‘కాంగ్రెస్‌ నిరసనలో మహిళా పోలీసులకు లైంగిక వేధింపులు’ | Harassment of female police personnel during the protest led by Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ నిరసనలో మహిళా పోలీసులకు లైంగిక వేధింపులు’

Oct 9 2026 3:53 PM | Updated on Oct 9 2026 4:44 PM

Harassment of female police personnel during the protest led by Rahul Gandhi

ఢిల్లీ: ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ నిరసన సందర్భంగా మహిళా పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు గురై, గాయపడ్డారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.  తమ నిరసనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇండి కూటమి సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల సందర్బంగా విచారణ జరిగింది.  దీనిలో భాగంగా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

‘దయచేసి రెండు రోజుల క్రితం నాటి దృశ్యాలను చూడండి. మహిళా పోలీసు అధికారులు లైంగిక వేధింపులకు గురై, గాయపడ్డారు’ అని మెహతా కోర్టుకు తెలిపారు. పోలీసు సిబ్బందిని మాటలతో కూడా దూషించారని,. అయినప్పటికీ వారు మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించారని ఆయన అన్నారు.  

ఈ నిరసనకు ఎలాంటి అనుమతి లేనందున ఇది చట్టవిరుద్ధమని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని 'ఓటు దొంగతనం' అని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్ చేరుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా రేపు(శనివారం, అక్టోబర్ 10న) కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నేపథ్యంలో నేటి వాదోప వాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఇదీ చదవండి: ఇక నరేంద్ర మోదీ విమానాశ్రయంగా నోయిడా ఎయిర్‌పోర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement