సాక్షి, ఢిల్లీ : రాహుల్ గాంధీ డ్రామాలను ప్రజలు చీదరించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన రాజ్యాంగ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో లోక్ సభ స్పీకర్ రాజీనామా చేయాలని నవ్వుల పాలయ్యారన్నారు. ఇప్పుడు సిఈసి రాజీనామా చేయాలని రోజుకొక నాటకం ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు సిజెఐ రాజీనామా చేయాలనడం శోచనీయమని, వేలాదిగా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయమూర్తుల పై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలలో గెలవడం చేతగాక రాజ్యాంగ సంస్థలపై దండ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు.


