సాక్షి,న్యూఢిల్లీ : దేశాన్ని కోటీశ్వరులు నడిపేందుకు మేము ఏ మాత్రం అంగీకరించబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాం లీలా మైదానంలో ప్రతిపక్షాలు నిర్వహించిన చలో ఢిల్లీ సభ రాహుల్ గాంధీ మాట్లాడారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత వర్గాలు లబ్ది పొందుతున్నాయి. పేదలు మాత్రం వంచింప బడుతున్నారు.ఓట్ల దొంగతనం చేసి మోడి ప్రధాని అయ్యారు. దేశంలో వ్యవస్థలను కొంతమంది కోటీశ్వరులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఓట్ల దొంగతనానికి పాల్పడ్డ మోడీ , అమిత్ షాలు దేశం నుండి పారిపోకుండా చూస్తాము. వారిని కఠినంగా శిక్షించాలి.
ప్రజాస్వామ్యాన్ని అంతం కానివ్వం.. రాజ్యాంగాన్ని ధ్వంసం కానివ్వం. ఇది ఒక్క రాజకీయ పార్టీ గొంతుక కాదు.. దేశ యువత, రైతులు, కార్మికుల గొంతుక. దేశంలో ఏళ్ల తరబడి ఓట్ల చోరీ జరుగుతోంది. మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగింది
2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల ద్వారా అక్రమాలు జరిగాయి. 2024 ఎన్నికల తర్వాత 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు. ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దేశంలోని మొత్తం ఓటర్లలో 15 శాతం మందిని తొలగించారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ, ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే!.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకుంటారు. జైలుకు వెళ్తారు. ఓట్ల చోరీ సాధారణ నేరం కాదు.. దేశ పౌరుల గొంతుకను దొంగిలించడమే!. దేశంలోని విద్య, వైద్యం, సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్ ఆధీనంలోకి తీసుకుంది. రైతులకు న్యాయం జరగడం లేదు..యువతకు ఉద్యోగాలు రావడం లేదు.. కార్మికులకు హక్కులు దక్కడం లేదు.దేశ సంపద ఇద్దరు, ముగ్గురు పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి వెళ్తోంది. అంబానీ, అదానీ వంటి పారశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు మాఫీ.. సామాన్యులకు మాత్రం వేధింపులు.. రైతులు, విద్యార్థులు, కార్మికులు తమ కష్టానికి తగిన ఫలితం పొందే భారతదేశం కావాలి.
దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్లడాన్ని అంగీకరించబోము.నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై చట్టపరమైన చర్యల కోసం పోరాడతాము . ఓట్ల చోరీపై దేశం న్యాయం కోరుతుంది.. బాధ్యులు సమాధానం చెప్పాల్సిందే!. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు’ అని పునరుద్ఘాటించారు.


