సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దుమారం చెలరేగింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ తనను నెట్టేశారని జర్నలిస్ట్ రిచా పరాశర్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నెలల గర్భిణీగా ఉన్న తనని రాహుల్ నెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆమెను బీజేపీ నేతలు పరామర్శించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ, బీజేపీ ఎమ్మెల్యే ఉమంగ్ బజాజ్‌లు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత గురించి, పితృస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ... విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్ట్ పట్ల ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు.
మరోవైపు, బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన అబద్ధాలని, ప్రతిపక్షాల పోరాటాన్ని దెబ్బతీసేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
ఎన్నికల సంఘం తీరును, ఓటరు జాబితా సవరణలోని లోపాలను ఎత్తిచూపుతూ విపక్షాలు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్,ఆందోళనల వేళ ఈ వివాదం తెరపైకి రావడం రాజకీయంగా మరింత వేడిని రాజేసింది. సుప్రీంకోర్టులో ఈ విషయమై పిటిషన్లు దాఖలవుతున్న తరుణంలో జర్నలిస్ట్ ఆరోపణల ఉదంతం చర్చనీయాంశమైంది.
"Rahul Gandhi Pushed me down" Rahul Gandhi now pushes a female journalist! Rahul Gandhi's behavior are dangerous for Indian Democracy! He pushes journalist, beats his workers with elbow punch, pushes his own Chief Minister. Rahul Gandhi is behaving like a goon! https://t.co/9GtJ36LDHO
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 12, 2026


