తొలిసారి కాంగ్రెస్ నిరసనలో విజయ్ పార్టీ | Vijay Party TVK joins INDIA bloc protest against CEC Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

తొలిసారి కాంగ్రెస్ నిరసనలో విజయ్ పార్టీ

Oct 15 2026 5:52 PM | Updated on Oct 15 2026 6:02 PM

Vijay Party TVK joins INDIA bloc protest against CEC Gyanesh Kumar

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ పార్టీ తొలిసారి ఇండియా కూటమి నిరసనలో పాల్గొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం చెన్నైలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో టీవీకే నేతలు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదంతో ఈ నిరసన చేపట్టారు. అక్టోబర్ 3న ఇండియా కూటమిలో చేరిన తర్వాత టీవీకే ఈ తరహా ఆందోళనలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

రాహుల్‌-విజయ్‌ భేటీ తర్వాత కీలక పరిణామం
అక్టోబర్ 10న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. విజయ్‌తో చెన్నైలో సమావేశమయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో నిర్వహించే ప్రచారాలు, నిరసనలు, రాజకీయ చర్చల్లో పాల్గొనాలని విజయ్‌ను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నేతలు కాంగ్రెస్ నిరసనలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Rahul Gandhi, Vijay Meeting In Chennai

ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో సుమారు 97 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని నిరసనకారులు ఆరోపించారు. అందులో ముఖ్యంగా ముస్లింలు, గిరిజనులు, అణగారిన వర్గాల ఓటర్లు ఉన్నారని వారు విమర్శించారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: ఇరాన్‌పై ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ప్రయోగానికి అమెరికా ప్లాన్?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement