breaking news
poor condition
-
నాణ్యతకు తూట్లు.. జేబుల్లోకి కోట్లు
కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాలపై చేపడుతున్న హంద్రీ–నీవా లైనింగ్ పనులు తెలుగు తమ్ముళ్లకు ఆదాయ వనరుగా మారాయి. తమకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నా సీఎం చంద్రబాబు నిధుల పందేరానికి తెరలేపారు. అసలు లైనింగే వద్దంటుంటే ఆపై నాసిరకంగా పనులు చేస్తూ రూ. కోట్లు కొట్టేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం/ఆత్మకూరు: కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీ–నీవా ప్రాజెక్టును చేపట్టి దాదాపు 90 శాతం పనులను తన హయాంలోనే పూర్తి చేయించారు. కాలువలో జలాలు పారడంతో ఆ మార్గంలోని భూముల్లో నీటి లభ్యత పెరిగి బోరు బావుల్లో నీరు సమృద్ధిగా లభించేవి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ అనుమతులు ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ వచ్చే సరికి ఆ పనులు ముందుకు సాగలేదు. నాసిరకంగా పనులు.. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. లైనింగ్ వల్ల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గి భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో లైనింగ్ చేయకూడదని ఒక వైపు రైతులు వాపోతుంటే... కూటమి ప్రభుత్వం మాత్రం ‘తమ్ముళ్ల’ జేబులు నింపడానికి పనులకు శ్రీకారం చుట్టింది.ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పనులను 7 ప్యాకేజీలుగా విభజించింది. 1 నుంచి 5వ ప్యాకేజీ వరకు రూ.936.70 కోట్లు, 6,7 ప్యాకేజీలకు రూ.319 కోట్ల ఖర్చుతో పనులు అప్పగించింది. 1,2,3 ప్యాకేజీలు ఆర్వీఆర్ కంపెనీ, 4,5 ప్యాకేజీలు బీఎస్ఆర్ కంపెనీ, 6,7 ప్యాకేజీల పనులు ఎస్ఆర్సీ కంపెనీ వాళ్లు దక్కించుకున్నారు. ఇష్టారాజ్యంగా పనులు..హంద్రీ–నీవా లైనింగ్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. సిమెంట్ తక్కువగా వేయడంతో అప్పుడే ఇసుక, కంకర తేలి కనిపిస్తోంది. పూర్తిగా మిషన్లతో పనులు చేపట్టాల్సి ఉన్నా.. దీనికి విరుద్ధంగా కారి్మకులతో చేయిస్తున్నారు. ఇక.. లైనింగ్ పనులకు కాంక్రీట్ వేయాలంటే కంకర తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆత్మకూరు మండలంలోని పంపనూరు తండా గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువ పక్కనే మొబైల్ క్రషర్ ఏర్పాటు చేసి కాలువలో ఉన్న రాళ్లతో పాటు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోని కొండ నుంచి రాళ్లను తరలించి కంకర మిషన్‌లోకి వేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు మొబైల్ క్రషర్కు అధికారులు అనుమతి ఇచ్చారా అనేది కూడా తెలియడం లేదు. కొండలోని రాళ్లను ఎలా కంకరగా తయారు చేసి వినియోగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జేబులు నింపుకోవడానికే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించ తలపెట్టిన గండికోట– గాలేరు నగరి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బ్రాంచ్‌కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడితే హంద్రీ–నీవా లైనింగ్‌తో పనే ఉండదు. అయినా.. ఆ ప్రాజెక్టులను రద్దు చేసి కేవలం తమ్ముళ్ల జేబులు నింపడానికి చంద్రబాబు ప్రయతి్నస్తున్నారనే విమర్శలున్నాయి. హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండా, పిల్ల కాలువలు ఏర్పాటు చేసి నీరు ఇవ్వకుండా లైనింగ్ పనులకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు అన్యాయం చేస్తూ ఎవరి జేబులు నింపడానికి ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు కష్టాలు తప్పవేమో అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి బీడుగా మారుతుంది నాకు కాలువ పక్కన ఐదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం రెండు బోర్లు వేసి పంట సాగు చేస్తున్నా. కాలువకు లైనింగ్ వేస్తే భూమి లోపలికి నీరు ఇంకే అవకాశం ఉండదు. బోర్లు ఎండిపోతాయని భయంగా ఉంది. గతంలో పంటలు పండక వలస వెళ్లేవాళ్లం. వైఎస్సార్ చలువతో కాలువ నీటితో పంటలు పండించుకుంటున్నాం. చంద్రబాబు లైనింగ్ వేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. – వెంకట నాయక్, పంపనూరు తండా, ఆత్మకూరు మండలంమళ్లీ వలసలు తప్పవేమో? గతంలో సాగునీరు లేక వలసలు వెళ్లేవాళ్లం. వైఎస్సార్ పుణ్యమా అని నీరు వచ్చాక ఉన్న ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాం. తాజాగా కాలువకు లైనింగ్ వేస్తున్నారు. లైనింగ్ వేస్తే బోర్లలో నీటి లభ్యత తగ్గుతుంది. ఈ క్రమంలో మళ్లీ వలసలు తప్పవేమో అని భయమేస్తోంది. – పోలన్న, సింగంపల్లి, ఆత్మకూరు మండలంరైతులకు అన్యాయంమా గ్రామస్తులంతా దాదాపు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు పంటల సాగు తప్ప ఇంకేమీ తెలియదు. ఇప్పుడు బోర్లు ఎండిపోతే పంటలు పండవు. రైతులకు అన్యాయం చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం కాలువకు కాంక్రీట్ వేస్తోంది. – మన్నల లక్షి్మదేవి, సింగంపల్లి, ఆత్మకూరు మండలం -
పస్తులు
♦ 8 నెలలుగా వేతనాల్లేవ్.. ♦ దుర్భరస్థితిలో సాక్షరభారత్ కోఆర్డినేటర్లు ♦ జిల్లాలో 2,154 మంది గ్రామ కోఆర్డినేటర్లు ♦ మండల కోఆర్డినేటర్ల పరిస్థితీ అంతే... ♦ పత్రికలకు సైతం రాని బిల్లులు జోగిపేట: జిల్లాలోని సాక్షర భారత్ కోఆర్డినేటర్లు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మాసాలుగా వేతనాలు అందక పోవడంతో పస్తులతో కాలం గడుపుతున్నారు. ఇదిగో ఇప్పుడిస్తాం..అప్పుడిస్తాం అంటూ అధికారుల మాయ మాటలు చెప్పి ఊరిస్తున్నారే తప్ప జీతాలు మాత్రం ఇవ్వడంలేదు. దీంతో కుటుంబాలు గడవక కోఆర్డినేటర్ల అవస్థలు వర్ణణాతీతం. గ్రామీణ ప్రాంతాల్లోని అక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాక్షరభారత్’ కార్యక్రమాన్ని 2010లో ప్రారంభించింది. ఇటీవలే 5వ దశ సాక్షర భారత్ కార్యక్రమం పూర్తయ్యింది. త్వరలో ఆరో దశకు కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తొంది. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తేనే సమాజం వేగవంతంగా ప్రగతి సాధిసాధిస్తుందనే సదాశయంతో కేంద్ర సాక్షరభారత్ చేపట్టింది. ఇందుకు ప్రతి గ్రామ పంచాయతీలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రెండు కేంద్రాలలో ఇద్దరు సాక్షర భారత్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉదయం వేళ పత్రికలు చదవడానికి అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఏఈసీ) సాయంత్రం సమయంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షర భారత్ కేంద్రాలను ప్రారంభించింది. కోఆర్డినేటర్లకు నెలకు రెండు వేల రూపాయల గౌరవ వేతనం, ఇవ్వాలని నిర్ణయించి అర్హులైన వారిని సాక్షర భారత్ కోఆర్డినేటర్లుగా గ్రామానికి ఇద్దరిని ఎంపిక చేసింది. ఏఈసీ కేంద్రాన్ని ఒకరు, సాక్షర భారత్ కేంద్రాన్ని మరొకరు ఉదయం, సాయంత్రం సమయాల్లో తెరచి ఉంచాలని విధి విధానాలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున మండల సాక్షర భారత్ కోఆర్డినేటర్‌గా నియమించింది. వీరికి నెలకు 6వేల చొప్పున వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 2,154 మంది వీసీఓలు, 46 మంది ఎంసీఓలు పనిచేస్తున్నారు. వీరికి గత సంవత్సరం అక్టోబర్ వరకు వేతనాలను అందజేశారు. నవంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేతనాలు అందించలేదు. జిల్లా అంతట వేతనాలు లేక అలమటిస్తున్నారు. ప్రతినిత్యం కేంద్రాలను తెరచి సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న తమకు వేతనాలు ఇవ్వకపోవడం భావ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా పత్రికలకూ బిల్లులు లేవు ప్రతి గ్రామ పంచాయతీలోని సాక్షర భారత్ కేంద్రంలో రెండు దినపత్రికలు వేసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు దినపత్రికలు వేసుకుంటున్నారు. రెండేళ్లుగా దినపత్రికలకు సైతం బిల్లులు చెల్లించడంలేదని గ్రామాల కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా తామూ పత్రికల ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. తమకు మాత్రం రెండేళ్లుగా పత్రికల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వేతనాలు వస్తాయి జిల్లాలో పనిచేస్తున్న మండల, గ్రామ కోఆర్డినేటర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు త్వరలో వస్తాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు తమకు తెలియజేశారు. వేతనాలకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయ్యిందని, ఆరు మాసాల వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. గత సంవత్సరం అక్టోబర్ మాసం వరకు మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించాం. గ్రామాల్లో సాక్షర భారత్ కేంద్రాలను కూడా ప్రతి రోజు నడిపేందుకు గ్రామ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలి. - ఉషామార్థా సాక్షర భారత్ డిప్యూటీ డెరైక్టర్