ఢిల్లీ: రాహుల్ గాంధీ, ఇండి కూటమి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దుర్మార్గపు ప్రచారం చేసినా.. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ఒక ఎన్నిక తర్వాత మరొక ఎన్నికలో విజయం సాధిస్తూనే ఉందని అమిత్ షా పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయాలు, అలాగే రాజస్థాన్, త్రిపురలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇండి కూటమిని పూర్తిగా తిరస్కరించారన్నారు. ప్రజా మద్దతును కోల్పోయిన ఇండియా కూటమి పార్టీలు ప్రతి ఓటమి తర్వాత సంస్థలను ప్రశ్నిస్తున్నాయని.. కానీ ప్రజలు వారి ఈ స్వభావాన్ని గుర్తించారన్న అమిత్ షా.. అందుకే మరోసారి బీజేపీపై తమ అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: సెంట్రల్ ఢిల్లీలో లాక్‌డౌన్..!


