జ్ఞానేశ్‌ కుమార్‌ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది! | Gyanesh Kumar will go, This government will go Says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ కుమార్‌ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది!

Oct 10 2026 11:55 AM | Updated on Oct 10 2026 12:26 PM

Gyanesh Kumar will go, This government will go Says Rahul Gandhi

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌ చేశారు. ఓట్ల చోరీ ఆరోపణల  నేపథ్యంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను మరోసారి బలంగా వినిపించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

‘‘జ్ఞానేశ్‌ కుమార్‌ పోతారు.. ఈ ప్రభుత్వం కూడా పోతుంది. ఆ తర్వాతే ప్రజాస్వామ్యాన్ని బాగుచేసే ప్రక్రియ మొదలవుతుంది’’ అంటూ పోస్ట్‌ చేశారాయన. మరోవైపు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్‌ జనతా పార్టీ) చేపట్టిన ‘జంతర్‌ మంతర్‌ 2.0’ నిరసనలకు రాహుల్‌ దూరంగా ఉన్నారు. ఆయన శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌తో భేటీ కానున్నారు. అనంతరం విద్యార్థులతో జరిగే ‘ఛాత్రోన్‌ కీ గూంజ్‌’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఇవే డిమాండ్లతో కాక్రోచ్‌ జనతా పార్టీ ఇవాళ జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి తమ ధర్నాలకు బ్రేక్‌ ఇచ్చింది. 

అయితే అనుమతులు నిరాకరించడం, భద్రతా ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ చీఫ్‌ అభిజిత్‌ దీప్కే సహా పలువురు నిరసనకారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ ఈ నిరసనకు కాంగ్రెస్‌ దూరంగా ఉంది. అయితే గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఇండియా కూటమి ఈసీ వ్యతిరేక ధర్నాలు చేపట్టింది. నిన్న రాత్రి విపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. ఇటు ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం ప్రియాంక గాంధీ వాద్రా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: రైళ్లు, బస్సులు ఆపడమేంటి? కేంద్ర మంత్రి సంచలన ‍వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement