breaking news
Implementation of scheme
-
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
-
‘పీఎం జన్ మన్’తో గిరిజనుల అభివృద్ధికి కృషి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు. అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్ కేంద్రాలు, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు, ఒకేషనల్ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు. ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
ఆసరాకు.. అడ్డంకులు!
అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్ పెంచడంతోపాటు లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ఓటరుజాబితాలో వయస్సును బట్టి అధికారులు పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. కానీ వరుస ఎన్నికలు రావడం..కోడ్ అమలులో ఉండడం వంటి ఆటంకాలతో అర్హులు పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్తగా ఆసరా పెన్షన్లు పొందేందుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. కానీ కొత్తగా అర్హులైన పెన్షన్ దారులు ఆసరా పెన్షన్లు పొందేందుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ మే 23 వరకు అమలులోనే ఉంటుంది. దీనికి తోడు జిల్లా పరిషత్ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రావడంతో ఈనెలలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా అందడం అసాధ్యంగానే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,589 మంది వివిధ రకాల ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో వృద్ధాప్య పెన్షన్లు 65,472 మంది పొందుతుండగా, దివ్యాంగులు 30,315 మంది, వింతంతు పెన్షన్లు 76,029 మంది, చేనేత కార్మికులు 2,928 మంది, గీత కార్మికులు 7,597 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటరి మహిళలకు కూడా పెన్షన్ కల్పించడంతో జిల్లాలో 7248 మంది పెన్షన్ పొందుతున్నారు. ప్రతినెలా రూ.20.47 కోట్లు ఖర్చు ప్రతినెలా ప్రభుత్వం జిల్లాలోని వివిధ రకాల పెన్షన్ దారులకు రూ.20,47,46,500 జిల్లాలో ఖర్చు చేస్తుంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి పెన్షన్ అందిస్తుండగా, వికలాంగులకు మాత్రం రూ.1500 అందజేస్తుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండోసారి అధికారం చేపట్టగానే ఆసరా పెన్షన్ల కోసం 65 నుంచి 57 సంవత్సరాల వయస్సు ఉన్న అర్హులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను అనుసరించి డీఆర్డీఏ అధికారులు 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారందరినీ గుర్తించారు. అందులో 84,515 మంది 57 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిగా గుర్తించారు. గుర్తించిన వారిలో అర్హులను తేల్చిన ఎంపీడీఓలు ఓటర్ల జాబితా ఆధారంగా 84,515 మందిని గుర్తించగా, ఆయా మండలాల ఎంపీడీఓలు వాటన్నింటినీ పరిశీలించారు. అందులో ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు పెన్షన్ పొందుతుండడం వల్ల కొందరిని తొలగించగా, మరికొందరిని ఇతర కారణాలతో అనర్హులుగా తేల్చారు. చివరికి 35863 మందిని అర్హులుగా గుర్తించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తే పెరగొచ్చు... ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న అధికా రులు 57 సంవత్సరాల వరకు ఉన్నవారి ని గుర్తించగా ఎంపీడీఓలు వారి జాబితా లను పరిశీలించి అర్హులుగా గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అసవరం ఉంది. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో అధికారులంతా బిజీగా ఉండడం, దానికితోడు కోడ్ కూడా ఉండడంతో ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకపోవడం, అటు ప్రభుత్వం కూడా కోడ్ కారణంగా కొత్త పెన్షన్‌ను అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. జూన్ వరకు కొత్త పెన్షన్‌దారులకు ఎదురుచూపులు తప్పవు ఇటు ఎన్నికల కోడ్, మరోపక్క అధికా రుల ఎన్నికల విధులతో బిజీగా ఉండడం వల్ల కొత్త పెన్షన్ దారులు అర్హత సాధించినా ప్రభుత్వం ఇస్తానన్న సమయం నుంచి పెన్షన్లు పొందలేని పరిస్థితి. మే మాసంలో కూడా అందే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్నికలు పూర్తయితేనే అటు ఎన్నికల కోడ్‌తోపాటు అధికారులు కూడా ఫ్రీ అవుతారు. జూన్మాసంలో కొత్తవారికి పెన్ష న్ అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు కొత్త పెన్షన్‌దారులు ఎదురుచూడక తప్పని పరిస్థితి. -
మారుతీ సుజుకీ ఉగాది ఉత్సవాల ఆఫర్లు
హైదరాబాద్: ఉగాది పండుగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ ‘ఉగాది ఉత్సవాల’ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 9వ తేదీ నుంచీ 21వ తేదీ వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. స్కీమ్ అమలు కాలంలో కారు కొన్న వారికి మూడు ఆఫర్లను సంస్థ ప్రకటించింది. 8 జీబీ పెన్ డ్రైవ్, బ్రాండెడ్ వాచ్, ఎంజీఏ వోచర్, టెఫ్లాన్ కోటింగ్, బ్రాండెడ్ ల్యాప్‌టాప్ బ్యాగ్, 4వ సంవత్సరం కూడా ఎటువంటి వ్యయం లేకుండా వారెంటీ అప్‌గ్రేడ్ వంటి తప్పనిసరి గిఫ్ట్స్ మొదటి ఆఫర్. గోల్డెన్ జాక్‌పాట్ పేరుతో మరో ఆఫర్‌ను ప్రకటించింది. 12 రోజుల పాటు లక్కీడ్రాలో గెలుపొందిన లక్కీ కస్టమర్‌కు లక్ష రూపాయల విలువైన బంగారం గిఫ్ట్ వోచర్ బహుమతి ప్రదానం జరుగుతుంది.మూడవ విభాగంలో బంపర్ ప్రైజ్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్‌ను సంస్థ అందిస్తోంది. స్కీమ్ కాలంలో కారు తీసుకున్న కస్టమర్లు అందరూ బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హులని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.