రహదారులు ఇలాగేనా ఉండేది?  | Rahul Gandhi highlights the poor state of PMGSY roads in Raebareli | Sakshi
Sakshi News home page

రహదారులు ఇలాగేనా ఉండేది? 

Sep 10 2026 6:24 AM | Updated on Sep 10 2026 6:24 AM

Rahul Gandhi highlights the poor state of PMGSY roads in Raebareli

రాయ్‌బరేలీలో రోడ్ల దుస్థితిపై రాహుల్‌ గాంధీ ఆవేదన  

రాయ్‌బరేలీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. అమేథీ ఎంపీ కిషోరీ లాల్‌ శర్మతో కలిసి కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించేందుకు జరిగిన ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్‌ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోజ్‌ కుమార్‌ పాండే, ఉద్యానవన శాఖ మంత్రి దినేష్‌ ప్రతాప్‌ సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) కింద నిర్మించిన రహదారుల దుస్థితిని రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంతలమయమైన రోడ్ల ఫోటోలను ప్రదర్శించారు. వాటి నిర్మాణానికి బాధ్యత వహించిన ఏజెన్సీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏ రోడ్డుకు ఏ సంస్థ బాధ్యత వహిస్తుందో తెలిపే రికార్డులను నిర్వహించాలని పేర్కొన్నారు. 

దెబ్బన్న రోడ్లను మరమ్మతు చేస్తామని చేపడతామని పీఎంజీఎస్‌వై ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ హామీ ఇచి్చనట్లు దిశా కమిటీ నామినేటెడ్‌ సభ్యుడు ఉమేష్‌ బహదూర్‌ సింగ్‌ చెప్పారు. జిల్లాలోని రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమరి్పంచిన తర్వాతే ఈ సమస్యను రాహుల్‌ గాంధీ లేవనెత్తారని వెల్లడించారు. దిశా సమావేశం ముగిసిన తర్వాత రాహుల్‌ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. రాహుల్‌పై మంత్రి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం కంటే వాటిలో లోపాలను వెతకడానికే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తప్పుపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement