ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్! | Tesla Roadster Bookings Open in India | Sakshi
Sakshi News home page

ఎగిరే కారు కోసం బుకింగ్స్ స్టార్ట్!

Oct 19 2026 6:54 PM | Updated on Oct 19 2026 7:30 PM

Tesla Roadster Bookings Open in India

టెస్లా ఇటీవల తన సరికొత్త రోడ్‌స్టర్‌ ఈవీను ప్రదర్శించింది. గాలిలో ఎగరగల ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించినప్పటికీ, దీని ఉత్పత్తి 2028లో ప్రారంభం కానుంది. అయితే కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం స్టార్ట్ చేసింది.

టెస్లా లాంచ్ చేయనున్న ఎగిరే రోడ్‌స్టర్‌ కోసం రూ. 50.06 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు స్వీకరిస్తోంది. ఈ మొత్తాన్ని రెండు వాయిదాలలో చెల్లించుకునే అవకాశం ఉంది. మొదటి చెల్లింపు రూ. 5.01 లక్షలు కాగా, రెండవ చెల్లింపును 10 రోజులలోపు చేయాలి, దీని మొత్తం రూ. 45.05 లక్షలు. అయితే డెలివరీలు ఎప్పుడనే విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.

టెస్లా రోడ్‌స్టర్ భారతదేశంలో థ్రస్ట్, రాకెట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. థ్రస్ట్ రెండు-సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది గాలిలో ఎగరదు. అయితే ఈ ఈవీ ఒక సెకనులోపు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని టెస్లా పేర్కొంది. ఇదే నిజమైతే అత్యంత వేగవంతమైన కారు ఇదే అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాకెట్ వేరియంట్ అనేది సింగిల్-సీటర్. ఇది గాలిలోకి ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాగా రాబోయే టెస్లా రోడ్‌స్టర్‌కు సంబంధించిన యాంత్రిక వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు.

ఇదీ చదవండి: శాంసంగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్: ధర ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement