మారుతీ సుజుకీ ఉగాది ఉత్సవాల ఆఫర్లు | Maruti Suzuki Ugadi Festivals Offers | Sakshi
Sakshi News home page

మారుతీ సుజుకీ ఉగాది ఉత్సవాల ఆఫర్లు

Mar 7 2015 1:01 AM | Updated on Sep 2 2017 10:24 PM

మారుతీ సుజుకీ  ఉగాది ఉత్సవాల ఆఫర్లు

మారుతీ సుజుకీ ఉగాది ఉత్సవాల ఆఫర్లు

ఉగాది పండుగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ ‘ఉగాది ఉత్సవాల’ ఆఫర్లను ప్రకటించింది.

హైదరాబాద్: ఉగాది పండుగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ ‘ఉగాది ఉత్సవాల’ ఆఫర్లను ప్రకటించింది. మార్చి 9వ తేదీ నుంచీ 21వ తేదీ వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.  స్కీమ్ అమలు కాలంలో కారు కొన్న వారికి మూడు ఆఫర్లను సంస్థ ప్రకటించింది. 8 జీబీ పెన్ డ్రైవ్, బ్రాండెడ్ వాచ్, ఎంజీఏ వోచర్, టెఫ్లాన్ కోటింగ్, బ్రాండెడ్ ల్యాప్‌టాప్ బ్యాగ్, 4వ సంవత్సరం కూడా ఎటువంటి వ్యయం లేకుండా వారెంటీ అప్‌గ్రేడ్ వంటి తప్పనిసరి గిఫ్ట్స్ మొదటి ఆఫర్.

గోల్డెన్ జాక్‌పాట్ పేరుతో మరో ఆఫర్‌ను ప్రకటించింది. 12 రోజుల పాటు లక్కీడ్రాలో గెలుపొందిన లక్కీ కస్టమర్‌కు లక్ష రూపాయల విలువైన బంగారం గిఫ్ట్ వోచర్ బహుమతి ప్రదానం జరుగుతుంది.మూడవ విభాగంలో బంపర్ ప్రైజ్‌గా మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్‌ను సంస్థ అందిస్తోంది. స్కీమ్ కాలంలో కారు తీసుకున్న కస్టమర్లు అందరూ బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హులని ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement