ఢిల్లీ: ‘మిస్టర్ మోదీ.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటారో తెచ్చుకోండి. యువకులందరినీ, నేతలందరినీ అరెస్ట్ చేసుకోండి. మేం మాత్రం వెనక్కి తగ్గం.. మిమ్మల్ని కమ్మేస్తాం’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు.
‘‘మేం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. 15 ఏళ్లలో దేశానికి ఏం జరిగిందో.. అది మళ్లీ జరగనివ్వం. రాజ్యాంగంపై దాడి చేసిన పాలకులను దించి తీరుతాం. దేశ యువతను చూసి గర్వపడుతున్నా. యువత తమ పోరాటాన్ని ఆపొద్దు.. మీ వెనుక మేం ఉన్నాం’’ అంటూ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
కాగా, ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కనాట్ ప్లేస్‌లో సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. గుంపులుగా వస్తున్న నిరసనకారులు ఆందోళనలో పాల్గొంటున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం


