ఓటు హక్కు పరిరక్షణకు కదంతొక్కండి | Congress Leader Rahul Gandhi Meets Tamil Nadu CM Vijay | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు కదంతొక్కండి

Oct 11 2026 3:51 AM | Updated on Oct 11 2026 3:52 AM

Congress Leader Rahul Gandhi Meets Tamil Nadu CM Vijay

చాయ్‌పే చర్చ: చెన్నైలో సీఎం విజయ్‌తో ముచ్చటిస్తున్న రాహుల్‌ గాంధీ

యువతకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ పిలుపు

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఉద్బోధ 

ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారు

తమిళ సంస్కృతిపై వ్యవస్థీకృత దాడి జరుగుతోంది   

సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు కదంతొక్కాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ నాశనం చేస్తున్నారని, విద్యార్థి పోరాటాలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైన్నైలో శనివారం నిర్వహించిన ‘వాయిస్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరో చెప్పారని దేనినీ గుడ్డిగా అనుకరించొద్దని, మీ నేల వారసత్వాన్ని, చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

తమిళనాడుకు చెందిన మహనీయులు తిరువళ్లువర్, పెరియార్‌ల అడుగుజాడల్లో నడుస్తూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. తమిళ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలపై వ్యవస్థీకృత దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దాలని అమిత్‌ షా ఆదేశించారని, కొత్త విద్యా విధానాన్ని ఆమోదిస్తేనే తమిళనాడుకు రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని బీజేపీ చెప్పిందని విమర్శించారు. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా ఒక విద్యార్థి తమిళనాడు గొప్పతనం, తిరువళ్లువర్, పెరియార్‌ సిద్ధాంతాల గురించి ప్రస్తావించారు. వెంటనే స్పందించిన రాహుల్‌ గాంధీ.. ఆ విద్యార్థినుద్దేశించి ‘ఒకవేళ మోదీ కలిస్తే.. పెరియార్‌ ఆయనతో ఏం మాట్లాడేవారు?’ అని ప్రశ్నించారు. దానికి ఆ విద్యార్థి సమాధానమిస్తూ.. ‘దేశంలో కులమతాలు కాదని.. మానవత్వమే ముఖ్యమని చెప్పి ఉండేవారు’ అని బదులిచ్చారు. విద్యార్థి ఇచ్చిన ఈ సమాధానానికి రాహుల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  

సీఎం విజయ్‌తో భేటీ: అంతకు ముందు రాహుల్‌ గాంధీ తమిళనాడు సీఎం విజయ్‌ నివాసానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం చేస్తూ సమకాలీన రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే కారులో సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లి కాఫీ తాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement