కాసేపట్లో కాంగ్రెస్‌ మార్చ్‌.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ | Delhi Congress March To Supreme Court Live Updates | Sakshi
Sakshi News home page

కాసేపట్లో కాంగ్రెస్‌ మార్చ్‌.. ప్రతిపక్ష నేతలను కలవలేను: సీజేఐ

Oct 12 2026 10:47 AM | Updated on Oct 12 2026 10:56 AM

Delhi Congress March To Supreme Court Live Updates

కాంగ్రెస్‌ మార్చ్‌ అప్‌డేట్స్‌..

  • జంతర్‌మంతర్ వద్ద పోలీసుల బందోబస్తు

  • జంతర్‌మంతర్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

  • కాంగ్రెస్‌ ర్యాలీ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు, జంతర్‌మంతర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.


ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయం

  • కన్నాట్‌ప్లేస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీకి కాంగ్రెస్ నిర్ణయం

  • మధ్యాహ్నం 1.30 గంటలకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

  • దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారాఖంబకు సమీపంలోని సాయంత్రం 4 గంటల వరకు పలు మెట్రో స్టేషన్లు మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు.

కాంగ్రెస్‌కు నో చెప్పిన సీజేఐ..
👉ఎన్నికల అక్రమాల ఆరోపణలపై వినతిపత్రం సమర్పించేందుకు సమావేశం కావాలన్న ఇండియా కూటమి నేతల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ తిరస్కరించారు. ఈ వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానం విచారణ పరిధిలో ఉన్నందున పిటిషన్‌ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఓట్‌చోరీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా, ఎస్‌ఐఆర్‌ నిలిపివేత, భవిష్యత్‌ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరపాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు భావించారు. అయితే సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వారిని కలిసేందుకు తిరస్కరించారు. 

👉అయితే, సీజేఐ నిర్ణయాన్ని గౌరవిస్తూనే అక్టోబర్‌ 12న సుప్రీంకోర్టు వరకు మార్చ్‌ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలను కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. ఈ మార్చ్ కేవలం ఒక ఆందోళన మాత్రమే కాదన్నారు. ఇది ఒక ఉద్యమంగా మారిందని తెలిపారు.

👉దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందరికీ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. తమ ప్రతినిధి బృందాన్ని కలవకూడదని సీజేఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం గౌరవిస్తుందని అన్నారు. కానీ, సుప్రీంకోర్టుకు మార్చ్​ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

సీఈసీ రాజీనామా చేయాలి: శశిథరూర్‌
👉ఎన్నికల సంఘం చట్టాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఆరోపించారు. ఓటు హక్కు పౌరుల రాజ్యాంగ హక్కు అని, తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ప్రజలకు ఉండాలని అన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణ తప్పినట్లుగా వ్యవహరిస్తోందని, నిబంధనలను పక్కనపెడుతోందని ఆయన విమర్శించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది భారతీయుల పేర్లు తొలగించారంటూ ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్చ్‌ ద్వారా న్యాయం కోరనున్నట్లు థరూర్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌పై మరో అస్త్రంతో ఇండియా కూటమి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement