కొత్త బ్రెజ్జాకు డిమాండ్ విపరీతంగా పెరగడాన్ని గమనించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టింది. త్వరగా డెలివరీలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ రెండు లక్షల ఆర్డర్ల పంపిణీ చేయాల్సి ఉంది. అందులో 95 వేలు కేవలం బ్రెజ్జాకే చెందినవి కావడం గమనార్హం.
బ్రెజ్జా 1.0లీటర్ బూస్టర్‌జెట్ (టర్బో) వెర్షన్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌కే అత్యధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బ్రెజ్జా కారులో.. యాక్టివ్ కూలింగ్‌తో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కొత్త రెండవ వరుస హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి.
ఇది 1.0-లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్ ద్వారా 108 bhp పవర్, 170 Nm టార్క్ అందిస్తుంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉంది. కానీ ఫ్రాంక్స్ ఈ ఇంజన్‌తో 99bhp/147Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే బ్రెజ్జా అధిక ట్యూనింగ్‌ను కలిగి ఉంది.


