలు పార్టీ విస్తరణకు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలు జరగబోయే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కౌంటర్ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ, మిత్రపక్షాలకు ఢిల్లీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.యువతే టార్గెట్.. కొత్త వ్యూహంబిహార్లో మొదలై యూపీకి విస్తరించనున్న ఈ కార్యక్రమం ద్వారా చిరాగ్ లాంటి యువనేతతో.. యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, టెక్నాలజీ వంటి అంశాలపై జెన్‌జీతో చర్చించనున్నారు. మరోవైపు ఎన్డీయే కూడా యువతను చేరుకునే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తోంది.రాహుల్ గాంధీ జెన్‌జీతో మమేకమవుతూ యువత సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. అధికార పక్షం కూడా యువతను చేరుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాస్వాన్ ‘Youth Bole To’ కార్యక్రమంతో రంగంలోకి దిగుతున్నారు.మోదీ తురుపుముక్కగా చిరాగ్ పాస్వాన్‌ను రాజకీయ వర్గాల్లో కొందరు అభివర్ణిస్తున్న నేపథ్యంలో.. ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బిహార్ నుంచి యూపీ వరకు జెన్‌జీని ఆకట్టుకునేలా ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించడం.. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. -
రాహుల్ గాంధీ ఓ పిచ్చోడు: హిమంత
గువాహటి: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ పిచ్చోడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. రాహుల్ ఓసారి గడ్డంతో, మరోసారి నీట్‌గా షేవ్ చేసుకుని కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లోని నందిగ్రామ్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సీఎం స్పందించారు. 19 ఏళ్లనాటి నాన్ బెయిలబుల్ కేసుల్లో మిలన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ‘అసలు రాహుల్ గాం«దీని ఏమనాలో అర్థం కావడం లేదు. మిలన్ ప్రధాన్‌పై 2007 నుంచి మూడు హత్య కేసులున్నాయి. ఇలాంటివి బయటపడిన తర్వాత కూడా పోలీసులు అరెస్ట్ చేయొద్దా? రాహుల్‌ను చూస్తే నాకు నవ్వొస్తుంది. అతడో పిచ్చోడు. ఒకసారి గడ్డంతో, మరోసారి నీట్‌గా షేక్ చేసుకుని కనిపిస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ, ఇంకొన్ని సార్లు విదేశాల్లో పర్యటనలు చేస్తుంటారు. ఆయన పిచ్చోడు తప్ప మరేమీ కాదు’అంటూ ఎద్దేవా చేశారు. -
అంధ భక్తులకు అది సాధ్యం కాదు
ఇండోర్: దేశం మొత్తాన్ని ఒక ‘వ్యవస్థ’తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యార్థులు ప్రశ్నలు అడగడం దానికి ఇష్టం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ చుట్టూ ఉండే వ్యక్తులు ప్రజా జీవనంలో అనేక అంశాలను నిర్దేశిస్తున్నారని విమర్శించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమాచార మారి్పడిని నియంత్రించడంతోపాటు గూఢచర్యానికి పాల్పడ్డారని ఆక్షేపించారు. విద్యార్థులు తమ చుట్టూ ఏం జరుగుతోందో ప్రశి్నస్తూ ఆ వ్యవస్థకు సవాలుగా నిలిచారని చెప్పారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఛాత్రోం కీ గూంజ్’లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దేశం నుంచి ద్వేషాన్ని తొలగించగలిగేది విద్యార్థులు మాత్రమేనని చెప్పారు. అంధ భక్తులకు అది సాధ్యం కాదని పరోక్షంగా బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని తేల్చిచెప్పారు. విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని అంధ భక్తులు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు జిజ్ఞాస, ప్రేమ, వినయం, సహనం, నిజాయితీ వంటి సద్గుణాలను కలిగి ఉంటారని, అంధభక్తుడికి ఈ సద్గుణాలన్నీ లోపిస్తాయని, అతను ద్వేషాన్ని వ్యాపింపజేస్తాడని వ్యాఖ్యానించారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ సంభాషించారు. విద్య, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. -
నందిగ్రామ్‌లో ఇంకో ట్విస్ట్.. ముదిరిన పొలిటికల్ వార్
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తొలుత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి సాంచిత తన నామినేషన్ ఉపసంహరించుకోవడం.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మమతా బెనర్జీ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అయితే ఆపై కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్ అరెస్ట్ కావడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ వర్గం తరఫున బరిలో ఉన్న సాంచితా ప్రధాన్ డే శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీఎం సువేందు అధికారితో భేటీ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అనూహ్య పరిణాంపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన వర్గం ఇక నందిగ్రామ్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టబోదని ప్రకటించి.. కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన మిలన్ ప్రధాన్‌కు మద్దతు తెలిపారు. ఇండియా కూటమిని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ సైతం ఖుషీ అయ్యింది.అయితే మమతా మద్దతు ప్రకటించిన కొద్ది గంటల్లోనే మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2007 నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన పాత హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆయనపై ఇప్పటికే పలు కేసులు, అరెస్టు వారెంట్ ఉన్నాయని చెబుతున్నారు.నందిగ్రామ్ సోనాచూరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మిలన్ ప్రధాన్. 2007 భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీతో కలిసి చురుకుగా పనిచేశారు. అప్పటి నుంచి నందిగ్రామ్ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు. ఉద్యమానికి సంబంధించిన పలు కేసుల్లో ఆయన పేరు నమోదైంది. తాజాగా ఆయనకు కాంగ్రెస్ నందిగ్రామ్ టికెట్ ఇచ్చింది. సరిగ్గా ఇదేసమయంలో.. పెండింగ్ వారెంట్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.మిలన్ ప్రధాన్‌ను శుక్రవారం రాత్రి పుర్బా మేదినీపూర్‌లోని ఓ హోటల్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత 2007 కేసులో పెండింగ్ వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 19) హల్దియా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఈ అరెస్ట్‌ను రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నా చేపట్టాలని కేడర్‌కు పిలుపు ఇచ్చింది. అలాగే ‘నందిగ్రామ్ చలో’ కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది.‘ఇది యాదృచ్ఛికం కాదు’..మిలన్ ప్రధాన్ అరెస్టుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. దీనిని ‘ఓటు చోరీ’, ‘ఎన్నికల చోరీ’గా అభివర్ణించారు. బీజేపీ ఉపఎన్నికలోనూ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి ‘మదర్ ఆఫ్ డెమొక్రసీ’ అని చెప్పుకుంటుంటే.. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ.. మిలన్ ప్రధాన్ అరెస్టు యాదృచ్ఛికం కాదని, ఇది రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లు, ప్రభుత్వాలు, పార్టీలు దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ భయపడబోదని, పోరాడుతుందని పేర్కొన్నారు.‘ఎందుకీ సమయంలోనే?’.. మమతా ప్రశ్నమమతా బెనర్జీ సైతం అరెస్టు సమయాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే మిలన్ ప్రధాన్‌ను అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. పాత కేసును ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. బీజేపీ ‘రాజకీయ కక్ష సాధింపు’తో వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని మమతా ఆరోపించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఏమంటోంది?మిలన్ ప్రధాన్ అరెస్టు రాజకీయ కక్షతో జరిగిందన్న ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, అరెస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. పాత కేసులో చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే చర్య జరిగిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ టికెట్‌ను హసిరాణి రథ్‌కు ఇచ్చింది. తన దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేసి.. దారుణ హత్యకు గురైన చంద్రనాథ్ తల్లి ఆవిడ. అందుకే సువేందు ఆమెకు టికెట్ ఇప్పించారు. దీంతో నందిగ్రామ్‌లో పోటీ ప్రధాన పార్టీల మధ్య మరింత ఉత్కంఠగా మారింది.రితబ్రత బెనర్జీ ఎదురుదాడిమరోవైపు టీఎంసీ రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ మాత్రం మమతా వర్గం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గత ఏడు రోజులుగా నందిగ్రామ్‌ను కాంగ్రెస్‌కు వదిలేసి.. రిజీనగర్లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అందుకు అంగీకరించకపోవడంతో మమతా అసంతృప్తికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమ వర్గం అభ్యర్థి అకస్మాత్తుగా నామినేషన్ ఉపసంహరించుకోవడం కూడా ఒక ‘ఫిక్స్’లో భాగమేనని ఆయన ఆరోపించారు. మమతా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడాన్ని రితబ్రత బెనర్జీ ‘అసంతృప్తితో తీసుకున్న నిర్ణయం’గా అభివర్ణించారు.అసలు వివాదం ఇక్కడే..బెంగాల్ రాజకీయ చదరంగంలో విపక్షాలకు ఒకే ఒక్కరోజులో భారీ షాకిచ్చింది. పార్టీ చీలిక కారణంగా.. అక్టోబర్ 6న జరగాల్సిన నందిగ్రామ్, రిజీనగర్ ఉప ఎన్నికలకు ఈసీ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పార్టీ పేరు, గుర్తు దూరం అయ్యాయి. ఆ వెంటనే నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ, మమతా కాంగ్రెస్‌కు మద్దతు.. ఆ వెంటనే ఆ అభ్యర్థి అరెస్టు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదీ చదవండి: బలవంతంగా ఆయన్ని రిటైర్ చేశారా? -
టీవీకేకు తలపోటు.. తమిళనాట మరో ట్విస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-కాంగ్రెస్ పొత్తు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై మొదలైన చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నేతల మధ్యే మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పొత్తు భాగస్వాములు అంగీకరించాల్సిందేనని మాజీ టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై స్పష్టం చేయగా.. అసలు రాహుల్‌కు వ్యతిరేకంగా టీవీకే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తులో అంతా సవ్యంగానే ఉందా? లేక ప్రధాని అభ్యర్థి అంశం అసలు పంచాయితీగా మారిందా? అన్న చర్చ మొదలైంది.తమిళనాడులో టీవీకే-కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2029 లోక్‌సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాలని సెల్వపెరుంతగై వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అయితే.. పొత్తు భాగస్వాములు దాన్ని అంగీకరించాలని, అలా లేనప్పుడు అలాంటి పొత్తు అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ నేతను ప్రధాని అభ్యర్థిగా బహిరంగంగా, స్పష్టంగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం సముచితమని పేర్కొన్నారు.‘పొత్తులో ఎలాంటి సమస్య లేదు’సెల్వపెరుంతగై వ్యాఖ్యలపై ప్రవీణ్ చక్రవర్తి స్పందిస్తూ.. పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. టీవీకే అధికారికంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో అన్ని భాగస్వామ్య పార్టీలు కలిసి చర్చించాయని, ముఖ్యమంత్రి విజయ్ కూడా సమావేశంలో ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారని, పొత్తు బలంగానే ఉందని పేర్కొన్నారు.‘నవ్వుతూ మాట్లాడితే ఒప్పందమా?’ప్రవీణ్ వ్యాఖ్యలకు సెల్వపెరుంతగై సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. నాయకులు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని ప్రధాని అభ్యర్థిత్వంపై అంగీకారంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ లేదా టీవీకేలోని కీలక నేతల్లో ఎవరైనా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టంగా చెప్పారా? అని నిలదీశారు. అలా చెప్పి హామీ ఇచ్చి ఉంటే తనకు తెలియజేయాలని కోరారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీవీకేకు చెందిన కొందరు నేతలు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులోని రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. ప్రస్తుతం టీవీకే-కాంగ్రెస్ పొత్తులో అసలు పరీక్ష సీట్ల సర్దుబాటు కాదు.. ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం అనే చర్చ మొదలైంది.అసలు చిక్కు టీవీకేకే..ఈ వ్యవహారంలో టీవీకే ముందున్నది కీలకమైన ప్రశ్న. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్న సొంత నేతల వ్యాఖ్యలకు బ్రేక్ వేయాలా? లేక రాహుల్ గాంధీ పేరుపై కాంగ్రెస్ కోరుతున్న స్పష్టత ఇవ్వాలా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. విజయ్ పేరుపై పట్టుబడితే కాంగ్రెస్‌తో పొత్తులో విభేదాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపితే విజయ్ను ప్రధాని ముఖంగా ముందుకు తెస్తున్న నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తు.. మరోవైపు ప్రధాని పీఠంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య టీవీకే ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. విజయ్ మౌనం వీడి స్పష్టత ఇస్తారా? లేక ఈ పంచాయితీని కూటమి నేతలకే వదిలేస్తారా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: సీఎం రెండో పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. -
యూపీఐ ‘ట్యాక్స్’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్‌కు కౌంటర్!
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్‌పై ప్రశ్నలు సంధించింది.బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్) ఎండీఆర్/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కే. గోపీనాథ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్‌లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఆ కమిటీ ఏం చెప్పిందంటే..యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్ రెవెన్యూ మోడల్ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్వర్క్ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.అసలు కొత్త ఛార్జీ ఎంత?కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్‌కు బదులుగా ఫ్లాట్ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.రాహుల్ గాంధీ ఏమంటున్నారు?ఈ కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.ఇక రాజకీయంగా కొత్త చర్చ..ఇలా రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్ రెవెన్యూ మోడల్ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్‌లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్‌కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?! -
యూపీఐ పేమెంట్లపై చార్జీలు వద్దు.. విపక్ష నేతలు
న్యూఢిల్లీ: వ్యాపారులకు రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం ప్రజలపై ప్రభావం చూపుతుందని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని రాష్ట్రీయ సమాజ్ పక్ష ఎంపీ ఎన్.కె.ప్రేమచంద్రన్ పేర్కొన్నారు.పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో కొందరు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ఆ సంఘం చైర్మన్ భర్తృహరి మహతాబ్ తెలిపారు. వచ్చే సమావేశంలో దీనిని చర్చకు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు.స్థాయీ సంఘం సభ్యుడు ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. వ్యాపారులకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయం దేశ ప్రజలందరినీ ప్రభావితం చేస్తుందని అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాలుగా పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం (సెప్టెంబర్ 15) మార్పు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే రూ.2,000కు మించిన బదిలీలపై 0.4 శాతం ఫీజు విధించనున్నట్లు వెల్లడించింది. అయితే సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలు, చిన్న మొత్తాల చెల్లింపులకు ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేసింది.ఎవరు ఏమన్నారు?యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే రూ.2,000కు మించిన చెల్లింపులపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు చేయాలన్న నిర్ణయంపై రాజకీయంగా భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా విపక్ష నేతలు ఈ నిర్ణయాన్ని విమర్శించగా, ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.రాహుల్ గాంధీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. వ్యాపారులపై విధించే ఫీజు చివరికి వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని ఆరోపించారు. దుకాణదారులు ఈ వ్యయాన్ని వస్తువుల ధరల్లో కలిపితే సాధారణ ప్రజలే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతోందని కూడా ఆయన ఆరోపించారు.మల్లికార్జున ఖర్గే: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర నిర్ణయాన్ని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే సామాన్యులపై ఒత్తిడి పెంచుతున్న సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన ఆరోపించారు.పవన్ ఖేరా: కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి, రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా.. కొత్త 0.4 శాతం ఎండీఆర్‌ను “మోదీ ట్యాక్స్”గా పిలవాలని అన్నారు. యూపీఐని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తర్వాత దాని వినియోగంపై పన్ను విధిస్తున్నారని ఆయన విమర్శించారు.హారిస్ బీరన్: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాజ్యసభ సభ్యుడు హారిస్ బీరన్.. ప్రభుత్వం సాధారణ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఎండీఆర్ భారం వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయవచ్చని, దీంతో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వ వివరణ: ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఎండీఆర్ వినియోగదారులపై విధించే ఛార్జీ కాదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని, రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు కూడా ఎండీఆర్ ఉండదని తెలిపింది. చిన్న వ్యాపారులకు సంబంధించిన జీరో-ఎండీఆర్ నిబంధనలు కొనసాగుతాయని, మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కాకుండా ఉంటాయని పేర్కొంది.బీజేపీ వాదన: ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ ఎండీఆర్ పన్ను కాదు. దీనివల్ల వచ్చే ఆదాయం బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంచబడుతుంది. యూపీఐ మౌలిక వసతులు, భద్రత, విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడమే కొత్త విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారులు ఎండీఆర్ భారాన్ని ఎలా నిర్వహిస్తారు, వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉంటుందా, డిజిటల్ చెల్లింపుల వినియోగంలో ఏమైనా మార్పు వస్తుందా అనేది తదుపరి పరిశీలించాల్సిన అంశాలుగా మారాయి. -
బీజేపీకి కొత్త చిక్కులు.. యూపీ‘ఐ’ ఫైట్ తప్పదా?
జేబుల్లో, పర్సుల్లో క్యాష్ పెట్టడం జనాలకు అరుదుగా మారిపోయింది. చిల్లర నుంచి పెద్ద పెద్ద పేమెంట్ల దాకా ఫోన్‌తోనే జరిగిపోతోంది. అలాంటిది యూపీఐ (UPI)తో చెల్లింపుల విషయంలో కొత్త రూల్స్ జనాలను బెంబేలెత్తిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, ఆపై డిజిటల్ చెల్లింపులంటూ క్యాష్‌లెస్ విధానం అలవాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు ఛార్జీల ద్వారా పరోక్షంగా సామాన్యుడిపై భారం వేసే ప్రయత్నమూ చేస్తోంది. అయితే రానున్న రోజుల్లో ఇదే బీజేపీ పాలిట గుదిబండగా మారుతుందా?..2016 నవంబర్ 8.. రూ.500, రూ.1,000 నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పునకు దారితీసింది. నగదు లావాదేవీలపై ఆధారపడిన ప్రజలకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాల అవసరం ఏర్పడింది. అదే సమయంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ప్రారంభించింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయని.. ఇకపై నగదు ఆధారిత వ్యవస్థను తగ్గించి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ వైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడితోనే ఆగకుండా.. డిజిటల్ పేమెంట్లు చేసే వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు ‘లక్కీ గ్రాహక్ యోజన’, ‘డిజి-ధన్ వ్యాపార్ యోజన’ వంటి ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అలా క్రమంగా డిజిటల్ చెల్లింపులు వ్యవస్థ.. అర్బన్ నుంచి రూరల్ ప్రాంతాలకు విస్తరించగలిగింది.ఇప్పుడు అదే UPIపై ఛార్జీల చర్చ!ఇప్పుడు UPI లావాదేవీలపై MDR చర్చకు దారితీస్తోంది. తాజా నిబంధనల ప్రకారం.. ఒకరి నుంచి ఒకరు యూపీఐ(ఫోన్‌పే, గూగుల్‌పే ఇలా.. ) చేసుకునే చెల్లింపులు పూర్తిగా ఉచితం. కానీ, రూ.2,000 దాటి ఏదైనా బయట షాపింగ్, కొనుగోలు చేస్తే మాత్రం MDR పడుతుంది. అలాగే.. చిన్న వ్యాపారులకు కూడా జీరో-MDR రక్షణ కొనసాగుతుందని కేంద్రం చెబుతోంది. దాదాపు 96 శాతం మర్చంట్ UPI లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం వెల్లడించింది. కానీ, ఆర్థిక నిపుణులు మాత్రం మరోలా చెబుతున్నారు. ఇది సామాన్యుడిపై భారం పడే స్థితికి కచ్చితంగా తెస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ‘UPIపై ఛార్జీలు’ అనే అంశం రాజకీయ చర్చలోకి వచ్చింది.రాహుల్ గాంధీ ఎంట్రీ.. రాజకీయ వేడి.. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు. 2,000కు మించిన లావాదేవీలు మొత్తం UPI లావాదేవీల్లో సంఖ్య పరంగా సుమారు 5 శాతమే అయినప్పటికీ.. వాటి విలువ మొత్తం UPI లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మర్చంట్‌పై MDR విధించినా.. వ్యాపారులు ఆ ఖర్చును చివరకు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుడిపై మోపే అవకాశం ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. భారత్‌లోని జీరో-MDR విధానాన్ని అమెరికా చెల్లింపుల సంస్థలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయని, తాజా మార్పు అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమంటూ రాహుల్ ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికా ట్రేడ్ డీల్ చర్చలతోనూ ముడిపెట్టారు. అయితే, కేంద్రం వాదన మరోలా ఉంది. UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధం, టెక్నాలజీ, మౌలిక వసతులపై నిరంతరం పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ఆ వ్యవస్థ దీర్ఘకాలికంగా కొనసాగేందుకు పరిమిత MDR అవసరమని వివరిస్తోంది.యూపీ ఎన్నికల్లో ఎందుకు కీలకం?యూపీఐ అంటే కేవలం యాప్‌లో డబ్బు పంపడం కాదు. కూరగాయల బండి, టీ దుకాణం, మెడికల్ షాప్, చిన్న హోటల్, ఆటో.. ఇలా రోజువారీ లావాదేవీల్లోకి అది వెళ్లిపోయింది. అందుకే ఛార్జీల అంశం కేవలం బ్యాంకింగో లేదంటే ఫిన్‌టెక్ పాలసీగా కాకుండా చిన్న వ్యాపారి, వినియోగదారుడి జేబుకు సంబంధించిన అంశంగా రాజకీయ పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను కాంగ్రెస్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించారు.. ఇప్పుడు పెద్ద మొత్తంలోని మర్చంట్ లావాదేవీలకు MDR ఎందుకు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలనుకుంటోంది. వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలోని పలు సమస్యలతో పాటు యూపీఐని కూడా ఎన్నికల ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.క్యూఆర్ కోడ్ టూ రాజకీయ కోడ్.. ఇప్పటికే రైతులు, యువత, ఉద్యోగాలు, ధరలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల చుట్టూ సాగుతున్న యూపీ రాజకీయంలో.. UP‘I’ ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తుందా? రోజూ ఫోన్లో కనిపించే QR కోడ్.. ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ కోడ్‌గా మారుతుందా? లేక ఇది కేవలం కేంద్ర విధానంపై కాంగ్రెస్ చేస్తున్న మరో విమర్శగానే మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మోదీని కలిసిన వారం రోజుల్లోనే.. -
రూ. 2 వేలు దాటితే వడ్డింపు, కస్టమర్లపైనే భారం : రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం యూపీఐ (UPI) విధానాలపై తీసుకున్న తాజా నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అమెరికన్ ఒత్తిడికి తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రాహుల్ ఆరోపించారు. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనమర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జ్ ఉండవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి జారీ చేసిన జారీ చేసిన సరికొత్త గెజిట్ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.రాహుల్ గాంధీ మండిపాటుయూపీఐపై ఛార్జీలు విధించేందుకు మోదీ ప్రభుత్వం రహస్యంగా గేట్లు తెరిచిందని మండిపడ్డారు. ఇప్పుడు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate - MDR) విధింపుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇవి కేవలం 5శాతం వాల్యూమ్ మాత్రమే అయినప్పటికీ, మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65శాతంగా ఉంటాయని రాహుల్ ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అంతిమంది కస్టమర్లపై భారం పడుతుందని ఆయన విమర్శించారు.కస్టమర్లకు ఎలాంటి ఫీజులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దుకాణదారులపై విధించే ఫీజులు చివరకు ఎక్కడి నుంచి వస్తాయి? నేరుగా సామాన్యుడి జేబు నుంచే వస్తువుల ధరల రూపంలో వసూలు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా జీరో-ఎండీఆర్ (Zero-MDR) విధానాన్ని అమెరికా పేమెంట్ కంపెనీలు ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదే దిశగా విధానాన్ని మార్చేందుకు మార్గం సుగమం చేసిందని రాహుల్ ఆరోపించారు.కాగా రూ. 2,000 వరకు చేసే యూపీఐ లావాదేవీలు లేదా రుపే డెబిట్ కార్డ్ (RuPay) చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు విధించ కూడదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. అయితే, రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీలపై వర్తకులకు ఛార్జీలు వర్తిస్తాయా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదం పొందిన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ ప్రకారం ఈ మార్పులు వచ్చాయి.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుమల్లికార్జున ఖర్గే స్పందనఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి, వారి జేబులు గుల్ల చేసేందుకు ప్రభుత్వం రోజూ కొత్త మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. "యూపీఐపై ఎలాంటి ఫీజులు లేవు" అన్న నిబంధనను "రూ. 2,000 వరకు మాత్రమే" అని మార్చేశారని ఎద్దేవా చేశారు. విపరీతమైన ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం దాదాపు 10% వద్ద ఉన్న తరుణంలో, బీజేపీ ప్రభుత్వం ప్రజలపై 'డిజిటల్ పేమెంట్స్ ట్యాక్స్' భారం మోపేందుకు ప్లాన్ చేసిందని ఖర్గే ఆరోపించారు.ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలుప్రభుత్వం వాదన ఇలా ఉందిలావాదేవీల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ, మోసాల నిరోధక చర్యలు, మౌలిక వసతుల నిరంతర అభివృద్ధి కోసం సిస్టమ్‌కు నిధులు అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంది. మార్కెట్ విస్తరణ, స్వయం సమృద్ధి, మెరుగైన పోటీతత్వం కోసం ఒక సమతుల్య విధానం అవసరమని, కేవలం సబ్సిడీలపై ఆధారపడటం సాధ్యం కాదని పేర్కొంది.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్లోనే, యూనిఫామ్ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. Lynching doesn’t always start as an act of killingSometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officialsThe way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…— KTR (@KTRBRS) September 14, 2026 -
శాకాహారం మంట!
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాధినేతలతోపాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో దౌత్యాధికారులకు ప్రధాని మోదీ శనివారం ఇచ్చిన విందులో కేవలం శాకాహార భోజనం వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. అత్యధికశాతం భారతీయులు మాంసాహారులని తెల్సి కూడా మోదీ సర్కార్ కేవలం శాకాహారం వడ్డించడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గణాంకాలను మీకు గుర్తుచేస్తున్నా. 80 శాతం మంది భారతీయులు మాంసాహారులే. మరీ ముఖ్యంగా భారతీయ మాంసాహార వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. నా చెల్లి చేసిన శాకాహార చిరుతిండి ఛోలే భటూరేలా మాంసాహారం ఎంతో పసందుగా ఉంటుంది. అలాంటప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సంబంధిత విందులో మాంసాహారాన్ని విస్మరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’అని రాహుల్ మోదీ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. పోస్ట్‌తోపాటు తన సోదరి చేసిన చిరుతిండి ఫొటోను పోస్ట్‌చేశారు. నచ్చిన ఆహారం వడ్డించరా?: కాంగ్రెస్ భారత్‌తోపాటు విదేశాల్లోనూ మాంసాహార ప్రియులే అత్యధికమని, అలాంటి బ్రిక్స్ దేశాల నుంచి వచ్చిన విదేశీ అతిథులకు శాకాహారం బలవంతంగా వడ్డించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టింది. ‘‘బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత దృష్ట్యా ప్రపంచదేశాల అతిథులు ఈ కార్యక్రమానికి వచ్చి విందు ఆరగించారు. వీళ్లు ఏ ఆహారం తినాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పటికే భారతీయులు ఏం తినాలో బీజేపీ ఆదేశిస్తోంది. ఇక విదేశీయులకు శాకాహారాన్ని బలవంతంగా తినిపించడం ఎంతవరకు సబబు?’’అని కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ పవన్ ఖేడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చవులూరించే ఎంతో మాంసాహార వంటకాలకు భారత్ పెట్టిందిపేరు. వాటిని విదేశీ అతిథులు రుచి చూడకుండా చేసి భారతీయ ఆహార సంప్రదాయాలను దాచాలని చూస్తారా?’’అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విందు మెనూను పోస్ట్చేసింది. సక్సెస్‌ను కాంగ్రెస్ సహించట్లేదు: బీజేపీ సదస్సు విజయవంతంకావడంతో కాంగ్రెస్ సహించట్లేదని, అందుకే అర్థంపర్థంలేకుండా ఆహారం గురించి విమర్శలుచేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ‘‘సదస్సు గురించి వంకలుపెట్టడానికి ఏమీ లేదు. డిక్లరేషన్‌లో ఏకాభిప్రాయం సాధించి మోదీ సర్కార్ తన దక్షతను చాటింది. సదస్సు ఇలా విజయవంతంకావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే విమర్శించడానికి మరే విషయాలు లేక చివరకు ఆహారం గురించి విమర్శలు చేస్తోంది’’అని భండారీ అన్నారు. ‘‘డిక్లరేషన్‌తో విజయం సాధించిన మోదీని రాహుల్ అభినందించాల్సిందిపోయి ఈ శాకాహారం, మాంసాహారం గోల ఏంటి?’’అని మరో బీజేపీ జాతీయ ప్రతినిధి తుహిన్ సిన్హా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోస్ట్ చేసిన మెనూ (అన్నీ శాకాహారాలే) స్టార్టర్స్.. 1. ఖండ్వీ మిలే–ఫియులే(శనగపిండితో ఆవిరిపై ఉడికించి పలుచగా చేసిన రోల్స్) 2. మష్రూమ్ కబాబ్‌లు, షీర్మాల్ రొట్టెతో కలిపి ఖుంబ్ గలౌతీ మెయిన్ కోర్స్ 1. పనీర్ లబాబ్దార్ 2. హిమాలయాల్లో లభించే అరుదైన మోరెల్ మష్రూమ్‌లు, ఆస్పరాగస్, కుంకుమపువ్వు, ఎండుద్రాక్ష, బాదంతో చేసిన గుచ్చీ మారి్మక్ 3. క్యారెట్, గ్రీన్ బీన్స్ కూర 4. కందిపప్పు, టమాటాలతో చేసినకర్ణాటక తక్కలి బెల్లే చారు 5. చిరు ధాన్యాల పులావ్6. బీట్రూట్ రైతా 7. వివిధ రకాల భారతీయ బ్రెడ్లు తీపి పదార్థాలు1. పాత ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ 2. జిలేబీ 3. పాలు, బియ్యం, మల్బెర్రీ పండ్లు కలిపిన షాహ్తూత్ పాయసం -
రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌కు వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం ఆదివారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీనిలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి అల్పాహారం స్వీకరిస్తూ, పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. అన్వర్ ఇబ్రహిం రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఇరువురు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం అల్పాహార టేబుల్ వద్దకు వెళ్లారు. అక్కడ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉండటంతో ముగ్గురూ కలిసి అల్పాహారం చేస్తూ మాట్లాడుకున్నారు. అయితే చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. Prime Minister of Malaysia Anwar Ibrahim met Lok Sabha Leader of the Opposition Rahul Gandhi and Congress MP Priyanka Gandhi Vadra for a breakfast meeting. (Source: AICC) https://t.co/tW5MCZfTKv— ANI (@ANI) September 13, 2026బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రక్షణ, వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఫిబ్రవరి 2026లో మోదీ మలేసియా పర్యటన సందర్భంగా వచ్చిన ఫలితాలపైనా చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతిని నేతలు సమీక్షించారు. -
రహదారులు ఇలాగేనా ఉండేది?
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. అమేథీ ఎంపీ కిషోరీ లాల్ శర్మతో కలిసి కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోజ్ కుమార్ పాండే, ఉద్యానవన శాఖ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారుల దుస్థితిని రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంతలమయమైన రోడ్ల ఫోటోలను ప్రదర్శించారు. వాటి నిర్మాణానికి బాధ్యత వహించిన ఏజెన్సీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ రోడ్డుకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుందో తెలిపే రికార్డులను నిర్వహించాలని పేర్కొన్నారు. దెబ్బన్న రోడ్లను మరమ్మతు చేస్తామని చేపడతామని పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హామీ ఇచి్చనట్లు దిశా కమిటీ నామినేటెడ్ సభ్యుడు ఉమేష్ బహదూర్ సింగ్ చెప్పారు. జిల్లాలోని రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమరి్పంచిన తర్వాతే ఈ సమస్యను రాహుల్ గాంధీ లేవనెత్తారని వెల్లడించారు. దిశా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. రాహుల్‌పై మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం కంటే వాటిలో లోపాలను వెతకడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తప్పుపట్టారు. -
అభివృద్ధిని చూడలేని నారాజ్ మామ
వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్ కీ గూంజ్(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. మోదీ మంగళవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. తప్పులు వెతకడమే వారి పని ‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్ కారిడార్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్–స్టాక్ కంటైనర్ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. ఇప్పుడు నారాజ్ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్–స్టాక్ కంటైనర్ రైళ్లు వస్తే ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్‌పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్‌ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నమో కమలం’ ప్రారంభం దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు. -
కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా 120 మంది కొత్త జాతీయ కార్యదర్శుల ఎంపికకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్వయంగా నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారి చురుకుదనం, పనితీరు నివేదిక ఆధారంగా అర్హతలను పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయి పదవుల నియామకాలకు రాజకీయ సీనియారిటీకి బదులుగా పనితీరు, చురుకుదనాన్ని ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తున్నారు.జాతీయ కార్యదర్శి పదవుల కోసం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసి నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన నేతలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం 30 మంది నేతలను ఇంటర్వ్యూ చేశారు. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ రెండు రోజుల పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగనుంది. ఒక్కోసారి 10 మంది చొప్పున నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. గతంలో వారు చేసిన పనులు, ప్రొఫైల్ తదితర అంశాలపై రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న నేతల పనితీరు నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నాయి.వివిధ రాష్ట్రాల్లో జాతీయ కార్యదర్శుల నియామకానికి కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత కార్యదర్శుల్లో 60 శాతానికిపైగా మార్పులు చేసి కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. కేవలం సిఫార్సులు, సిఫార్సు లేఖల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలు, పని సామర్థ్యం, దూరదృష్టి ఆధారంగా యువతకు అవకాశం కల్పించాలన్నది రాహుల్‌గాంధీ ఉద్దేశం. జాతీయ కార్యదర్శి పదవికి 120 మంది నేతలను ఇంటర్వ్యూ చేయనున్నారు. అనంతరం వారి నియామకం చేపట్టనున్నారు. కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసిన నేతలకు ఈ పదవుల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పునరుద్ధరణ, తరాల మార్పు రాహుల్‌గాంధీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. యువతను ముందుకు తీసుకురావడంతోపాటు సంస్థాగత వ్యవస్థలో మార్పులకు ఆయన గతంలోనూ ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలోనూ ఇంటర్వ్యూ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరించారు. గతంలో సీనియర్ నేతల వ్యతిరేకత, అంతర్గత విభేదాల కారణంగా ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న మార్పులతో పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువ నేతలకు అవకాశాలు కల్పిస్తున్నారు. దీని కొనసాగింపుగానే జాతీయ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించి సమ్మిళిత బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీ గ్రహీతకూ ‘సర్’ నోటీసు! -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
ఛిద్రమైన కలలను నిలబెట్టగలరా?
న్యూఢిల్లీ: బిహార్‌లో విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడం, తుపాకులతో కాల్పులు జరపడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విరిగిన ఎముకలను సరిచేయవచ్చు గానీ చెదిరిపోయిన విద్యార్థుల కలలను పునరుద్ధరించగలరా? అని ప్రధాని మోదీ, బిహార్ సీఎం సామ్రాట్‌లను ప్రశ్నించారు. బిహార్ విద్యార్థులు, యువతతో తాను ఇటీవల సమావేశమైన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరీక్షల విధానంలో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తినందుకు పోలీసులు లాఠీలతో చావబాదారని, కాల్పులు జరిపారని మండిపడ్డారు. పిల్లలు చేసిన పాపం ఏమిటి? కాల్పులు జరిపేటంత నేరం వారు ఏం చేశారు? అని నిలదీశారు. బిహార్‌లో ఏకే–47 బుల్లెట్ తాకడంతో ఒక విద్యార్థి కాలి ఎముక విరిగిపోయిందని, దాంతో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న అతని కల కరిగిపోయిందని రాహుల్అన్నారు. మరో ఇద్దరు విద్యార్థుల భుజాల గుండా బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలిపారు. విద్యార్థులు నేరస్తులు కాదని తేలి్చచెప్పారు. కుటుంబాల ఆశయాలను మోస్తూ చదువుకోవడానికి బయటకు వచి్చన పేద పిల్లలపై కాఠిన్యం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. తూటా గాయాలు మానుతాయి గానీ పిల్లల మనసుల్లో లోతుగా పాతుకుపోయిన భయానికి చికిత్స చేసే ఆసుపత్రి ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఛిద్రమైన కలలను మళ్లీ నిలబెట్టగలరా? అని నిలదీశారు. -
ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక!
టీవీకే 2029లో లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగే తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు ‘ఇక్కడా కాదు.. అక్కడా కాదు’ అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్ తివారీ విశ్లేషించారు. అంటే, రాహుల్ గాంధీ మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. విజయ్ 2029లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే, రాహుల్ గాంధీకి ప్రతిపక్షాల తరఫున ప్రధాన నాయకుడిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. విజయ్ ఎదుగుదల వల్ల రాహుల్‌కు ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిపత్యం లేకుండా, రాజకీయంగా మధ్యలో ఇరుక్కునే పరిస్థితి రావచ్చు. 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా విజయ్ పనితీరు, టీవీకేకు లభించే ప్రజాదరణ, కాంగ్రెస్‌తో కొనసాగించే పొత్తు ఈ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి.తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఇప్పటికే బహిరంగ చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇది తమిళనాడులో టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం.విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి నేరుగా సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీవీకే తన మిత్రపక్షాలతో సెప్టెంబర్ 9న సమావేశం నిర్వహించనుంది.దక్షిణాది నుంచి ప్రధాని రావాలి టీవీకే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్ను జాతీయ రాజకీయాల కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మంత్రి ఆధవ్ అర్జున దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాలని తమిళనాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి జగదీశ్వరి.. విజయ్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని అన్నారు. ఎమ్మెల్యే కనిమొళి అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు విజయే టీవీకే ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. “ఎవరు ప్రధాని కావాలో ఢిల్లీ నిర్ణయించదు. తమిళనాడు నిర్ణయిస్తుంది” అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ కూడా విజయ్ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇస్తారని ఆమె పేర్కొన్నారు.తాజా ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తదుపరి ప్రధానమంత్రిగా విజయ్‌కు 9 శాతం మద్దతు లభించింది. నరేంద్ర మోదీ 48.7 శాతంతో ముందుండగా, రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ మాత్రం 543 స్థానాల లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చూడటం తొందరపాటు, అత్యాశతో కూడిన లక్ష్యమని అన్నారు.కాంగ్రెస్ నేతలు మాత్రం విజయ్ ప్రధాని ప్రచారాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్ దీన్ని అభిమాన సంఘం తరహా ఆలోచనగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ప్రధాని కావాలంటే 272 మంది ఎంపీల మద్దతు అవసరమని అన్నారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ -
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే అధికార కూటమికి ‘2029 ఎన్నికల’ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా పూర్తికాకముందే.. ‘ప్రధాని అభ్యర్థి ఎవరు?’ అన్న ప్రశ్న టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఒకవైపు సీఎం, టీవీకే అధినేత విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెస్తున్న ఆయన పార్టీ నేతలు.. మరోవైపు రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని ముఖంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే నేతలను టీవీకే మంత్రులు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు ఆహ్వానం లేకపోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.అసలు కథ మొదలైంది ఇక్కడే..టీవీకేకి చెందిన పలువురు నేతలు వరుసగా ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. విజయ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, 2029లో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ముందుకు తీసుకురావాలని పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని కూడా కొందరు టీవీకే నేతలు వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో మరింత అసహనానికి కారణమైంది.కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ మా ఛాయిస్!టీవీకేనేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 2029లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని.. కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం ఇద్దరు వేర్వేరు నేతలను ప్రధాని కుర్చీ కోసం ముందుకు తెస్తున్నాయి. అయితే, ఈ వివాదం మాటలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్.. రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు పదవుల్లో కొనసాగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతను మరింత బయటపెట్టాయి.మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడంతా సెప్టెంబర్ 9 సమావేశంపైనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఇప్పటికే మిత్రపక్షాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ సమావేశంలో కూటమి నిర్మాణం, రాజకీయ ఫ్రంట్‌కు పేరు, సమన్వయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు విజయ్-రాహుల్ వివాదానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? అన్నది కీలకంగా మారింది.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడగటం ప్రభుత్వ వ్యతిరేకమా: సీజేపీ -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్‌తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్‌కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్‌లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్‌గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు ఎండ్‌కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్‌ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్‌తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్‌తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్‌కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కూడా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్న వేళ.. అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త విధానాన్ని అనుసరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.బలమైన ప్రజాదరణతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సొంతంగా నిర్వహించగల ఆర్థిక సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది. ఎన్నికలను ఈసారి కాంగ్రెస్ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. నియోజకవర్గంలో ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, ప్రచారానికి అవసరమైన వనరులు ఉన్న నేతలను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.అయితే.. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ గెలిచే సత్తా ఉన్న బలమైన అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదే సమయంలో అభ్యర్థులు పార్టీ నిధికి కూడా తమ వంతు సహకారం అందించాలని పార్టీ ఆశిస్తోంది. గతంలో ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ నుంచి నిధులు తీసుకున్న కొందరు అభ్యర్థులు వాటిని పూర్తిగా ప్రచారానికి వినియోగించకుండా తమ వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ అంశంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.2022 ఫలితాల నేపథ్యంలో కొత్త వ్యూహం2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 399 స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలువురు అభ్యర్థులకు పార్టీ నుంచి ఎన్నికల ప్రచారం కోసం భారీగా నిధులు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవం నేపథ్యంలోనే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలతో పాటు ఆర్థిక సామర్థ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.ఎస్పీతో సీట్లపై కాంగ్రెస్ పట్టుమరోవైపు.. సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల అంశం కాంగ్రెస్‌కు కీలకంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 115 నుంచి 120 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఏకంగా 50 శాతం సీట్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకోవడం, ఉత్తర భారతదేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ తమకు అనుకూలంగా మారుతుందని పార్టీ అంచనా వేస్తోంది. దళితులు, మైనారిటీలు, యాదవేతర ఓబీసీ వర్గాలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై యాంటీ ఇన్‌కంబెన్సీ తమకు కలిసొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ మొత్తం 403 నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తోంది. సీట్ల పంపకాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రీల్స్.. ఫాలోవర్ల మోజు!.. పార్టీని పట్టించుకోరా? -
టూర్లు.. పెళ్లిళ్లు.. బంగారం: మోదీ కీలక పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వృద్ధి రేటు నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ శర వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ‘స్వదేశీ.. వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలంటించారు.కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సుకు హాజరైన మోదీ.. మంగళవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘7.8 శాతం వృద్ధి దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇది ప్రజల సంకల్ప బలం, కష్టపడి పనిచేసే తత్వానికి ప్రతిబింబం’’ అని అన్నారు.‘ప్రపంచం యుద్ధంలో ఉంది’ప్రస్తుతం ప్రపంచం యుద్ధాలు, సంక్షోభాలతో సతమతమవుతోందని మోదీ పేర్కొన్నారు. కొవిడ్ కాలం 2020 నుంచి ఇప్పటివరకు ఎక్కడా పూర్తి స్థాయిలో స్థిరత్వం కనిపించలేదని, సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.విదేశీ టూర్లు వద్దు.. ‘వెడ్ ఇన్ ఇండియా’ఈ నేపథ్యంలో ప్రజలు దేశీయ ఉత్పత్తులు, సేవలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని కోరారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అసలే నిర్వహించవద్దని సూచించారు. పెళ్లిళ్లను దేశంలోనే నిర్వహిస్తూ ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదాన్ని పాటించాలని అన్నారు. అలాగే అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలోపేతమవుతుందని చెప్పారు.‘అబద్ధాల ప్రతిధ్వని’పై వ్యాఖ్యలుఇదే సమయంలో దేశంలో కొందరు నిరాశావాదంతో ‘జూట్ కీ గూంజ్’ (అబద్ధాల ప్రతిధ్వని) వ్యాప్తి చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విమర్శలు, నిరాశావాద ప్రచారాలను అధిగమిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ‘‘దేశంలోనే కొందరు తీవ్ర నిరాశలో మునిగిపోయి అబద్ధాల ప్రతిధ్వనిని వ్యాప్తి చేస్తున్నారు. వాటన్నింటినీ అధిగమించి దేశం 7.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ వేగాన్ని కొనసాగించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.మోదీ చెప్పిన ‘జూట్ కీ గూంజ్’ పదప్రయోగం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రచారంపై కొనసాగుతున్న రాజకీయ విమర్శలకు సంబంధించి చేసిన వ్యాఖ్యగా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. ఆయన నాలుగు కార్యక్రమాల్లో చేసిన 40 ప్రకటనల్లో 29 అవాస్తవమైనవని, మరో 11 తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే మోదీ ‘అబద్ధాల ప్రతిధ్వని’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.7.8 శాతం వృద్ధిసోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలోని 8.6 శాతంతో పోలిస్తే వృద్ధి కొంత తగ్గినప్పటికీ.. అంచనాలను మాత్రం అధిగమించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వంటి సవాళ్ల మధ్య ఈ వృద్ధి నమోదైంది.భారత్ స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘విధానం సరైనది.. సంకల్పం స్పష్టంగా ఉంది.. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తితో దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం’’ అని తాజా వీడియో సందేశంలో ఉద్ఘాటించారు.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ? విజయ్?? పీఎం అభ్యర్థి ఎవరసలు! -
విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి!
తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ హస్తం పార్టీకి అసహనం తెప్పిస్తోంది. ఆ వెంటనే అసెంబ్లీలో సీటింగ్ మార్పు.. ఇరు పార్టీల మధ్య గ్యాప్‌నకు కారణమనే చర్చా నడిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తరహై కత్బర్ట్(Tharahai Cuthbert) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని విజయ్ కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘సీఎం రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని తెలిపారు.‘కాంగ్రెస్ ఎవరికీ బానిస కాదు’టీవీకేకు కాంగ్రెస్ లోబడి పనిచేయడం లేదని తరహై కత్బర్ట్ స్పష్టం చేశారు. తమిళనాడులో తమ పార్టీ స్వతంత్రంగా విస్తరిస్తోందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధమైన స్వతంత్ర పార్టీ అని పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పార్టీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.అందుకే సీటు మారాల్సి వచ్చిందిఇదిలా ఉండగా.. అసెంబ్లీలో తన సీటు మార్పుపైనా కత్బర్ట్ వివరణ ఇచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఎమ్మెల్యేలతోనే కూర్చున్నారు. తాజా తాజా వివాదం నేపథ్యంలో వాళ్లు కావాలనే సీటు మారి విపక్ష సభ్యులతో కూర్చున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే తనకు ముందు వరుసలో సీటు కేటాయించారని, దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని కత్బర్ట్ స్పష్టం చేశారు. ఇక ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదానికి సంబంధించి రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదవడాన్ని కూడా కత్బర్ట్ ప్రస్తావించారు. రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.‘విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బయటకొస్తాం’అంతకు ముందు.. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు ప్రభుత్వాన్ని వీడతారని ఆ పార్టీకి చెందిన మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ హెచ్చరించారు. ఆగస్టు 30న మార్తాండంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తాను, మరో కాంగ్రెస్ మంత్రి విశ్వనాథన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ కేబినెట్ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.విజయ్–రాహుల్ మధ్య సాన్నిహిత్యంమరోవైపు విజయ్, రాహుల్‌గాంధీ మధ్య మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కరూర్ ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ ఫోన్ చేసి సంఘీభావం తెలపడాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన అరంగేట్రం చేసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి సవాల్ విసిరింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించగా.. వేదికపై ఆయనను తన ‘సోదరుడు’గా విజయ్ అభివర్ణించారు. టీవీకే ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.మొత్తంగా.. విజయ్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిత్వం అంశం మాత్రం కూటమిలో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు విభేదాలు లేవని చెబుతున్నా.. విజయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశం కూటమి మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ చెప్పిన ఆ గుంటనక్క ఎవరు?


