ప్రభుత్వం చాలా తప్పు చేస్తోంది: రాహుల్‌ గాంధీ | India Bloc Protest against cec Gyaneshkumar Rahul Gandhi to address media update | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చాలా తప్పు చేస్తోంది: రాహుల్‌ గాంధీ

Oct 12 2026 12:20 PM | Updated on Oct 12 2026 1:16 PM

India Bloc Protest against cec Gyaneshkumar Rahul Gandhi to address media update

సాక్షి, న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఢిల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సంద‍ర్భంగా ప్రభుత్వ తీరు తెన్నులను ఎండగట్టారు. నిరసనకారులను నిర్బంధిస్తూ ప్రభుత్వం తప్పు చేస్తున్నదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని, సుప్రీంకోర్టులో జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్‌ వేస్తామన్నారు. సెంట్రల్‌ ఢిల్లీ వ్యాప్తంగా వాటర్‌ కెనాన్లు మోహరించారని రాహుల్‌ పేర్కొన్నారు. 

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి నాయకులు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తొలి రోజు నిరసనల సందర్భంగా ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని, రెండో రోజు నిరసనల కోసం ఒక నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయించాలని కోరినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి స్పందించి, చట్టపరమైన మార్గాన్ని అనుసరించాలని సలహా ఇవ్వడంతోనే తాము ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీఈసి జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతేకాకుండా సీఈసీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.


 

 ప్రభుత్వం ఢిల్లీని నిర్బంధించి కోటలా మార్చిందని, ప్రజలు రాకుండా బస్సులు, రైళ్లను అడ్డుకుంటోందని రాహుల్‌ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెందిన 200 మంది ఉన్నతాధికారులు తమతో సంప్రదింపుల్లో ఉండి సమాచారం ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం తీరుపై సిబ్బందిలోనూ అసంతృప్తి ఉందని, సుమారు 50 శాతం మంది పోలీసులు తమకు అనుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి సీజేఐతో భేటీకి సమయం కోరగా అనుమతి లభించలేదని, బదులుగా న్యాయపరంగా పిటిషన్ వేయాలని సూచించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలందరూ కలిసి నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని నాయకులు స్పష్టం చేశారు.

హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేయగా, బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు ఆరోపించారు. మధ్యాహ్నం 1 గంటకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమా సమావేశం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. మరోవైపు నిరసనలకు అనుమతి నిరాకరించడంపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కాక్రోచ్ జనతా పార్టీ సైతం పోలీసులకు 24 గంటల గడువు ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement