సాక్షి, హైదరాబాద్: దసరా తర్వాత రాష్ట్రంలో రెండు లక్షల మందితో భారీ స్థాయిలో మార్చ్ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. అదే విధంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదికి చెందిన రెండు రాష్ట్రాలలో సభ లు నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా జర్నలిస్టుల ను అవమానించారని రాహుల్ గాంధీ పై చౌకబారు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ఖర్గేకు షూస్ లేస్ కట్టారు. బీజేపీ మొలకెత్తడానికి వాజ్ పేయి,సుస్మా స్వరాజ్ కారణం వాళ్ళు లేకుంటే బీజేపీ మొలకెత్తేదా? అని ప్రశ్నించారు. ప్రజా స్వామ్యం లో నిరసన తెలిపే హక్కును కాల రాస్తాం అంటే ఎట్లా?బీజేపీ మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడిన వాళ్లకు మద్దతు ఇస్తాం. సీజేపీ, ఇండియా కూటమి ఎవరి వారే పోరాటం చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో భాష గౌరవం ఉండాలి. అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ.."అయోధ్య మందిరానికి భూమి పూజ చేసింది రాజీవ్ గాంధీరాజకీయాలకోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాముడికి రాజకీయాలకు ఏంటి సంబంధం. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ చేసిన తప్పిదాలు ఆధారాల తో సహా బయట పడుతున్నాయి. 2029 లో ఎవరు ఓడిపోబోతున్నారు అని ప్రజలు చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం ప్రమాదం లో ఉంది. బీజేపీ పాలనలో సామాన్యులకు ఏమి జరగలేదు"అని అన్నారు.
అదే విధంగా రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతూ "15ఏండ్ల నుండి RTC ఎన్నికలు లేవు కాబట్టి నిర్వహించాం. ఓడినా గెలిచినా కార్మికుల శ్రేయస్సు కు కట్టుబడి ఉన్నాం. పట్టబద్రుల ఎన్నికల కోసం సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం.ఎర్రవల్లి లో 45 ఎకరాలు ఎవరి కబ్జా లో ఉన్నాయో విచారణ జరుగుతుంది. కవిత ఫ్యామిలీ గురించి ఎక్కువగా వాస్తవాలు మాట్లాతుంది. కవిత మాట్లాడే వాస్తవాలు అన్ని ప్రజలకు అర్థం అవుతుంది. ఫామ్ హౌస్ ల మీద దాడి చేయాలని మా అభిమతం కాదు.సింగరేణి గర్జనకు అర్థం లేదు కాంగ్రెస్ పార్టీనే సింగరేణి కార్మికులకు ఫలాలు ఇస్తుంది. అని అన్నారు.


