రాహుల్‌, ప్రియాంకలకు మద్దతుగా.. నేడు ఢిల్లీకి రేవంత్‌! | Revanth Reddy Delhi Rahul Gandhi Congress Leaders | Sakshi
Sakshi News home page

రాహుల్‌, ప్రియాంకలకు మద్దతుగా.. నేడు ఢిల్లీకి రేవంత్‌!

Oct 7 2026 3:20 AM | Updated on Oct 7 2026 3:20 AM

Revanth Reddy Delhi Rahul Gandhi Congress Leaders

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతల అరెస్టుల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలకు మద్దతు తెలిపేందుకు రేవంత్‌ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం.

అయితే, మంగళవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల నిర్బంధాన్ని ఖండించారు.

ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీ అగ్రనేతలను కలిసి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement